
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-2024 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్ ముగిసింది. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది.
తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన కేకేఆర్.. ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక విజేతగా నిలిచిన కేకేఆర్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టీమ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
విజేతకు ఎన్ని కోట్లంటే?
ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు ప్రైజ్‌మనీ రూపంలో రూ.20 కోట్లు లభించాయి. అదేవిధంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఎస్ఆర్‌హెచ్‌కు రూ.13 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మూడో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి .రూ. 6.5కోట్లు అందాయి.
⇒ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన విరాట్ కోహ్లికి రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు.
⇒పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచిన హర్షల్ పటేల్‌కు రూ.15లక్షల నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హర్షల్.. 24 వికెట్లు పడగొట్టాడు.
⇒ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డికి, ప్లేయర్ ఆఫ్‌ది సీజన్ అవార్డు విన్నర్ సునీల్ నరైన్‌కు చెరో రూ. 10లక్షల ప్రైజ్‌మనీ లభించింది.
⇒అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన సునీల్ నరైన్ రూ.12 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో16 మ్యాచ్‌లు నరైన్.. 488 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment