India vs Zimbabwe
-
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్‌లో కాదు. ప్రపంచకప్‌లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్‌కప్‌లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్‌ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్‌కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్‌లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఇదేందయ్యా ఇది.. టాస్ ఇలా కూడా వేయవచ్చా? వీడియో
హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును గిల్ సేన చిత్తు చేసింది. కాగా ఆఖరి టీ20 టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కే ముందుకే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత నాలుగు గేమ్‌లలో టాస్ ఓడిన రజా ఈసారి తన ఆదృష్టాన్ని మార్చుకోనేందుకు కాస్త విన్నూత్నంగా ప్రయత్నించాడు. అతడు టాస్ కాయిన్‌ను గాల్లోకి జంప్ చేస్తూ స్పిన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వలు పూయిస్తోంది. టాస్ ఇలా కూడా వేయవచ్చా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్ pic.twitter.com/snhOXumMx4— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) July 14, 2024 -
వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్
జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది.168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 125 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే రెండు, అభిషేక్, సుందర్, దేశ్‌పాండే తలా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లలో ముజ్బారనీ రెండు, రజా, నగర్వా, మవుటా తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు."ఇదొక అద్భుతమైన సిరీస్. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా బాయ్స్ దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు. ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విదేశీ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు.అయినప్పటకి వారు ఆడిన విధానం నిజంగా అద్భుతం. ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక శ్రీలంక పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంతకుముందు ఆసియాకప్ కోసం శ్రీలంకకు వెళ్లాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: 4–1తో ముగించారు -
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4), శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు, 4-0-25-2) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ఈ సిరీస్‌లో నాలుగు టీ20లు గెలవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శుభ్‌మన్.. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో ఈ భారీ రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. రోహిత్ శర్మ (50), ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
రాణించిన శాంసన్, ముకేశ్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే (5 ఓవర్లలో 40/3) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి దోహదపడ్డాడు. ఆఖర్లో శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 12, శుభ్‌మన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14, రియాన్ పరాగ్ 22 పరుగులు చేసి ఔట్ కాగా.. రింకూ సింగ్ (11), వాషింగ్టన్ సుందర్ (1) అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన ముకేశ్168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆ జట్టు క్రమ అంతరాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (34) టాప్ స్కోరర్ కాగా.. మరుమణి (27), బ్రియాన్ బెన్నెట్ (10), , ఫరక్ అక్రమ్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. భారత బౌలర్లలో ముకేశ్‌తో పాటు శివమ్ దూబే (4-0-25-2), తుషార్ దేశ్‌పాండే (3-0-26-1), వాషింగ్టన్ సుందర్ (2-0-7-1), అభిషేక్ శర్మ (3-0-20-1) వికెట్లు పడగొట్టారు. -
110 మీటర్ల భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్ 110 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో సంజూ కొట్టిన సిక్సర్ స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sanju Samson Smashed 110M SIX 🤯 #ZIMvIND #CricketTwitter pic.twitter.com/fQLHkjZvaX— Mano (@manoj_tweezz) July 14, 2024ఈ మ్యాచ్‌లో సంజూ ఈ సిక్సర్‌తో పాటు మరో మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న సంజూ.. నాలుగు సిక్సర్లు, బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో సంజూ మినహా భారత బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND Vs ZIM: చరిత్ర సృష్టించిన యశస్వి.. ఒక్క బంతి 13 పరుగులు
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రెండు సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికందర్ బౌలింగ్‌లో తొలి బంతి నో బాల్ కాగా.. ఆ బంతిని యశస్వి సిక్సర్‌గా మలిచాడు. ఆతర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్‌లో పంపాడు. నో బాల్‌తో లభించే అదనపు పరుగుతో కలుపుకుని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలా తొలి బంతికే 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు.Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మాంచి జోష్ మీదుండిన యశస్వి.. అదే ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రజా సంధించిన ఇన్ స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన యశస్వి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. యశస్వి ఔటైన అనంతరం అభిషేక్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (13) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. After conceding two sixes, Sikandar Raza took Yashasvi Jaiswal's wicket, and the celebration says it all.📸: SonyLIV pic.twitter.com/XpNkG19AhM— CricTracker (@Cricketracker) July 14, 2024వీరి తర్వాత క్రీజ్‌లో వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 38; 3 సిక్సర్లు), రియాన్ పరాగ్ (18 బంతుల్లో 20; సిక్స్) కుదురుగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/3గా ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా, నగరవ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM 5th T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ స్థానంలో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సత్తాచాటుతున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటకి ఆ తర్వాత మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఆ తర్వాత మూడో టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్‌కు.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్‌లో ఛాన్స్ రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ కేవలం 20 పరుగులు మాత్రమే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. కాగా, ఓ సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో లాల్ అమర్నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు. ఇక నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన గిల్-జైశ్వాల్ జోడీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.టీ20 క్రికెట్లో ఛేజింగ్‌లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.ఇంతకుముందు 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్‌లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్‌ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్‌హిల్, 2023160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024 -
సంతోషం.. కానీ ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది: గిల్
జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లోనే టీమిండియాకు ఘన విజయం అందించింది.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తొలి టీ20లో పరాజయం పాలైనా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలతో జోరు ప్రదర్శించారు.హరారే వేదికగా శనివారం నాటి నాలుగో టీ20లో సమష్టిగా రాణించి జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌గా తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్ ఖాతాలో అరంగేట్రంలోనే సిరీస్ విజయం చేరింది.ఈ నేపథ్యంలో గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ‘‘మొదటి టీ20లో మేము లక్ష్య ఛేదనలో విఫలమయ్యాం.అయితే, ఈరోజు విజయవంతంగా టార్గెట్ పూర్తి చేశాం. ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయినా.. ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొక మ్యాచ్ మిగిలే ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక ప్రస్తుతం ఆడుతున్న జట్టు గొప్పగా ఉందన్న గిల్... తదుపరి మ్యాచ్‌లో మార్పులు చేర్పుల గురించి కోచ్‌తో ఇంకా చర్చించలేదని తెలిపాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య నామమాత్రపు ఐదో టీ20 హరారే వేదికగా ఆదివారం జరుగనుంది.టీమిండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20 స్కోర్లు:👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్👉టాస్: టీమిండియా.. బౌలింగ్👉జింబాబ్వే స్కోరు: 152/7 (20)👉టీమిండియా స్కోరు: 156/0 (15.2)👉ఫలితం: పది వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ సొంతం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 పరుగులు నాటౌట్, (13 ఫోర్లు, 2 సిక్సర్లు)).చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్‌కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తొలి సిరీస్‌లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
Ind vs Zim: సికందర్ రజా వరల్డ్ రికార్డు
టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రజా విఫలమయ్యాడు.అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా వరల్డ్ రికార్డుఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు3. విరన్‌దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లుమెరుగ్గా రాణించిటీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే
Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో శుబ్‌మన్ గిల్ సేన ఆధిక్యంలో ఉంది. శనివారం టీ20లో టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దంచికొట్టారు. జైస్వాల్ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.జింబాబ్వే తుదిజట్టు: వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.అప్డేట్స్14.1: గిల్ అర్ధ శతకం12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)జింబాబ్వే బౌలింగ్‌ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్ముగిసే సరికి జైస్వాల్ 75, గిల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0శుబ్‌మన్ గిల్ 37, యశస్వి జైస్వాల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.6.3: 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి జైస్వాల్పవర్ ప్లేలో యశస్వి పరుగుల వరదఆరో ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ 47(26), శుబ్‌మన్ గిల్ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)దంచికొడుతున్న యశస్విజింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్ చేస్తున్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్ ఐదు బంతుల్లో 11 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 153ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్ సికందర్ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లుఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్‌కు పంపాడు.18.3: రజా హాఫ్ సెంచరీ మిస్ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19) పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 129/4రజా 42, మేయర్స్ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు14.4: నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వేబ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో సికందర్ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్‌లో ఉన్న క్యాంప్‌బెల్ వేగంగా కదలలేకపోయాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా.. బాల్ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్‌బెల్(3) రనౌట్ అయ్యాడు. 13.4: మూడో వికెట్ డౌన్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బ్రియాన్ బెనెట్ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.జొనాథన్ క్యాంప్‌బెల్ క్రీజులోకి వచ్చాడు. సికందర్‌రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).9.6: రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వేపేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే బౌలింగ్‌లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ(25) పెవిలియన్ చేరాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా 0, బ్రియాన్ బెనెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.7.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వేవాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. తన పేస్ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.ఇక రెండో ఓవర్ వేసిన అరంగట్రే పేసర్ తుషార్ దేశ్‌పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన భారత జట్టుశనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.తుషార్ దేశ్‌పాండే అరంగేట్రంఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్ తెలిపాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపాడు. వెల్లింగ్టన్ మసకజ్ద స్థానంలో ఫరాజ్ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. -
జింబాబ్వేతో నాలుగో టీ20.. ధోని శిష్యుడి ఎంట్రీ!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. శనివారం హరారే వేదికగా జరగనున్న నాలుగో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.తొలి టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన గిల్ బ్రిగేడ్.. తర్వాత రెండు టీ20ల్లో మాత్రం ప్రత్యర్ధిని చిత్తు చేసింది. అదే జోరును నాలుగో టీ20లో కొనసాగించాలని యంగ్ టీమిండియా భావిస్తోంది.ధోని శిష్యుడి ఎంట్రీ?అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు పేసర్లు ఖాలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఖాలీల్ స్ధానంలో ముంబై స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే అంతర్జాతీయ అరగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ధోని శిష్యుడిగా పేరొందిన దేశ్‌పాండేకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు, ఐపీఎల్లో సీఎస్కేకు గత రెండు సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2024లో 17 వికెట్లు పడగొట్టిన తుషార్.. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి చోటు ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అదేవిధంగా అవేష్ ఖాన్ స్ధానంలో పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.జింబాబ్వేతో నాలుగో టీ20కు భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్. -
జింబాబ్వేతో మూడో టీ20.. గిల్‌పై అభిమానుల ఆగ్రహం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు అర్దసెంచరీతో (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గిల్ చాన్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్‌తోనే ఫామ్‌లోకి వచ్చినా ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.విషయం ఏంటంటే.. శుభ్‌మన్ గిల్.. మూడో టీ20లో తాను ఓపెనర్‌గా బరిలోకి దిగడం కోసం రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను డిమోట్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ స్థానచలనం కలగడంతో ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అభిమానులకు గిల్‌పై ఆగ్రహం తెప్పించింది. గిల్ తన స్వార్దం కోసం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో పాటు అభిషేక్ లయను దెబ్బ తీశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం (అభిషేక్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు) చేసినా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గిల్ మరో కోహ్లిలా (వ్యక్తిగత రికార్డుల విషయంలో) ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి యశస్వి జైస్వాల్ రాకతో టీమిండియాకు కొత్త చిక్కే (ఓపెనర్ల విషయంలో) వచ్చి పడింది. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన యశస్వి లేటుగా (మూడో టీ20) జట్టుతో జతకట్టిన విషయం తెలిసిందే.కాగా, బ్యాటింగ్‌లో గిల్, రుతురాజ్ (49).. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-16-1) సత్తా చాటడంతో మూడో టీ20లో టీమిండియా జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో పోటీపడలేకపోయిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. -
‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్ సుందర్ రియాక్షన్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 27 పరుగులు చేయడంతో పాటు.. కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.ఆ మ్యాచ్ల్ భారత్ ఓడినా వాషీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లో టాపార్డర్ అదరగొట్టడంతో సుందర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 234 భారీ స్కోరు నెలకొల్పగా.. జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.ఇందులో వాషింగ్టన్ సుందర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జొనాథన్ కాంప్‌బెల్ వికెట్ దక్కించుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్లో నిలదొక్కుకున్న ల్యూక్ జోంగ్వే ఇచ్చిన క్యాచ్ పట్టాడు.ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కీలకమైన మూడో టీ20లోనూ 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇందులో వాషింగ్టన్ సుందర్‌దే కీలక పాత్ర.హరారే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టీమిండియా విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది.వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్(3/15)తో రాణించి టీమిండియాను గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం వాషింగ్టన్ సుందర్ మాత్రం మాట్లాడుతూ.. దేశానికి ఆడటం తనకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ప్రణాళికలను పక్కా అమలు చేసి గెలుపొందామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా.. టీ20లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వాషీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.ప్రతీ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాను. ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను’’ అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేయడంపై మాత్ర దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు.కాగా చెన్నైకి చెందిన వాషింగ్టన్ సుందర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన వాషీ.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 19వన్డేలు, 46 టీ20లు ఆడి 265, 265, 134 పరుగులు చేశాడు. అదే విధంగా ఆయా ఫార్మాట్లలో ఆరు, 18, 40 వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్‌షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
ఇది మాకు శుభసూచకం.. చాలా సంతోషంగా ఉంది: భారత కెప్టెన్
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1ఆధిక్యంలో దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌తో షో తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 182 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును 159 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ఆల్‌రౌండ్‌షో కనబరిచిన భారత జట్టుపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్బుతంగా రాణించాము. ఈ వికెట్లో డబుల్ పేస్, బాల్ గ్రిప్పింగ్ ఎక్కువ ఉంది. ఇటువంటి పిచ్‌పై లెంగ్త్ బాల్స్‌ను హిట్ చేయడం అంత ఈజీకాదు.కానీ మా బ్యాటర్లు ఇక్కడ పరిస్థితులను బాగా ఆర్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్టే బ్యాటింగ్ చేశారు. ఇక బౌలర్లతో కూడా అదే విషయం చర్చించాము. ఇక్కడ బంతి ఎక్కువగా గ్రిప్ప్ అవుతుండడంతో ఏది చేయాలన్న కొత్త బంతితో చేయాలని మా బౌలర్లకు చెప్పాను.బంతి పాతదయ్యే కొద్దీ స్కోర్ చేయడం సులభం అని మాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే మా బౌలర్లు కొత్త బంతితో అద్బుతాలు సృష్టించారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి ఆదిలోనే ప్రత్యర్థిని కష్టాల్లో నెట్టారు.జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికమని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్(49) పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.జింబాబ్వే బ్యాటర్లలో మైర్స్(65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మదండే(37) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, ఖాలీల్ ఆహ్మద్ ఒక్క వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన భారత్..ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. భారత్‌కు ఇది పొట్టిఫార్మాట్లో 150వ విజయం కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.టీమిండియా ఇప్పటవరకు 230 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. కాగా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో భారత్(150) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్(142), న్యూజిలాండ్(111) మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. -
సత్తా చాటిన శుభ్‌మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్‌లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్‌రేట్‌తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్‌ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్‌రేట్‌తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్‌మ్యాన్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 833 పరుగులు చేశాడు.జింబాబ్వే, భారత్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా