టీ20 ప్రపంచకప్-2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌లో భారత జట్టు తలపడనుంది.
అయితే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. యువ భారత జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.
ఐపీఎల్-2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రానాలకు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీమ్ జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది.
పాస్ పోర్ట్ కూడా మర్చిపోయా?
ఇక తొలిసారి భారత జట్టు నుంచి పిలుపురావడంపై రాజస్తాన్ రాయల్స్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. "భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నాను.
ఇండియన్స్ జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సా నుంచి వచ్చిన నేను భారత్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాను. నా కలను ఎన్నాళ్లకు నెరవేర్చుకోగలిగాను.
ఈ ఉత్సాహంలో పాస్‌పోర్టు, నా ఫోన్లు మరిచిపోయా. వాటిని పోగొట్టుకోలేదు కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రాలేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్లీ దొరికాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా.
ఇప్పటికే నేను చాలా మ్యాచ్‌లు విదేశాల్లో ఆడాను. కానీ భారత్ జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment