బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత జట్టు 2-0 తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. మరో పొట్టి క్రికెట్ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
అయితే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక జట్టుతో తలపడనుంది. శనివారం హైదరాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్దమైనట్లు భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమచారం. తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తొలి రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన తిలక్ వర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు ఆఖరి టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టీ20కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా
Comments
Please login to add a commentAdd a comment