muscat - hyderabad flight
-
హైదరాబాద్ నుంచి మస్కట్‌కు విమాన సర్వీసు.. టైమింగ్స్ ఇవే..
హైదరాబాద్ నుంచి విదేశాలకు చాలా విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. అయితే తాజాగా సలాం ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్ నుంచి మస్కట్‌కు విమానాన్ని నడుపుతున్నట్లు ప్రకటించింది. జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌కు సలాం ఎయిర్‌లైన్స్ నూతన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ నూతన సర్వీసును ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త విమానయాన సంస్థకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. హైదరాబాద్ నుంచి ఓవీ 732 నంబర్ కలిగిన విమాన సర్వీసు ఉదయం 3:55 గంటలకు బయలుదేరి 6 గంటలకు మస్కట్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఓవీ 731 నంబర్ కలిగిన విమానం మస్కట్‌లో రాత్రి 22:15 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 2:55 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ సర్వీసు ప్రతి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన రాకపోకలు ఉంటాయని వివరించారు. -
విమానం బాత్రూంలో బంగారం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మస్కాట్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న విమానంలోని బాత్రూంలో నాలుగు కేజీల బంగారాన్ని విమాన సిబ్బంది గమనించి... అనంతరం డీఆర్ఐ అధికారులకు వారు సమాచారం అందించారు. డీఆర్ఐ అధికారులు బాత్రూంలోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తనిఖీల్లో బంగారం పట్టుబడుతుందని భావించిన ప్రయాణికుడు భయపడి బాత్రూంలో వదిలేసి వెళ్లి ఉంటాడని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 26వ తేదీన దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా... బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సహకరిస్తున్న ఇద్దరు జీఎమ్ఆర్ ఉద్యోగుల పేర్లు వెళ్లడించాడు. దాంతో వారిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.