టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదివారం(ఆగస్టు 18)తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ సరదాగా ముచ్చటించాడు.
ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ నుంచి పలు ప్రశ్నలు కోహ్లికి ఎదురయ్యాయి. తన ఫేవరేట్ క్రికెటర్లను ఎంచుకోమని ఎంఎస్ ధోని, ఎబీ డివిలియర్స్ పేర్లు అప్షన్స్ ఇవ్వగా.. కోహ్లి ఇద్దరూ కూడా తనకు ఇష్టమైన వారేనని తెలివగా సమాధనమిచ్చాడు.
ఆ తర్వాత తనకు ఇష్టమైన షాట్ ఫ్లిక్ లేదా కవర్ డ్రైవ్? అని అడగ్గా.. అందుకు కవర్ డ్రైవ్ తన ఫేవరేట్ షాట్ అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో తన ఫేవరేట్ ప్రత్యర్ధి జట్టు ఏదన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది.
అందుకు అప్షన్స్‌గా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కాస్త సమయం తీసుకున్న కోహ్లి.. ఆలోచించి కేకేఆర్‌ను తనకు ఇష్టమైన ప్రత్యర్ధిగా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా విరాట్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగతున్నాడు. 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీలోనే కోహ్లి ఉన్నాడు.
తొట్టతొలి సీజన్ నుంచి ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లినే. ఇక ఐపీఎల్‌లో కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ అంటే అభిమానలకు పండగే. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు హోరహోరీగా జరుగుతాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment