ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్‌కు నిన్నటి (మే 5) కేకేఆర్-లక్నో మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రమన్‌దీప్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అర్శిన్ కులకర్ణి ఆడిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు రమన్‌దీప్ సింగ్ పెద్ద విన్యాసమే చేశాడు.
తాను ఫీల్డింగ్ చేసే డైరెక్షన్ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్ అర్శిన్ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్ అనంతరం రమన్‌దీప్‌ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్ స్టార్క్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ రమన్‌దీప్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024
ఈ మ్యాచ్‌లో రమన్‌దీప్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ (6 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్‌దీప్‌తో పాటు సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్ రాణా (3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి (3-0-30-3), రసెల్ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో కేకేఆర్ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో నరైన్, రమన్‌దీప్‌లతో పాటు ఫిలిప్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్‌వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment