Ramandeep Singh
-
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు (నవంబర్ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ చివర్లో సూపర్‌గా బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత యూనిట్లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.మూడో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ, రమన్‌దీప్ సింగ్‌లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమన్‌దీప్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రమన్‌దీప్‌కు హార్డ్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు. మూడో టీ20లో అభిషేక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని స్థానంలో యశ్ దయాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్‌దీప్, యశ్ దయాల్ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్. -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
సౌతాఫ్రికాతో మొదటి టీ20లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించలేకపోయింది. కీలక బ్యాటర్లంతా విఫలం కావడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ గెలవాలంటే.. మిగిలిన రెండు టీ20లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.సంజూ శాంసన్ ధనాధన్ సెంచరీ వల్లనిజానికి డర్బన్‌లో జరిగిన తొలి టీ20లోనూ ఓపెనర్ సంజూ శాంసన్(50 బంతుల్లో 107), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(33) రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. మిగతా వాళ్లంతా విఫలమైనా 202 రన్స్ రాబట్టగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య ప్రొటిస్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.రెండో టీ20లో మాత్రంఅయితే, గెబెహా వేదికగా రెండో టీ20లో మాత్రం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లలో సంజూ శాంసన్(0) అనూహ్య రీతిలో డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ(4) మరోసారి విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్య సైతం నాలుగు పరుగులకే వెనుదిరగగా.. మిడిలార్డర్లో తిలక్ వర్మ(20), అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) కాసేపు క్రీజులో నిలబడ్డారు.ఇక లోయర్ ఆర్డర్లో రింకూ సింగ్(9) నిరాశపరచగా.. టెయిలెండర్ అర్ష్‌దీప్ సింగ్(7 నాటౌట్) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా కేవలం 124 పరుగులే చేసింది. అయితే, సౌతాఫ్రికాను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు మాత్రం ఆఖరి వరకు గట్టి పోరాటం చేశాడు.అయినప్పటికీ 19 ఓవర్లలోనే ప్రొటిస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించి జయభేరి మోగించింది. టీమిండియా ఆధిక్యాన్ని తగ్గిస్తూ 1-1తో సమం చేసింది. ఇలా తొలి రెండు మ్యాచ్‌లలోనూ బౌలర్లు వందశాతం పాసైనా.. బ్యాటర్లలోనే నిలకడ లోపించింది. ఆల్‌రౌండర్ అవసరం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికా- టీమిండియా మధ్య సెంచూరియన్ వేదికగా మూడో టీ20పై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సూర్య సేన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలదు. ఈ క్రమంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌ను అరంగ్రేటం చేయించాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. ఈ మేరకు.. ‘‘ఎనిమిదో స్థానంలో మనకు ఓ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. అతడు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేయగలగాలి.అతడిని ఆడిస్తేనే మంచిదిఅతడు స్పిన్నరా? లేదంటే ఫాస్ట్ బౌలరా అన్న అంశంతో మనకు పనిలేదు. హార్దిక్ పాండ్యా కాకుండా.. అతడిలా ఆడగలిగే మరో క్రికెటర్ కావాలి. ఇప్పుడు జట్టులో ఉన్న ప్రధాన లోటు అదే. ప్రస్తుతం రమణ్‌దీప్ సింగ్ సరైన ఆప్షన్లా కనిపిస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టులో ఆడిస్తే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప జియో సినిమా షోలో పేర్కొన్నాడు.కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టుతో ఉన్నాడు. అయితే, రమణ్‌దీప్ సింగ్‌కు లైన్ క్లియర్ కావాలంటే.. మిగిలిన ఆటగాళ్లలో ఎవరో ఒకరిపై వేటు తప్పదు. అలాంటి పరిస్థితిలో తొలి రెండు టీ20లలో ఘోరంగా విఫలమైన ఏకక ఆటగాడు అభిషేక్ శర్మ(7, 4)నే తప్పించే అవకాశమే ఎక్కువగా ఉంది. అదే జరిగితే ఓపెనింగ్ జోడీలోనూ మార్పు వస్తుంది. కాగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సూర్యకుమార్ సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్ -
సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు!
సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. రెండో టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకుని తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.పోర్ట్ ఎలిజిబెత్‌లో చేసిన బ్యాటింగ్ తప్పిదాలను పునరావృతం చేయకూడదని సూర్య సేన యోచిస్తోంది. అందుకు తగ్గట్టే భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.అభిషేక్ శర్మపై వేటు..గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత జట్టు మేనెజ్మెంట్ వేటు వేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ రమణ్‌దీప్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అభిషేక్‌ను పక్కన పెట్టి సంజూ శాంసన్ జోడీగా తిలక్ వర్మను ప్రమోట్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు పేసర్ అవేష్ ఖాన్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. అవేష్ స్ధానంలో కర్ణాటక పేసర్ విజయ్‌కుమార్ వైశ్యాఖ్ అరంగేట్రం చేసే అవకాశముంది.భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రమణ్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశ్యాఖ్చదవండి: BGT: పంత్ కాదు!.. అతడే కొత్త రాజు అంటున్న ఆస్ట్రేలియా మీడియా! -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
Asia Cup: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడుతోంది. దాయాదుల మధ్య పోరుకు ఒమన్‌లోని అల్ అమెరట్ స్టేడియం వేదికగా నిలిచింది. భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అభిషేక్ జోడీగా ప్రభ్సిమ్రన్సింగ్ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడే భారత తుదిజట్టులో టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా ఒమన్‌లో జరుగుతున్న ఈ ఆసియా టీ20 టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే శుభారంభం చేశాయి.అంచనాలు రెట్టింపుహాంకాంగ్పై బంగ్లా యువ జట్టు 5 వికెట్లు, శ్రీలంక-ఎ జట్టుపై అఫ్గన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. మరోవైపు.. మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో తలపడ్డ ఆతిథ్య ఒమన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో భారత్- పాక్ తలపడటం.. అందులోనూ టీమిండియా స్టార్లు తిలక్ వర్మ(కెప్టెన్‌గా), అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ తుదిజట్లుయువ భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాక్ యువ జట్టుహైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్! -
KKR Vs MI: కేకేఆర్ ఆల్‌రౌండర్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్‌కు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2024లో భాగంగా శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదిగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రమణ్‌దీప్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును రమణ్ దీప్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను సైతం అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే. క్రికెట్ పరికరాలు లేదంటే, స్టంప్స్‌ను బ్రేక్ చేయడం, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ప్రకటనల బోర్డులను డామేజ్లకు చేయడం వంటి ఆర్టికల్ 2.2 కిందకు వస్తాయి. ఇక ఈ మ్యాచ్‌లో రమణ్ దీప్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైపై 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. -
ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్‌కు నిన్నటి (మే 5) కేకేఆర్-లక్నో మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమన్‌దీప్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అర్శిన్ కులకర్ణి ఆడిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు రమన్‌దీప్ సింగ్ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్ చేసే డైరెక్షన్ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్ అర్శిన్ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్ అనంతరం రమన్‌దీప్‌ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్ స్టార్క్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ రమన్‌దీప్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్‌లో రమన్‌దీప్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ (6 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్‌దీప్‌తో పాటు సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్ రాణా (3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి (3-0-30-3), రసెల్ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్ ఇన్నింగ్స్‌లో నరైన్, రమన్‌దీప్‌లతో పాటు ఫిలిప్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
KKR Vs LSG: నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్‌దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్‌ను రమణ్‌దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.. 27 ఏళ్ల ఈ క్రికెటర్ ఎవరో తెలుసా?
-
ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం.. ఐదు బంతుల్లో 5 సిక్స్‌లు! వీడియో వైరల్
పంజాబ్ క్రికెట్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో జరగుతున్న షేర్-ఈ-టీ20 T20 కప్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్ అదరగొడుతున్నాడు. ఈ టీ20 లీగ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్‌కు రమణదీప్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం బీఎల్వీ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమణదీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదాడు. అగ్రి కింగ్స్ నైట్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన క్రిష్ణన్ అలాంగ్ బౌలింగ్‌లో తొలి ఐదు బంతులను రమణదీప్ సిక్స్‌లుగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రమణదీప్ 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 63 పరుగులు చేశాడు. అయితే రమణదీప్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో అగ్రి కింగ్స్ నైట్స్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 195 లక్ష్యంతో బరిలోకి దిగిన అగ్రి కింగ్స్ నైట్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగల్గింది. బీఎల్వీ బ్లాస్టర్స్ బౌలర్లలో కెప్టెన్ మయాంక్ మార్కండే, అలాంగ్ తలా మూడు వికెట్లు సాధించి అగ్రి కింగ్స్ నైట్స్‌ను దెబ్బతీశారు. అంతకుముందు బీఎల్వీ బ్లాస్టర్స్.. కువార్ పఠాక్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై pic.twitter.com/Ejq5DmyHrJ — IndiaCricket (@IndiaCrick18158) July 20, 2023 -
ఎవరీ రమన్‌దీప్ సింగ్.. ఆసక్తికర విషయాలు
ఐపీఎల్ 2022 సీజన్లో ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు కొందరు లభించారు. తిలక్ వర్మ, ఆయుష్ బదోని, రింకూ సింగ్, శశాంక్ సింగ్ సహా తదితర ఆటగాళ్ల పేర్లు మారుమోగాయి. తాజాగా మంగళవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నుంచి మరొక ఆటగాడు మెరిశాడు. అతనే రమన్‌దీప్ సింగ్. 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి సహా డేంజరస్ బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్క్రమ్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అదే సమయంలో రమన్‌దీప్ తన బౌలింగ్‌లో ఎక్కువ పరుగులిచ్చుకోవడం విశేషం. మరి ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్న రమన్‌దీప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ►1997 డిసెంబర్ 13న చంఢీగర్‌లో జన్మించాడు. 25 ఏళ్ల రమన్‌దీప్ సింగ్ ఫిబ్రవరి 12, 2020న పంజాబ్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ►2019లో లిస్ట్-ఏ , 2017లో టి20ల్లో అరంగేట్రం చేశాడు. ►ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రెండు మ్యాచ్‌లాడి 124 పరుగులు చేశాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో 10 మ్యాచ్‌ల్లో 141 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఒక వికెటల తీశాడు. 16 టి20 ఫస్ట్క్లాస మ్యాచ్‌లు ఆడి 116 పరుగులతో పాటు నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
భారత్ క్లీన్‌స్వీప్
ఆంట్వర్ప్: బెల్జియం పర్యటనను భారత పురుషుల హాకీ జట్టు క్లీన్ స్వీప్‌తో ముగించింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 5–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బెల్జియంపై ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సిమ్రన్ జీత్ సింగ్ (7వ నిమిషంలో), లలిత్ (35వ ని.లో), వివేక్ సాగర్ (36వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో), రమణ్‌దీప్ సింగ్ (43వ ని.లో) తలా ఓ గోల్ సాధించారు. ప్రత్యర్థి తరఫున హెన్రిక్స్ (39వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. ఈ పర్యటనలో భారత్ తన తొలి మ్యాచ్‌లో 2–0తో బెల్జియంపై, అనంతరం రెండు, మూడు మ్యాచ్‌ల్లో 6–1తో, 5–1తో స్పెయిన్‌పై, నాలుగో మ్యాచ్‌లో 2–1తో బెల్జియంపై విజయాలను సాధించింది. -
మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి
సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అలాంటి సంఘటనే ఆదివారం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట సెల్ఫీ తీసుకుంటూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు నేటి సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్ సింగ్ కాంట్రాక్టరు. ఆయన వద్ద ఓ లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. ఈ క్రమంలో శుక్రవారం బంధువు ఇంట్లో శుభకార్యానికి భార్యతో సహా వెళ్లాడు. జరిగే దారుణాన్ని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఇంట్లో ఉన్న వారి 15 కుమారుడు ఏళ్ల రమన్‌దీప్ సింగ్ తన తండ్రి రివాల్వర్ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.. రివాల్వర్‌ను కణతకు ఆనించుకుని సెల్ఫీకి ఫోజిస్తూ.. ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై నొక్కడంతో రివాల్వర్ పేలింది. పేలుడు శబ్ధం విన్న చుట్టుపక్కల వాళ్లు తీవ్రంగా గాయపడ్డ రమన్ దీప్ ను ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రులు కూడా ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డారు. రెండు రోజులపాటు లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో ప్రాణాలతో పోరాడిన రమన్ దీప్ నేటి సాయంత్రం మృతిచెందాడు. రమన్ దీప్ ఇకలేడన్న వార్త విన్న బంధువులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.