కాన్‌బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీసి ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ దెబ్బకొట్టాడు.
ఆకాశ్‌దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సామ్ కొన్స్టాస్ సెంచరీతో (97 బంతుల్లో 107) కదంతొక్కాడు. జాక్ క్లేటన్ 40, హన్నో జాకబ్స్ 61 పరుగులు చేశారు.
WHAT A BALL FROM HARSHIT RANA ⚡
- India continues their dominance in Australia...!!!! pic.twitter.com/YNjS77gQaf— Johns. (@CricCrazyJohns) December 1, 2024
138 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్‌ను సామ్ కొన్స్టాస్, హన్నో జాకబ్స్ ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ హర్షిత్ రాణా నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. హర్షిత్ అద్భుతమైన బంతులతో ఇద్దరు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్ పింక్ బాల్‌తో, డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ప్రాక్టీస్‌గానే వార్మప్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment