Oman
-
వన్డేల్లో సరికొత్త చరిత్ర.. 40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏ
వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఓ మ్యాచ్ మొత్తంలో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేదు. అన్ని ఓవర్లు స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. యూఎస్ఏ, ఒమన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఒమన్.. యూఎస్ఏ బ్యాటింగ్ చేసిన 35.3 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. అనంతరం యూఎస్ఏ సైతం ఒమన్ బ్యాటింగ్ చేసిన 25.3 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 61 ఓవర్లు జరగ్గా, అన్నింటినీ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.40 ఏళ్ల కిందటి భారత రికార్డును బద్దలు కొట్టిన యూఎస్ఏఈ మ్యాచ్‌లో మరో రికార్డు వరల్డ్ రికార్డు కూడా నమోదైంది. వన్డేల్లో అతి తక్కువ స్కోర్‌ను (122) డిఫెండ్ చేసుకున్న జట్టుగా యూఎస్ఏ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు పేరిట ఉండేది. 1985లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. 40 ఏళ్ల తర్వాత యూఎస్ఏ.. భారత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఒమన్‌పై యూఎస్ఏ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 35.3 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో మిలింద్ కుమార్ (47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆండ్రియస్ గౌస్ (14), హర్మీత్ సింగ్ (10), ఆరోన్ జోన్స్ (16), సంజయ్ కృష్ణమూర్తి (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లు షకీల్ అహ్మద్ 3, ఆమిర్ కలీమ్, సమయ్ శ్రీవత్సవ్ తలో 2, జే ఒడెడ్రా, సిద్దార్థ్ బుక్కపట్నం చెరో వికెట్ తీసి యూఎస్ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఒమన్ తరఫున బౌలింగ్ చేసినవారంతా స్పిన్నర్లే.అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. యూఎస్ఏ స్పిన్నర్ల దెబ్బకు 25.3 ఓవర్లలో 65 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుశ్ కెంజిగే ఐదు వికెట్లు తీసి ఒమన్ పతనాన్ని శాశించాడు. మిలింద్ కుమార్, యాసిర్ మొహమ్మద్ తలో రెండు, హర్మీత్ సింగ్ ఓ వికెట్ పడగొట్టి ఒమన్ పతనానికి తమవంతు సహకారాన్ని అందించారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం హమ్మద్ మీర్జా (29) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయగా.. నలుగురు డకౌట్ అయ్యారు. ఒమన్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేసిన బౌలర్లు కూడా స్పిన్నర్లే. -
భారత్ ‘ఎ’ హ్యాట్రిక్ గెలుపు
మస్కట్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత ‘ఎ’ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ ఒమన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ ‘ఎ’ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మొహమ్మద్ నదీమ్ (49 బంతుల్లో 41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. భారత్ ‘ఎ’ బౌలర్లలో అఖీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిషాంత్, రమణ్‌దీప్ సింగ్, సాయికిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆయుష్ బదోనీ (27 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్‌సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ (30 బంతుల్లో 36 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (15 బంతుల్లో 34; 5 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
Asia T20 Cup 2024: ఆయుశ్ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్ సేన హ్యాట్రిక్ విజయం
ACC Mens T20 Emerging Teams Asia Cup 2024 India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్ టోర్నీలో భారత్-‘ఎ’ జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్-బిలో భాగంగా పాకిస్తాన్, యూఏఈలపై తిలక్ సేన విజయం సాధించింది.స్కోర్లుటాస్: ఒమన్.. తొలుత బ్యాటింగ్ఒమన్ - 140/5(20)భారత్ - ఏ- 146/4(15.2)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆయుశ్ బదోనిరాణించిన భారత బౌలర్లు.అల్ అమెరత్ వేదికగా ఒమన్ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ సేన.. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.ఒమన్ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్ జతిందర్ సింగ్(17), ఆమిర్ ఖలీం(13) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్ నదీం 41, హమద్ మీర్జా 28(నాటౌట్) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.కాగా ఒమన్ ఓపెనర్లలో జతిందర్ సింగ్ వికెట్‌ను నిషాంత్ సంధు.. ఆమిర్ ఖలీం వికెట్‌ను ఆకిబ్ ఖాన్ తీయగా.. రమణ్‌దీప్ సింగ్ కరణ్ సోనావాలేను అవుట్ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్ వసీం అలీ, రాసిక్ సలాం మహ్మద్ నదీం వికెట్లను దక్కించుకున్నారు.సెమీస్లోఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధిస్తే గ్రూప్-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్ -
పాకిస్తాన్ తొలి విజయం
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్ 2024 టోర్నీలో పాకిస్తాన్-ఏ జట్టు తొలి విజయం నమోదు చేసింది. అల్ అమీరట్ వేదికగా ఒమన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్‌లో పాక్-ఏ జట్టు 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఖాసిమ్ అక్రమ్ (48), రొహైల్ నజీర్ (41 నాటౌట్), ఆరాఫత్ మిన్హాస్ (31 నాటౌట్), ఒమైర్ యూసఫ్ (25), అబ్దుల్ సమద్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలరల్లో ముజాహిర్ రజా రెండు వికెట్లు పడగొట్టగా.. వసీం అలీ, సమయ్ శ్రీవత్సవ, సుఫ్యాన్ మెహమూద్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఒమన్‌ను కట్టడి చేశారు. జమాన్ ఖాన్ 2, షానవాజ్ దహాని, మొహమ్మద్ ఇమ్రాన్, ఖాసిమ్ అక్రమ్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ పడగొట్టారు. ఒమన్ బ్యాటర్లలో వసీం అలీ (28), జతిందర్ సింగ్ (24), హమ్మద్ మిర్జా (14), ఆమిర్ ఖలీమ్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పాక్ ఈ టోర్నీలో తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుండగా.. భారత్ ఇవాళ సాయంత్రం అదే యూఏఈని ఢీకొట్టనుంది. చదవండి: పాక్ బౌలర్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్ శర్మ -
చరిత్ర సృష్టించిన ఒమన్ పేసర్.. షాహీన్ అఫ్రిది రికార్డు బద్దలు
ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ వన్డేల్లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బిలాల్‌కు ముందు ఈ రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది పేరిట ఉండేది. షాహీన్ 51 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. బిలాల్ కేవలం 49 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా (పేసర్లు, స్పిన్నర్లు) వన్డేల్లో ఫాస్టెస్ 100 వికెట్స్ రికార్డు నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ పేరిట ఉంది. లామిచ్చేన్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు.ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బిలాల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నమీబియాపై ఒమన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. ఒమన్ 49.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా ఇన్నింగ్స్‌లో మలాన్ క్రుగెర్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. ఆకిబ్ ఇలియాస్ (68), ఖలీద్ కైల్ (43) ఒమన్‌ను గెలిపించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ భట్ 2, కలీముల్లా, జే ఒడేడ్రా, షోయబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసల్ 2, బెన్ షికోంగో, తంగెని లుంగమెని తలో వికెట్ దక్కించుకున్నారు.వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్లుబిలాల్ ఖాన్- 49 మ్యాచ్లుషాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52షేన్ బాండ్- 54ముస్తాఫిజుర్ రెహ్మాన్- 54వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లుసందీప్ లామిచ్చేన్- 42రషీద్ ఖాన్- 44బిలాల్ ఖాన్- 49షాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52 -
అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు.. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే!
స్కాట్లాండ్ ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కాసెల్ రికార్డులకెక్కాడు. సోమవారం ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ లీగ్ 2లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాసెల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 21 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబడా పేరిట ఉండేది. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెబ్యూ చేసిన రబాడ.. తన అరంగేట్రంలో 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో రబాడ ఆల్‌టైమ్ రికార్డును కాస్సెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో వరల్డ్రికార్డును కూడా అతడు నమోదు చేశాడు. అరంగేట్రంలో తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గా కాస్సెల్ నిలిచాడు. తను వేసిన మొదటి ఓవర్లో తొలి రెండు బంతుల్లో ఒమన్ బ్యాటర్లు జీషన్ మస్కూద్ అయాన్ ఖాన్‌లను ఔట్ చేసిన కాసెల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 53 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేయలేకపోయాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఒమన్.. కాసెల్ దాటికి కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ 2 వికెట్లు కోల్పోయి చేధించింది.Charlie Cassell's sensational seven-for on debut has helped Scotland bowl Oman out for a modest total 👏Catch all the live #CWCL2 action on https://t.co/CPDKNxoJ9v 📺#SCOvOMA 📝: https://t.co/woV3zYu9sG | 📸: @CricketScotland pic.twitter.com/iGeeVoyvTc— ICC (@ICC) July 22, 2024 -
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం
ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్‌ను గుర్తించడానికి భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎస్ఎస్ టెగ్ను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపారు. ఒమన్‌లోని రాస్ మద్రాక్కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్సీ)పేర్కొంది. -
ఒమన్ సమీపంలో సరుకు రవాణా నౌక మునక
దుబాయ్: ఒమన్ సమీప సముద్రజలాల్లో సరకు మూడు రోజుల క్రితం రవాణా నౌక మునిగిపోయిన ఘటనలో ఐదుగురు భారత, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. మూడ్రోజుల అన్వేషణ తర్వాత 8 మంది భారతీయులను, ఒక శ్రీలంక వ్యక్తిని కాపాడ గలిగారు. మిగతా వారికోసం అన్వేషణ సాగుతోంది. దుబాయ్ నుంచి బయలుదేరిన నౌక దుక్మ్ పట్టణం సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. కొమొరోస్ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 13 మంది భారత సిబ్బంది, ముగ్గురు శ్రీలంక వాసులు ఉన్నట్టు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒమన్‌లోని ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్టులకు దుక్మ్ పోర్ట్ ప్రధాన కేంద్రంగా ఉంది. 117 మీటర్ల పొడవైన ఫాల్కన్ నౌకను 2007లో నిర్మించారు. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులే. -
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024 -
ఒమన్‌లో కాల్పుల కలకలం
మస్కట్: ఒమన్‌లోని వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం(జులై 16) తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా పులువురికి గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్‌కప్‌లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్‌తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్‌రన్‌రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ పడింది. మెగా టోర్నీ నుంచి ఓ జట్టు నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఒమన్ తదుపరి దశకు చేరకుండా ఎలిమినేట్ అయ్యింది. నిన్న (జూన్ 9) స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన అనంతరం ఒమన్ అధికారికంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్ సూపర్-8కు అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టనుంది. ఈ టోర్నీలో ఒమన్ మరో మ్యాచ్ (జూన్ 13న ఇంగ్లండ్‌తో) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండానే ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.కాగా, ఆంటిగ్వా వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ప్రతిక్ అథవాలే (54) అర్ద సెంచరీతో రాణించగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయాన్ ఖాన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్క్ వాట్, వీల్, క్రిస్టఫర్ సోల్, క్రిస్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్.. బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (31 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జార్జ్ మున్సే (20 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఆకిబ్ ఇలియాస్, మెహ్రన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో స్కాట్లాండ్ రన్‌రేట్‌ను బాగా మెరుగుపర్చుకుని టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. -
T20 World Cup 2024: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్
ఆసీస్ వెటరన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. గేల్ పేరిట 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
T20 World Cup 2024: ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన స్టోయినిస్.. బోణీ కొట్టిన ఆసీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 జర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-బిలో పసికూన ఒమన్‌తో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో (67 నాటౌట్, 3/19) ఇరగదీసి ఆసీస్‌ను గెలిపించాడు. స్టోయినిస్ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఒమన్ విలవిలలాడిపోయింది.వివరాల్లోకి వెళితే.. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్) ఆదుకున్నారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హెడ్ (12), మిచెల్ మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. మెహ్రాన్ ఖాన్ 2, బిలాల్ ఖాన్, కలీముల్లా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. జంపా (4-0-24-2), ఇల్లిస్ (4-0-28-2), స్టార్క్ (3-0-20-2) కూడా సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన అయాన్ ఖాన్ టాప్ స్కోరర్‌గా నిలువగా..మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
T20 World Cup 2024: ఉత్కం‘టై’న పోరులో నమీబియా ‘సూపర్’ గెలుపు
సూపర్ ఓవర్‌కు ముందు... నమీబియా గెలిచేందుకు 6 బంతుల్లో 5 పరుగులు కావాలి. క్రీజులో పాతుకుపోయిన ఫ్రయ్‌లింక్ (48 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఉండటంతో నమీబియా గెలుపు లాంఛనం. కానీ మెహ్రాన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ఆఖరి బంతి బౌల్ అయ్యేసరికి ఒమన్ గెలవాలి! ఫ్రయ్‌లింక్, గ్రీన్ వికెట్లు తీసిన మెహ్రాన్ 4 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 2 పరుగులపుడు మెహ్రాన్ చక్కని బంతి వేయగా... వికెట్ కీపర్ మిస్ ఫీల్డింగ్, మిస్ త్రో వల్ల ఒక పరుగు వచ్చి స్కోరు ‘టై’ అయింది. తుది ఫలితం కోసం మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో... ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నమీబియా బ్యాటర్లు డేవిడ్ వీస్ తొలి నాలుగు బంతుల్లో 4, 6, 2, 1 కొట్టగా... చివరి రెండు బంతులు ఆడిన ఎరాస్మస్ 4, 4 బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు 22 పరుగులు చేయాల్సిన ఒమన్ జట్టు నసీమ్ (2) వికెట్ కోల్పోయి 10 పరుగులే చేయడంతో నమీబియా ‘సూపర్’ విక్టరీ నమోదు చేసింది. బ్రిడ్జ్‌టౌన్: లాంఛనమైన (ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 5 పరుగులు) విజయానికి దూరమైన నమీబియా ‘సూపర్ ఓవర్’తో చేజారిన విజయాన్ని చేజిక్కించుకుంది. ఒమన్ పేసర్ మెహ్రాన్ (3–1–7–3) అసాధారణ బౌలింగ్‌ను... డేవిడ్ వీస్ ‘షో’ సూపర్ ఓవర్లో మాయం చేసింది. ‘సూపర్ ఓవర్’లో 13 పరుగులు చేసిన వీస్ వెంటనే బౌలింగ్‌కు దిగి వికెట్ కూడా తీసి 10 పరుగులిచ్చాడు. 20 జట్లు బరిలో ఉన్న ఈ టి20 ప్రపంచకప్‌లో ‘బోర్’ మ్యాచ్‌లే బోలెడనుకున్న క్రికెట్ ప్రేక్షకులు, విశ్లేషకుల అంచనాల్ని గ్రూప్ ‘బి’లోని ఈ మ్యాచ్ తారుమారు చేసింది. ఔరా అనిపించేలా ఈ కూనల తక్కువ స్కోర్ల మ్యాచ్ వరల్డ్‌కప్‌కే వన్నె తెచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా గెలిచినా... మ్యాచ్ చూసిన ప్రతి మదిని ఒమన్ పోరాటం తాకింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖాలిద్ కైల్ (39 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్), జీషాన్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్ (4/21), వీస్ (3/28), కెపె్టన్ గెరార్డ్ ఎరాస్మస్ (2/20) అదరగొట్టారు. తర్వాత నమీబియా కూడా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జాన్ ఫ్రయ్లింక్తో పాటు నికోలస్ డేవిన్ (31 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 3: టి20 ప్రపంచకప్ చరిత్రలో ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలిన మ్యాచ్‌లు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్‌లో సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు.. అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించాయి. -
T20 World Cup 2024: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న వీస్
నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (39) లేటు వయసులో అదిరిపోయే ప్రదర్శనలతో ఇరదీస్తున్నాడు. గత కొంతకాలంగా నమీబియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీస్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లోనూ చెలరేగిపోతున్నాడు. వరల్డ్‌కప్ గ్రూప్-బి పోటీల్లో భాగంగా ఒమన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి నమీబియాను గెలిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాట్‌తో బంతితో సత్తా చాటిన వీస్.. సూపర్ ఓవర్లోనూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.రెగ్యులర్ మ్యాచ్‌లో తొలుత బంతితో (3.4-0-28-3) రాణించిన వీస్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ (8 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్లోనూ వీస్ ఇరగదీశాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాట్‌తో (4 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) చెలరేగిన వీస్.. ఆతర్వాత బంతితోనూ (1-0-10-1) రాణించి నమీబియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు గాను వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో వీస్‌తో పాటు ట్రంపెల్మన్ (4-0-21-4), ఎరాస్మస్ (4-0-20-2), స్కోల్జ్ (4-0-20-1) సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఒమన్ చేసినన్ని పరుగులే (109) చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ (3-1-7-3), కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ (4-1-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బిలాల్ ఖాన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. నమీబియాను విజయతీరాలకు చేర్చేందుకు ఫ్రైలింక్ (45) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.సూపర్ ఓవర్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వీస్, ఎరాస్మస్ (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. వీస్ ధాటికి 10 పరుగలకే పరిమితమై ఓటమిపాలైంది. -
చెలరేగిన నమీబియా బౌలర్లు.. 109 పరుగులకే ఒమన్ ఆలౌట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. మరి 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒమన్ బౌలర్లు కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. -
మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
India-Oman Relations: సరికొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత్–ఒమన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో మరో ముందడుగు పడింది. సుమారు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రూపొందించిన దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల సంబంధాల్లో ఇది సరికొత్త మలుపు కానుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య కుదిరే సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)కి ఇది దోహదప డుతుందని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత్‌లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చలు జరిపారు. పాలస్తీనా సమస్యకు పరిష్కారమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగించాలని వారు అభిప్రాయపడినట్లు విదేశాంత శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అదేవిధంగా, ఇద్దరు నేతలు ఒమన్–భారత్ సంయుక్త పెట్టుబడి నిధికి మూడో విడతగా రూ.2,500 కోట్లు సమకూర్చుతామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేసుకున్న రంగాల్లో పెట్టుబడులుగా వినియోగిస్తారు. భారత్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై పోరు, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఒమన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ కార్యాలయంలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్‌లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
T20 WC Qualifier: థ్రిల్లింగ్ మ్యాచ్.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఊహించని ఫలితం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన భారత్-సౌతాఫ్రికా మ్యాచ్‌తో క్రికెట్ ప్రపంచం మొత్తం బిజీగా ఉంటే.. నేపాల్‌లోని ఖాట్మండులో ఓ అద్భుతం జరిగింది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్లో ఒమన్.. తమకంటే పటిష్టమైన నేపాల్‌ను సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి సమానమైన స్కోర్లు (184 పరుగులు) చేయడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేయగా.. నేపాల్ కేవలం 10 పరుగులకు (వికెట్ కోల్పోయి) మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో ఒమన్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. కిక్కిరిసిపోయిన స్టేడియం.. ఇసుకేస్తే రాలనంత జనం నేపాల్‌లో క్రికెట్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వేల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. సొంత జట్టు మ్యాచ్ అయితే అభిమానులను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. స్టేడియంలో నిలబడేందుకు కూడా ప్లేస్ దొరక్క జనాలు చెట్లు, టవర్లు ఎక్కుతున్నారు. ఇక్కడ క్రికెట్ క్రేజ్ ప్రమాదకర స్థాయికి చేరింది. నిన్న కిరిటీపూర్లో జరిగిన నేపాల్-ఒమన్ 2024 టీ20 వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు జనాలు తండోపతండాలుగా స్టేడియంకు వచ్చారు. స్టేడియంలో వాతావరణం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. A cacophony of noise and a full house again here well before the start of play in Kathmandu as Nepal's anthem provides the goosebumps with the 30,000 or so in & around the TU singing in unison It's Nepal🇳🇵 v Oman🇴🇲 for the title with both teams guaranteed to the #T20WorldCup pic.twitter.com/CWDIQYLfMh — Andrew Leonard (@CricketBadge) November 5, 2023 ఇది చాలదనట్లు జనాలు స్టేడియం బయట ఉన్న చెట్లు, ఎత్తైన హోర్డింగ్‌లు ఎక్కి మ్యాచ్ వీక్షించారు. క్రికెట్ మ్యాచ్‌ల కోసం జనాలు స్టేడియానికి రావడం మంచిగానే అనిపిస్తున్నప్పటికీ, జరగరానిది ఏదైన జరిగితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. It's an electrifying atmosphere here at T.U Ground as always.#NEPvOMAN pic.twitter.com/5BJv1RAQud — Samraat Maharjan (@MaharjanSamraat) November 5, 2023 ఇదిలా ఉంటే, నేపాల్ ఫ్యాన్స్ తమ జట్టు టైటిల్ సాధిస్తుందేమోనని కిరీటీపూర్ స్టేడియానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ జట్టు అనూహ్యంగా సూపర్ ఓవర్లో ఓటమిపాలై, వారిని నిరాశపరిచింది. -
T20 WC 2024: టి20 ప్రపంచకప్.. తొలిసారి 20 జట్లు బరిలోకి
కీర్తిపూర్ (నేపాల్): వచ్చే ఏడాది వెస్టిండీస్–అమెరికాలలో జరిగే టి20 పురుషుల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు నేపాల్, ఒమన్ జట్లు అర్హత సాధించాయి. ఇక్కడ జరుగుతున్న ఆసియా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి టి20 ప్రపంచకప్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఒమన్ జట్టు 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్ జట్టును ఓడించగా... నేపాల్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై గెలిచింది. టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించడం ఇది రెండోసారి కాగా... ఒమన్ జట్టు మూడోసారి ఈ మెగా టోర్నీలో పోటీపడనుంది. నేపాల్ 2014లో, ఒమన్ 2016, 2021 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్నాయి. మరో రెండు బెర్త్‌ల కోసం... వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు వెస్టిండీస్–అమెరికాలలో జరిగే తొమ్మిదో టి20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికి 18 జట్లు అర్హత పొందాయి. ఆతిథ్య దేశాల హోదాలో వెస్టిండీస్, అమెరికా నేరుగా అర్హత సంపాదించాయి. 2022 ప్రపంచకప్ ద్వారా భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లకు బెర్త్‌లు లభించాయి. ర్యాంకింగ్ ఆధారంగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు బెర్త్‌లు దక్కాయి. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా నేపాల్, ఒమన్... యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా స్కాట్లాండ్, ఐర్లాండ్... తూర్పు ఆసియా–పసిఫిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా పాపువా న్యూగినీ... అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా కెనడా అర్హత సాధించాయి. ఈనెల 22 నుంచి 30 వరకు నమీబియాలో ఏడు దేశాల మధ్య (జింబాబ్వే, కెన్యా, నమీబియా, నైజీరియా, రువాండా, టాంజానియా, ఉగాండా) జరిగే ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు బెర్త్‌లు ఖరారవుతాయి. -
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు. నేడు జింబాబ్వే గెలిస్తే... ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది. -
CWC Qualifier 2023: సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు, తదుపరి షెడ్యూల్ వివరాలు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. నేపాల్, యూఎస్ఏ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఒమన్ సూపర్ సిక్స్‌కు చేరుకోగా.. ఐర్లాండ్, యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లు జూన్ 29 నుంచి ప్రారంభమవుతాయి. సూపర్ సిక్స్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు జరుగనుండగా.. ఓ గ్రూప్‌లోని మూడు జట్లు మరో గ్రూప్‌లోని మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టోర్నీలో మరో నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఏ పొజిషన్లో ఉంటుందో డిసైడ్ కాలేదు. గ్రూప్-ఏలో జింబాబ్వే తొలి స్థానాన్ని దాదాపుగా ఖరారు చేసుకోగా.. వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 26) విజేత రెండో స్థానంలో నిలుస్తుంది. గ్రూప్-బి నుంచి శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌లో (జూన్ 27) విజేత గ్రూప్ టాపర్ నిలుస్తుంది. మరో జట్టు ఒమన్ తమ కోటా మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడంతో ఓడిన జట్టు రెండో స్థానంలో ఉంటుంది. సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే 2 పాయింట్లతో తదుపరి దశకు చేరతాయి. గ్రూప్-ఏలో జింబాబ్వే.. తమ గ్రూప్‌లోని నెదర్లాండ్స్, వెస్టిండీస్‌లపై విజయాలు సాధించడంతో సూపర్ సిక్స్ దశకు రెండు పాయింట్లతో అడుగుపెడుతుంది. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక-స్కాట్లాండ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత 2 పాయింట్లతో సూపర్ సిక్స్‌కు చేరుకుంటుంది. సూపర్ సిక్స్ షెడ్యూల్ (అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి).. జూన్ 29: ఏ2 వర్సెస్ బి2 జూన్ 30: ఏ3 వర్సెస్ బి1 జులై 1: ఏ1 వర్సెస్ బి3 జులై 2: ఏ2 వర్సెస్ బి1 జులై 3: ఏ3 వర్సెస్ బి2 జులై 4: ఏ2 వర్సెస్ బి3 జులై 5: ఏ1 వర్సెస్ బి2 జులై 6: ఏ3 వర్సెస్ బి3 జులై 7: ఏ1 వర్సెస్ బి1 సూపర్ సిక్స్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు జులై 9న జరిగే వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్లో తలపడటంతో పాటు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. -
శ్రీలంకకు ధీటుగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన స్కాట్లాండ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్ చేతిలో ఓడినా ఒమన్ ఈ గ్రూప్ నుంచి మూడో జట్టుగా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరగా.. నేపాల్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్ కీపర్ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడు.. శతక్కొట్టి చుక్కలు చూపించాడు
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న గ్రూప్-బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ యువ ఆటగాడు బ్రాండన్ మెక్‌ముల్లెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ 92 బంతుల్లోనే శతక్కొట్టి, ఒమన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడిన మెక్‌ముల్లెన్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ పేరు హిట్టింగ్ దిగ్గజం, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరుకు దగ్గరగా ఉండటం, మెక్కల్లమ్ తరహాలో మెక్‌ముల్లెన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం చూసి నెటిజన్లు ఈ స్కాటిష్ హిట్టర్‌ను మెక్కల్లమ్తో పోలుస్తున్నారు. ఈ మెక్‌ముల్లెన్ మెక్కల్లమ్ కంటే డేంజర్లా ఉన్నాడంటూ కితాబిస్తున్నారు. పైగా మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లోనూ ఇరగదీశాడంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల మెక్‌ముల్లెన్.. స్కాట్లాండ్ తరఫున 11 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 326 పరుగులు చేసి.. బౌలింగ్‌లో ఓసారి 5 వికెట్ల ఘనతతో 17 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, బులవాయో వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. -
ఐర్లాండ్‌కు బిగ్ షాకిచ్చిన ఒమన్.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బోణీ
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో ఒమన్ బోణీ కొట్టింది. బులవాయో అథ్లెటిక్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఒమన్ అద్భుతమైన విజయం సాధించింది. 282 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఒమన్ ఛేదించింది. ఒమన్ విజయంలో ఓపెనర్ ప్రజాపతి(72) కెప్టెన్ జీషన్ మక్సూద్ కీలక(59) కీలక పాత్ర పోషించారు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్, అడైర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో డాక్రెల్(91), హ్యరీ టెక్టార్(52) పరుగులతో రాణించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఫయ్యాజ్ భట్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయాన్ ఖాన్, ఒడేరా, మక్సూద్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. చదవండి: #CWCQualifiers2023: చెలరేగిన హసరంగా.. ICC CWC Qualifiersలో లంక శుభారంభం -
ఉండలేక.. తిరిగి రాలేక...
మోర్తాడ్ (బాల్కొండ): పొరుగు దేశాలతో వాణిజ్య వ్యాపార సంబంధాలను వృద్ధి చేయడానికి ఒమన్ ప్రభుత్వం విరివిగా జారీ చేసిన విజిట్ వీసాలను కొందరు దళారులు పక్కదారి పట్టించారు. ఒమన్ లో వ్యాపారం చేయడానికి విదేశీయులకు జారీ చేసిన విజిట్ వీసాలను నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. ఫలితంగా ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లిన వందలాది మంది తెలంగాణ వలస కార్మికులు ఆ దేశంలో ఇరుక్కుపోయారు. విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో అక్కడ ఉండలేక, ఇంటికి చేరాలంటే రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో మగ్గుతున్నారు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఒమన్ విదేశీ వ్యాపారులను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేలా చర్యలు చేపట్టింది. ఇలా ఐదు నెలల కింద విజిట్ వీసాలను ఎక్కువగా జారీ చేసింది. ఒకసారి జారీ చేసిన విజిట్ వీసాను రెండుమార్లు గడువు పొడిగించుకోవడానికి ఒమన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి అవకాశాలు పొందాలనుకునే ఔత్సాహికులను నకిలీ ఏజెంట్లు ఆకర్షించారు. ఒమన్‌కు విజిట్ వీసాపై వెళ్లి వర్క్ వీసా పొందవచ్చని నమ్మించారు. 300 మంది తెలంగాణ వలస కార్మికులు ఉచితంగా జారీ చేసిన విజిట్ వీసాలను రూ.80 వేలకు ఒకటి చొప్పున విక్రయించి దాదాపు 300 మంది తెలంగాణ వలస కార్మికులను తరలించారు. విజిట్ వీసాలపై వచ్చినవారికి ఒమన్‌లోని కంపెనీలు పనులు ఇవ్వడానికి నిరాకరించాయి. ఒక నెల విజిట్ వీసా గడువు ముగిసిపోవడంతో మరో నెల రోజులకు పొడిగించుకుని ఉపాధి అవకాశాల కోసం కార్మికులు ప్రయత్నించారు. కంపెనీలలో ఉన్నవారికే సరైన పని లేకపోవడంతో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు ఇచ్చే అవకాశం అసలే లేకపోయింది. కొందరు వలస కార్మికులు తమ చేతిలో డబ్బు లేకపోవడంతో వీసా గడువు పొడిగించుకోలేక రహస్యంగా అక్కడే ఉండిపోయారు. పార్కులు, స్నేహితుల గదుల్లో కార్మికులు తలదాచుకుంటున్నారు. వీసా రెన్యూవల్, జరిమానా చెల్లించేందుకు డబ్బుల్లేకపోవడంతో వలస కార్మికులు స్వదేశం తిరిగి రావడానికి అవస్థలు పడుతున్నారు. వీసా ఉంటేనే రావాలి: గుండేటి గణేశ్ ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్ ప్రతినిధి గుండేటి గణేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ దేశానికి విజిట్ వీసాపై వచ్చిన వారికి పనులు ఇవ్వడం లేదన్నారు. కంపెనీ వీసా ఉంటేనే ఒమన్‌కు రావాలని సూచించారు. చిక్కుకుపోయిన వలస కార్మికులను మాతృభూమికి పంపించడానికి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని గణేశ్ వివరించారు. -
వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..
అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు. He is a hero! 💞pic.twitter.com/wKcUKVQpmH — Figen (@TheFigen_) December 21, 2022 చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..! -
దళారుల చేతిలో మోసం
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎనిమిది మంది దళారుల చేతిలో మోసపోయారు. వారి మాటలు విని ఓ కంపెనీలో వెల్డింగ్ పనులు చేసే నిమిత్తం ఒమన్ దేశానికి వెళ్లారు.. అక్కడకు వెళ్లాక అసలు అలాంటి కంపెనీయే లేదని తెలియడంతో లబోదిబోమంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం(గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్, గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు(బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు(గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం(బాలాజీపురం)లు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్‌కు వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులుంటాయని చెప్పారని, మంచి జీతాలొస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరూ రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ చెల్లించారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక, కడుపు నిండా తిండి లేక ఇబ్బందిపడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న పాస్ పోర్టు, వీసాలు నకిలీవంటూ అక్కడి పోలీసులు తీసుకెళ్లారని అక్కడ నుంచి బంధువులకు సమాచారం అందజేశారు. క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం..: మంత్రి అప్పలరాజు ఉపాధి కోసం వెళ్లి ఒమన్ దేశంలో చిక్కుకుపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు హామీ ఇచ్చారు. జరిగిన విషయాన్ని బాధితుల బంధువులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన శుక్రవారం పలాసలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ఒమన్‌లో వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని, క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటుందని ధైర్యం చెప్పారు. ఇండియన్ ఎంబసీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. చదవండి:గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు -
ఒమెన్‌లో చిక్కుకున్న సిక్కోలు యువకులు.. మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో
వజ్రపుకొత్తూరు రూరల్/కంచిలి/సంతబొమ్మాళి: దేశం కాని దేశంలో సిక్కోలు యువకులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన 8 మంది యువకులు ఒమెన్ దేశంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఇక్కడి వారితో సంప్రదించి తమ బాధలు చెప్పుకున్నారు. వీరు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులు ఉంటాయని చెప్పారని, మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరం రూ. 90 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లించామని తెలిపారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక కడుపు నిండా తినేందుకు తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్డు, వీసాలు నకిలీవని పోలీసులు తీసుకెళ్లారని, భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ఒమెన్‌లో చిక్కుకున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం (గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్ (పెద్దపాలేరు), గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు (బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు (గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం (బాలాజీపురం)లు ఉన్నారు. -
ఇంకా నయం.. గ్లోవ్స్, బ్యాట్ మాత్రమే విసిరాడు!
మ్యాచ్ గెలిస్తే సెలబ్రేషన్ చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి అలాంటి సెలబ్రేషన్స్ హద్దులు దాటిపోతాయి. చూడడానికి కాస్త ఓవర్‌గా కూడా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2022లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం ఒమన్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కష్యప్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మహ్మద్ నదీమ్ 53 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి విజయాన్ని అందుకుంది. రిచీ బెరింగ్టన్(73), జార్జ్ మున్సీ(43), మైకెల్ లీస్క్(21) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లో రిచీ బెరింగ్టన్ ఔట్ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రధాన బ్యాటర్స్ అంతా వెనుదిరగడంతో భారం అంతా మార్క్ వాట్పై పడింది. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో ఓవర్ తొలి బంతిని మార్క్ వాట్ ఫోర్ తరలించాడు. ఆ తర్వాత మూడు బంతులకు నాలుగు పరుగుల వచ్చాయి. ఇక ఐదో బంతిని ఫోర్ కొట్టి జట్టను గెలిపించాడు మార్క్ వాట్. 37 పరుగులతో అజేయంగా నిలిచిన మార్క్ వాట్ తన సహచర బ్యాటర్ వద్దకు పరిగెత్తుకొచ్చి గ్లోవ్స్, బ్యాట్‌ను గాల్లోకి విసిరేసి.. హెల్మెట్‌కు ముద్దులు పెట్టాడు. దీంతో ఇదేం వింత సెలబ్రేషన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ODI World Cup Qualifiers: వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు Mark Watt finished the game for Scotland with a ball in hand. He scored an unbeaten 37 in 35 balls. The celebration from him says it all about the importance of the win. pic.twitter.com/bgCzpEcrvL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2022 -
మోసం చేసిన ఏజెంట్! ఒమన్‌లో చిక్కుల్లో పడ్డ భారతీయ మహిళ !
ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. మారుమూల ప్రాంతానికి మస్కట్‌లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్ ఏజెంట్ రంగారెడ్డి జిల్లాలోని షహీన్ నగర్‌కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్‌కి కాకుండా ఒమన్‌లోని మారుమూల ప్రాంతమైన సిర్కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. నిత్యం హింసే రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది. నిఘా పెట్టాలి ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్, ఒమన్లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో హుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టు డ్రోన్ ఎటాక్.. యూఏఈ స్పందన -
T20 World Cup 2021: ఒమన్‌పై స్కాట్లాండ్ ఘన విజయం.. సూపర్ 12కు అర్హత
ఒమన్‌పై స్కాట్లాండ్ ఘన విజయం.. గ్రూప్ బీ టాపర్‌గా సూపర్ 12కు అర్హత ఒమన్ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ సునాయాస విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసి, గ్రూప్ బీ టాపర్‌గా సూపర్ 12కు అర్హత సాధించింది. కెప్టెన్ కైల్ కొయెట్జర్(28 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు మున్సే(19 బంతుల్లో 20; 4 ఫోర్లు), మాథ్యూ క్రాస్(35 బంతుల్లో 26 నాటౌట్ ), రిచీ బెర్రింగ్టన్(21 బంతుల్లో 31 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్, ఖవర్ అలీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన స్కాట్లాండ్.. సూపర్ 12లో భారత్ ఉండే గ్రూప్(గ్రూప్ 2)లో చేరింది. జోష్ డేవీకి ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డుయ లభించింది. లక్ష్యం దిశగా సాగుతున్న స్కాట్లాండ్ ఒమన్ నిర్ధేశించిన 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. 8 ఓవర్ల తర్వాత మున్సే(19 బంతుల్లో 20; 4 ఫోర్లు) వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. క్రీజ్‌లో కైల్ కొయెట్జర్(22 బంతుల్లో 33), మాథ్యూ క్రాస్(6) ఉన్నారు. మున్సే వికెట్ ఫయాజ్ బట్కు దక్కింది. ఒమన్ 122 ఆలౌట్.. స్కాట్లాండ్ టార్గెట్ 123 స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒమన్ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో కేవలం 122 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్(37), మహ్మద్ నదీమ్(25), కెప్టెన్ జీషన్ మక్సూద్(34) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. స్కాట్లాండ్ బౌలర్లలో జోష్ డేవీ 3 వికెట్లతో చెలరేగగా.. సాఫ్యాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్ చెరో 2 వికెట్లు.. మార్క్ వాట్ ఓ వికెట్ దక్కించుకున్నారు. 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఒమన్ స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఒమన్ జట్టు 15 ఓవర్లలో 94 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. స్కాట్లాండ్ బౌలర్లు సాఫ్యాన్ షరీఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ లీస్క్, మార్క్ వాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. క్రీజ్‌లో కెప్టెన్ జీషన్ మక్సూద్(19), నసీం ఖుషి(1) ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 31/2 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒమన్.. ఇన్నింగ్స్ రెండో బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ జతిందర్ సింగ్(0) రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో ఆ జట్టు మరో వికెట్ కోల్పోయింది. సాఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో మున్సేకు క్యాచ్ ఇచ్చి కశ్యప్ ప్రజాపతి(8 బంతుల్లో 3) వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 31/2. క్రీజ్‌లో ఆకిబ్ ఇలియాస్(18 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు), మహ్మద్ నదీమ్(3) ఉన్నారు. అల్ అమీరట్: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా గురువారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-బీ మ్యాచ్‌లో ఒమన్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: ఒమన్: జతిందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్, కశ్యప్ ప్రజాపతి, జీషన్ మక్సూద్(కెప్టెన్), ఖవర్ అలీ, నసీం ఖుషి(వికెట్ కీపర్), సూరజ్ కుమార్, మహ్మద్ నదీం, సందీప్ గౌడ్, బిలాల్ ఖాన్, ఫయాజ్ బట్ స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోట్జెర్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మాక్లీడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవి, బ్రాడ్లీ వీల్, సాఫ్యాన్ షరీఫ్ -
T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్‌తో
Oman Bowler Fayyaz Butt Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్ ఫయాజ్ భట్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. తన బౌలింగ్‌లోనే ఒకవైపుగా డైవ్ చేస్తూ మెహదీ హసన్‌ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతిని ఫయాజ్ భట్ ఫుల్‌టాస్ వేయగా.. మెహదీ బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. వెంటనే భట్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకొని ఆ తర్వాత రెండు చేతులతో బంతిని బాలెన్స్ చేశాడు. దీంతో మెహదీ అసన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: Oman Vs BAN: చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం PC: ICC T20.Com కాగా మెహదీ అసన్ను డకౌట్ చేసిన భట్ మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 26 పరుగుల తేడాతో ఒమన్‌పై విజయం సాధించింది. బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్‌లో 42 పరుగులు.. అనంతరం బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: T20 WC 2021: మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2021: చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
చెలరేగిన ముస్తాఫిజుర్.. 26 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ, చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 26 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బంగ్లా బౌలర్లు ముస్తాఫిజుర్, షకీబ్ ధాటికి ఒమన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో బంగ్లాదేశ్‌కు మరో ఓటమి ఖాయమయ్యేలా కనిపించినా, బంగ్లా బౌలర్లు తేరుకుని ఒమన్‌ను కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లతో చెలరేగగా, షకీబ్ 3, సైఫుద్దీన్, మెహిదీ హసన్ తలో వికెట్ పడగొట్టారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో జతిందర్ సింగ్(40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యం దిశగా సాగుతున్న ఒమన్.. 15 ఓవర్ల తర్వాత 100/4 ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లా జట్టుకు మరో పరాభవం తప్పేలా లేదు. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. లక్ష్యం దిశగా సాగుతుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/4. క్రీజ్‌లో అయాన్ ఖాన్(11 బంతుల్లో ), సందీప్ గౌడ్(6 బంతుల్లో 4) ఉన్నారు. ఒమన్ గెలవాలంటే 30 బంతుల్లో 54 పరుగులు చేయాలి. 10 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 70/2 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి నరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి కశ్యప్ ప్రజాపతి(18 బంతుల్లో 21) ఔట్ కాగా.. జతిందర్(25 బంతుల్లో 30), జీషన్ మక్సూద్(4) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోర్ 70/2గా ఉంది. ధాటిగా ఆడుతున్న ఒమన్.. 5 ఓవర్ల తర్వాత 40/1 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. 2వ ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడుతుంది. ముస్తాఫిజుర్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి ఒమన్ ఓపెనర్ ఆకిబ్ ఇలియాస్(6 బంతుల్లో 6) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగగా.. కశ్యప్ ప్రజాపతి(15 బంతుల్లో 15), జతిందర్(9 బంతుల్లో 10) ధాటిగా ఆడుతున్నారు. 5 ఓవర్ల తర్వాత ఒమన్ స్కోర్ 40/1. ఒమన్ బౌలర్ల విజృంభన.. బంగ్లాదేశ్ 153 ఆలౌట్ ఆఖరి 5 ఓవర్లలో ఒమన్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. 17వ ఓవర్లో కలీముల్లా.. అఫీఫ్ హోసేన్(5 బంతుల్లో 1), మహ్మద్ నయీమ్(50 బంతుల్లో 64; 3 ఫోర్లు, 4 సిక్సర్లు)ల వికెట్లు పడగొట్టగా.. 19వ ఓవర్లో ఫయాజ్ బట్ వరుస బంతుల్లో.. ముష్ఫికర్(4 బంతుల్లో 6), సైఫుద్దీన్(0)లను ఔట్ చేసి బంగ్లా భారీ స్కోర్ ఆశలకు గండికొట్టాడు. ఆఖరి ఓవర్ బౌల్ చేసిన బిలాల్ ఖాన్.. మహ్మదుల్లా(10 బంతుల్లో 17), ముస్తాఫిజుర్(2)లకు ఔట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ 153 పరుగుల వద్ద ముగిసింది. ఒమన్ బౌలర్లు ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్ తలో 3 వికెట్లు సాధించగా.. కలీముల్లా 2, జీషన్ మక్సూద్ ఓ వికెట్ పడగొట్టారు. గేర్ మార్చిన బంగ్లా బ్యాటర్లు.. 15 ఓవర్ల తర్వాత 112/4 మొదటి 10 ఓవర్లలో ఆచితూచి ఆడిన బంగ్లా బ్యాటర్లు ఆ తర్వాత గేర్ మార్చారు. 10కిపైగా సగటుతో పరుగులు స్కోర్ చేస్తున్నారు. 13.3 ఓవర్లో షకీబ్(29 బంతుల్లో 42; 6 ఫోర్లు) రనౌట్ కాగా, 15వ ఓవర్ ఆఖరి బంతికి జీషన్ మక్సూద్ బౌలింగ్‌లో సందీప్ గౌడ్‌కు క్యాచ్ ఇచ్చి నరుల్ హసన్(4 బంతుల్లో 3) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 112/4. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(46 బంతుల్లో 56), అఫీఫ్ హోసేన్ ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 63/2 తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన బంగ్లా జట్టు ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపిస్తోంది. 5 నుంచి 10 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 38 పరుగులు జోడించింది. 10 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 63/2. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(31 బంతుల్లో 32), షకీబ్ అల్ హసన్(18 బంతుల్లో 22) ఉన్నారు. 5 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 25/2 టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మరోసారి చెత్త బ్యాటింగ్ ప్రదర్శనను కొనసాగిస్తుంది. తొలి 5 ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు (లిటన్ దాస్(6), మెహిదీ హసన్(0)) కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 5 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్‌లో మహ్మద్ నయీమ్(13), షకీబ్ అల్ హసన్(4) ఉన్నారు. ఒమన్ బౌలర్లు ఫయాజ్ బట్, బిలాల్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి మ్యాచ్‌లో బంగ్లా జట్టు పసికూన స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసినా సంగతి తెలిసిందే. అల్ అమీరట్: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-బీ మ్యాచ్‌లో ఒమన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: ఒమన్: జతిందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్, కశ్యప్ ప్రజాపతి, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్, ఫయాజ్ బట్ బంగ్లాదేశ్: లిటన్ దాస్, మహ్మద్ నయీమ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మహ్మదుల్లా(కెప్టెన్), అఫిఫ్ హోసేన్, నరుల్ హసన్, మెహిదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. -
T20 World Cup 2021: తొలి వికెట్, తొలి హాఫ్ సెంచరీ.. ఎవరిదో తెలుసా?!
T20 World Cup 2021 Match 1 Interesting Facts: క్రికెట్ ప్రేమికులకు మజాను అందించేందుకు పొట్టి ప్రపంచకప్ టోర్నీ మొదలైపోయింది. ఆదివారం(అక్టోబరు 17) ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్ జరిగింది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా(రౌండ్ 1) గ్రూపు-బిలోని ఒమన్- పపువా న్యూగినియా మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమైంది. మెగా ఈవెంట్‌లోని మొదటి మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు.. టీ20 వరల్డ్‌కప్-2021: ►టాస్ గెలిచిన జట్టు- ఒమన్ ►తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు- పపువా న్యూగినియా ►తొలి వికెట్- బిలాల్ ఖాన్(ఒమన్)- టోనీ ఉరాను అవుట్ చేశాడు ►తొలి అర్ధ సెంచరీ- అసద్ వాలా(పపువా కెప్టెన్) ►తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- జీషన్ మక్సూద్(ఒమన్ సారథి) 4/20 in four overs 👏 Zeeshan Maqsood, take a bow 🙇#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Y3LidFsqdl — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►తొలి బౌండరీ- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) ►తొలి సిక్సర్-చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) What a shot to hit the first six of the ICC Men's #T20WorldCup 💥 Charles Amini, you beauty 👏https://t.co/SoC9rvdqTu — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►తొలి రనౌట్- చార్లెస్ అమిని(పపువా న్యూగినియా) ►తొలి విజయం సాధించిన జట్టు- ఒమన్ ►అత్యధిక వికెట్లు తీసిన బౌలర్- జీషన్ మక్సూద్(4/20) ►అత్యధిక పరుగులు- జతీందర్ సింగ్(73 నాటౌట్), 7 ఫోర్లు, 4 సిక్సర్లు) Jatinder Singh brings up an explosive half-century 💪#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/ekRVqdiTzz — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ►పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన ఆటగాళ్లు- టోనీ ఉరా(0), లెగా సియాకా(0)(పపువా) ►తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించిన పపువాపై 10 వికెట్ల తేడాతో ఒమన్ విజయం. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జతీందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ The first wicket of the ICC Men's #T20WorldCup 2021 belonged to Bilal Khan 🔥https://t.co/nA12nCeZkj — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 -
T20 WC: కల నెరవేరింది... భావోద్వేగానికి గురైన ఆటగాళ్లు...
PNG cricketers, support staff break down; ప్రపంచ వేదికపై మెరిసే అద్భుత క్షణాల కోసం ఎదురుచూసిన ఆ జట్టుకు ఎట్టకేలకు అవకాశం లభించింది... ఏళ్ల నాటి కల నేటితో నెరవేరింది. అందుకే మెగా టోర్నీలో తమ జాతీయ గీతం వినిపించగానే భావోద్వేగంతో అందరి కళ్లు చెమర్చాయి. క్రికెట్ పండుగ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సందర్భంగా... ఈ ఈవెంట్‌కు తొలిసారిగా అర్హత సాధించిన పపువా న్యూగినియా జట్టు, సిబ్బంది గురించే ఈ ప్రస్తావన. గ్రూపు-బీలో ఉన్న పపువా న్యూగినియా.. ఆదివారం మొదలైన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ టోర్నీలో ఆతిథ్య ఒమన్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలుత పపువా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. దీంతో... ఆటగాళ్లు, ఇతర సిబ్బంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్... పపువాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. కెప్టెన్ అసద్ వాలా(56) టోర్నీలో మొదటి అర్ధ శతకం సాధించడం విశేషం. చదవండి: T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్.. -
T20 WC Oman Vs PNG: 10 వికెట్ల తేడాతో ఒమన్ ఘన విజయం
T20 World Cup 2021 Oman vs Papua New Guinea: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్‌లో ఒమన్ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్ ఇలియాస్ (50), జితేందర్ సింగ్(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచి వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(4)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ►స్కోర్లు: పపువా న్యూగినియా129/9 (20) ఒమన్ 131/0 (13.4) ►ఒమన్ ఓపెనర్లు అర్ధ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు. అకిబ్ ఇలియాస్(42), జితేందర్ సింగ్(42) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోరు: 88-0. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు ►పపువా న్యూ గినియా విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ ఓపెనర్లు అకిబ్ ఇలియాస్, జితేందర్ సింగ్ మెరుగ్గా ఆడుతున్నారు. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేయగలిగింది. A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ఒమన్ టార్గెట్ 130 ►టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్‌లో ఒమన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు టోని ఉరా, లెగా సియాకా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచ వేదికపై తొలిసారిగా ఆడే అవకాశం దక్కించుకున్న జట్టు కెప్టెన్ అసద్ (56) అర్ధ సెంచరీతో మెరిశాడు. పపువా ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్ స్కోర్. ►పపువా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్ అసద్(56) అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నార్మన్ వనువా(1), ఆ వెంటనే సెసె బా(13)ను ఒమన్ కెప్టెన్ జీషన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఆ తర్వాత కిప్లిన్ డోరిగాను కూడా జీషన్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలో 113 పరుగులు చేసిన పపువా 7 వికెట్లు కోల్పోయింది. ►కొరకాని కొయ్యగా తయారైన అసద్ వాలాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. అసద్ షాట్ ఆడే క్రమంలో జితేందర్ సింగ్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను అవుట్ చేసిన తర్వాత ఒమన్ ప్లేయర్ జితేందర్... టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ►పపువా కెప్టెన్ అసద్ వాలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒమన్ సారథి జీషన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఈ టోర్నీలో మొదటి అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఆడే అర్హత సాధించిన పపువా న్యూ గినియాకు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ►నాలుగు ఫోర్లు, సిక్సర్ బాది 37 పరుగులతో జోరు మీదున్న పపువా బ్యాటర్ అమినీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒమన్ బౌలర్ మహ్మద్ నదీం బౌలింగ్‌లో అసద్ వాలాతో సమన్వయ లోపం కారణంగా వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పపువా మూడో వికెట కోల్పోయింది. ప్రస్తుతం అసద్ వాలా, సెసె బా క్రీజులో ఉన్నారు. ►ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డా పపువా బ్యాటర్లు అసద్ వాలా, చార్లెస్ అమిని వరుస షాట్లతో అలరిస్తున్నారు. అసద్ 26, అమిని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►ఆతిథ్య ఒమన్ జట్టుకు శుభారంభం లభించింది. తొలి ఓవర్లోనే ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వికెట్ పడగొట్టాడు. పపువా ఓపెనర్ టోనీ ఉరాను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ లెగా సియాకాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పపువా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని క్రీజులో ఉన్నారు. Updates: పపువా న్యూగినియా జాతీయ గీతాలాపన అనంతరం... ఆతిథ్య ఒమన్ గీతాలాపన. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జితేందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ మస్కట్: మరో మహా క్రికెట్ సంగ్రామానికి తెర లేచింది. ఐదేళ్ల విరామం తర్వాత ఒమన్ వేదికగా పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఆరంభమైంది. గ్రూప్- బీలోని ఆతిథ్య ఒమన్- పపువా న్యూగినియా మధ్య తొలి మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
T20 World Cup 2021: పాల్గొనే జట్లు, పూర్తి షెడ్యూల్.. ఇతర వివరాలు
ICC T20 World Cup 2021: మరికొన్ని గంటల్లో మరో క్రికెట్ పండుగ మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లోని మజా పంచేందుకు ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీ మన ముందుకు రానుంది. అక్టోబరు 17 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్, జట్లు, సమయ పట్టిక, వేదిక తదితర అంశాల గురించి పరిశీలిద్దాం. 16 జట్లు టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో మొత్తం 16 జట్లు ఆడబోతున్నాయి. టీమిండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఒమన్, పపువా న్యూ గినియా, నమీబియా మెగా టోర్నీలో భాగం కానున్నాయి. నవంబరు 14న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 4 స్థానాల కోసం పోటీ ►సూపర్ 12లో భాగంగా ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు స్థానాల కోసం 8 జట్లు పోటీపడనున్నాయి. ►గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. ప్రతి గ్రూపులో టాపర్‌గా నిలిచిన రెండు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. సూపర్ 12లో ఉన్న జట్లు ►గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్- ఏ(A1) టాపర్, గ్రూప్-బీ(B2)లోని రెండో జట్టు ఉంటాయి. ►గ్రూప్-2లో టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, A2, B1 ఉంటాయి. ►ప్లేఆఫ్ చేరుకున్న ఇరు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీ ఫైనల్లో తలపడతాయి. ►మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నిమిషాలు, రాత్రి 7:30 నిమిషాలకు మొదలవుతాయి. మ్యాచ్ నెంబర్ తేదీ మ్యాచ్ సమయం వేదిక స్టేజ్ 1, అక్టోబరు 17 ఒమన్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 2 అక్టోబరు 17 బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్- 1 3 అక్టోబరు 18 ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్- 1 4 అక్టోబరు 18 శ్రీలంక వర్సెస్ నమీబియా 07:30 అబుదాబిi రౌండ్- 1 5 అక్టోబరు 19 స్కాట్లాండ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్- 1 6 అక్టోబరు 19 ఒమన్ వర్సెస్ బంగ్లాదేశ్ 07:30 మస్కట్ రౌండ్- 1 7 అక్టోబరు 20 నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్ 03:30 అబుదాబి రౌండ్ 1 8 అక్టోబరు 20 శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ 07:30 అబుదాబి రౌండ్ 1 9 అక్టోబరు 21 బంగ్లాదేశ్ వర్సెస్ పపువా న్యూగినియా 03:30 మస్కట్ రౌండ్ 1 10 అక్టోబరు 21 ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ 07:30 మస్కట్ రౌండ్ 1 11 అక్టోబరు 22 నమీబియా వర్సెస్ ఐర్లాండ్ 03:30 అబుదాబి రౌండ్ 1 12 అక్టోబరు 22 శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్ 07: 30 అబుదాబి రౌండ్ 1 13 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్ 12 14 అక్టోబరు 23 ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ 07:30 అబుదాబి సూపర్ 12 15 అక్టోబరు 24 A1 vs B2 03:30 షార్జా సూపర్ 12 16 అక్టోబరు 24 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 17 అక్టోబరు 25 అఫ్గనిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 18 అక్టోబరు 26 సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ 03:30 దుబాయ్ సూపర్ 12 19 అక్టోబరు 26 పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ 07:30 షార్జా సూపర్ 12 20 అక్టోబరు 27 ఇంగ్లండ్ వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 21 అక్టోబరు 27 B1 వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 22 అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్ A1 07:30 దుబాయ్ సూపర్ 12 23 అక్టోబరు 29 వెస్టిండీస్ వర్సెస్ B2 03:30 షార్జా సూపర్ 12 24 అక్టోబరు 29 అఫ్గనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ 07:30 దుబాయ్ సూపర్ 12 25 అక్టోబరు 30 సౌతాఫ్రికా వర్సెస్ A1 03:30 షార్జా సూపర్ 12 26 అక్టోబరు 30 ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 07:30 దుబాయ్ సూపర్ 12 27 అక్టోబరు 31 అఫ్గనిస్తాన్ వర్సెస్ A2 03:30 అబుదాబి సూపర్ 12 28 అక్టోబరు 31 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 07:30 దుబాయ్ సూపర్ 12 29 నవంబరు 1 ఇంగ్లండ్ వర్సెస్ A1 07:30 షార్జా సూపర్ 12 30 నవంబరు 2 సౌతాఫ్రికా వర్సెస్ B2 03:30 అబుదాబి సూపర్ 12 31 నవంబరు 2 పాకిస్తాన్ వర్సెస్ A2 07:30 అబుదాబి సూపర్ 12 32 నవంబరు 3 న్యూజిలాండ్ వర్సెస్ B1 03:30 దుబాయ్ సూపర్ 12 33 నవంబరు 3 ఇండియా వర్సెస్ అఫ్గనిస్తాన్ 07:30 అబుదాబి సూపర్ 12 34 నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్ B2 03:30 దుబాయ్ సూపర్ 12 35 నవంబరు 4 వెస్టిండీస్ వర్సెస్ A1 07:30 అబుదాబి సూపర్ 12 36 నవంబరు 5 న్యూజిలాండ్ వర్సెస్ A2 03:30 షార్జా సూపర్ 12 37 నవంబరు 5 ఇండియా వర్సెస్ B1 07:30 దుబాయ్ సూపర్ 12 38 నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ 03:30 అబుదాబి సూపర్ 12 39 నవంబరు 6 ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా 07:30 షార్జా సూపర్ 12 40 నవంబరు 7 న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ 03:30 అబుదాబి సూపర్ 12 41 నవంబరు 7 పాకిస్తాన్ వర్సెస్ B1 07:30 షార్జా సూపర్ 12 42 నవంబరు 8 ఇండియా వర్సెస్ A2 07:30 దుబాయ్ సూపర్ 12 43 నవంబరు 10 సెమీ ఫైనల్-1 07:30 అబుదాబి ప్లే ఆఫ్ 44 నవంబరు 11 సెమీఫైనల్-2 07:30 దుబాయ్ ప్లేఆఫ్ 45 నవంబరు 14 ఫైనల్ 07:30 దుబాయ్ ఫైనల్ చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ICC Announces T20 World Cup Prize Money: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) ఆదివారం ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు 12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ రూపంలో లభిస్తుంది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకి రూ.6 కోట్లు ప్రైజ్‌మనీ అందుతుంది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు(నాలుగు లక్షల డాలర్లు) వరకు వస్తుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే పురుషుల టీ 20 ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న మొత్తం 16 జట్లు 5.6 మిలియన్ డాలర్లను పంచుకోనున్నాయి. 2016 వరల్డ్‌కప్ వలె సూపర్ 12 దశలో జట్లు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు బోనస్ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ ఇవ్వనుంది. సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచులు జరుగుతాయి. గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు) వరకు దక్కనుంది. ఈ రౌండ్ కోసం మొత్తం 12 లక్షల డాలర్లను ఖర్చు పెట్టనున్నట్లు ఐసీసీ మీడియా ప్రకటనలో తెలిపింది. సూపర్ 12 నుంచి ఇంటిముఖం పట్టే జట్లకు 70వేల డాలర్లను ఐసీసీ అందజేయనుంది. దీని కోసం ఐసీసీ మొత్తంగా 560000 డాలర్లను ఖర్చు చేయనుంది. ఇక రౌండ్ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు) దక్కుతాయి. ఇందుకు గాను మొత్తం 4,80,000 డాలర్లను ఐసీసీ కేటాయించింది. ఇదే రౌండ్లో వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందజేస్తారు. నమీబియా, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఓమన్, పపువా న్యూ గియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు రౌండ్ వన్‌లో పోటీ పడబోతున్నాయి. ఇక సూపర్ 12లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడనున్నాయి. చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే... -
ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..!
Cyclone Shaheen Almost Forced Oman To Wave Goodbye To T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌కు ఆతిధ్య దేశమైన ఒమన్‌లో షహీన్ తుఫాను బీభత్సం సృష్టించింది. వేగవంతమైన గాలులు, అతి భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని మస్కట్ సహా చుట్టు పక్క ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఈ ప్రభావం ఇక్కడ జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్‌లపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను నేపథ్యంలో క్వాలిఫయర్స్ (శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్) జట్ల మధ్య జరగాల్సిన 6 రౌండ్-1 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది. మరోవైపు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకం యధావిధిగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్ జట్ల మధ్య రౌండ్-1 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక, ఐర్లాండ్ జట్లు టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం 70 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే స్టేడియాల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌తో రసవత్తర పోరు మొదలవుతుంది. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్ అక్కడే..! -
టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ దూరం
ఢాకా: వచ్చే నెలలో ఒమన్, యూఏఈలలో జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో తాను పాల్గొనడంలేదని బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా గత ఐదు నెలలుగా తమీమ్ ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సీరిస్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మార్గదర్శకాల ప్రకారం, సెప్టెంబర్ 10 లోపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలి. కొన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. టి20 ప్రపంచ కప్ జట్టులో నేను ఉండాలని అనుకోవడం లేదని..నా స్థానంలో ఎవరు వచ్చినా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గా తమీమ్ పేరిట రికార్డు ఉంది. ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌లు ఆడి 1,701 పరుగులు చేశాడు. కాగా బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్‌లో సూపర్12 కు అర్హత సాధించడానికి గ్రూప్ B లో స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ తో తలపడనుంది. చదవండి: పాల్ స్టిర్లింగ్ మెరుపు సెంచరీ.. ఐర్లాండ్ ఘనవిజయం -
ఒమన్ పొమ్మంటోంది!
మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ వలస కార్మికులకు అపారమైన ఉపాధి అవకాశాలు కల్పించిన ఒమన్ దేశం.. ఇప్పుడు వారిని వదిలించుకుంటోంది. స్వదే శీయులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బయటవారిని సాగనంపుతోంది. దీంతో వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టా డుతోంది. దీంతో అక్కడివారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి, వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవాలని ఒమన్ నిర్ణయించింది. ఇప్పటికే ఎందరో విదేశీ వలస కార్మికులను స్వదేశాలకు పంపించేసింది. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలలో ఒమనీయులకు పెద్దపీట వేశారు. అలాగే, చిన్న, మధ్య తరహా వాహనాల డ్రైవింగ్‌లోనూ తమ ప్రజలకు అవకాశం కల్పిస్తూ, విదేశీ డ్రైవర్ల లైసెన్స్‌ల రెన్యూవల్‌ను నిలిపి వేశారు. దీనికి తోడు ప్రైవేటు రంగంలోనూ ఒమన్ పౌరులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇందులో భాగంగానే ఈ నెల 20 నుంచి వాణిజ్య రంగాలలో విదేశీ వలస కార్మికుల స్థానంలో ఒమన్ పౌరులకు ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణ కార్మికులకు పెద్ద దెబ్బ.. ఒమన్ నిర్ణయం తెలంగాణ వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒమన్‌లో ఇప్పటివరకు ఉపాధి పొందిన విదేశీ వలస కార్మికులలో భారత్‌కు చెందిన వలసదారుల సంఖ్యనే ఎక్కువగా ఉండగా, ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 1.25 లక్షల మంది ఉంటారని అంచనా. తాజా నిర్ణయంతో 80 శాతం మంది ఉపాధి కోల్పోనున్నారని అంచనా. గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం .ఒమన్‌లో కొన్ని నెలల నుంచి భారతీయులే కాకుండా ఇతర దేశాల వ్యాపారులు, ఉద్యోగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంతో భారతీయులకు కష్టకాలం ఏర్పడనుంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఒమన్‌లో బతకడం కష్టమే. –నరేంద్ర పన్నీరు, ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు. వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు -
వారికి ఒమన్ ప్రభుత్వం శుభవార్త
మోర్తాడ్ (బాల్కొండ): ఒమన్ దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులు స్వచ్ఛందంగా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి ప్రకటించిన క్షమాభిక్ష గడువును ఆ దేశ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2020 డిసెంబర్ 31 వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు నిర్ణయించిన ఒమన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ విమానాల నిలుపుదల నేపథ్యంలో మొదటిసారి ఈ నెల 15 వరకు పొడిగించింది. క్షమాభిక్ష పొందేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరోసారి మార్చి 31 వరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ డైరెక్టర్ జనరల్ సేలం బిన్ సయీద్ అల్‌బాడి వెల్లడించారు. గడిచిన నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన క్షమాభిక్షతో ఇప్పటివరకు 12,378 మంది విదేశీయులు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు.(చదవండి: వీసా లేకుండానే ఒమన్ వెళ్లొచ్చు) ఇదిలా ఉండగా మరో 57,847 మంది క్షమాభిక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు గడువు పెంచడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒమన్‌లో అమలవుతున్న క్షమాభిక్ష వల్ల లబ్ధిపొందే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు క్షమాభిక్ష పొందిన వారికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఆర్థిక పరిస్థితి బాగాలేని వారికి విమాన టికెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు తెలిపారు. -
ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
సాక్షి, మోర్తాడ్ (బాల్కొండ): విదేశీ పర్యాటకులకు ఒమన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విజిట్ వీసాతో సంబంధం లేకుండానే ఒమన్‌లో పది రోజులపాటు పర్యటించడానికి అవకాశం కల్పించింది. భారత్‌సహా 103 దేశాల పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గతంలో ఒమన్‌లో పర్యటిం చాలంటే నెల లేదా 3 నెలల కాలపరిమితి గల విజిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. విజిట్ వీసా కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అయ్యేది. ఎవరైనా స్పాన్సర్లు ఉంటే విజిట్ వీసా ఉచితంగానే లభించేది. తాజా వెసులుబాటు నేపథ్యంలో ఒమన్‌లో పర్యటించే పర్యాటకులు అక్కడి రాయల్ పోలీసు నిబంధనలను అనుసరించాలి. ఆరోగ్య బీమా, ఒమన్ వచ్చి వెళ్లడానికి విమాన టికెట్లు, బస చేసే హోటల్ వివరాలను ఒమన్ రాయల్ పోలీసులకు అందించాలి. పర్యటన ఆసాంతం పోలీసుల నిఘా ఉంటుంది. -
ఒమన్‌లో వలస కార్మికులకు క్షమాభిక్ష
సాక్షి, జగిత్యాల: ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది. వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. 25 లక్షల మంది వలసదారులు ఒమన్ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. క్షమాభిక్ష ద్వారా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు అందించి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాలని భారత కార్మికులు కోరుతున్నారు. ఉచిత విమాన సదుపాయం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఒమన్–తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ సభ్యుడు నరేంద్ర పన్నీర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్ ఫారం నింపాలి
మస్కట్ : ఒమన్ నుండి భారత్‌కు ప్రయాణించేవారికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ప్రకటన జారీ చేసింది. భారత్‌కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా భారతదేశానికి అత్యవసరంగా ప్రయాణించడానికి ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్‌లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. కోవిడ్-19 పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి 14 ఏప్రిల్ 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయులు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుందని, విమానాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఒమన్ నుండి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్‌సైట్‌లోని ఈ లింకు ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం డేటా (సమాచార) సేకరణ కోసం మాత్రమే అని రాయబార కార్యాలయం తెలిపింది. https://docs.google.com/forms/d/e/1FAIpQLSe5f6iMNMfovllq_6q0BRao8MAXKzcnzCfCnWc9ZVLtvBLfKA/viewform భారత్‌కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ ఎయిర్ పోర్టులో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుందని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు చేరుకున్నాక, వారిని నేరుగా వారివారి ఇళ్లకు పంపి 'సెల్ఫ్ క్వారంటైన్' (స్వీయ నిర్బంధం) చేయడమా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడమా అనే దానిపై భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. 'గల్ఫ్ తదితర దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది చిన్న ఇండ్లు కలిగిన పేద, దిగువ మధ్యతరగతి వారే. తమ ఇండ్లలో 'సెల్ఫ్ క్వారంటైన్' కొరకు ప్రత్యేకంగా విడిగా ఉండటానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో తగినన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండవచ్చని' భీరెడ్డి అన్నారు. ఆర్ధిక మాంద్యం వలన భవిష్యత్తులో లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు వాపస్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా "గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ" కి రూపకల్పన చేయాలని మంద భీరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’
మస్కట్ : ఓమాన్లో మస్కట్ లోని ఇండియన్ ఎంబసీలో శుక్రవారం 'ఓపెన్ హౌజ్' అనే అనే బహిరంగ సామాజిక సమావేశం (ప్రవాసి ప్రజావాణి) నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఓమాన్ లో నివసించే ప్రవాస భారతీయులు మధ్యాహ్నం గం. 2 నుండి గం. 3.30 ని.ల వరకు ఫోన్ నెంబర్ +968 2469 5981 కు కాల్ చేసి ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 కు కాల్ చేయవచ్చు. హాట్ లైన్ నెంబర్ +91 11 4050 3090, +91 11 2688 5021, ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఈ-మెయిల్ helpline@mea.gov.in కు కూడా సంప్రదించవచ్చు. తెలంగాణకు చెందిన వారు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ +91 94916 13129, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ +91 89783 73310 హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించవచ్చు. -
నిరీక్షణకు తెర...
మస్కట్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా పదేళ్ల నిరీక్షణకు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ తెరదించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఒమన్ ఓపెన్ చాలెంజర్ ప్లస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో శరత్ కమల్ చాంపియన్ అయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 37 ఏళ్ల శరత్ కమల్ 6–11, 11–8, 12–10, 11–9, 3–11, 17–15తో టాప్ సీడ్ ఫ్రెటాస్ మార్కోస్ (పోర్చుగల్)ను బోల్తా కొట్టించాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ చివరిసారి అంతర్జాతీయస్థాయిలో 2010లో ఈజిప్ట్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత అతను రెండు టోర్నమెంట్లలో (మొరాకో ఓపెన్–2011; ఇండియా ఓపెన్–2017) సెమీఫైనల్ చేరి ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శరత్ 11–13, 11–13, 13–11, 11–9, 13–11, 8–11, 11–7తో కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)పై గెలవగా... మరో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ 11–5, 9–11, 11–6, 11–6, 8–11, 11–13, 3–11తో మార్కోస్ చేతిలో ఓడాడు. -
అప్పులు తీర్చాలని విదేశాలకు వెళ్లాడు కానీ..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఒమన్ దేశంలో ఈ నెల 4న గుండెపోటుతో మృతి చెందిన యువకుడి మృతదేహం గురువారం స్వగ్రామం చేరింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన బత్తుల లక్ష్మీ–రాజయ్య దంపతులకు సతీష్, సుమలత, సుజాత సంతానం. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ పోషణ భారం సతీష్(29)పై పడింది. రూ.5 లక్షలు అప్పు చేసి పెద్ద చెల్లెలు సుమలతకు పెండ్లి చేశాడు. రెండేళ్ల క్రితం రూ.2లక్షలు అప్పు చేసి గల్ఫ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఏడాదిన్నర పాటు పనులు చేయగా ఆరునెలల క్రితం అనారోగ్యానికి గుర రైయ్యాడు. చర్మవ్యాధితో బాధపడుతూ గల్ఫ్‌లో చికిత్స పొందుతున్నాడు. అప్పులు తీర్చలేక, స్వగ్రామానికి రాలేక, మానసికంగా కుంగిపోయిన సతీష్ రెండునెలలుగా రూంలోనే ఒంటరిగా ఉంటూ కాలం గడిపాడు. చర్మవ్యాధి తీవ్రరూపం దాల్చడం, అప్పులతో మానసిక వేదనకు లోనయ్యాడు. ఈ నెల 4న రూంలోనే గుండెనొప్పి రావడంతో మిత్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి మిత్రులు చందాలు పోగుచేసి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు. శవపేటిక గ్రామానికి రాగానే బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఒమాన్ ప్రభుత్వం షాక్.. ఉద్యోగాలకు కోత
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): బల్దియా(మున్సిపాలిటీ)ల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులకు ఒమాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేరుగా నియమించుకున్న కార్మికులను క్రమంగా తొలగిస్తోంది. వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు ఇప్పటికే ఇళ్లకు చేరుకోగా.. దశల వారీగా ఈ ఏడాది చివరి వరకు మరికొందరు ఇంటిముఖం పట్టనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనులను కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించాలని ఒమాన్ ప్రభుత్వం మూడేళ్ల కిందనే నిర్ణయించింది. ఇటీవల ఒమాన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన స్థానంలో హైతమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం బల్దియా ప్రైవేటీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బల్దియా పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించగా.. ఆ ఏజెన్సీలు తక్కువ వేతనంపై పనిచేసేవారిని నియమించుకుంటున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కార్మికులు తక్కువ వేతనానికి పని చేసేందుకు ముందుకు రావడంతో వారినే పనుల్లోకి తీసుకుంటున్నారు. బల్దియాలో ఇది వరకు పనిచేసిన మన కార్మికులు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆశ్రయిస్తే.. తాము ఇచ్చే వేతనానికి అంగీకరిస్తేనే పనిలో చేర్చుకుంటామని చెబుతున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల కింద పనిచేస్తే శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. ఒమాన్ దేశంలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేసే విదేశీ కార్మికుల్లో 60 శాతం మంది కార్మికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం విశేషం. బల్దియాల ప్రైవేటీకరణతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల సంఖ్య దాదాపు లక్షకు మించి ఉంటుందని అంచనా. ఇందులో బల్దియాల్లో పని చేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం.. వేతనం కూడా ఆశించిన విధంగా ఉండటంతో మన రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ఈ ఉద్యోగాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. సుమారు 40 ఏళ్ల నుంచి బల్దియా ఉద్యోగాలకు వలసలు కొనసాగుతున్నాయి. కార్మికులు చేసే పనులు ఇవే... మస్కట్‌తో పాటు ఇతర పట్టణాల్లోని మున్సిపాలిటీల్లో మన కార్మికులు గార్డెనింగ్, క్లీనింగ్, విద్యుదీM్దý రణ, రోడ్ల పక్కన ఉన్న చెత్తా చెదారం ఏరివేయడం తదితర పనులను చేసేవారు. అలాగే కార్మికులను వారి నివాసం నుంచి మున్సిపాలిటీల్లోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన వాహనాలను నడిపే డ్రైవర్లు కూడా మనవారే ఉన్నారు. నిర్ణీత పనివేళలు ఉండటంతో పాటు నెలకు మన కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు వేతనం లభించడంతో ఒమాన్ బల్దియాల్లో పనులకు డిమాండ్ ఏర్పడింది. ఒమాన్ ప్రభుత్వంలోని మున్సిపల్ వ్యవహారాల శాఖనే నేరుగా రిక్రూట్మెంట్ చేయడంతో.. కార్మికులు ఉద్యోగం మానివేస్తే గ్రాట్యూటీ కూడా ఎక్కువగా లభించేది. అలాగే ఏడాదికి నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు లభించేవి. ఈ సమయంలో కార్మికులు ఇంటికి వచ్చి వారి కుటుంబాలతో గడిపి వెళ్లేవారు. కొందరు కార్మికులు తమ పనివేళలు ముగిసిన తరువాత ఇతర పనులు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం దక్కేది. ఒమాన్ బల్దియాల్లో వివిధ పనులు చేసే కార్మికులను ఎన్నో ఏళ్ల నుంచి నేరుగా నియమించుకుంటున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికిన అక్కడి ప్రభుత్వం అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ప్రైవేటీకరణను ముమ్మరం చేసింది. పెరిగిన పనివేళలు బల్దియాల్లో ప్రభుత్వం ద్వారా నియమించబడిన కార్మికులు రోజుకు 8 గంటల పాటు పనిచేసేవారు. కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పుడు పనివేళలను పెంచాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 12 గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించాయి. గతంలో ఒక్కో కార్మికునికి భారత కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వేతనం లభించగా ఇప్పుడు రూ.20వేలకు మించి చెల్లించడం లేదు. పని వేళలు పెరగడంతో పాటు వేతనం తగ్గడం వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. స్వరాష్ట్రంలో ఉపాధి చూపాలంటున్న కార్మికులు ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగాలను కోల్పోయి ఇంటి బాట పట్టిన తెలంగాణ వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలోనే ఉపాధి మార్గాలను చూపాలని పలువురు కోరుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బల్దియా వీసాలపై ఉపాధి పొందిన కార్మికులు ఒమాన్ ప్రభుత్వ నిర్ణయంతో ఇంటికి చేరుకుంటుండగా వారికి పునరావాసం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. మూడు రకాల వీసాలు రద్దు.. మున్సిపాలిటీల్లో మన కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒమాన్ ప్రభుత్వం గతంలో జారీచేసిన మూడు రకాల వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా, సెవెన్ బల్దియా వీసా, దివాన్ బల్దియా వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా అంటే పట్టణం పరిధిలోనే పని చేయడం. సెవెన్ బల్దియా అంటే పట్టణ ప్రాంతానికి శివారుల్లో పనిచేయడం. దివాన్ బల్దియా వీసాలు ఉన్నవారు రాజు, మంత్రుల నివాసాల వద్ద పనిచేసేవారు. ఈ మూడు రకాల వీసాలను రద్దు చేసి.. అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు ఉపాధి దక్కకుండా పోతోంది. ఎనిమిదేళ్లు పనిచేశాను.. మస్కట్ బల్దియాలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశాను. గార్డెనింగ్ పనులను కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పగించడంతో మా వీసాలను రద్దుచేశారు. ఇప్పుడు ఇంటికి చేరుకున్నాం. ఉపాధి కోసం మరో గల్ఫ్ దేశానికి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒమాన్‌లో బల్దియా ప్రైవేటీకరణ కంటే ముందుగానే పరిస్థితి బాగుంది. కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పగించిన తరువాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.– డి.శ్రీకాంత్, మెండోరా,భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) ఉపాధి కోల్పోవడంబాధగా ఉంది.. ఒమాన్ బల్దియాలో పనిచేస్తున్న మాకు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడం బాధగా ఉంది. ఎనిమిది సంవత్సరాలు బల్దియాలో పనిచేశాను. ఇప్పుడు వీసా రద్దుచేసి ఇంటికిపంపించారు. ఇక్కడ ఉపాధి లేకనే గల్ఫ్‌కు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.– రాజేష్, వేంపేట్, మెట్పల్లిమండలం(జగిత్యాల జిల్లా) ప్రభుత్వాలు స్పందించాలి.. ఒమాన్‌లో బల్దియాలో పనిచేసిన కార్మికులు వందల సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణించడంతో కొత్త రాజు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దేశంలో ప్రైవేటీకరణ ఊపందుకుంది.– జి.కృష్ణ, తిప్పాపూర్, వేములవాడమండలం(రాజన్న సిరిసిల్ల జిల్లా) ఏం చేయాలోఅర్థంకావడం లేదు.. స్థానికంగా పని లేకపోవడంతోనే మేము గల్ఫ్ దేశానికి వలస వెళ్లాం. అక్కడ కూడా ప్రైవేటీకరణ వల్ల ఉపాధి కోల్పోయి ఇంటికి చేరుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వం స్పందించి మా పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదైనా ఉపాధి చూపాలి. లేకుంటే మరో గల్ఫ్ దేశానికి వెళ్లక తప్పని పరిస్థితి.– ప్రశాంత్, మెండోరా, భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) -
ఒమన్ రాజు మరణం తీరని లోటు..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): అందరికీ మిత్రులమే ఎవరికీ శత్రువులం కాదు అనే నినాదంతో జనరంజక పాలన అందించిన ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్(79) మరణం తమకు తీరనిలోటని ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసులు అభిప్రాయపడ్డారు. ఖబూస్ బిన్ అల్ సయీద్ తమ గుండెల్లో గూడుకట్టుకున్నాడని అతడు మరణించినా జ్ఞాపకాలు మాత్రం తమ మదిలో నిలచిపోతాయని పలువురు తెలంగాణవాసులు చెబుతున్నారు. ఈ నెల 10న ఖబూస్ మరణించగా 11న అధికారిక ప్రకటన వెలువడింది. ఇదేరోజున అతడి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఖబూస్ మరణించిన నుంచి ఒమన్‌లోని ఎంతో మంది తెలంగాణ వలసదారులు ఖబూస్ను కొలుస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానం చాటుకుంటున్నారు. ఖబూస్ చిత్రాలు, పలు సందర్భాల్లో తీసిన వీడియోలుమ వారికి మెసెజ్‌రూపంలో పంపిస్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న సంతాపదినంగా పాటించింది. ఆ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు మన ప్రభుత్వాలు నిర్వహించలేదు. ముంబై, పుణేలో తన విద్యాభ్యాసం కొనసాగించిన ఖబూస్ బిన్ అల్ సయీద్ 1970లో ఒమన్ పగ్గాలు చేపట్టిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని వలసదారులు వివరించారు. గల్ఫ్ దేశాల్లో వలసదారులను కట్టు బానిసలుగా చూసే దుస్థితి కొనసాగుతోంది. ఒమన్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వలసదారులను తమ సొంత మనుషులుగా చూసే గొప్ప సంప్రదాయానికి బాటలు వేసిన దార్శనికుడు ఖబూస్ బిన్ అల్ సయీద్ అని తెలంగాణవాసులు కీర్తిస్తున్నారు. తాము ఉపాధి కోసం ఇంటికి దూరంగా ఉన్నా సొంత ఇంటిలోనే ఉన్నామనే భావన కలిగిందని, ఇందుకు ఖబూస్ మంచితనం, మానవత్వమే కారణమంటున్నారు. ప్రస్తుతం ఒమాన్‌లో వలస కార్మికులు 1.35 లక్షల మంది ఉంటారని అంచనా.వారికి కష్టంకలగకుండా చూసిన ఖబూస్ లేని లోటు తీరనిదని ప్రవాసులు ఆవేదనవ్యక్తం చేశారు. తట్టుకోలేక పోతున్నాం నేను 25 ఏళ్ల నుంచి ఒమన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తు న్నా. ఒమన్‌లో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారి సమస్య ఇట్టే పరిష్కారం అయ్యేది. ఖబూస్ మరణించిన వార్త విని తిండి కడుపులోకి పోవడం లేదు. ఖబూస్ మరణించిన రెండో రోజు నుంచి జోరు వర్షం కురుస్తోంది. అంటే ఆకాశం అతడి మృతి పట్ల దుఖిఃస్తుందని అనిపిస్తుంది. ఇలాంటి గొప్ప మానవత్వవాది మరణించడం మాకు మింగుడుపడడం లేదు. ఈ బాధ నుంచి ఎలా బయటపడతామో అర్థం కావడం లేదు. – రిటా, ప్రొఫెసర్, ఒమన్ సొంత మనిషిని కోల్పోయినట్లు ఉంది ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణిస్తే అందరికీ సొంత మనిషిని కోల్పోయినట్లు బాధ కలుగుతోంది. ఇలాంటి మానవతావాది, గొప్ప దార్శనికుడిని కోల్పోవడం ప్రధానంగా వలసదారులకు తీరని లోటు. ఒమన్ పాలనను అభివృద్ధి పథంలో నడిపించడమే కాదు ప్రజలను సొంత బిడ్డలుగా చూసుకున్న రాజు మరణించడం తీరని లోటు. ఖబూస్ మరణించినా అతడి జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో నిలిచిపోతాయి – నరేంద్ర పన్నీరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఒమన్ గొప్ప నాయకుడిని కోల్పోయాం ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణం ఒక్క ఒమన్‌కే కాదు ఎన్నో దేశాలకు తీరని లోటు. గొప్ప నాయకుడిని కోల్పోయాం. వలసదారులకు ప్రధానంగా భారతీయులకు ఖబూస్ ఎంతో అభిమాన నాయకుడు. ఒమన్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఖబూస్‌కు దక్కుతుంది. ఖబూస్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం. ఇలాంటి పాలకుడు మళ్లీ పుడుతాడా అనిపిస్తుంది. – గణేశ్ గుండేటి, ఒమన్ తెలంగాణ సమితి కన్వీనర్ -
ఒమన్ సుల్తాన్ కన్నుమూత
-
ఒమన్ సుల్తాన్ కన్నుమూత
దుబాయ్: మధ్య ప్రాచ్యంలో కీలక నేతగా ఎదిగిన ఒమన్ సుల్తాన్ ఖాబూస్ బిన్ సైద్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా బెల్జియంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించినట్లు తెలిపింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా బ్రిటీష్ పాలన నుంచి శాంతియుతంగా అధికారం చేపట్టిన ఖాబూస్.. దాదాపు 50 ఏళ్ల పాటు దేశ పాలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1970 నుంచి మరణించే వరకు సుదీర్ఘ కాలంపాటు సుల్తాన్‌గా వ్యవహరించారు. అయితే ఆయనకు సంతానం లేకపోవడంతో ప్రస్తుత పాలకుడిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో ఖాబూస్ వారసుడి ప్రకటనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒమన్ సైన్యాధికారులు.. ఆయన కుటుంబానికి విఙ్ఞప్తి చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత.. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా... పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సింహాసనాన్ని అధిష్టంచబోయే వ్యక్తి గురించి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా రాచ కుటుంబం ఈ బాధ్యతను తీసుకోనట్లయితే.. ఒమన్ నిబంధనల ప్రకారం... మిలిటరీ, భద్రతా అధికారులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి పాలకుడిగా తమకు నచ్చిన వ్యక్తిని రహస్య పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఖాబూస్ ముగ్గురు కజిన్లు.. అసద్, షీహాబ్, హైతం బిన్ తారిఖ్ అల్- సైద్లలో ఎవరో ఒకరికి సింహాసనం దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో 2017లో ఉప ప్రధానిగా అసద్ బిన్ తారీఖ్‌ను ఎంపిక చేస్తూ.. అతడి పేరిట ఖాబూస్ రాయల్ డిక్రీపై సంతకం చేసినందున ఆయననే వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని సీటెల్‌కు చెందిన రచయిత(గల్ఫ్ రాజ్యాల రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారు)క్రిస్టేన్ ఉల్రిచ్సేన్ అన్నారు. నలభైతొమ్మిదిన్నరేళ్ల ఖాబూస్ పాలనను కొనసాగించే సత్తా అసద్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఒమన్ పాలకుడు మరణించడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఖాబూస్.. అమెరికా- ఇరాన్‌లతో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదరడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇరు దేశాల అధినేతలతో మైత్రితో మెలిగేవారు. (అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు) -
జీతం అడిగితే.. గెంటేశారు!
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా): ఇప్పటి వరకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించిన ఆ కంపెనీ ఇప్పుడు కార్మికుల తగ్గిం పు చర్యలు చేపడుతోంది. ఒమాన్ రాజధాని మస్కట్‌లో రేడియేటర్లు తయారు చేసే డాల్ఫిన్ కంపెనీ ఎంతో మంది విదేశీయులకు వీసాలు జారీచేసి ఉపాధి కల్పించింది. కార్మికులకు, ఉద్యోగులకు వారి పనినిబట్టి నెలకు 150 రియాళ్ల నుంచి 450 రియాళ్ల వరకు వేతనం చెల్లించడానికి అంగీకరించింది. దీంతో తెలం గాణ జిల్లాలకు చెందిన కొందరు టెక్నీషియన్లు రూ.60 వేల నుంచి రూ.70 వేలను వీసాల కోసం చెల్లించారు. ఒమాన్‌లో వాడీకబీర్, గాలా శాఖలలో పని కల్పించింది. మొదట్లో సక్రమంగా వేతనం.. కంపెనీలో పనికి కుదిరిన తరువాత ప్రతి నెలా సక్రమంగా వేతనం ఇచ్చిన యాజమాన్యం ఆ తరువాత మూడు, నాలుగు నెలకు ఒకసారి వేతనం ఇచ్చింది. దీనిపై ప్రశ్నించిన కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందని పలువురు ఆరోపించారు. అలాగే కార్మికులకు ఉన్న వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూలీలు చేసే పనిని కూడా తమకు అప్పగిస్తున్నారని పలువురు తెలంగాణకు చెందిన కార్మికులు చెప్పారు. కంపెనీ నిర్వహణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. సరిగా పనిలేకపోవడం, వేతనం ఆశించిన విధంగా చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్తామని అంటే.. మొదటగా వీసాకు చెల్లించిన ఖర్చులన్నీ తిరిగి చెల్లించి వెళ్లిపోవాలని చెప్పారని వెల్లడించారు. వీసా ఒప్పందం ప్రకారం ఇంటికి వెళ్లే సమయంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా కంపెనీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో తాము ఆర్థిక భారం భరించామని కార్మికులు తెలిపారు. కంపెనీ నుంచి ఇంటికి వచ్చినందుకు డాల్ఫిన్ కంపెనీ యాజమాన్యానికి రూ.60వేల వరకు జరిమానా చెల్లించడంతో పాటు విమాన చార్జీలు సొంతంగానే పెట్టుకున్నామన్నారు. ఇప్పటికి కొంత మంది కార్మికులు కంపెనీ యాజమాన్యం సరైన వసతి, భోజనం అందించక పోవడంతో కార్మికులు ఎంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. కాగా గడు వుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం కాగా గడువుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం రెండు సంవత్స రాల పాటు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉండదు. బలవంతంగా పంపించారు ఒమాన్‌లోని డాల్ఫిన్ కంపెనీ యాజమాన్యం మమ్మల్ని బలవంతంగా గెంటేసింది. టెక్నికల్‌గా ఎంతో అనుభవం ఉన్న వారిని సాంకేతిక పనులపై వినియోగించుకోకుండా కార్మికులుగా ఉపయోగించుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇంటికి వెళ్లిపోవాలన్నారు. అంతేకాకుండా మా నుంచి బలవంతంగా జరిమానా వసూలు చేశారు. కంపెనీ యాజమాన్యంపై ఇండియన్ ఎంబసీలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. కంపెనీపై ఒమాన్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మన విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకురావాలి. – మల్లూరి భూమన్న,పాలెం (నిజామాబాద్ జిల్లా) మాకు అన్యాయం చేశారు.. ఒమాన్‌లోని డాల్ఫిన్ కంపెనీ మాకు అన్యాయం చేసింది. కంపెనీ తీరు సరిగా లేదు. కంపెనీపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జిల్లాల కార్మికులను వంచించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇళ్లకు చేరుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.– ద్యావల లింగన్న,కొత్తపేట్ (జగిత్యాల జిల్లా) -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతీవారం ‘సాక్షి’ జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన ఈ పేజీ 22 నెలలుగా.. ఈ సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 15 జూన్ 2018 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలపై, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమన్ రాజధాని మస్కట్‌లో 4 అక్టోబర్ 2019న నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా 83 వారాల పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం సంతోషం. ‘మైగ్రేంట్ ఫోరం ఇన్ ఏసియా’ సభ్య సంస్థ అయిన ‘ఎమిగ్రేంట్స్ వెల్ఫేర్ ఫోరం’ తెలంగాణ వలసల చరిత్రలతో ఈ ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం గుర్తుండిపోయే ఘట్టం అని చెప్పవచ్చు. -
గల్ఫ్‌లో శ్రమ దోపిడీ
సాక్షి, కామారెడ్డి: నాలుగురాళ్లు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆశతో గల్ఫ్‌బాట పట్టారు. కంపెనీ వీసా పేరుమీద పని దొరుకుతుందని తెలియడంతో రూ.లక్షలు పోసి దేశం కాని దేశానికి వెళ్లారు. మొదట్లో అక్కడ అంతా బాగానే గడిచింది. కంపెనీల మోసాలు ఒక్కొక్కటిగా పెరిగిపోయి జీతాలు పెరిగిపోయాయి. ఏడాదికిపైగా జీతాలు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిలువునా దోపిడీకి గురైన తర్వాత చేసేదేమి లేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో గుప్పెడు దుఃఖాన్ని గుండెల్లో నింపుకుని ఇళ్లకు తిరిగివచ్చారు. ఒమన్ దేశం నుంచి మొత్తం 13 మంది గల్ఫ్ కార్మికులు గురువారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో దిగారు. వీరిలో 11 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు. వీరిలో ఐదుగురు కామారెడ్డి జిల్లాకు చెందినవారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బుర్రస్వామిగౌడ్, గంగావత్ చందర్, మాచారెడ్డి మండలం ఫరీదుపేటకు చెందిన అబ్దూల్ మాజీద్, కామారెడ్డి మండలం క్యాసంపల్లికి చెందిన రవి, చిన్నమల్లారెడ్డికి చెందిన పంపరి గోపాల్ ఉన్నారు. రూ.లక్షల్లో నష్టపోయారు.. జిల్లాకు చెందిన కార్మికులు కంపెనీ వీసాపై ఓమన్ దేశంలోని మస్కట్‌లో హసన్ జుమాబాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో పని చేసేందుకు ఏడాదిన్నర క్రితం వెళ్లారు. ఆ సమయంలో ఒక్కొక్కరు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు వీసాలు, టిక్కెట్ల పేరిట చెల్లించుకున్నారు. మొదట కొంతకాలం జీతాలు సక్రమంగానే ఇచ్చిన కంపెనీ ఏడాది కాలంగా జీతాలు సక్రమంగా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష 50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు రావాల్సి ఉంది. జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లాయర్‌ను సంప్రదించి కంపెనీ మీద కేసు వేశారు. ఇండియన్ ఎంబసిని కూడా ఆశ్రయించారు. ఎవరూ సరిగ్గా పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కంపెనీ ప్రతినిధులను గట్టిగా నిలదీస్తే బెదిరింపులు, జైల్లో పెట్టిస్తామని భయపెట్టేవారని తెలిపారు. గత ఫిబ్రవరి నుంచి పనులకు హాజరుకాలేదు. చేతిలో చిల్లి గవ్వ లేక తిండికి కూడా కష్టంగా మారింది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారు నివాసం ఉండే క్యాంపుల వద్దకు భోజనం తీసుకువచ్చి పెట్టేవారని బాధితులు చెబుతున్నారు. దాతల సహకారంతో స్వదేశానికి.. కంపెనీ మోసంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించారు. వారు సహకారం అందించి అక్కడి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి స్వస్థలాలు తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఓమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సామాజిక సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని అక్కడి క్యాంపులో కలుసుకుని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ.500 అందజేసినట్లు స్వస్థలాలకు చేరిన కార్మికులు తెలిపారు. మస్కట్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 13 మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ విభాగం పక్షాన ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్ సిబ్బంది సహాయం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల సంఘం ప్రతినిధులు కోటపాటి నర్సింహానాయుడు, సురేందర్సింగ్ ఠాకూర్ బాధితులను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అష్టకష్టాలు పడ్డాం... మొత్తం 45 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు మా కంపెనీలో పనిచేసేశారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 2.50 లక్షల వరకు సదరు కంపెనీ నుంచి జీతాలు రావాల్సి ఉంది. ఏడాదిగా ఇవ్వలేదు. అడిగితే జైల్లో పెడుతా మన్నారు. పని మానేశాక ఎన్నో కష్టాలు పడ్డాం. ఎంబసి వారు కూడా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరిగి వచ్చాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. –అబ్దుల్ మాజిద్, ఫరీదుపేట, మాచారెడ్డి మండలం. -
ఒమాన్‌లో ఏడాదిగా జీతాలు ఇవ్వని కంపెనీ
ఒమాన్‌లోని మస్కట్‌లో హాసన్ జుమా బాకర్ అనే భవన నిర్మాణ కంపెనీలో తెలంగాణకు చెందిన కార్మికులకు ఏడాదికాలంగా వేతనాలు ఇవ్వనందున ఎడారిలో అష్టకష్టాలు పడుతున్నారు. వీరు ఆర్థిక ఇబ్బందులతోనే మస్కట్ నుండి హైదరాబాద్‌కు బయలు దేరుతున్న విషయం తెలుసుకున్న 'ఓమాన్ తెలంగాణ ఫ్రెండ్స్' అనే సామాజిక సేవా సంస్థ కన్వీనర్ నరేంద్ర పన్నీరు వీరిని లేబర్ క్యాంపులో కలుసుకొని జేబు ఖర్చులకు ఒక్కొక్కరికి రూ. 500 నగదు సహాయం అందజేశారు. వీరిలో 11 మంది తెలంగాణ వారు కాగా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరంతా ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకున్నారు. ఈ సందర్బంగా నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ... వేతన బకాయిల కోసం న్యాయపోరాటానికి ఇండియన్ ఎంబసీ కృషి చేస్తుందని, కార్మికులు అధైర్య పడవద్దని అన్నారు. గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చిన కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్రతో పాటు సంస్థ సభ్యులు మంచికట్ల కుమార్, వడ్ల గంగాధర్, బొక్కెన దేవేందర్ లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన గనిశెట్టి శ్రీనివాస్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒక్కొక్క కార్మికునికి రూ.1 లక్షా 50 వేల నుండి రూ. 2 లక్షల 50 వేల వరకు జీతం బకాయిలు రావాల్సి ఉన్నాయని, తెలంగాణకు చెందిన 45 మంది కార్మికులకు కంపెనీ యాజమాన్యం రూ. ఒక కోటి వరకు బాకీ పడిందని అన్నారు. ఎడారిలో ఒక్కొక్క చెమటచుక్క ఒక్క రూపాయితో సమానమని, తమ కష్టార్జితాన్ని మన భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...
గువాహటి: చివరి నిమిషాల్లో అలసత్వం ప్రదర్శించిన భారత డిఫెండర్లు భారత్‌కు అద్భుత విజయాన్ని దూరం చేశారు. 81వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి 9 నిమిషాల్లో ప్రత్యర్థి ముందు తలవంచింది. దీంతో ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో గురువారం జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్–2022 రెండో అంచె అర్హత మ్యాచ్‌లో భారత్ 1–2తో ఒమన్ చేతిలో ఓడింది. ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ రెండు గోల్స్ (82, 90వ నిమిషాల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ తరఫున సారథి సునీల్ ఛెత్రీ 24వ నిమిషంలో గోల్ చేశాడు. ఆరంభంలో మెరిశారు... చివర్లోతలవంచారు ర్యాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన దేశంతో ఆడుతున్నా భారత్ అది ఎక్కడా కనిపించకుండా ఆడింది. మొదటి నిమిషం నుంచే బంతిపై పూర్తి నియంత్రణతో... ప్రత్యర్థికి బంతిని చిక్కనివ్వకుండా కళాత్మక పాస్‌లతో అదరగొట్టింది. 15వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని భారత ఆటగాడు ఉదంత సింగ్ జారవిడిచాడు. సునీల్ ఛెత్రీ అందించిన పాస్‌ను అందుకున్న అతను ప్రత్యర్థి రక్షణశ్రేణిని, కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. కానీ అది గోల్‌పోస్టు బార్‌ను తగిలి దూరంగా పడటంతో భారత్ ఖాతా తెరవలేదు. అయితే 24వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా బ్రెండన్ ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను అందుకున్న ఛెత్రీ ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి గోల్ పోస్టులోకి పంపి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో 22 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. అనంతరం దూకుడు పెంచిన ఒమన్ భారత గోల్ పోస్టుపైకి పదేపదే దాడులు చేసింది. 43వ నిమిషంలో ఒమన్ ఆటగాడు అహ్మద్ కనో కొట్టిన హెడర్‌ను భారత గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగం చివర్లో భారత ఢిపెండర్ల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ 82వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మరో 7 నిమిషాల అనంతరం రబియా భారత గోల్ కీపర్‌కు దొరక్కుండా కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి ఒమన్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. -
ఉపాధి వేటలో విజేత
గల్ఫ్ డెస్క్: ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూనే సేవా రంగంలోనూ రాణిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నరేంద్ర పన్నీరు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన తండ్రి ఎల్లయ్య బాటలోనే గల్ఫ్‌కు పయనమయ్యాడు. గల్ఫ్ దేశాల్లో టెలికం రంగం ప్రైవేటీకరణ ఆరంభమైన మొదట్లోనే సర్వీస్ ప్రొవైడర్‌గా సబ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఎల్లయ్య తక్కువ సమయంలోనే ఖతార్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. టెలికం రంగంలో ఉపాధి పొందడానికి గల్ఫ్ దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ఎల్లయ్య తన కుమారునికి అదే రంగంలో శిక్షణ ఇప్పించి నైపుణ్యం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఖతార్ మంత్రితో తండ్రికి స్నేహం.. నరేందర్ తండ్రి ఎల్లయ్య ఉపాధి కోసం ఖతార్‌కు 1980లో వెళ్లాడు. అక్కడ ఆయన వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. బట్టలు కుట్టి అమ్ముతున్న ఎల్లయ్య వద్దకు అప్పట్లో ఖతార్ సమాచార శాఖ మంత్రి వచ్చి వెళ్లేవారు. 1984లో ఖతర్ టెలికం రంగాన్ని ప్రైవేటీకరించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో సర్వీస్ ప్రొవైడర్(కాంట్రాక్టర్)ల సేవలు అవసరం అయ్యాయి. మంత్రి ప్రోత్సాహంతో ఎల్లయ్య కొత్తగా టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయన 2010 వరకు ఖతార్‌లో టెలికం వ్యాపారాన్ని కొనసాగించారు. ఒమాన్‌లో సొంతంగా వ్యాపారం.. ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫైబర్ టెక్నాలజీని పూర్తిచేసిన నరేంద్ర మొదట ఉపాధి కోసం టెలికం రంగంలో పనిచేశారు. అయితే ఇక్కడ టెలికం రంగంలో పనిచేస్తే వేతనాలు తక్కువగా ఉండటంతో నరేందర్ ఖతార్‌లో ఉన్న తండ్రి వద్దకు 2002లో వెళ్లారు. తండ్రికి సొంతంగా వ్యాపారం ఉన్నా నరేందర్ మాత్రం ఖతార్‌లోని ఒరిడో అనే టెలికం కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 2012లో స్వదేశానికి తిరిగివచ్చిన నరేందర్.. ఖతార్ కంటే ఒమాన్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయని గుర్తించి 2013లో ఒమాన్‌కు వెళ్లి అక్కడ టెలికం వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నరేందర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒమాన్‌లోని అల్ కువైర్ పట్టణంలో టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబ సమేతంగా నివసిస్తున్నారు. సేవా కార్యక్రమాలు.. నరేంద్ర ఒమాన్‌లో వ్యాపారం నిర్వహిస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి చేయూతనందిస్తున్నారు. ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అనే సంస్థను ఆరంభించి ఆ సంస్థ ద్వారా ఖల్లివెల్లి కార్మికులకు స్వదేశానికి వెళ్లడానికి టిక్కెట్లను సమకూర్చడం, ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి పంపించడం, కంపెనీ యజమానుల చేతుల్లో మోసపోయిన వారికి న్యాయ సహాయం అందించడం తదితర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒమాన్‌లోని అధికారులతో ఉన్న సంబంధాలతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకు సహాయ సహకారాలను నరేంద్ర అందిస్తున్నారు. కళలు, సాహస క్రీడలు.. ఒక వైపు వ్యాపారం, మరో వైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న నరేందర్ సమయం చిక్కినప్పుడు కళలు, సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ జానపద గాయకుడైన నరేంద్ర ఉత్సాహవంతులైన వారిని గుర్తించి వారిని మంచి గాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ జానపద గీతాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలపించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాలను, అంతర్జాతీయ యోగా దినోత్సవాలను కూడా ఒమాన్‌లో నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కళల పట్ల ఎంత మక్కువ చూపుతున్నాడో.. సాహస క్రీడల పట్ల అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. స్విమ్మింగ్‌తో పాటు పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలో నరేందర్ ప్రత్యేకతే వేరు. పారాగ్లైడింగ్‌లో కమర్షియల్ లైసెన్స్ పొంది ఇటీవలే 3,700 ఫీట్ల ఎత్తు నుంచి దూకి తన సాహసాన్ని చాటాడు. నాన్నే గురువు ఒమాన్‌లో సొంతంగా టెలికం వ్యాపారం నిర్వహించడానికి నాకు మా నాన్నే మార్గదర్శి. నాన్న చెప్పినట్లు టెలికం రంగాన్ని ఎంచుకున్నా. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్ఫూర్తి మా నాన్ననే. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన సహాయం కోసం ఎదురు చూసేవారికి కచ్చితంగా తోడుగా ఉండాలని నాన్న ఎప్పుడు చెబుతుండేవారు. అందువల్లే సేవా కార్యక్రమాలను బాధ్యతగా కొనసాగిస్తున్నా.– నరేంద్ర పన్నీరు -
ఒమన్‌లో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
గల్ఫ్ డెస్క్: ఒమన్‌లో అంతర్జాతీయ ఐదవ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి మన రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం మస్కట్‌లోని ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితమే. ఒమన్‌లో ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగాకు ఉన్న ప్రత్యేకత వల్ల కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
ఒమన్ వైపు ‘వాయు’ గమనం
అహ్మదాబాద్: గుజరాత్‌ను భయపెట్టిన ‘వాయు’ తుపాను తన దిశను మార్చుకుంది. అరేబియా సముద్రంలో అల్లకల్లోలం రేపుతున్న ఈ తుపాను ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. అయినప్పటికీ, గుజరాత్ తీరం వెంబడి వర్షాలు, గాలుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ‘వాయు’ తుపాను హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇప్పటికే మూడు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ‘వాయు’ గమనం మార్చుకున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపినప్పటికీ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించినట్లు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పాఠశాలలు శుక్రవారం కూడా మూసే ఉంటాయని ప్రకటించారు. ‘వాయు’ దిశ మారినప్పటికీ సౌరాష్ట్ర తీరం వెంబడి రాగల 24 గంటల్లో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రంలో దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వాయు తుపాను ప్రభావం తొలగిపోయినట్లు భావించలేమని అధికార వర్గాలు చెప్పాయి. వాయు ప్రభావంతో రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపాయి. పోర్బందర్లోని 150 ఏళ్ల నాటి భూతేశ్వర్ మహాదేవ్ ఆలయం తీవ్ర గాలులు, భారీవర్షం ధాటికి కుప్పకూలిందని వెల్లడించాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 86 రైళ్లను రద్దు చేసి, 37 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించింది. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 12కు చేరిన భారత మృతులు
దుబాయి : దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భారతీయుల సంఖ్య 12కు పెరిగింది. ఒమన్ నుంచి దుబాయికి వెళుతున్న బస్సు అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 12 మంది భారతీయులేనని దుబాయిలోని భారత కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు. మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయ్శంకర్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. Deeply grieved by the unfortunate bus accident in Dubai that has claimed 12 Indian lives. My sincere condolences to the families. Our Consulate @cgidubai is extending all help. https://t.co/wh2PV8sdMj — Dr. S. Jaishankar (@DrSJaishankar) June 7, 2019 -
దుబాయిలో 8 మంది భారతీయుల మృతి
దుబాయి: యూఏఈలోని దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయికి వస్తుంగడగా ఈ ఘటన చోటుచేసుకుంది. 1/2) We are sorry to inform that as per local authorities and relatives it is so far confirmed that 8 Indians have passed away in Dubai bus accident. Consulate is in touch with relatives of some of the deceased & awaits further details for others to inform their families. — India in Dubai (@cgidubai) June 6, 2019 2/2) The names of those who have passed away are: Mr. Rajagopalan, Mr. Feroz Khan Pathan, Mrs. Reshma Feroz Khan Pathan, Mr. Deepak Kumar, Mr. Jamaludeen Arakkaveettil, Mr. Kiran Johnny, Mr. Vasudev, Mr. Tilakram Jawahar Thakur. — India in Dubai (@cgidubai) June 6, 2019 అతివేగంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బస్సు బోల్తాపడింది. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్‌కు చెందిన రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అరక్కవీటిల్, కిరన్ జానీ, వాసుదేవ్, తిలక్‌రామ్ జవహార్ ఠాకూర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్ అధికారులు తెలిపారు. #هام | في تمام الساعة 5:40 من مساء اليوم، وقع #حادث مروري بليغ لباص مواصلات على متنه 31 راكب يحمل لوحة أرقام سلطنة عمان على شارع الشيخ محمد بن زايد وتحديدا (مخرج الراشدية) الى محطة المترو نتج عنه وفاة 15 راكب من جنسيات مختلفة وإصابة 5 أشخاص آخرون بإصابات بليغة. pic.twitter.com/ma5FRPW9OX — Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) June 6, 2019 -
ఒమన్ 24 ఆలౌట్
అల్ అమారత్: ఒమన్ క్రికెట్ జట్టు అరుదైన, చెత్త రికార్డును నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 17.1 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. ఖావర్ అలీ (15) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఆరుగురు బ్యాట్స్‌మెన్ అయితే ఖాతా తెరవలేదు. మిగతా బ్యాట్స్‌మెన్ 2, 2, 1, 1 చొప్పున పరుగులు చేశారు. అనంతరం స్కాట్లాండ్ 3.2 ఓవర్లలో 26 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు అంతర్జాతీయ వన్డే హోదా లేదు. దీనిని దేశవాళీ వన్డే (లిస్ట్–ఎ) మ్యాచ్‌గానే పరిగణిస్తున్నారు. ఒమన్ చేసిన 24 పరుగులు ఓవరాల్‌గా లిస్ట్ ‘ఎ’లో నాలుగో అత్యల్ప స్కోరుగా నమోదైంది. గతంలో వెస్టిండీస్ అండర్–19 టీమ్ (18 పరుగులు), సరకెన్స్ సీసీ (19), మిడిల్‌ఎసెక్స్ (23) ఇంతకంటే తక్కువ స్కోర్లు చేశాయి. -
24 పరుగులకే ఆలౌట్
అల్ అమరాట్: లిస్ట్-ఎ క్రికెట్లో మరో చెత్త రికార్డు నమోదైంది. తాజాగా ఒమన్ క్రికెట్ జట్టు మూడు పదుల స్కోరు కూడా చేయకుండానే కుప్పకూలడంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది. మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. ఇందులో ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరితే, మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఖవర్ అలీ(15) ఒక్కడే రెండంకెల స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో రుద్రి స్మిత్, ఆడ్రియన్ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించారు. ఇది లిస్ట్-ఎ క్రికెట్లో నాల్గో అత్యల్ప స్కోరుగా రికార్డు అయ్యింది. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్ పేరిట ఉంది. 2007లో బార్బోడాస్తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అండర్-19 జట్టు 18 పరుగులకే ఆలౌటైంది. ఇదే నేటికీ లిస్ట్-ఎ క్రికెట్లో అత్యల్ప స్కోరు. తాజా మ్యాచ్‌లో 25 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్కాట్లాండ్ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో ఛేదించింది. -
నేడు ఒమన్‌లో ఓపెన్ హౌస్
సాక్షి : ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయంలో నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. ఆ దేశంలో నివసించే ఎన్నారైలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఇండియన్ ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను చర్చించే అవకాశం లభిస్తుంది. ఒమన్‌లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయులు ఎంబసీ హెల్పలైన్ నెంబర్ +968 2469 5981 టోల్‌ఫ్రీ నంబర్ 8007 1234కు సంప్రదించవచ్చు. ఎంబసీ ఇ-మెయిల్ cw.muscat@mea.gov.in మరియు inde mbassy.muscar@mea.gov.in ఇండియన్ ఎంబసీ వెబ్సైట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. -
గల్ఫ్ గోస; ఓ భారతీయురాలి దీనగాథ
సాక్షి, న్యూఢిల్లీ : అరబ్ దేశమైన ఓమన్ రాజధాని మస్కట్ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు. దాంతో ఆమెకు వెన్నుముకతోపాటు రెండు కాళ్లు విరిగాయి. ఎడమ వైపు నడుము నుంచి పాదం వరకు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. ఓమన్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను మే 26వ తేదీన భారత్‌లోని కేరళకు పంపించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం జిల్లా, చిరాయింకీజు గ్రామంలోని చిన్న ఇంటిలో జీవచ్చవంలా రోజులు లెక్కపెడుతోంది. కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఆమె భర్త బిజుమన్ సదాశివన్ సపర్యలు చేస్తున్నారు. శీజా దాస్ ఇంతటి దుస్థితికి కారణమైన ఆమె యజమానురాలి నుంచి మాత్రం ఆమెకు నష్టపరిహారంగా ఒక్క పైసా రాలేదు. అందుకు ప్రస్తుత భారత ప్రభుత్వం కారణమవడం బాధాకరం. నేడు శీజా దాస్‌కు జరిగిన అన్యాయం.. 2015లో తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నంకు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎదురైన దారుణాన్ని గుర్తుచేస్తోంది. అతి తక్కువ డబ్బులకు తనతో అరవచాకిరి చేయిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2015, అక్టోబర్ 8వ తేదీన ఆమె కుడిచేతిని ఇంటి యజమాని నరికేశారు. ఈ సంఘటనపై నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వార్త తెల్సిన మరుక్షణమే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆమె అక్టోబర్ 9వ తేదీన తొమ్మిది గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే: ‘గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కంట్రీస్’గా పిలిచే ఓమన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిలో శీజా దాస్, మునిరత్నంలాంటి బాధితులు కూడా వేలల్లో ఉంటారని అక్కడి భారతీయ సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచు కొస్తోందనే భయంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయరని వారు చెబుతున్నారు. పస్తులు, వీపు దెబ్బలు శీజా దాస్ 2016వ సంవత్సరం నుంచి మస్కట్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిచేస్తున్నారు. అదే యజమాని కింద 2013 నుంచి ఆమె భర్త శివదాసన్ పనిచేస్తుండడంతో తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని శీజా భావించారు. ఇద్దరి జీతాల నుంచి కూడ బెట్టుకున్న సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకోవచ్చని వారు కలలుగన్నారు. గత వేసవి సెలవుల్లో వారు తమ ఇద్దరు పిల్లల (13 ఏళ్ల శ్రీరప్, రెండేళ్ల శోభిత్)ను తీసుకొని మస్కట్ వెళ్లారు. ఎంత పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇంటి యజమానురాలు కర్రతో ఎప్పుడూ శీజా వీపుపై బాదేదట. పస్తులు ఉంచేదట. మే నాలుగవ తేదీన ఏదో సాకుతో చితకబాదడం మొదలు పెట్టిందట. ఎంత వేడుకున్నా వదిలి పెట్టలేదట. తరిమి తరిమి కొట్టిందట. ఆ దెబ్బలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు మేడ మీదకు పరుగెత్తిందట. అయినా వెంటపడడంతో తప్పించుకునేందుకు మరో మార్గం లేక కిందకు దూకేసిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మస్కట్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారట. మస్కట్‌కు రాకముందు తన భార్య శీజా 48 కిలోల బరువు ఉండేదని, ఆస్పత్రిలో చేరనాటికి ఆమె బరువు 30 కిలోలే ఉందని భర్త శివదాసన్ తెలిపారు. తన భార్యకు నెలకు 50 ఓమన్ రియల్స్ (8,750 రూపాయలు) ఇస్తానన్న హామీతో పనిమనిషిగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, యజమాని ప్రతి నెల ఆమె బ్యాంక్ ఖాతాలో ఆ జీతం మొత్తాన్ని జమచేసి మళ్లీ అదే రోజు విత్‌డ్రా చేయించి తీసుకునే వారని ఆయన తెలిపారు (అక్కడ పని మనుషుల జీతాలను తప్పనిసరిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలి). అంతా కలిపి మళ్లీ భారత్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తానని చెప్పేవారని, అనుమానం ఉన్నా చేసేదేమీ లేక ఊరుకున్నామని ఆయన చెప్పారు. తనకు మాత్రం నెలకు 17,500 రూపాయలు వచ్చేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన తన భార్యకు నష్టపరిహారం చెల్లించకపోగా, జీతంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భారత్‌కు పంపించేందుకు తన భార్య శీజాకు మాత్రమే తమ యజమాని విమాన టిక్కెట్టు కొన్నారని, తనకు, తమ పిల్లలకు కొనలేదని శివదాసన్ తెలిపారు. వీరి పరిస్థితి గురించి ఓమన్‌లో సామాజిక, సాంస్కతి సంస్థగా రిజిస్టర్ అయిన ‘ఇండియన్ సోషల్ క్లబ్’ అధ్యక్షుడు, ‘కేరళ నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డ్’ డైరెక్టరయిన పీఎం జబీర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. ఆమె ఆదేశం మేరకు మస్కట్‌లోని భారతీయ ఎంబసీ జోక్యం చేసుకొని బిజూమన్, ఇద్దరు పిల్లలకు కూడా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు పంపించారు. ఒక్క నయాపైసా కూడా యజమాని నుంచి శీజాకు రాలేదు. చట్టాలు ఏమి చెబుతున్నాయి? విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం 2,600 డాలర్ల ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి 2,850 డాలర్ల (దాదాపు రెండు లక్షల రూపాయలు) చొప్పున భారత అంబసీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని అంబసీ సెక్యూరిటీ డిపాజిట్‌గా పరిగణిస్తుంది. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు, నష్టపరిహారం కోసం బాధితుడికి అంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని 280 డాలర్లు (దాదాపు 18,800 రూపాయలు)గా నిర్దేశించింది. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతోపాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుతో మొబైల్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఏడాదికోసారి భారత్ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఈమ్రైగ్రేషన్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించిన అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహించాలి. నష్టపరిహారం ఎత్తివేశారు విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండంతో భారతీయ అంబసీ కోరుతున్న బ్యాంక్ గ్యారంటీ అందుకు కారణం అవుతుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో గల్ఫ్‌తోపాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతు ఎత్తివేసింది. పర్యవసానంగా నేడు శీజా దాస్‌కు నష్టపరిహారం అందకుండా పోయింది. ‘ఇంటి కల ఎలాగు చెదిరిపోయింది. నా వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇక నేనా లేవలేను. నేను ఎప్పుడు కన్నుమూసినా ఫర్వాలేదు. కానీ ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత, బరువు నా భర్తపై పడింది. ఎలా నెట్టుకొస్తాడో ఏమో’ అంటూ ఆమె మీడియాతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయ పని మనుషులకు సరైన భద్రత కల్పించాలి. లేకపోతే శీజా లాంటి కథలు వింటూనే ఉంటాం’ అని పీఎం జబీర్ వ్యాఖ్యానించారు. -
ఒమన్, యెమన్లను గడగడలాడిస్తున్న మెకును తుఫాను
-
మతం పేరు దుర్వినియోగాన్ని అరికట్టాలి..
మస్కట్: ఉగ్రవాదానికి సహకరిస్తున్న, ప్రోత్సహిస్తున్న వారిని ఏకాకిని చేయటంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని భారత్, ఒమన్ దేశాలు నిర్ణయించాయి. మతం పేరును దుర్వినియోగం చేస్తున్న వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఇరుదేశాధినేతలు నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ ఖబూస్ నిర్ణయించారు. ఒమన్ పర్యటనలో భాగంగా సుల్తాన్ ఖబూస్‌తో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. భారత్–ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో బలమైన పురోగతికి ఈ పర్యటన తోడ్పడిందని మోదీ పేర్కొన్నారు. అనంతరం మోదీ గల్ఫ్, పశ్చిమాసియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మస్కట్‌లోని పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించారు. ఉగ్రవాదంపై ప్రత్యేకంగా.. ‘ఇరుదేశాలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో, అంతర్జాతీయంగా శాంతినెలకొల్పే ప్రయత్నాల్లో కలసి ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిని ఏకాకి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని ఇరుదేశాధినేతల సంయుక్త ప్రకటన పేర్కొంది. ఒమన్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను సుల్తాన్ ఖబూస్ ప్రశంసించారు. వారి కష్టపడి పనిచేసేతత్వం, నిజాయితీని మరిచిపోలేమన్నారు. 8 ఒప్పందాలు: మోదీ, ఖబూస్ సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. పౌర, వాణిజ్యపరమైన అంశాల్లో న్యాయ సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి. దౌత్య, ప్రత్యేక, సేవా, అధికారిక వీసాలు ఉన్నవారికి సంయుక్త వీసా రద్దుకు సంబంధించిన ఒప్పందం కూడా ఈ జాబితాలో ఉంది. వైద్యం, పర్యాటకం, శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష వినియోగం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయి. డుక్మా ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారత సంస్థలు 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. మధుర స్మృతి ‘భారత్–ఒమన్ దేశాల ప్రజల మధ్యనున్న శతాబ్దాల పురాతనమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన దోహదపడింది. వాణిజ్యం, పెట్టుబడుల బంధాలు సహా అన్నిరంగాల్లోనూ సహకారం మరింత వేగవంతమవనుంది. గౌరవనీయులైన సుల్తాన్ ఖబూస్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆతిథ్యం, స్నేహం.. నా ఒమన్ పర్యటనను మధురస్మృతిగా మార్చేశాయి’ అని పర్యటన ముగింపు సందర్భంగా మోదీ పేర్కొన్నారు. అనంతరం మస్కట్‌లోని 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక సుల్తాన్ ఖబూస్ మసీదునూ ప్రధాని సందర్శించారు. -
గల్ఫ్‌తో దశాబ్ధాల అనుబంధం
-
దోశ, బీట్రూట్ కబాబ్, పప్పు!
గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం యూఏఈ, ఒమన్లలో బిజీబిజీగా గడిపారు. ఉదయం దుబాయ్‌లోని ఒపెరా హౌజ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. భారత్–యూఏఈ మధ్య శతాబ్దాల నాటి బంధం దృఢమైనదన్నారు. ప్రవాసీల కలల సాకారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించనున్న స్వామినారాయణ్ మందిరానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రారంభోపన్యాసం చేశారు. సాంకేతికతను వికాసానికే వాడాలి తప్ప విధ్వంసానికి కాదని సూచించారు. దుబాయ్ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్‌తో సమావేశమై రక్షణ, వాణిజ్యరంగాల్లో ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై చర్చించారు. అక్కడినుంచి ఒమన్ చేరుకున్న ప్రధాని.. మస్కట్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒమన్ పురోగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. దుబాయ్/మస్కట్ సైబర్ స్పేస్ దుర్వినియోగం కాకుండా, ఉగ్రవాదుల చేతిలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించే ఓ నియంత్రణ వ్యవస్థగానే వినియోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో మోదీ ప్రసంగించారు. సైబర్‌స్పేస్‌ను ఉగ్రవాదులు, హ్యాకర్లు దుర్వినియోగం చేస్తున్నారని దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలనకు సరైన సాంకేతికత తోడైతే సరైన అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత పురోగతిలో సాంకేతికత పాత్రను మోదీ తన ప్రసంగంలో వివరించారు. కృత్రిమ మేధస్సు, నానో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర రంగాల్లో భారత్ త్వరలోనే కీలకస్థానం అందుకోనుందన్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘6ఆర్’లు, ‘5ఈ’ల సూత్రంతోనే.. భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘సాంకేతికతతో ప్రకృతిపై పోరాటం చేయటం భవిష్యత్ మానవాళికి ప్రమాదకరం. ప్రకృతితో పోరాటం చేయవద్దు. దాంట్లో మమేకమయ్యే ప్రయత్నం చేయాలి’ అని మోదీ సూచించారు. ‘6ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు. సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. గల్ఫ్ సహకార మండలి వ్యాపారవేత్తలతోనూ ప్రధాని సమావేశమై ‘నవభారతం’ విజన్‌ను వారితో పంచుకున్నారు. పెట్టుబడులతో భారత్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. ఫ్రెంచ్ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్పీ, కిర్గిజ్స్తాన్ ప్రధాని సపర్ ఇసాకోవ్లతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్–యూఏఈ బంధం దృఢమైంది యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న బంధం అమ్మకపుదారు–కొనుగోలుదారు పరిధికంటే లోతైనది, విస్తృతమైనదని, బలమైనదని మోదీ తెలిపారు. దుబాయ్ ఒపెరా హౌజ్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. దేశం, కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. 30 లక్షల మంది భారతీయులకు యూఏఈ సొంతింటిలా అక్కున చేర్చుకుందన్నారు. ప్రవాసీయుల కలలను నిజం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ‘ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల జాబితాలో భారత్ స్థానం చాలా మెరుగుపడింది. ఇంతటితో సంతృప్తి చెందాలనుకోవట్లేదు. దీన్ని మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ అని అన్నారు. అబుదాబిలో దేవాలయ శంకుస్థాపన అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. బీఏపీఎస్ నారాయణ్ ఆలయానికి ఒపెరా హౌజ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘యూఏఈ పాలకులు భారత్‌పై, భారత సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఇక మన పాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ ఉండకూడదని ఈ ఆలయ నిర్మాణంతో ముడిపడిఉన్న అందరికీ చెబుతున్నా. మనం ఎవరికీ ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దు. మీనుంచి ఇదే ఆశిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మందిర నిర్మాణానికి స్థలాన్నిచ్చిన అబుదాబి యువరాజుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దోశ, బీట్రూట్ కబాబ్, పప్పు! ప్రధాని నరేంద్ర మోదీ ఆహారంతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలను తినే వ్యక్తి కాదనీ, మాంసాహారాన్ని ముట్టని మోదీ ఎలాంటి శాకాహార వంటలనైనా ఆరగించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆయన ఆహారాన్ని సంజీవ్ కపూర్ తయారుచేస్తున్నారు. దోశ, బీట్రూట్తో చేసిన కబాబ్, పప్పు, అన్నం ఎప్పుడూ మోదీ ప్లేట్లో ఉంటాయని సంజీవ్ పేర్కొన్నారు. ఒక దేశం సంస్కృతీ సంప్రదాయాలను మరో దేశం సులభంగా తెలుసుకునేందుకు ఆహారాన్ని మంచి మార్గంగా మోదీ భావిస్తారన్నారు. వంటకు సంబంధించి మోదీ కొన్ని కొత్త విషయాలను తనకు నేర్పించారని సంజీవ్ చెప్పారు. ఒమన్.. మినీ ఇండియా! యూఏఈ నుంచి రెండ్రోజుల పర్యటనకోసం ప్రధాని ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లో మోదీకి ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ ఫహద్ బిన్ మహమ్మద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని ఒమన్ సుల్తాన్ ఖబూస్ స్టేడియంలోని రాయల్ బాక్స్ నుంచి వీక్షించారు. ‘ఒమన్‌లోని 8 లక్షల మంది భారతీయులు.. సౌహార్ద్ర రాయబారులే. ఒమన్ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించారు. అందుకే ఒమన్‌ను చూస్తుంటే మినీ భారత్‌లా అనిపిస్తోంది. ఇరుదేశాల్లో రాజకీయ మార్పులొచ్చినా.. భారత్–ఒమన్ సంబంధాల్లో మాత్రం ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు’ అని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కుంభకోణాల కారణంగా భారత ప్రతిష్ట మసకబారిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. పశ్చిమాసియాతో భారత్ సంబంధాల్లో ఇదొక కొత్త శకమన్నారు. తమ ప్రభుత్వ పథకాలను మోదీ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారందరితో వందేమాతరం అని నినాదాలు చేయించారు. దీంతో స్టేడియం మార్మోగిపోయింది. వాహనంలో తిరుగుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. మస్కట్‌లో మోదీకి స్వాగతం పలుకుతున్న ఒమన్ ఉపప్రధాని ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ -
‘మస్కట్’ ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: చదువు పూర్తయ్యాక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగం చేద్దామనుకున్నవారి ఆశలపై ఒమన్ (మస్కట్) ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. దీనిని ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చింది. విదేశాల నుంచి వలసలు పెరుగుతుండటం, స్వదేశంలో నిరుద్యోగులు పెరుగు తుండటంతో ఒమన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కున్నట్టు చెబుతున్నారు. దీనిపై మిగతా గల్ఫ్ దేశాల్లోనూ తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఒమన్ నిర్ణయం ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగులకు ఆశనిపాతంగా మారుతోంది. ఉన్నత ఉద్యోగాల కోసం.. గల్ఫ్ దేశాల్లో దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన 4.75 లక్షల మంది గల్ఫ్‌కు వలస వెళ్లినట్లు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో వెల్లడైంది. తర్వాత ఆ సంఖ్య మరింతగా పెరిగింది. యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–దుబాయి, అబుదాబీ, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్మన్, ఫుజైరా, ఉమల్‌ఖివైన్ ప్రాంతాలు)లోనే రెండు లక్షల మంది తెలంగాణవారున్నారు. వారిలో చాలా మంది భవన నిర్మాణం, ఇతర రంగాల్లో కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. ఇక యూఏఈ తర్వాత ఒమన్ (మస్కట్)కు ఎక్కువ మంది తెలుగువారు ఉపాధి పొందుతున్నారు. అయితే ఒమన్ సంపన్న దేశం కావడం, పర్యాటక రంగం కీలకం కావడంతో హోటళ్లు, ఇంజనీరింగ్, మార్కెటింగ్, హెచ్ఆర్, సేల్స్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ. దీంతో గత పదేళ్లుగా తెలంగాణ యువత ఈ రంగాల్లో ఉద్యోగాల కోసం ఒమన్ బాట పట్టింది. స్వదేశీయులకు ప్రాధాన్యం కోసం విదేశాల నుంచి వలసలు పెరగటంతో ఒమన్‌లో ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. స్థానికులకు ఉద్యోగాలు అందని పరిస్థితి తలెత్తింది. దీంతో కీలకమైన ఉద్యోగాలు స్వదేశీయులకే చెందాలని ఒమన్ యువత డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు విధిగా స్థానిక నిరుద్యోగులతోనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించింది. వీసాలు నిషేధించిన రంగాలివే.. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, తమ దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఒమన్ ప్రభుత్వం వీసాలపై నిషేధం నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యవృత్తి, మార్కెటింగ్–సేల్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మీడియా రంగాల్లోని 87 ఉద్యోగాలకు నిషేధం వర్తించనుంది. చిన్న కంపెనీ అయినా.. ఒమానీలే ‘‘గతంలో ఎక్కడ ఉద్యోగావకాశం ఉన్నా విదేశీయులా, స్వదేశీయులా అని పట్టించుకోకుండా ఒమన్ ప్రభుత్వం వీసాలు ఇచ్చింది. కానీ కొంతకాలంగా కీలక రంగాల ఉద్యోగాల్లో ఒమనీలే ఉండాలనే డిమాండ్ తలెత్తింది. చిన్నా, పెద్దా అన్ని కంపెనీల్లో ఎక్కువ శాతం స్వదేశస్తులే ఉండేలా నిబంధనలను రూపొందించింది. పది మంది ఉద్యోగులుండే చిన్న హోటల్లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతి మంజూరు చేస్తోంది..’’ – ఒమన్‌లో ప్రైవేటు జాబ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు ప్రకాశ్ -
ఒక్క సెల్ఫీతో ఇండియన్ సినిమా!
సాక్షి, సినిమా : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటుడిగానే కాదు.. బిజినెస్ మాన్‌గా కూడా సక్సెస్ అయ్యాడన్నది తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ, ఐపీఎల్ జట్టుతోపాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన సౌత్ స్టార్లతో కలిసి ఓ ఈవెంట్లో చేసిన సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ తమ కొత్త బ్రాంచ్‌లను మస్కట్(ఒమన్)లో ప్రారంభించింది. ఈ లాంఛింగ్ కార్యక్రమానికి తారా లోకం కదిలి వచ్చింది. సౌత్‌లో ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని(టాలీవుడ్), శివరాజ్‌కుమార్(శాండల్‌వుడ్), ప్రభు(కోలీవుడ్), మంజువారియర్(మాలీవుడ్)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్లో ఈ సంస్థకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్ అన్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్యకారణాలతో ఆయన ఈ కార్యక్రమానికి గైర్హాజరు కాగా, ఆ లోటును షారూఖ్ తీర్చినట్లయ్యింది. దీంతో సౌత్ స్టార్లు, కింగ్ ఖాన్‌తో దిగిన ఓ సెల్ఫీ వైరల్ అవుతోంది. ఒక్క ఫ్రేమ్‌లో టోటల్ ఇండియన్ సినిమాను చూపించారంటూ ఆ ఫోటో చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. -
ఒమన్‌లో విషవాయువులతో ముగ్గురు మృతి
మోర్తాడ్ (బాల్కొండ): ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని ఒమన్ దేశానికి వెళ్లిన ఇద్దరు తెలంగాణ కార్మికులు విషవాయువు ప్రభావంతో మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు కార్మికులు మరణించారు. అందులో ఒకరు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వాసి తిరుమలేశ్ కాగా, మరొకరు జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రాంతానికి చెందిన రమేశ్ అని తెలిసింది. మరో వ్యక్తి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిగా గుర్తించారు. ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల కార్మికులు అక్కడి షిప్‌యార్డులో ఓడల నుంచి సరుకులను లోడింగ్, అన్లోడింగ్ చేస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం ఒడ్డుకు చేరుకున్న షిప్ నుంచి సరుకులను దించేందుకు తిరుమలేశ్ కిందికి దిగగా, విషవాయువు ప్రభావంతో సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని రక్షించాలనే ఉద్దేశంతో రమేశ్ కార్గో షిప్‌లోకి దిగడంతో అతను కూడా సొమ్మసిల్లాడు. వీరిద్దరిని గమనించిన మణి అరుస్తూ కార్గో షిప్‌లోకి వేగంగా వెళ్లడంతో విషవాయువు గుప్పుమని అతనూ కింద పడిపోయాడు. ముగ్గురు కార్మికులు ఒకరి వెనుక మరొకరు సొమ్మసిల్లి పడిపోవడంతో మిగతా కార్మికులు, సేఫ్టీ బృందం గమనించి విషవాయువు వస్తున్న ప్రాంతంలో దాన్ని నిరోధించే మందును స్ప్రే చేశారు. కాగా, సొమ్మసిల్లి పడిపోయిన ముగ్గురు కార్మికులను ఆస్పత్రిలోకి తీసుకెళ్లే క్రమంలోనే వారు మరణించారు. కార్గో షిప్ సముద్రంలో ప్రయాణించే సమయంలో ప్రాణాంతకమైన జలచరాలు వచ్చి చేరుతుంటాయి. వీటిని సంహరించడానికి రసాయనాలను షిప్లో చల్లుతారు. కార్గో షిప్ ఒడ్డుకు చేరుకున్న తరువాత రసాయనాలు నింపి ఉన్న అరల తలుపులను గంటపాటు తెరిచి ఉంచాలి. అయితే సేఫ్టీ బృందం ఇదేమీ పట్టించుకోక పోవడంతో కార్మికులు విషవాయువుల బారిన పడి మృత్యువాత పడినట్లు మృతుల సన్నిహితులు కుదురుపాక ప్రదీప్, నూగూరు రణధీర్ ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. తిరుమలేశ్ ఆరోగ్యం బాగాలేక పోవడంతో నెలరోజుల క్రితమే ఇంటికి వచ్చి చికిత్స చేయించుకుని ఒమన్ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన కొన్నిరోజులకే మృత్యువాత పడటాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమవారి మృతదేహాలను త్వరగా రప్పించాలని మృతుల కుటుంబీకులు కోరుతున్నారు. -
ఒమన్‌లో ప్రవాసుల బతుకమ్మ
మస్కట్: ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్ (ఒమన్ తెలంగాణ సమితి) ఆధ్వర్యంలో మస్కట్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మాతృభూమికి దూరంగా ఓమాన్లో ఉన్న రెండువేలకు పైగా తెలంగాణ ప్రవాసులు మస్కట్‌లోని వాది కబీర్లోని మస్కట్ క్లబ్లో ప్రవాసి బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ గాయకులు తేలు విజయ, రాంపూర్ సాయి తమ పాటలతో మస్కట్ లోని ప్రవాసులను అలరించారు. తంగేడు తదితర పూలను ఇండియా నుండి తెప్పించుకుని పేర్చిన బతుకమ్మలు పూల జాతరను తలపించాయి. బతుకు తెరువు కోసం ఎడారి దేశం వచ్చిన తామందరం ఒకే దగ్గర చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, తమకు స్వదేశంలో ఉన్నఅనుభూతి కలిగిందని ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ఖానాపూర్ కు చెందిన ప్రముఖ భారతీయుడు గుండేటి గణేష్ తెలిపారు. -
షేక్‌ను వదిలి రానంటున్న రుక్సా!
సాక్షి, హైదరాబాద్ : వృద్ధుడైన ఒమన్ షేక్‌ను వివాహం చేసుకున్న పాతబస్తీలోని ఫలక్‌నుమా బాలిక రుక్సా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బాలికను తిరిగి రప్పించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేదు. తాను షేక్‌ను వదిలి రానంటూ స్పష్టం చేసింది. పాతబస్తీలోని ఫలక్‌నుమా ఠాణా పరిధిలో ఉన్న నవాబ్సాబ్ కుంట ప్రాంతంలో గత నెల 17న వెలుగులోకి వచ్చిన రుక్సా ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒమన్‌కు చెందిన షేక్ అహ్మద్ అబ్దుల్లా అమూర్ అల్ రహ్బీ(61) పేదింటి మైనర్లను వివాహం చేసుకోవడం కోసం మే 12న హైదరాబాద్ వచ్చాడు. పాతబస్తీకి చెందిన బ్రోకర్లు అహ్మద్, సికిందర్ ఖాన్ (రుక్సా మేనమామ), గౌసున్నిసా బేగం (రుక్సా మేనత్త) సాయంతో రుక్సా తల్లిదండ్రులకు ఎరవేసి మే 16న ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం దళారులకు రూ.8 లక్షలు చెల్లించాడు. అయితే, బాలిక తండ్రికి ఓ మోపెడ్, కూలర్ మాత్రమే కొనిచ్చి మిగిలిన మొత్తం ఖాజీలతో కలసి వీరు కాజేశారు. ఎర్రగుంటకు చెందిన ఖాజీ హబీబ్ అలీ వీరి నిఖా జరిపించాడు. దౌత్యపరంగా ముందుకు... దాదాపు వారంపాటు పాతబస్తీలోని ఓ హోటల్లోనే బస చేసిన షేక్ ఇక్కడే రుక్సాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై అతడు తన స్వదేశానికి వెళ్లిపోయి రుక్సా పేరుతో వీసా పంపించాడు. ఆమె మైనర్ కావడంతో నకిలీ పత్రాల ఆధారంగా ముంబైకి చెందిన చీఫ్ ఖాజీ ఫరీద్ అహ్మద్ ఖాన్, మరో ఖాజీ మునావర్ అలీ సహకారంతో అక్కడే వివాహమైనట్లు నిఖానామా సృష్టించారు. వీటి ఆధారంగా రుక్సాకు వీసా సంపాదించి ఒమన్‌కు పంపారు. అక్కడకు వెళ్లిన రుక్సాపై షేక్‌తోపాటు అతడి బంధువులు సైతం లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాలను ఆమె ఫోన్ ద్వారా తన కుటుంబీకులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి సైదా ఉన్నీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తనను షేక్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయట్లేదని, తాను అతడిని వదిలిరానని రుక్సా స్పష్టం చేసింది. రుక్సా మైనర్ కావడం, షేక్‌తో జరిగిన వివాహం చెల్లుబాటు కాకపోవడంతో ఆమెను ఇక్కడికి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. రుక్సా వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగినట్లు ఆధారాలుండడంతో వారిపైనా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.