అభిషేక్‌ శర్మ విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఊచకోత | Abhishek Sharma hits maiden T20I hundred in second match | Sakshi
Sakshi News home page

IND vs ZIM: అభిషేక్‌ శర్మ విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఊచకోత

Published Sun, Jul 7 2024 5:43 PM | Last Updated on Sun, Jul 7 2024 5:54 PM

Abhishek Sharma hits maiden T20I hundred in second match

హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

 ఈ మ్యాచ్‌లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 46 బంతుల్లోనే అభిషేక్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్లతో తన సెంచరీని అభిషేక్ పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను మాత్రం అభిషేక్‌ ఊచకోత కోశాడు. 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ బౌండరీలు వర్షం కురిపించాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 

అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ అభిషేక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement