శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేలకు సిద్దమైంది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ రేపటి(ఆగస్టు 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కొలంబో వేదికగా శుక్రవారం జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం ఆరు వన్డేల్లో మాత్రమే పాల్గోనుంది. దీంతో ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలని హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు భావిస్తోంది.
హర్షిత్ రానా అరంగేట్రం..
ఇక తొలి వన్డే విషయానికి వస్తే భారత తరపున యువ పేసర్ హర్షిత్ రానా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. లంకతో జరిగే తొలి వన్డేకు భారత తుది జట్టులో రానాకు చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2024 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది. మరోవైపు అతడితో పాటు రియాన్ పరాగ్ సైతం వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండ్ స్కిల్స్‌ను పరిగణలోకి తీసుకుని పరాగ్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి.
మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
శ్రీలంకతో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment