విశ్వవిజేతలగా నిలిచిన అనంతరం భారత జట్టు తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో భారత జట్టుకు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.
ఐపీఎల్ హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయిసుదర్శన్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. జూలై 6న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈమ్యాచ్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే హరారేకు చేరుకుంది. తొలి పోరు కోసం తీవ్రంగా యంగ్ టీమిండియా శ్రమించింది. ఈ క్రమంలో తొలి టీ20లో ఆడే భారత తుది జట్టుపై ఓ లూక్కేద్దం.
అభిషేక్, పరాగ్ ఎంట్రీ..
ఈ మ్యాచ్‌తో ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశముంది. అతడు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఫస్ట్‌డౌన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను బ్యాటింగ్ దింపే ఆలోచనలో జట్టు మెనెజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభిషేక్‌తో పాటు రియాన్ పరాగ్ కూడా డెబ్యూ చేయనున్నట్లు సమాచారం. అతడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు చోటు దక్కే అవకాశముంది. ఫినిషర్‌గా రింకూ సింగ్ ఎలాగో ఉంటాడు.
ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బౌలర్లగా రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్‌ల స్ధానాలు దాదాపు ఖాయమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
భారత తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖాలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment