జింబాబ్వే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సత్తాచాటుతున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటకి ఆ తర్వాత మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.
ఆ తర్వాత మూడో టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్‌కు.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్‌లో ఛాన్స్ రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ కేవలం 20 పరుగులు మాత్రమే ఓ కీలక వికెట్ పడగొట్టాడు.
ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు.
కాగా, ఓ సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో లాల్ అమర్‌నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు. ఇక నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment