India vs Zimbabwe, 1st T20 Live Updates and Highlights:
భారత్‌కు బిగ్ షాక్.. జింబావ్వే చేతిలో ఓటమి
టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు.
స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు.
భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు.
తొమ్మిదో వికెట్ డౌన్..
టీమిండియా ఓటమికి చేరువైంది. ముఖేష్ కుమార్ రూపంలో భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
టీమిండియా ఎనిమిదో వికెట్ డౌన్..
అవేష్ ఖాన్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అవేష్ ఖాన్.. మజకజ్డా బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత్ విజయానికి 22 బంతుల్లో 31 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు.
టీమిండియా ఏడో వికెట్ డౌన్.. బిష్ణోయ్ ఔట్
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. రవి బిష్ణోయ్ రూపంలో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి 39 బంతుల్లో 53 పరుగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్(5) పరుగులతో ఉన్నారు.
టీమిండియా ఆరో వికెట్ డౌన్.. శుబ్‌మన్ గిల్ ఔట్
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన గిల్.. సికిందర్ రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత విజయానికి 53 బంతుల్లో 63 పరగులు కావాలి. క్రీజులో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఉన్నారు.
కష్టాల్లో టీమిండియా.. ఐదో వికెట్ డౌన్
ధ్రువ్ జురెల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. మజకజ్డా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 43/5
రింకూ సింగ్ ఔట్..
టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. చతర బౌలింగ్‌లో రింకూ సింగ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 28/4. క్రీజులో శుబ్‌మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు.
నిరాశపరిచిన పరాగ్..
భారత అరంగేట్ర ఆటగాడు రియాన్ పరాగ్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పరాగ్.. చతరా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రెండో వికెట్ డౌన్..
టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. ముజబారనీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 16/2
తొలి వికెట్ డౌన్.. అభిషేక్ శర్మ ఔట్
116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రియన్ బెన్నట్ వేసిన తొలి ఓవర్‌లో నాలుగో బంతికి అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. మసకజ్డాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు.
4 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్.. 115 పరుగులకే జింబాబ్వే పరిమితం
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు.
బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు.
ఆలౌట్ దిశగా జింబాబ్వే.. 90 పరుగులకే 7 వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 15వ ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.
23 పరుగులు చేసిన డియాన్ మైర్స్ సుందర్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత బంతికే మస్‌కజ్డా స్టంపౌటయ్యాడు.
13 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/5
జింబాబ్వే వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. 12 ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఐదో బంతికి సికిందర్ రజా ఔట్ కాగా.. ఆరో బంతికి క్యాంప్‌బెల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే.. 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
మూడో వికెట్ డౌన్..
జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మాధవరే.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మైర్స్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
రెండో వికెట్ డౌన్..
40 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెన్నట్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సికిందర్ రజా, మాధవరే(17) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో కయా క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. క్రీజులో బెన్నట్(8), మాధవరే(6) పరుగులతో ఉన్నారు.
భారత్-జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడతున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో భారత తరపున యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్‌జురెల్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కాగా సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు.
తుది జట్లు
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్
జింబాబ్వే: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా
Comments
Please login to add a commentAdd a comment