జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్, సుందర్ చెరో రెండు వికెట్లు సాధించారు.
జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.
ఈ మ్యాచ్‌లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేక్ శర్మ, రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వారు ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే పవర్‌ప్లేలో ఆ విధంగా బ్యాటింగ్ చేయడం అంత ఈజీకాదు.
"పవర్‌ప్లేలో కొత్త బంతి కాస్త ఎక్కువగా స్వింగ్ అవ్వడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. కానీ అభి, రుతు మాత్రం చాలా పరిపక్వతతో ఆడారు. ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించారు. ఇది యువ భారత జట్టు.
ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ప్రొఫిషనల్ టీ20 క్రికెట్‌లో ఆడిండవచ్చు గానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా ఎవరికి లేదు. తొలి టీ20లో ఒత్తడిని తట్టుకోలేక వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు.
అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక ఓడిపోయాం. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సంచలన విజయం సాధించాము. ఈ సిరీస్‌లో మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment