
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నేరుగా షికాగో వెళ్లేందుకు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. షికాగో నుంచి బుధవారం బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్–777 విమానం గురువారం రాత్రి 12.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది.
ఇదే విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ అయి నేరుగా షికాగో బయల్దేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ప్రతి శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి షికాగోకు ఈ సర్వీసు వెళుతుంది. 238 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 మొదటి తరగతి, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment