శనివారం తెల్లవారుజామున మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా .....
శంషాబాద్: శనివారం తెల్లవారుజామున మస్కట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తనతో పాటు అక్రమంగా తీసుకొచ్చిన 4 కేజీల బంగారు బిస్కెట్లను పట్టుబడుతాననే భయంతో లగేజీ బ్యాగును విమానంలోని టాయిలెట్‌లో వదిలేసి వెళ్లాడు.
బంగారాన్ని గమనించిన ఎయిర్‌లైన్స్ సిబ్బంది కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు.