బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్, భారత్-ఏ మధ్య వాకా వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏకు ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రెండు.. మానవ్ సుతార్, హర్షిత్ రాణా బౌలింగ్‌లో తలో సిక్సర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో గంటకు పైగా బ్యాటింగ్ చేసిన రుతురాజ్ ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు.
రుతురాజ్ ఇటీవలే ఆస్ట్రేలియా-ఏతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ సిరీస్‌లో రుతురాజ్ ఆశించిన మేరకు రాణించకపోయినప్పటికీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాత్రం ఇరగదీశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రుతురాజ్ టీమిండియా మేనేజ్‌మెంట్‌ను మెప్పించి తుది జట్టులో (ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు) చోటు దక్కించుకుంటాడేమో వేచి చూడాలి.
🚨 Updates from Perth
4 Sixes from Ruturaj Gaikwad - 2 Vs Ashwin 1 Vs Sutar and one vs Rana - After playing for more than an hour made his way to Sarfaraz Khan.#AUSvsIND pic.twitter.com/yGMIjk4Wzp— RevSportz Global (@RevSportzGlobal) November 16, 2024
చెమటోడ్చిన విరాట్, యశస్వి, గిల్
రుతురాజ్ విషయాన్ని పక్కన పెడితే, టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లో చెమటోడ్చారు. ఈ ముగ్గురు ఈ మ్యాచ్‌లో తలో రెండుసార్లు బ్యాటింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆశాజనకమైన ప్రదర్శన చేశాడు. యశస్వి జైస్వాల్ షార్ట్ బాల్స్‌ను మంచి టెక్నిక్‌తో ఎదుర్కొన్నాడు.
శుభ్‌మన్ గిల్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడినప్పటికీ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్థాయి మేరకు రాణించాడు. బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముకేశ్ ఆస్ట్రేలియా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాడు. అయితే అతను భారత మెయిన్ జట్టులో లేని విషయం తెలిసిందే. భారత సెలెక్టర్లు ముకేశ్‌ను ట్రావెలింగ్ రిజర్వగా ఎంపిక చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment