Who Is Mumbai Indians Ramandeep Singh: Biography And Interesting Unknown Facts In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2022 Who Is Ramandeep Singh: ఎవరీ రమన్‌దీప్‌ సింగ్‌.. ఆసక్తికర విషయాలు

Published Tue, May 17 2022 10:36 PM | Last Updated on Wed, May 18 2022 9:42 AM

Intresting Facts About Ramandeep Singh From Mumbai Indians - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు కొందరు లభించారు. తిలక్‌ వర్మ, ఆయుష్‌ బదోని, రింకూ సింగ్‌, శశాంక్‌ సింగ్‌ సహా తదితర ఆటగాళ్ల పేర్లు మారుమోగాయి. తాజాగా మంగళవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ నుంచి మరొక ఆటగాడు మెరిశాడు. అతనే రమన్‌దీప్‌ సింగ్‌. 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ప్రియమ్‌ గార్గ్‌, రాహుల్‌ త్రిపాఠి సహా డేంజరస్‌ బ్యాట్స్‌మన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అదే సమయంలో రమన్‌దీప్‌ తన బౌలింగ్‌లో ఎక్కువ పరుగులిచ్చుకోవడం విశేషం. మరి ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్న రమన్‌దీప్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

►1997 డిసెంబర్‌ 13న చంఢీగర్‌లో జన్మించాడు. 25 ఏళ్ల రమన్‌దీప్‌ సింగ్‌ ఫిబ్రవరి 12, 2020న పంజాబ్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

►2019లో లిస్ట్‌-ఏ , 2017లో టి20ల్లో అరంగేట్రం చేశాడు.

►ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రెండు మ్యాచ్‌లాడి 124 పరుగులు చేశాడు. ఇక లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 10 మ్యాచ్‌ల్లో 141 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఒక వికెటల​ తీశాడు. 16 టి20 ఫస్ట్‌క్లాస​ మ్యాచ్‌లు ఆడి 116 పరుగులతో పాటు నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement