
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయినప్పటికి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), సునీల్ నరైన్(26 బంతుల్లో 44) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
వీరితో పాటు రఘువంశీ(30) పరుగులతో రాణించాడు. డికాక్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్(6), అండ్రీ రస్సెల్(4), రింకూ సింగ్(12) తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. హాజిల్ వుడ్ రెండు, రసీఖ్ ధార్ సలీం, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.
కోహ్లి, సాల్ట్ విధ్వంసం..
175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పవర్‌ప్లేలో కోహ్లి, సాల్ట్ చాలా దూకుడుగా ఆడారు.
వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ఆర్సీబీ స్కోర్ ఆరు ఓవర్లలోనే 80 పరుగులు దాటేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆప్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment