PC : Insidesport
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఢిల్లీ యువ పేసర్ హర్షిత్ రానాకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నందుకు అతడిని కీలకమైన ఆసీస్ టూర్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియాకు సెలక్ట్ అయిన జోష్‌లో ఉన్న హర్షిత్ రానా.. రంజీ ట్రోఫీలో నిప్పులు చెరుగుతున్నాడు.
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అస్సాం జరుగుతున్న మ్యాచ్‌లో రానా అదరగొడుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 15 ఓవర్లు బౌలింగ్ చేసిన రానా.. 62 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
రిశావ్ దాస్, శుభమ్ మండల్, అభిషేక్ ఠాకూర్ వంటి కీలక వికెట్లు పడగొట్టి అదిలోనే అస్సాంను హర్షిత్ దెబ్బతీశాడు. దీంతో 15 పరుగులకే అస్సాం 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ సుమిత్ ఘడిగాంకర్(120) అస్సాం ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అస్సాం 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
గంభీర్ వల్లే..
కాగా ఆసీస్ టూర్‌కు హర్షిత్ రానా ఎంపిక కావడం వెనుక హెడ్ కోచ్ గౌతం గంభీర్ హస్తం ఉంది. ఐపీఎల్-2024 సీజన్‌లో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌ను రానా తన అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మొత్తం ఈ ఏడాది సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టిన హర్షిత్ రానా.. కేకేఆర్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
దీంతో అతడిని భారత జట్టులోకి తీసుకురావాలని గంభీర్ ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు రానాకు భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ వైరల్ ఫీవర్ కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ కొట్టేశాడు.
చదవండి: చాలా బాధగా ఉంది.. కానీ అతిగా పోస్టుమార్టం చేయనక్కర్లేదు: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment