ఐపీఎల్ స్టార్, యువ పేసర్ హర్షిత్ రాణా బంపరాఫర్ తగిలింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు భారత సెలక్టర్లు హర్షిత్ రాణాకు పిలుపునిచ్చారు. లంకతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కింది. భారత వన్డే జట్టులో రాణాకు చోటు దక్కడం ఇదే తొలిసారి.
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాణా ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలోనైనా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయాలని ఈ ఢిల్లీ యువ పేసర్ ఉవ్విళ్లూరుతున్నాడు.
అయితే తను స్దాయికి చేరుకోవడంలో ప్రస్తుత భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్‌ది కీలక పాత్ర అని హర్షిత్ తెలిపాడు. కాగా గంభీర్, రాణా ఇద్దరూ ఢిల్లీ క్రికెట్‌కు ఆడి వచ్చిన వారే కావడం గమనార్హం. అంతేకాకుండా ఐపీఎల్‌లో గంభీర్ మెంటార్‌గా పనిచేసిన కేకేఆర్ జట్టులో రాణా సభ్యునిగా ఉన్నాడు.
"నేను ఎప్పుడూ నా కష్టాన్నే నమ్ముకుంటాను. కానీ కొన్ని సార్లు సీనియర్ జట్లలో చోటుదక్కినప్పడు ఒక్కడినే రూమ్‌లోని కూర్చోని బాధపడేవాడిని. నా ఈ అద్భుత ప్రయాణంలో నేను ముగ్గురికి కృతజ్ఝతలు తెలపాలనకుంటున్నాను. అందులో ఒకరు మా నాన్న. నేను ఈ స్ధాయికి చేరుకోవడానికి ఆయన ఎంతగానే కృషి చేశారు.
ఆ తర్వాత వ్యక్తిగత కోచ్ అమిత్ భండారీ ( ఢిల్లీ మాజీ పేసర్). భండారీ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇక అందరికంటే గంభీర్ భయ్యాకు నేను రుణపడి ఉంటాను. ఆట పట్ల నా ఆలోచన విధానం గంభీర్ భయ్యా వల్లే మారింది. ఆయనలాంటి వ్యక్తితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. మనకు ఎంత టాలెంట్ ఉన్నప్పటకి ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉండాలి.
అప్పుడే మనం విజయం సాధించలగము. గంభీర్‌ను చూసి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేను నేర్చుకున్నాను. గౌతీ భయ్యా నాతో ఎప్పుడూ చెప్పేది ఒక్కటే విషయం. నేను నిన్ను నమ్ముతున్నాను, కచ్చితంగా నీవు విజయం సాధిస్తావని నాతో చెప్పేవారు" న్యూస్ 18తో మాట్లాడుతూ రాణా పేర్కొన్నాడు.
ఐపీఎల్‌లో అదుర్స్..
ఐపీఎల్-2024లో హర్షిత్ రానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధిలను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చేవాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రానా కీలక పాత్ర పోషించాడు.
ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రానా 19 వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కూడా 7 మ్యాచ్‌లు ఆడిన రానా.. 28 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇక శ్రీలంక పర్యటన జూలై 27 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment