muscat
-
మస్కట్ పిలుస్తోంది!
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్‌కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్‌ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్‌ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్లు ఈ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్‌లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్‌గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం. -
హైదరాబాద్ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసు.. టైమింగ్స్ ఇవే..
హైదరాబాద్ నుంచి విదేశాలకు చాలా విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. అయితే తాజాగా సలాం ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి మస్కట్‌కు విమానాన్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌కు సలాం ఎయిర్‌లైన్స్ నూతన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ నూతన సర్వీసును ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త విమానయాన సంస్థకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. హైదరాబాద్ నుంచి ఓవీ 732 నంబర్ కలిగిన విమాన సర్వీసు ఉదయం 3:55 గంటలకు బయలుదేరి 6 గంటలకు మస్కట్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఓవీ 731 నంబర్ కలిగిన విమానం మస్కట్‌లో రాత్రి 22:15 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 2:55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ సర్వీసు ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన రాకపోకలు ఉంటాయని వివరించారు. -
ఇవే ప్రపంచకప్ మస్కట్లు!
దుబాయ్: వన్డే వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉధృతం చేసింది. ఇందులో భాగంగా టోర్నీ ‘మస్కట్’లను ప్రకటించింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్లు షఫాలీ వర్మ, యశ్ ధుల్ పాల్గొన్నారు. పురుష క్యారెక్టర్‌ను బ్యాటర్‌గా, మహిళా క్యారెక్టర్‌ను బౌలర్‌గా చూపిస్తూ ఐసీసీ ఒక వీడియో విడుదల చేసింది. అయితే వీటికి అధికారికంగా ఐసీసీ పేర్లు పెట్టలేదు. ఇందుకు అభిమానులు ఆగస్టు 27లోగా ఓటింగ్ చేయాలని కోరుతూ ఒక్కో క్యారెక్టర్‌కు 3 ఆప్షన్లను ఇచ్చింది. బ్యాటర్ మస్క ట్ కోసం టాంక్, బాష్, బ్లిట్జ్‌లలో ఒకదానిని, బౌలర్ మస్కట్ కోసం బ్లేజ్, విక్స్, పైరా అనే పేర్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 5నుంచి భారత్‌లో వరల్డ్ కప్ జరుగుతుంది. -
బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన వ్యక్తి
-
షాకింగ్ దృశ్యాలు.. బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన వ్యక్తి
భారతీయుల్లో గుండెపోటు కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. యవసుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. వృద్ధుల కంటే 50 ఏళ్ల లోపు ఉన్న వారిలోనే ఈ మరణాలు ఎక్కువగా కనిపిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు, ఫిట్‌గా ఉన్నవారు సైతం ఉన్నంటుడి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మస్కట్‌లో చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అనూహ్య రీతిలో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. నలుగురు స్నేహితులు బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపిస్తున్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. అయితే సెకన్ల వ్యవధిలో పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన వ్యక్తి.. గేమ్ ఆడుతూ ఉన్నట్టుండి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డ స్నేహితులు వెంటనే అతడి దగ్గరికొచ్చి లేపే ప్రయత్నం చేశారు. కానీ అతడు లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి అతను ఆకస్మిక గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. బ్యాడ్మింటన్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. నిమిషం నిడివి గల ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కాగా ఈ ఘటన జనవరి 2న జరిగినట్లు తెలుస్తోంది మృతుడి వయసు 38 ఏళ్లు ఉండగా అతడు కేరళకు చెందినవ్యక్తిగా సమాచారం. బాధితుడికి భార్య, ఇద్దరుపిల్లలు ఉన్నారు. స్వతహాగా క్రీడా ప్రేమికుడైన ఆ వ్యక్తి తరుచుగా దేశీయ క్రికెట్ లీగ్‌లోనూ ఆడేవాడని తెలుస్తోంది. 2 Jan 2023 : Indian-origin man dies of 💔 attack💉 while playing on court in Muscat#heartattack2023 #heartattack #cardiacarrest #Myocarditis #ClotShotStrikesAgain pic.twitter.com/m96z2bYcAg — Anand Panna (@AnandPanna1) January 10, 2023 -
మస్కట్‌లో తెలుగు మహిళకు వేధింపులు, ఏపీ మహిళా కమిషన్ సీరియస్
తిరుపతి: తిరుపతి జిల్లా నుంచి ఉపాధికి గల్ఫ్ దేశానికి వెళ్లిన మహిళను అక్కడి ఏజెంట్లు వేధిస్తున్న వైనంపై 'ఏపీ మహిళా కమిషన్' తీవ్రంగా స్పందించింది. తక్షణమే బాధితురాలిని రక్షించి దేశం తీసుకొచ్చేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకొస్తే... తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడెవడ్లపల్లి పంచాయతీలోని చెట్టి హరిజనవాడకు చెందిన కె.సులోచన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలను అదే మండలానికి చెందిన ఏజెంట్ రత్నమ్మ చెప్పుకోగా ఆమె తన పరిచయ సంబంధాలతో గల్ఫ్ ఏజెంట్ లను కుదిర్చింది. సులోచన మస్కట్ దేశానికి వెళ్లాక, అక్కడ ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఆమె మరలా ఇక్కడికొచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే, మస్కట్ విడిచి పోవాలంటే తమకు రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదరిరిస్తూ...తీవ్రంగా శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని, ఈ క్రమంలో కాలు గాయపడటంతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు వైరల్ వీడియోలో బాధితురాలు కె.సులోచన చెప్పింది. దీనిపై సులోచన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదిచ్చారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, రాయలసీమ జిల్లాల పర్యవేక్షకులు గజ్జల లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరిస్తుందని... తక్షణమే బాధితురాలిని రక్షించే ఏర్పాట్లకు పూనుకోవాలని గురువారం ఏపీ ఎన్.ఆర్.టీ కార్యాలయానికి వెళ్లి లేఖను అందించి సీఈవో మాట్లాడారు. అదేవిధంగా విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్.ఆర్.టీ అధ్యక్షులు మేడపాటి ఎస్. వెంకట్ తో కూడా ఆమె ఫోన్ లో మాట్లాడి మస్కట్ బాధితురాలు కె. సులోచన విషయం వివరించారు. ఆమెను స్వగ్రామం రప్పించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్ పోల్ తో పాటు భారత రాయబార కార్యాలయంతో మాట్లాడించేందుకు గజ్జల లక్ష్మి ప్రయత్నించారు. బాధితురాలి వీడియో వైరల్ అనంతరం ఆమె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకుని సత్వరమే భారత రాయబార కార్యాలయం టీమ్ రంగంలో దిగాలని ఆమె కోరారు. ఏపీ ఎన్.ఆర్.టి అధికారుల హామీమేరకు గజ్జల లక్ష్మి బాధితురాలి బంధువులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలు సులోచనను దేశానికి రప్పించే కసరత్తును వివరించారు. భవిష్యత్తులోనూ గల్ఫ్ దేశాలలో ఉపాధికి వెళ్లిన మహిళల భద్రత, రక్షణ పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తగిన ప్రణాళికను అమలు చేస్తుందని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి స్పష్టం చేశారు. -
మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..
ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా): ‘నేను ఏజెంట్ చేతిలో మోసపోయా. ఆరోగ్యం కూడా క్షీణించింది. నన్ను భారత్‌కు రప్పించేలా చర్యలు చేపట్టండి’ అంటూ ఎర్రావారి పాళెం మండలం బోడ వాండ్లపల్లెకి చెందిన సులోచన(38) కుటుంబ సభ్యులకు మంగళవారం మస్కట్ నుంచి సెల్ఫీ వీడియో పంపింది. తనను అనుకున్నచోట పనిలో పెట్టలేదని వాపోయింది. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్‌ను బతిమలాడినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా తనను భారత్‌కు పిలిపించుకోవాలని కుటుంబ సభ్యులను వేడుకుంది. చదవండి: పైసా లేదు.. రూ.30 లక్షలు ఉన్నాయని గొప్పలు.. చివరికి బిగ్ ట్విస్ట్ -
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. కొచ్చి రావాల్సిన ఎయిరిండియా విమానం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో విమానంలో ఉన్నట్టుండి పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఒమన్ నివేదించింది. మస్కట్ నుండి కొచ్చిన్‌కు రావాల్సిన ఐఎక్స్-442 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంటలంటుకున్నాయి. టేకాఫ్ సమయంలో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది స్లైడ్ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. విమానం మస్కట్నుంచి కొచ్చికి బయలు దేరాల్సి ఉంది. ప్రయాణికులు అందరినీ (141+ 4గురు శిశువులు) ఖాళీ చేయించామనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంబంధఙత అధికారి తెలిపారు. అయితే ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మస్కట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
ఒమన్: ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్- తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మస్కట్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉగాది వేడుకల్లో 600 మంది భారతీయులు పాల్గొన్నారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కౌనిసలర్ ఇర్షిద్ అహ్మద్ (కారిమక్ & సామాజిక్ సంక్షేమం), ఇండియన్ ఎంబసీ, శుభోదయం గ్రూప్ ఛైర్మన్ లక్ష్మీ ప్రసాద్ క్లపటపు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇర్షిద్ అహ్మద్ తెలుగు కళా సమితి విశిష్టతను, మస్కుట్ లోని తెలుగు కమ్యూనిటీ కోసం తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని,సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ అనిల్ కుమార్‌తో పాటు చిన్నారావు, తవ్వా కుమార్, సీతారాం, శ్రీదేవి, చైతు సూరపనేని, చైతన్య, రాజ, చరణ్, మూర్తి, శ్రీధర్, రాణి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ వేడుకలు కన్నుల పండువగా జరిపేందుకు తమ వంతు కృషి చేశారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీజ
మస్కట్ (ఒమన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ మస్కట్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ మ్యాచ్‌లో శ్రీజ 3–11, 11–7, 12–10, 9–11, 12–10తో హుయ్ జింగ్ యాంగ్ (చైనా)పై గెలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్యోగి అయిన 23 ఏళ్ల శ్రీజ తొలి రౌండ్లో 11–4, 11–6, 11–8తో జాంగ్ వాన్లింగ్ (సింగపూర్) పై, రెండో రౌండ్లో 11–6, 11–4, 11–5తో ఇవా జుర్కోవా (స్లొవేకియా)పై నెగ్గింది. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ జట్టులో హార్దిక్ పాండ్యా.. స్టార్ బౌలర్‌కు నో ఛాన్స్! -
మంచిజీతం ఉంటుందని ఆశపడితే.. అమ్మేశారు!
ఆర్మూర్‌టౌన్(నిజామాబాద్): ఆమె ఇళ్లలో పనిచేసి జీవితాన్ని వెళ్లదీసేది. మస్కట్‌లో పని అంటే... మంచిజీతం, కుటుంబం బాగుంటుందని ఆశపడింది. తీరా వెళ్లాక అదో నరకకూపం అని ఆమెకు అర్థమయింది. తన వేదననంతా వీడియో ద్వారా కుటుంబంతో పంచుకుంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్‌కు చెందిన అర్జున్, లక్ష్మి బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్ట ణానికి వలస వచ్చారు. అక్కడ లక్ష్మి ఇళ్లలో పనిచేసేది. నిజామాబాద్‌కు చెందిన సల్మా అనే ఏజెంటు మస్కట్‌లో మంచి పని ఉందని లక్ష్మికి చెప్పింది. సల్మా మాటలను నమ్మిన లక్ష్మి సరేనంది. బతుకు బాగుపడుతుందనే ఆశతో మస్కట్‌కు వెళ్లింది. అయితే ఏజెంట్ సల్మా, లక్ష్మిని మస్కట్‌లో విక్రయించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్కడ తనను రెండు నెలలుగా లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని లక్ష్మి తమకు వీడియో పంపిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆర్మూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు వాపోయారు. -
మస్కట్‌లో మహిళ ‘గోస’.. 10 రోజుల నుంచి ఫోన్ స్విచ్చాఫ్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): నిరుపేద కుటుంబం. భర్త వికలాంగుడు. ఎదిగిన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకొని ఇల్లు విడిచి వెళ్లాడు. దీంతో ఆ పేద మహిళకు ఇంటి పోషణ భారం కావడంతో ఓ గల్ఫ్ ఏజెంట్ ద్వారా 36 రోజుల క్రితం మస్కట్ వెళ్లింది. అక్కడ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలకు నరకం అనుభవిస్తున్నట్లు 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగా స్విచ్ ఆఫ్ ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన కొదురుపాక సత్తమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలు అదే కాలనీకి చెందిన రమాదేవికి చెప్పుకోగా, ఆమె తన అన్న నిజామాబాద్‌లో గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న రవికుమార్‌కు పరిచయం చేయించింది. ఈ క్రమంలో రవికుమార్, సత్తమ్మ వయస్సుతో పాటు మతం (క్రిస్టియన్‌గా) మార్చి పాస్‌పోర్టు తీయించాడు. నవంబర్ 4న ఇంటి పని కోసమని మస్కట్‌కు పంపించాడు. అక్కడకు చేరుకున్న సత్తమ్మ ఇంటి యజమానితో తాను హిందువు అని చెప్పడంతో ఆమెను తీవ్ర వేధింపులతో పాటు అనవసరమైన పనులు చేయించడం.. చేయకపోతే దాడిచేయడంతో చెయ్యి కూడా విరిగిపోయిందని 15 రోజుల క్రితం బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు గల్ఫ్ ఏజెంట్ రవికుమార్ వద్దకు వెళ్లగా, తాను మస్కట్‌కు పంపించేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని, ప్రస్తుతం రూ.లక్ష చెల్లిస్తే స్వగ్రామం రప్పిస్తానని చెప్పాడు. వారి వద్ద డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో జగిత్యాలలోని గల్ఫ్ సోషల్ వర్కర్ షేక్ చాంద్‌పాషాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతడు స్పందించి సత్తమ్మను స్వగ్రామం రప్పించేందుకు గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌తో పాటు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశాం జిల్లా కేంద్రానికి చెందిన సత్తమ్మకు గల్ఫ్ ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టు ఇప్పించి మస్కట్ పంపించాడు. అక్కడ యజమాని ద్వారా ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం అందించడంతో పాటు మస్కట్ భారత రాయబార కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాం. – షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ సోషల్ వర్కర్, జగిత్యాల చదవండి: యువతి అదృశ్యం -
T20 WC Oman Vs PNG: 10 వికెట్ల తేడాతో ఒమన్ ఘన విజయం
T20 World Cup 2021 Oman vs Papua New Guinea: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్‌లో ఒమన్ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్ ఇలియాస్ (50), జితేందర్ సింగ్(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచి వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఒమన్ కెప్టెన్ జీషన్ మక్సూద్(4)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ►స్కోర్లు: పపువా న్యూగినియా129/9 (20) ఒమన్ 131/0 (13.4) ►ఒమన్ ఓపెనర్లు అర్ధ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు. అకిబ్ ఇలియాస్(42), జితేందర్ సింగ్(42) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్ స్కోరు: 88-0. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు ►పపువా న్యూ గినియా విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ ఓపెనర్లు అకిబ్ ఇలియాస్, జితేందర్ సింగ్ మెరుగ్గా ఆడుతున్నారు. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేయగలిగింది. A brilliant knock by Aaqib Ilyas as he raises his bat for a fifty ✨#T20WorldCup | #OMNvPNG | https://t.co/dYPcIueHIP pic.twitter.com/Iq1IkSbe5p — T20 World Cup (@T20WorldCup) October 17, 2021 ఒమన్ టార్గెట్ 130 ►టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్‌లో ఒమన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు టోని ఉరా, లెగా సియాకా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచ వేదికపై తొలిసారిగా ఆడే అవకాశం దక్కించుకున్న జట్టు కెప్టెన్ అసద్ (56) అర్ధ సెంచరీతో మెరిశాడు. పపువా ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్ స్కోర్. ►పపువా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్ అసద్(56) అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నార్మన్ వనువా(1), ఆ వెంటనే సెసె బా(13)ను ఒమన్ కెప్టెన్ జీషన్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఆ తర్వాత కిప్లిన్ డోరిగాను కూడా జీషన్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలో 113 పరుగులు చేసిన పపువా 7 వికెట్లు కోల్పోయింది. ►కొరకాని కొయ్యగా తయారైన అసద్ వాలాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. అసద్ షాట్ ఆడే క్రమంలో జితేందర్ సింగ్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను అవుట్ చేసిన తర్వాత ఒమన్ ప్లేయర్ జితేందర్... టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ►పపువా కెప్టెన్ అసద్ వాలా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒమన్ సారథి జీషన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఈ టోర్నీలో మొదటి అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఆడే అర్హత సాధించిన పపువా న్యూ గినియాకు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాడు. ►నాలుగు ఫోర్లు, సిక్సర్ బాది 37 పరుగులతో జోరు మీదున్న పపువా బ్యాటర్ అమినీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒమన్ బౌలర్ మహ్మద్ నదీం బౌలింగ్‌లో అసద్ వాలాతో సమన్వయ లోపం కారణంగా వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో పపువా మూడో వికెట కోల్పోయింది. ప్రస్తుతం అసద్ వాలా, సెసె బా క్రీజులో ఉన్నారు. ►ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డా పపువా బ్యాటర్లు అసద్ వాలా, చార్లెస్ అమిని వరుస షాట్లతో అలరిస్తున్నారు. అసద్ 26, అమిని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►ఆతిథ్య ఒమన్ జట్టుకు శుభారంభం లభించింది. తొలి ఓవర్లోనే ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వికెట్ పడగొట్టాడు. పపువా ఓపెనర్ టోనీ ఉరాను బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ లెగా సియాకాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పపువా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని క్రీజులో ఉన్నారు. Updates: పపువా న్యూగినియా జాతీయ గీతాలాపన అనంతరం... ఆతిథ్య ఒమన్ గీతాలాపన. తుది జట్లు: పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్ వాలా(కెప్టెన్), చార్లెస్ అమిని, లెగా సియాకా, నార్మన్ వనువా, సెసె బా, సిమన్ అటాయి, కిప్లిన డొరిగా(వికెట్ కీపర్), నొసైనా పొకానా, డామిన్ రవూ, కబువా మోరియా. ఒమన్: జితేందర్ సింగ్, ఖవార్ అలీ, ఆకిబ్ ఇలియాస్, జీషన్ మక్సూద్(కెప్టెన్), నసీం ఖుషి(వికెట్ కీపర్), కశ్యప్ ప్రజాపతి, మహ్మద్ నదీం, అయాన్ ఖాన్, సందీప్ గౌడ్, కలీముల్లా, బిలాల్ ఖాన్ మస్కట్: మరో మహా క్రికెట్ సంగ్రామానికి తెర లేచింది. ఐదేళ్ల విరామం తర్వాత ఒమన్ వేదికగా పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ఆరంభమైంది. గ్రూప్- బీలోని ఆతిథ్య ఒమన్- పపువా న్యూగినియా మధ్య తొలి మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన ఒమన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. -
విజయవాడ: నేటి నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి ఒమన్ దేశ రాజధాని మస్కట్‌కు ఎయిర్ ఇండియా సంస్థ మంగళవారం నుంచి విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. వారానికి ఒక సర్వీస్ మాత్రమే నడుస్తుంది. ఈ విమాన సర్వీస్ ద్వారా ఇక్కడి నుంచి మస్కట్‌కు కేవలం 3.30 గంటలలోనే చేరుకోవచ్చు. 182 మంది ప్రయాణికుల సామార్ధ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ–321 విమానం ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్ట్‌గా మస్కట్‌కు బయలుదేరి వెళ్తుంది. మస్కట్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇవీ చదవండి: ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! ‘రోడ్డు’ మ్యాప్ రెడీ -
జూలై 20 నుంచి మస్కట్‌కు విమాన సర్వీస్
విమానాశ్రయం (గన్నవరం): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్ఇండియా సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా జూలై 20 నుంచి ఒమాన్ దేశ రాజధాని మస్కట్‌కు డైరెక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ఇండియా ప్రారంభించనుంది. ఎయిర్‌బస్ ఎ–321 విమానం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఒమాన్ దేశ కాలమానం ప్రకారం మస్కట్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని ఎయిర్ఇండియా వర్గాలు తెలిపాయి. వారంలో ఒక రోజు మాత్రమే నడిచే ఈ సర్వీస్‌కు సంబంధించి ఆ సంస్థ ఇప్పటికే ప్రయాణ షెడ్యూల్‌ను ప్రకటించడంతో పాటు టిక్కెట్ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. -
ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు. వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు -
భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్ ఫారం నింపాలి
మస్కట్ : ఒమన్ నుండి భారత్‌కు ప్రయాణించేవారికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ ప్రకటన జారీ చేసింది. భారత్‌కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా భారతదేశానికి అత్యవసరంగా ప్రయాణించడానికి ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్‌లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. కోవిడ్-19 పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి 14 ఏప్రిల్ 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రవాస భారతీయులు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుందని, విమానాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఒమన్ నుండి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్‌సైట్‌లోని ఈ లింకు ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం డేటా (సమాచార) సేకరణ కోసం మాత్రమే అని రాయబార కార్యాలయం తెలిపింది. https://docs.google.com/forms/d/e/1FAIpQLSe5f6iMNMfovllq_6q0BRao8MAXKzcnzCfCnWc9ZVLtvBLfKA/viewform భారత్‌కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ ఎయిర్ పోర్టులో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుందని గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నారైలు భారత్‌కు చేరుకున్నాక, వారిని నేరుగా వారివారి ఇళ్లకు పంపి 'సెల్ఫ్ క్వారంటైన్' (స్వీయ నిర్బంధం) చేయడమా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక వసతి ఏర్పాటు చేయడమా అనే దానిపై భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. 'గల్ఫ్ తదితర దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది చిన్న ఇండ్లు కలిగిన పేద, దిగువ మధ్యతరగతి వారే. తమ ఇండ్లలో 'సెల్ఫ్ క్వారంటైన్' కొరకు ప్రత్యేకంగా విడిగా ఉండటానికి సరైన గదులు, వసతి సౌకర్యాలు లేవు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రాలలో తగినన్ని ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉండవచ్చని' భీరెడ్డి అన్నారు. ఆర్ధిక మాంద్యం వలన భవిష్యత్తులో లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు వాపస్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా "గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ" కి రూపకల్పన చేయాలని మంద భీరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీలో ‘ఓపెన్ హౌస్’
మస్కట్ : ఓమాన్లో మస్కట్ లోని ఇండియన్ ఎంబసీలో శుక్రవారం 'ఓపెన్ హౌజ్' అనే అనే బహిరంగ సామాజిక సమావేశం (ప్రవాసి ప్రజావాణి) నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఓమాన్ లో నివసించే ప్రవాస భారతీయులు మధ్యాహ్నం గం. 2 నుండి గం. 3.30 ని.ల వరకు ఫోన్ నెంబర్ +968 2469 5981 కు కాల్ చేసి ఎంబసీ అధికారులతో నేరుగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్ లోని వారి బంధువులు ఢిల్లీలోని 'ప్రవాసి భారతీయ సహాయత కేంద్రం' టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090 కు కాల్ చేయవచ్చు. హాట్ లైన్ నెంబర్ +91 11 4050 3090, +91 11 2688 5021, ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఈ-మెయిల్ helpline@mea.gov.in కు కూడా సంప్రదించవచ్చు. తెలంగాణకు చెందిన వారు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ +91 94916 13129, గల్ఫ్ వర్కర్స్ జేఏసీ +91 89783 73310 హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించవచ్చు. -
మస్కట్ల పనిజేసేందుకు..
మధ్యాహ్నం.. బస్సు దిగాడు.. బస్టాండ్‌గా వాడకంలో ఉన్న ఓ చెట్టు కింద. అటూఇటూ చూశాడు. తన వాళ్లు.. తనకు తెలిసినవాళ్లెవరూ కనిపించలేదు. కుడి చేతిలో ఉన్న బ్యాగ్‌ను, ఎడమ చేతిలో ఉన్న టేప్‌రికార్డర్‌ను కిందపెట్టి.. ఒళ్లు విరుచుకున్నాడు. తర్వాత బ్యాగ్‌ను కుడి జబ్బకు వేసుకొని.. టేప్‌రికార్డర్‌ను ఎడమ చేత్తో పట్టుకొని నడక సాగించాడు. అతను ఆ ఊరు వదిలిపెట్టి వెళ్లి అయిదారేళ్లవుతోంది. ‘ఏం మారలేదు.. ఊరికి బస్సు అచ్చుడు తప్పితే’ అనుకున్నాడు చుట్టూ పరికించి చూస్తూ! ఆ మట్టిబాటకు రెండు వైపులా పచ్చగా ఉన్న పొలాలు.. పారుతున్న పంటకాల్వలను చూసి ఆశ్చర్యపోయాడు. ‘ఏ.. ఊరు మారింది’ ఒక్క క్షణం కిందటి అభిప్రాయాన్ని మార్చుకుంటూ ‘ప్రాజెక్ట్ కెనాలొచ్చి మంచిగైంది. అంతకుముందెట్లుండే... బొక్కలల్ల మూలుగ అరిగేదాంక కష్టవడ్డా.. వీసెడు పంటచ్చేది కాదు.. అవుగని.. నా సోపతిగాండ్లు ఎట్లున్నరో..’ తలపోసుకున్నాడు అతను. ‘అగో... నువ్వూ...’ అంటూ కళ్లకు, నుదిటికి మధ్య అరచెయ్యి అడ్డంపెట్టుకొని అతణ్ణి గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అంది ఒక అవ్వ. తనకెదురుగా వచ్చిన ఆమెను చూసి.. ఆగిపోయాడు అతను. ‘నువ్వు.. దుబ్బడివి గదా..?’ గుర్తొచ్చినట్టు అడిగింది ఆ అవ్వ. ‘ఔ సాయవ్వ.. గుర్తువట్టినవా?’ ఎక్కడలేని ఆనందం అతని గొంతులో. ‘అగో.. గిన్నేండ్లకు కనవడ్తివి? యేడికేంచి అస్తున్నవ్? నువ్వు బొంబైకి పరారైనవంట గదా కొడ్కా?’ తనకు తెలిసిన సమాచారమంతా అడిగేసింది సాయవ్వ. టేప్‌రికార్డర్‌ను రెండు మోకాళ్ల కాళ్లమధ్య పెట్టుకుంటూ షర్ట్ జేబులో ఉన్న ఒక సిగరెట్, లైటర్‌ను తీశాడు. సిగరెట్‌ను నోట్లో పెట్టుకొని లైటర్‌తో వెలిగించి మళ్లీ లైటర్‌ను షర్ట్ జేబులో వేసేసి... మోకాళ్ల మధ్య నుంచి టేప్‌రికార్డర్‌ను తీసి ఎడమచేత పట్టుకొని.. కుడిచేత్తో సిగరెట్ దమ్ము లాగి.. వదులుతూ.. ‘అవ్ బొంబైకి పరారై.. మస్కట్ల తేలిన’ అని సమాధానమిచ్చి మళ్లీ నడక సాగించాడు. మొదలైంది.. ఊరి జనం అతణ్ణి గమనించడం.. గళ్ల గళ్ల చొక్కా.. ఖాకీ కలర్ ప్యాంట్.. మల్టీ కలర్ సిల్క్ రుమాలు.. రేబాన్ కళ్లద్దాలు.. అన్నిటికన్నా.. అన్నిటికన్నా.. మెడలో లావుపాటి బంగారపు గొలుసు.. చేతికి గడియారం.. ఆ ఊరి జనాన్ని ఆకర్షించిన మరో ముఖ్యమైన వస్తువు.. అతని చేతిలో ఠీవిగా కనపడుతున్న టేప్‌రికార్డర్.. ‘గప్పుడు మనూళ్లెకు అన్నలచ్చిండ్రు గదా..’ అతను చెప్తున్నాడు. ‘అవ్.. దుబ్బయ్యా.. గా సంగతి ఎర్కే.. గదిగాదు.. నువ్వు బొంబైకెంచి మస్కట్కెట్లా వోయినవో షెప్పు’ అడిగాడు అతని ఫ్రెండ్. గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న హోటల్లో టీ తాగుతూ ఈ ముచ్చట సాగుతోంది. ‘గా దినాలల్ల పోలీసులు నిన్నెంత లెంకిండ్రో ఎర్కేనా దుబ్బయ్యా?’ అన్నాడు ఇంకో వ్యక్తి. ‘మీ ఇంటోళ్లు అరిగోస వడ్డరు’ మరో స్నేహితుడి జాలి. అతను ఆ ఊళ్లోకి వచ్చి వారం రోజులవుతోంది. ఈ వారం రోజుల్లో అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసిన.. చేస్తున్న విషయం.. తన దగ్గరివాళ్లు.. తనను దూరం పెట్టినవాళ్లు..అందరూ తనను ‘దుబ్బయ్యా’ అని పిలవడం. ‘అరేయ్ దుబ్బిగా.. పటేల్ సాబ్ రమ్మంటుండు..’ ‘ఎన్ని కాడలు(ఆబ్సెంట్) వెడ్తవ్రా దుబ్బిగా?’ ‘మల్లేం రోగమచ్చేరా దుబ్బడికి? ’ ‘నక్రాలా బే దుబ్బీ..?’ అంటూ పిలవబడ్డ గతం అతని చెవుల్లో గింగుర్లు కొడ్తోంది.. ఆ రోజుల రీలు మస్తిష్కంలో తిరుగుతోంది. ‘అస్సలు సంగతి చెప్పకుండా ఎటో చూడవడ్తివి?’ అని తన ముందున్న వ్యక్తి భుజం తడ్తేగాని వర్తమానం గుర్తుకురాలేదు అతనికి. ‘ఇండ్ల మీకు తెల్వందేముంది సాయిలూ.. అన్నలు చెప్పిన మాటలు నివద్దనిపించి.. పటేల్ తాన చేస్తున్న పాలేరుగిరి కూడా ఇడ్శివెట్టి.. భూమి కావాల్నని కొట్లాడిన గదా.. నా అసుంటి పాలేర్లందరినీ పోలీసులు వట్టుకునుడు షురు జేసినంక.. అందరు ఎక్కడోళ్లక్కడ పరారైన బాపతిల నేను బొంబై బస్సెక్కిన. ఆడ ఏదో కూలీనాలీ జేస్కుంటుండంగా.. ఒక మరాఠాయనతో దోస్తానాయింది. గాయన్నే.. మస్కట్ల పనిజేయతందుకు పోతవా అని సోల్దివెట్టిండు. ఇంటికి ఉత్తరం రాశ్న గిట్ల సంగతి అని.. పొమ్మన్నరు.. గాయన అడ్రస్‌లనే నేనుంటున్నట్టు పాస్‌పార్ట్ తీపిచ్చి.. వీసా సూత ఇప్పిచ్చి మస్కట్ తోలిచ్చిండు. బిల్డింగ్లు కట్టేకాడ పని. బొంబైలనే కార్ డ్రైవింగ్ సూత నేర్సుకున్న. గిప్పుడు గా పనే దొరికేటట్టుంది.. లైసెన్స్గిట్ల అన్నీ గా మరాఠాయన్నే ఇప్పిస్తనన్నడు’ అని చెప్పాడు అతను. ‘దుబ్బయ్యా.. అయితే ఈ అయిదేండ్లలో మస్తే సంపాదించి ఉంటవ్ లే..’ ఆత్రంగా ఒకరు అడిగారు.. ఆదుర్దాగా అందరూ చెవులు రిక్కించారు. ‘ఊ..’గాజు గ్లాస్‌లోని టీని జుర్రుతూ క్లుప్తంగా అతను. ‘దుబ్బయ్యా.. ’ అని పిలిచిన నర్సిరెడ్డి మాటకు ఉలిక్కిపడ్డాడు అతను. మస్కట్ మాయా అనుకున్నాడు మనసులో. ‘బిడ్డ పెండ్లి చేయాలే. రెండెకరాలు అమ్ముదామనుకుంటున్నా.. కొనుక్కోరాదు?’ అని ఎంతకు అమ్మదల్చుకున్నాడో రొక్కం కూడా చెప్పాడు నర్సిరెడ్డి పటేల్ తన పాత పాలేరైన అతనికి. ‘ఏ.. నా దగ్గర గన్ని పైసలు యేడున్నయ్ పటేల్సాబ్?’ ఉలిక్కిపడ్డాడు అతను. ‘గట్లనకు.. బిడ్డ పెండ్లి ఉంది..’ బతిమాలుతున్న ధోరణిలో ఉంది నర్సిరెడ్డి మాట. ఆలోచనలో పడ్డాడు అతను. ‘ఏం ఆలోచన జెయ్యకు.. నాకోసం దెచ్చిన బంగారం అమ్మేసి పొలం కొందాం..’ చెప్పింది అతని భార్య. ‘పెండ్లయినప్పటి సంది నీకేం జేయ్యలే... షోకిలవడి తెచ్చిన బంగారం.. వద్దంటవేందే?’ నొచ్చుకున్నాడు అతను. ‘నా మెడల బంగారం ఎవ్వలు సూడవోయిండ్రు? పొలం ఉందా.. ఇల్లుందా అని అడ్గవోతరుగని? బిగడు పొలం లేకుండా బగ్గ బంగారం దిగేసుకున్నా వేష్టే..’నిష్ఠూరమాడింది అతని భార్య. ఆ మాటతో అతని ఆలోచనలను కట్టేసింది ఆమె. ‘ఇంకేంది.. దుబ్బయ్య పటేల్.. ఈసారి అచ్చినప్పుడు ఏం కొంటవ్?’ మస్కట్‌కి ప్రయాణమైన అతణ్ణి ముంబై బస్ ఎక్కించడానికి వచ్చిన స్నేహితుడు అడిగాడు అలైబలై చేసుకుంటూ! మళ్లీ నవ్వుకున్నాడు మనసులోనే అతను.. ‘దుబ్బిగా .. దుబ్బయ్య.. దుబ్బయ్య పటేల్’ అని అనుకుంటూ! - సరస్వతి రమ -
మస్కట్ నుంచి వచ్చి ఎయిర్‌పోర్టులో అదృశ్యం
శంషాబాద్: మస్కట్ నుంచి వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా పెరవాలి మండలం కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీభవాని (23) ఉపాధి కోసం మస్కట్ వెళ్లింది. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఈ నెల 10న అర్ధరాత్రి మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ఇంటికి చేరుకోలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతోపాటు బంధువుల ఇంటి వద్ద కూడా లేకపోవడంతో ఆమె సోదరుడు సతీశ్ సోమవారం ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్ : గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. ఇటువంటి ప్రయోగాన్ని చేపట్టింది ‘సాక్షి’ దినపత్రిక. 2017 నవంబర్ 11న ప్రారంభమై ఇప్పటి వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. ఒమాన్ రాజధాని మస్కట్‌లో నేడు(అక్టోబర్ 4న) నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఇప్పటివరకు ప్రచురితమైన పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ అవిష్కరించారు. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 2018 జూన్ 15 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాలవివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలు, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించడం జరిగింది. ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
-
నేడు మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 2017 నవంబర్ 11న ప్రారంభమై ఇప్పటి వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 2018 జూన్ 15 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాలవివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలు, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమాన్ రాజధానిమస్కట్లో నేడు (అక్టోబర్ 4) నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ప్రచురిచిత మైన పేజీలను అన్నింటినీ కలిపి‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరించబడనుంది. -
పడిపోయిన పీడనం.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. మస్కట్ నుంచి కాలికట్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ఆకాశంలో ఉండగానే ఒక్కసారిగా పీడనం తగ్గిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకుగురయ్యారు. విమానంలో పీడనం తగ్గడంతో నలుగురు ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం కారగా, మరికొందరు చెపి నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737-8 రకానికి చెందిన IX - 350 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణికులు అస్వస్థతకు గురవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని మస్కట్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ప్రయాణికులకు విమానాశ్రయంలో వైద్య చికిత్స అందించారు. ప్రయాణికులు కోలుకున్న తర్వాత విమానం కాలికట్ బయల్దేరింది. క్యాబిన్లో పీడన సమస్య ఏర్పడటంతో ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు ఎయిర్ఇండియా ప్రతినిధి తెలిపారు. -
ఎడారి దేశంలో కుమిలిన ‘కమల’
కమ్మర్పల్లి (బాల్కొండ): ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లి అష్టకష్టాల పాలైన ఓ మహిళా ఎంపీ చొరవతో స్వదేశానికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన కమల, సుదర్శన్ దంపతులు. సుదర్శన్ తాగుడుకు బానిసవడం.. రోజురోజుకు కుటుంబ పోషణ భారమవడం.. ఈ క్రమంలో రూ.3 లక్షల దాకా అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి సుదర్శన్‌కు ప్రత్యామ్నాయ మార్గం కనిపించకపోవడంతో భార్యను ఉపాధి నిమిత్తం ఒమన్ దేశంలోని మస్కట్‌కు పంపించాడు. అక్కడ అరబ్‌షేక్ ఇంట్లో భాష సమస్య, 24 గంటల పనితో నరకయాతన అనుభవించింది. చేసిన పనులకు ఏదో వంకలు పెట్టి తీవ్రంగా హింసించేవారు. ఈ విషయాన్ని ఏజెంట్ రాజు, భర్త సుదర్శన్‌కు సమాచారం చేరవేసింది. పైసలు కావాలంటే బాగా కష్టపడాలని ఏజెంట్ ఉచిత సలహా ఇవ్వడంతో ఆమె షేక్ పెట్టిన కష్టాలను భరించి పని చేసింది. చివరకు వేధింపులకు తాళలేక తాను ఇక్కడ పని చేయనని కుటుంబ సభ్యులకు (భర్తకు కాదు) ఫోన్లో తెలిపింది. మస్కట్‌లో పడుతున్న కష్టాలను వివరించింది. ఇక్కడి నుంచి ఎలాగైన రప్పించాలని వేడుకుంది. కమల ఆవేదనను అర్థం చేసుకున్న సమీప బంధువులు స్పందించి అక్కడి, ఇక్కడి ఏజెంట్లతో మాట్లాడి రూ.70 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కానీ వారూ నమ్మించి మోసం చేశారు. దీంతో కమల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే.. కమల దీనస్థితిని ఆమె సమీప బంధువు వెంకటేశ్ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కవిత అక్కడి రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి కమలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కమల స్వదేశం చేరుకుంది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు భూమయ్య, లక్ష్మితో కలసి చౌట్పల్లిలోనే ఉంటోంది. కవితమ్మకు రుణపడి ఉంటా: కమల ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లిన తాను అక్కడి కష్టాలను తట్టుకొని మళ్లీ చౌట్పల్లి చూస్తాననుకోలేదు. అక్కడ పడిన కష్టం జన్మలో చూడలేదు. 6 గంటలే పని అని చెప్పి రోజంతా పని చేయించుకున్నారు. పని సరిగ్గా చేయకపోతే దెబ్బలు కొట్టారు. తినడానికి సరిగ్గా తిండి, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు. పని కారణంగా నీరసపడితే విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఆరోగ్యం బాగా లేకున్నా పని చేయించుకున్నారు. ఇక్కడే నా చావు రాసి పెట్టింది ఉం దనుకున్నా. అదృష్టం కొద్దీ ఎంపీ కవితమ్మ కృషితో ఇక్కడికి వచ్చాను. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటా.