అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా తీవ్ర నిరాశపరిచాడు. తన అరంగేట్ర టెస్టులో ఆకట్టుకున్న హర్షిత్ రాణా.. రెండో టెస్టులో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
అడిలైడ్‌లో రాణా బౌలింగ్‌ను ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ ఉతికారేశారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 16 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన రాణా.. 5.40 ఏకానమితో ఏకంగా 86 పరుగలు సమర్పిచుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.
దీంతో డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు రాణాపై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణను తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గంభీర్ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన అనాధాకరిక టెస్టు సిరీస్‌లో కృష్ణ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 4 ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లు పడగొట్టి ఈ కర్ణాటక పేసర్ సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వనున్నట్లు వినికిడి. ప్రసిద్ద్ చివరగా భారత్ తరపున ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు.
జడ్డూకు పిలుపు.. !
అదే విధంగా బ్రిస్బేన్ టెస్టులో రవీంద్ర జడేజా ఆడనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ స్ధానంలో జడ్డూ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్టులో ఆడిన అశ్విన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.బ్యాటింగ్ లైనప్‌లో బలం పెంచుకోవడానికి జడ్డూను మూడో టెస్టులో ఆడించాలని భారత్ భావిస్తుందంట.
భారత తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: 'హెడ్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.. ఆ ఒక్కటి చేస్తే చాలు'
Comments
Please login to add a commentAdd a comment