
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 1996 వరల్డ్‌కప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీంతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
ఇక భారత్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అదేవిధంగా తొలి మ్యాచ్ కోసం తుది జట్టు కూర్పుపై కూడా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
హర్షిత్‌కు నో ఛాన్స్..
బంగ్లాతో మ్యాచ్‌కు పేసర్ హర్షిత్ రాణాకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా వెటరన్ మహ్మద్ సిరాజ్‌ను కాదని మరి అర్ష్‌దీప్‌ను సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉందని అజిత్ అగార్కకర్ అండ్ కో సెలక్ట్ చేశారు.
ఈ క్రమంలోనే హర్షిత్ కంటే అర్ష్‌దీప్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ తొలి ప్రాధన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అర్ష్‌దీప్ అంచనాలకు తగ్గట్టు రాణించకపోతే రాణా తర్వాతి మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. వాస్తవానికి తొలుత ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో రాణా లేడు.
జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో రాణాకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన రాణా పర్వాలేదన్పించాడు. ఈ ఢిల్లీ పేసర్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు తీసుకు వెళ్లారు.
బంగ్లాతో మ్యాచ్‌కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
చదవండి: IND vs PAK: షాకింగ్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.4 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment