సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. రెండో టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.
పోర్ట్ ఎలిజిబెత్‌లో చేసిన బ్యాటింగ్ తప్పిదాలను పునరావృతం చేయకూడదని సూర్య సేన యోచిస్తోంది. అందుకు తగ్గట్టే భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ శర్మపై వేటు..
గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత జట్టు మేనెజ్‌మెంట్ వేటు వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అభిషేక్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్ జోడీగా తిలక్ వర్మను ప్రమోట్ చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మరోవైపు పేసర్ అవేష్ ఖాన్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. అవేష్ స్ధానంలో కర్ణాటక పేసర్ విజయ్‌కుమార్ వైశ్యాఖ్ అరంగేట్రం చేసే అవకాశముంది.
భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రమణ్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశ్యాఖ్
చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా!
Comments
Please login to add a commentAdd a comment