RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు | IPL 2024 RCB Vs KKR: Virat Kohli Surpasses Chris Gayle To Record Most Sixes For RCB, See Details Inside - Sakshi
Sakshi News home page

#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు

Published Sat, Mar 30 2024 6:30 AM | Last Updated on Sat, Mar 30 2024 10:11 AM

Virat Kohli surpasses Gayle to record most sixes for RCB - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన ఆర్సీబీ ఆట‌గాడిగా విరాట్ రికార్డ‌ల‌కెక్కాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో మ్యాచ్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన‌ కోహ్లి.. ఈ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు కోహ్లి ఐపీఎల్‌లో 241 సిక్స్‌లు బాదాడు. కాగా ఇంత‌క‌ముందు ఈ రికార్డు యూనివ‌ర్స‌ల్ బాస్‌, ఆర్సీబీ మాజీ ఆట‌గాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఐపీఎల్‌లో 239 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డు బ‌ద్ద‌లైంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.  58 బంతులు ఎదుర్కొన్న  4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.

కానీ మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ కేవ‌లం 16.5 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(50) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. సునీల్ న‌రైన్‌(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(39 నాటౌట్‌) అద్బుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement