మస్కట్ : ఓమాన్లో మస్కట్ లోని ఇండియన్ ఎంబసీలో శుక్రవారం 'ఓపెన్ హౌజ్' అనే అనే బహిరంగ సామాజిక సమావేశం (ప్రవాసి ప్రజావాణి) నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఓమాన్ లో నివసించే ప్రవాస భారతీయులు మధ్యాహ్నం గం. 2 నుండి గం. 3.30 ని.ల వరకు ఫోన్ నెంబర్ +968 2469 5981 కు కాల్ చేసి ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చు.
వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 కు కాల్ చేయవచ్చు. హాట్ లైన్ నెంబర్ +91 11 4050 3090, +91 11 2688 5021, ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఈ-మెయిల్ helpline@mea.gov.in కు కూడా సంప్రదించవచ్చు. తెలంగాణకు చెందిన వారు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ +91 94916 13129, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ +91 89783 73310 హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment