ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.
స్కోర్లు
టాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్
ఒమన్ - 140/5(20)
భారత్ - ఏ- 146/4(15.2)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోని
రాణించిన భారత బౌలర్లు
.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.
ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.
కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.
సెమీస్‌లో
ఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.
చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment