హైదరాబాద్‌ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసు.. టైమింగ్స్‌ ఇవే.. | Flight From Hyderabad To Muscat Timings Are Announced | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసు.. టైమింగ్స్‌ ఇవే..

Published Tue, Dec 19 2023 2:06 PM | Last Updated on Tue, Dec 19 2023 4:46 PM

Flight From Hyderabad To Muscat Timings Are Announced - Sakshi

హైదరాబాద్‌ నుంచి విదేశాలకు చాలా విమానయాన స​ంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. అయితే తాజాగా సలాం ఎయిర్‌లైన్స్‌ సంస్థ హైదరాబాద్‌ నుంచి మస్కట్‌కు విమానాన్ని నడుపుతున్నట్లు ప్రకటించింది.

జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌కు సలాం ఎయిర్‌లైన్స్‌ నూతన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ నూతన సర్వీసును ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ పణికర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త విమానయాన సంస్థకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ..

హైదరాబాద్‌ నుంచి ఓవీ 732 నంబర్‌ కలిగిన విమాన సర్వీసు ఉదయం 3:55 గంటలకు బయలుదేరి 6 గంటలకు మస్కట్‌ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఓవీ 731 నంబర్‌ కలిగిన విమానం మస్కట్‌లో రాత్రి 22:15 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 2:55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ సర్వీసు ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన రాకపోకలు ఉంటాయని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement