పుణే వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. 182 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇక ఇది ఉండగా.. కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా హర్షిత్ రాణా జట్టులోకి రావడం ప్రస్తుతం వివాదస్పదమైంది.
అసలేం జరిగిందంటే ?
భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఓ బంతి దూబే హెల్మెట్ బలంగా తాకింది. వెంటనే ప్రోటోకాల్ ప్రకారం ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాను. అతడు అంతా బాగానే ఉందనడంతో ఫిజియో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. కానీ దూబే మాత్రం ఫీల్డింగ్ రాలేదు. దూబే తన బ్యాటింగ్‌ను కూడా కొనసాగించాడు. కానీ ఫీల్డింగ్‌కు మాత్రం దూబే రాలేదు.
అతడి స్ధానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా బరిలోకి దిగాడు. కంకషన్ సబ్‌గా వచ్చిన రాణా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణాకు కంకషన్ సబ్‌గా అవకాశమివ్వడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(jos buttler) తీవ్ర అగ్రహం వ్యక్తం చేశాడు. శివమ్ దూబే వంటి ఆటగాడికి హర్షిత్ రాణా ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బట్లర్ మండిపడ్డాడు.
మేము అంగీకరించము..
"ఇది ఏ మాత్రం సరైన రిప్లేస్ మెంట్ కాదు. దీన్ని మేము మేం ఏమాత్రం అంగీకరించం శివమ్ దూబే గంటకు 25 మైల్స్ వేగంతో బౌలింగ్ చేసినా.. హర్షిత్ రాణా తన బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నా మాకు అనవసరం. అది ఆటలో భాగం మాత్రమే. ఈ మ్యాచ్‌లో మేమే గెలవాల్సింది. ఈ నిర్ణయం వల్లే మేము గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయాము.
మమ్మల్ని సంప్రదించకుండానే హర్షిత్ రాణాను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దించారు. నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతడిని మైదానంలో చూశాను. అతడు ఎవరికి బదులుగా ఆడుతున్నాడని అప్పుడే అంపైర్లకు అడిగాను. వారు కంకషన్ రిప్లేస్‌మెంట్ అని బదులిచ్చారు.
అప్పుడే ఈ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్’ కాదని చెప్పా. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ నిర్ణయం తీసుకున్నారని అంపైర్లు చెప్పారు. క్లారిటీ కోసం జవగల్ శ్రీనాథ్‌తో కచ్చితంగా మాట్లాడుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో బట్లర్ పేర్కొన్నాడు.
చదవండి: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు: సూర్య
Comments
Please login to add a commentAdd a comment