భారత క్రికెట్ జట్టు మరో టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. పుణే వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో టీమిండియా(Teamindia) విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో మెరిసినప్పటకి ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) స్పందించాడు. అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే, హార్దిక్ పాండ్యాలపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. అదేవిధంగా మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు మద్దతు అద్భుతంగా ఉంది. మా విజయాలు వెనక వారి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. 10 వికెట్లకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో మేము వెనకంజ వేయాలని అనుకోలేదు.
బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలో మా కుర్రాళ్లకు బాగా తెలుసు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోవడం గట్టి ఎదురు దెబ్బే. నేను అస్సలు ఊహించలేదు. కానీ అక్కడ నుంచి మా బ్యాటర్లు ఆడిన విధానం నిజంగా అద్భుతం. హార్దిక్ పాండ్యా, దూబే ఆసాధరణ బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ తమ అనుభవాన్ని చూపించారు. మేం ఎప్పుడూ మాట్లాడేది ఇదే. నెట్స్‌లో ఎలా ఆడుతారో, మ్యాచ్‌లో ఆలానే స్వేఛ్చగా ఆడాలని మా బాయ్స్‌కు చెబుతాం.
మా ఆటగాళ్లు నెట్ సెషన్‌లలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారు నెట్ ప్రాక్టీస్‌లో ఆడినట్లే గేమ్‌లో కూడా ఆడుతున్నారు. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సరైన దిశలోనే పయనిస్తున్నామని నేను భావిస్తున్నాను. పవర్ ప్లే తర్వాత(7 -10 ఓవర్ల మధ్య) పరుగులు సాధించడం అంత ఈజీ కాదు.
ఇంగ్లండ్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడినప్పటికి.. తర్వాత మేము కొన్ని వికెట్లు తీసి గేమ్‌ని మా నియంత్రణలోకి తీసుకున్నాము. దురదృష్టవశాత్తు శివమ్ దూబే ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. హర్షిత్ రాణా మూడువ సీమర్‌గా బరిలోకి దిగాడు. అతడు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముంబైలో జరిగే ఆఖరి టీ20లో కూడా మేము దుమ్ములేపుతాం అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు.. గేమ్‌నే మార్చేశాడు! రూల్స్ ఏమి చెబుతున్నాయి?
Comments
Please login to add a commentAdd a comment