కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ రమణదీప్ సింగ్‌కు ఐపీఎల్ మెనెజ్‌మెంట్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2024లో భాగంగా శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదిగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రమణ్‌దీప్ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.
ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును రమణ్ దీప్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను సైతం అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే.
క్రికెట్ పరికరాలు లేదంటే, స్టంప్స్‌ను బ్రేక్ చేయడం, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ప్రకటనల బోర్డులను డామేజ్‌లకు చేయడం వంటి ఆర్టికల్ 2.2 కిందకు వస్తాయి.
ఇక ఈ మ్యాచ్‌లో రమణ్ దీప్ 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబైపై 18 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment