chicago city
-
చికాగోలో సీయోను తెలుగు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చికాగోలోని ప్రవాస తెలుగువారు క్రిస్మస్ వేడుకలను సీయోను తెలుగు చర్చిలో అత్యంత వైభవంగా సీనియర్ పాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ మాథ్యూస్ వట్టిప్రోలు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. యేసు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేస్తూ చేసిన చిన్నపిల్లల డాన్స్, యూత్ డాన్స్‌లు, కారల్ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంతాక్లాస్ చిన్న పిల్లలకు బహుమతులు అందచేశాడు. యేసు ప్రభు రెండువేల సంవత్సరాల క్రితం బెత్లహేంలో జన్మించినది స్కిట్‌గా ఆవిష్కరించిన రీతి ఈ వేడుకలకు హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు మాట్లాడుతూ సీయోను తెలుగు చర్చి రెండు కుటుంబాలతో ప్రారంభమై ఇప్పుడు అరవై ఐదు కుటుంబాలతో అమెరికాలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న తెలుగు చర్చిగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలుగచేస్తోందన్నారు. క్రిస్మస్ సందేశాన్ని అందచేస్తూ యేసు ప్రభు జననం ఎందుకు అవసరమో, మానవాళికి అది ఎంత అధ్బుతమనేది వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. -
చికాగో నాట్స్ విభాగం థ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌కు చక్కటి స్పందన
చికాగో: భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు మేముసైతం సమాజహితం కోసం అని స్పందించారు. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్ ద్వారా వందలాది బట్టలు, బూట్లను సేకరించారు. ఇలా సేకరించిన వాటిని చికాగో శివారులోని అరోరాలో ఉన్న హెస్డ్ హౌస్ హోమ్ లెస్ షెల్టర్‌కు అందించారు. చికాగో నాట్స్ నాయకులు శ్రీహరీశ్ జమ్ము, నరేంద్ర కడియాల, వీర తక్కెళ్లపాటి లు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి చికాగో నాయకులకు దిశా నిర్థేశం చేశారు. వీరితో పాటు నాట్స్ ఈసీ సభ్యులు మదన్ పాములపాటి వైస్ ప్రెసిడెంట్(సర్వీసెస్) , కృష్ణ నిమ్మలగడ్డ, లక్ష్మి బొజ్జ, బిందు వీధులముడి, రోజా శీలంశెట్టి, భారతీ పుట్టా తమ వంతు సహకారం అందించారు. నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు సుమతి నెప్పలి, బిందు బాలినేని, ప్రతిభ, ప్రత్యూష, నవీన్ జరుగుల, వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, పండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, రాజేష్ వీధులమూడి, సతీష్, వినోద్ బాలగురు, యజ్ఞేశ్, అరుల్ బాబు, శ్రేయాన్, అక్షిత, రుషిత, ఆరుష్ , ఆదిన్, వర్షిత్, కృష్ణఫణి, సంకీత్, నిరుక్త, నిత్య, సహస్ర, హన్సిక, అన్షిక, వేద, అనీష్ తదితరులు గివింగ్ బ్యాక్ కార్యక్రమంలో చురుకుగా వ్యవహారించారు. ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా అవార్డులు అందించారు. హ్యూస్టన్‌లో నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్ హ్యూస్టన్: తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా బాల,బాలికలలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ సహ సమన్వయకర్త చంద్ర తెర్లీ నాట్స్ క్రీడా సమన్వయకర్త ఆదిత్య దామెర నేతృత్వంలో ఈ టోర్నెమెంట్ జరిగింది. నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త విజయ్ దొంతరాజు, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, సుమిత్ అరిగెపూడి, శ్రీనివాస్ కాకుమాను, వీరు కంకటాల, వంశీ తాతినేని తదితరులు ఈ టోర్నెమెంట్ విజయానికి కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ ఎప్పుడూ వెన్నంటి ఉండి తమ సహాయ సహకారాలను అందిస్తుందని నాట్స్ బోర్డు సభ్యులు సునీల్ పాలేరు అన్నారు. చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి నాట్స్ కేంద్ర కమిటీ సభ్యులు, కోశాధికారి హేమంత్ కొల్ల అభినందనలు తెలిపారు. క్రీడా నైపుణ్యత ఆధారంగా బాలబాలికలకు రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు)నూతి నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు. -
Chicago: 100 కార్లతో రేసింగ్.. తుపాకులతో విధ్వంసం..
వాషింగ్టన్: అమెరికా చికాగో ఇంటర్సెక్షన్లో షాకింగ్ ఘటన జరిగింది. కొంతమంది కలిసి 100 కార్లతో డ్రాగ్ రేసింగ్ నిర్వహించి విధ్వంసం సృష్టించారు. తుపాకులతో కాల్పులు జరిపి రెచ్చిపోయారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికాగో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే రేమండ్ లోపేజ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. డ్రాగ్ రేసింగ్ కారవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇవి వీధుల్లో తమషా కోసం నిర్వహించే గేమ్స్ కాదని మండిపడ్డారు. ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో చికాగో ఇంటర్సెక్షన్ను కొన్ని గ్యాంగ్‌లు కలిసి 100 కార్లతో తమ నియంత్రణలోకి తీసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నడిరోడ్డుపై రేసింగ్‌లు నిర్వహించి స్టంట్లు చేశారని పేర్కొన్నారు. మొత్తం 13 సార్లు కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం ఉందని వివరించారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఐదుగురు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారని, వెంటనే వారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అందులో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని, మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. చదవండి: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ట్రంప్ హింట్.. -
Mystery: సెకండ్ షోకి వెళ్లి శవాలుగా తేలి.. గ్రిమ్స్ సిస్టర్స్ డెత్ స్టోరీ
ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్ల విషాద గాథ. షికాగో చరిత్రలో అత్యంత అపఖ్యాతికి గురైన అపరిష్కృత వ్యథ. అది 1956 డిసెంబరు 28. షికాగోలోని ఇల్లినాయీకి చెందిన బార్బరా గ్రిమ్స్(15), ప్యాట్రీషియా గ్రిమ్స్(12) అనే ఇద్దరు సోదరీమణులు.. మెకిన్లీ పార్క్, బ్రైటన్ థియేటర్లోని అప్పటి స్టార్ హీరో అండ్ సింగర్ ‘ఎల్విస్ ప్రెస్లీ’ సినిమా ‘లవ్ మీ టెండర్’ సెకండ్ షోకి వెళ్లారు. వాళ్లింటికి ఆ థియేటర్ కేవలం ఒకటిన్నర మైళ్ల దూరం. వాళ్లు ఆ సినిమా చూడటం అది పదకొండవసారి. ప్రెస్లీకి వీరాభిమానులైన ఆ అక్కాచెల్లెళ్లు ప్రెస్లీ ఫ్యాన్స్ క్లబ్లో సభ్యులు కూడా. రాత్రి 7:30కి ఇంటి నుంచి బయలుదేరిన ఆ అమ్మాయిలు.. సినిమా చూసి, 11:45 కల్లా వచ్చేస్తామని తల్లి లోరిటాకి మాటిచ్చారు. పన్నెండు దాటినా రాకపోయేసరికి భయపడిన లోరిటా.. తన మరో కూతురు థెరిసా, కొడుకు జోయిలను బస్‌స్టాండ్‌కి పంపించింది చూసి రమ్మని. వాళ్ల ముందే మూడు బస్సులు వెళ్లిపోయాయి కానీ బార్బరా, ప్యాట్రీషియా మాత్రం రాలేదు. ఆ కుటుంబం.. ఆ బాలికల స్నేహితుల ఇళ్లకు పరుగుతీసింది. అక్కడా నిరాశే ఎదురైంది. దాంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రౌండ్ సెర్చ్ మొదలుపెట్టారు. రోజులు గడిచేకొద్దీ సాక్షులు పెరిగారు తప్ప బాలికల ఆచూకీ మాత్రం దొరకలేదు. ప్యాట్రీషియా స్కూల్ ఫ్రెండ్ డోరతీ.. ‘ఆ రోజు రాత్రి నేనూ, మా అక్క కూడా అదే సినిమాకు వెళ్లాం. లేట్ అవుతుందనే ఉద్దేశంతో తొమ్మిదిన్నరకు ఇంటర్వెల్లో ఇంటికి వెళ్లిపోయాం. వెళ్తూ వెళ్తూ వాళ్లిద్దరినీ చూశాను. పాప్‌కార్న్ కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డారు. సంతోషంగానే కనిపించారు’ అని చెప్పింది. మరికొందరు ప్రత్యక్షసాక్షులు.. మెర్క్యురీ మోడల్ కారులో వచ్చిన ఒక యువకుడితో బాలికలు మాట్లాడటం చూశామని.. ఆ వ్యక్తి అచ్చం ప్రెస్లీని పోలి ఉన్నాడని చెప్పారు. పత్రికల్లో విస్తృత ప్రచారం మొదలైంది. ‘ఆచూకి చెప్పండి’ అంటూ రివార్డ్లూ ప్రకటించారు. అనుమానాలు, అరెస్ట్‌లు ముమ్మరంగానే సాగాయి. తన పిల్లల్ని వదిలిపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తానంటూ లోరిటా కిడ్నాపర్లకు పలు విజ్ఞప్తులూ చేసింది. డిసెంబర్ 28న బాలికలు తన బస్ ఎక్కారని, దాదాపు రాత్రి 11:05 గంటలకు వెస్ట్రన్ అవెన్యూలో దిగారని ఓ బస్ డ్రైవర్ సాక్ష్యమిచ్చాడు. ఆ ప్రదేశం థియేటర్‌కి.. బాలికల ఇంటికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కాలం గడుస్తున్నా కొద్దీ.. ఆ అమ్మాయిల్ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, వాళ్లంతట వాళ్లే ఇంటి నుంచి పారిపోయి స్వచ్ఛందంగా బాయ్‌ఫ్రెండ్స్‌తో ఉంటున్నారనే అభిప్రాయం స్థిరపడిపోయింది. 1957 జనవరి 19న టెలివిజన్‌లో ప్రెస్లీ గ్రేస్‌ల్యాండ్ ఎస్టేట్ నుంచి అమ్మాయిల కోసం అధికారిక ప్రకటన వెలువడింది. ‘మీరు నిజమైన ప్రెస్లీ అభిమానులైతే వెంటనే ఇంటికి వెళ్లిపోండి. మీ మీద బెంగతో మీ అమ్మ చిక్కిశల్యమవుతోంది’ అంటూ ప్రెస్లీ కూడా స్పందించాడు. అయినా కేసులో ఎలాంటి పురోగతి లేదు. జనవరి 22న విల్లో స్ప్రింగ్స్‌లోని నిర్మానుష్య రహదారి పక్కన.. కరిగిన మంచు ముక్కల మధ్య.. లియోనార్డ్ ప్రెస్కాట్ అనే కార్మికుడికి.. రెండు తెల్లటి బొమ్మలు కనిపించాయి. అనుమానం వచ్చిన లియోనార్డ్.. దగ్గరల్లో ఉన్న తన ఇంటికి వెళ్లి భార్యను తీసుకొచ్చి వాటిని చూపించాడు. అవి బొమ్మలు కావు శవాలని గుర్తించిన అతడి భార్య అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. తేరుకుని ఆ ఇద్దరూ స్టేషన్‌కు పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ శవాలు గ్రిమ్స్ సిస్టర్స్వని గుర్తించారు. వారిది నిజంగా కిడ్నాప్ అని, లైంగికదాడి చేసి చంపేశారని నమ్మేవాళ్లు పెరిగారు. వాళ్లు కనిపించకుండా పోయిన(డిసెంబర్ 28) ఐదు గంటల వ్యవధిలోనే హత్యకు గురయ్యారని రిపోర్ట్స్ తేల్చాయి. అయితే డిసెంబర్ 30 తర్వాత, జనవరి మొదటి వారాల్లో వాళ్లను హోటల్స్ దగ్గర, స్టోర్స్ దగ్గర చూశామంటూ చాలా మంది సాక్ష్యమిచ్చారు. అప్పటికే చనిపోయిన వారిని వాళ్లంతా ఎలా చూశారనేది పెద్ద మిస్టరీగా మారింది. బాలికల శరీరాలపై తీవ్రమైన గాయాలేమీ లేవు కానీ కొట్టినట్లుగా కొన్ని మచ్చలు ఉన్నాయి. ఎలుక కొరికిన గాట్లున్నాయి (శవాలపై జరిగిన దాడి కావచ్చు). బాలికల్ని ఎక్కడో చంపి.. కారులో కౌంటీలైన్ రోడ్‌కి తీసుకొచ్చి పడేసి ఉంటారని, మంచులో ఉండటం వల్లే శవాలు త్వరగా పాడుకాలేదని అంచనాకు వచ్చారు నిపుణులు. ఎన్నిసార్లు పరీక్షలు నిర్వహించినా వాళ్లిద్దరూ ఊహించని షాక్ వల్లే చనిపోయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి తప్ప మరే కారణాన్ని స్పష్టపరచలేదు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 3 లక్షల మందిని విచారించారు పోలీసులు. రెండు వేల మందిపై పూర్తి నిఘా పెట్టారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిలో ఎడ్వర్డ్ బెడ్‌వెల్ అనే వ్యక్తిపై సుదీర్ఘ విచారణ జరిగింది. నేరాన్ని అంగీకరించాలని తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని అతడు కోర్టు ముందు వాపోయాడు. ఆ తర్వాత అభియోగాల నుంచి బయటపడ్డాడు. అయితే అసలు నేరస్థులు ఎవరు? బాలికలు తమ ఇష్టంతోనే వెళ్లారా? లేక వాళ్లను బలవంతంగా లాక్కెళ్లారా? బాలికలకు తెలిసిన వాళ్ల పనేనా? లేక అపరిచితుల కుట్రా? అసలు సాక్ష్యులంతా నిజమే చెప్పారా లేదా? అనేది నేటికీ తేలలేదు. -సంహిత నిమ్మన చదవండి: Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రుల్ని చంపిందెవరు? -
Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ
షికాగో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట పోరాటం ముగిసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ ద్వయం 5–7, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్)–బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. ఈ సీజన్లో సాకేత్–యూకీ జంట అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వీరిద్దరు కలిసి నాలుగు ఏటీపీ చాలెంజర్ టైటిల్స్‌ను, రెండు ఐటీఎఫ్ టోర్నీ టైటిల్స్‌ను సాధించారు. -
విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పిందని..హత్య చేసిన మాజీ భర్త!
ఇటీల ఏం జరిగిన ప్రతి విషయాన్ని సోషల్ మాధ్యమ్యంలో షేర్ చేయడం ఒక అలవాటైపోయింది జనాలకు. ఇవి ఒక్కోసారి వారిని ఇబ్బందులకు గురి చేస్తాయనే స్ప్రుహ కూడా ఉండటం లేదు. అదీగాక వ్యూస్, ఫాలోవర్స్ మాయలో ఏ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. వ్యక్తిగత విషయాలు గురించి చెప్పేటప్పుడూ కాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీతో ఉండే వ్యక్తులకు అలా చెప్పడం నచ్చుతుందో లేదో తెలియదు. అందువల్ల లేనిపోని సమస్యలు కూడా వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక మహిళ సామాజిక మాధ్యమంలో తన వ్యక్తిగత విషయాలను చెప్పి.. విగత జీవిగా మారింది. వివరాల్లోకెళ్తే...పాకిస్తానీ అమెరికన్ మహిళ సానియా ఖాన్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించి వివాహం ఎందుకు విఫలమయ్యిందో, అందుకు దారితీసిని విషయాల గురించి సోషల్ మాధ్యమంలో షేర్ చేసింది. పైగా విడాకుల తీసుకున్న మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా వివరించింది. పైగా ఆమె మాజీ భర్త కుటుంబం నుంచి తనకు ఎదురైన కూడా పంచుకుంది. అంతే ఇది నచ్చిన ఆమె మాజీ భర్త ఆమెను చంపేందుకు రెడీ అయిపోయాడు. వాస్తవానికి సానియా ఖాన్ తన మాజీ భర్త రహెల్ అహ్మద్ ఇద్దరు ఐదేళ్లు డేటింగ్ చేసి గతేడాది 2021లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఇద్దరు చికాగోలో కొన్నాళ్లు కలిసి ఉన్నారు. ఏమైందో ఇద్దరిమధ్య విభేదాలు తలెత్తి కొద్దిరోజుల్లోనే విడిపోయారు. దీంతో ఆమె టేనస్సీకి వెళ్లిపోదాం అనుకుంది. ఐతే ఆమె టిక్‌టాక్, ఇన్స్ట్రాగ్రాంలో మంచి యాక్టివిగ్ ఉంటుంది. తనకు ఆనందం కలిగినా, బాధ కలిగినా ఆ విషయాలను సోషల్ మీడియాలోని నెటిజన్లతో షేర్ చేసుకోవడం అలవాటే. అలానే ఆమె టేనస్సీకి బయలుదేరే సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయాలన్ని వివరిస్తూ...పోస్ట్‌లు పెట్టింది. పైగా తనలాంటి వాళ్ల కోసం పాటుపడతానని, సమాజం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి అవమానాన్నైనా తట్టుకుంటానంటూ చెప్పుకొచ్చింది. అంతే ఇది తెలుసుకున్న జార్జియాలో ఉన్న ఆమె మాజీ భర్త చికాగోలో ఉన్న తన వద్దకు వచ్చి తుపాకితో ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఐతే అహ్మద్ తల్లిదండ్రలు తమ కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాధ ఘటన వెలుగు చూసింది. ఏదీ ఏమైన కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. (చదవండి: అమానుష ఘటన: గర్భిణిని కింద పడేసి, కాళ్లతో తన్ని...) -
America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం
షికాగో: అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీటిలో కనీసం ఆరుగురు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్‌క్లబ్‌లో కాల్పుల్లో మరొకరు అమెరికాలో శాక్రిమాంటో నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. డెన్మార్క్‌లో ముగ్గురు... కోపెన్‌హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
సాహసం చేసి ప్రాణం కాపాడాడు.. అడి కార్ అందుకున్నాడు
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్‌తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా. ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్‌తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్‌ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది. టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్‌ను టోనీకి సర్ప్రైజ్గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది. -
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్
వయెలెన్స్.. వయెలెన్స్.. వయెలెన్స్.. అమెరికాలో నియంత్రణ కాలేకపోతోంది. తుపాకీల గర్జనతో మరోసారి అమెరికా ఉలిక్కి పడింది. చికాగో (Chicago) నగరంలోని వారాంతంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఎనిమిది మందికి పైగా మృతిచెందారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ కిల్ప్యాట్రిక్లో పేలిన ఘటన.. అటుపై బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ పార్క్‌లో వరుసగా చోటు చేసుకున్నాయి. తొలి ఘటన శుక్రవారం జరగ్గా.. 69 ఏండ్ల వృద్ధుడు మరణించాడు. ఆ తర్వాతి కాల్పుల ఘటనల్లో దాదాపు అన్ని వయస్సుల వాళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గన్ వయొలెన్స్ అమెరికాలో ఎంతకీ తగ్గడం లేదు. ఓ పరిశోధన సంస్థ ప్రకారం.. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140కి పైగా కాల్పుల ఘటనలు సంభవించాయి. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకే ఘోస్ట్ గన్స్‌పై నిషేధం విధించాడు ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్. అయితే ఈ చట్టం తీసుకొచ్చినా కూడా.. ఘటనలు మాత్రం ఆగడం లేదు. చదవండి: ఘోస్ట్ గన్స్ ఎఫెక్ట్.. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తు నుంచి దూకింది! -
ఇల్లినాయిస్లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్
షికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నాట్స్ తాజాగా నిర్వహించిన ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. ఇల్లినాయిస్లో చికాగో నాట్స్ టీం నిర్వహించిన మిడ్ వెస్ట్రన్ త్రో బాల్ టోర్నమెంట్‌కు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం ఇల్లినాయిస్ మాత్రమే కాకుండా మిచిగాన్, ఇండియానా, విస్కాన్సిన్, మిస్సోరి తదితర రాష్ట్రాల నుంచి మహిళ జట్లు ఈ పోటీలకు హాజరయ్యారు. దాదాపు 150 మందికి పైగా మహిళలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. విస్కాన్సిన్ కు చెందిన ఎఎస్‌సీటీగ్రెస్ టీమ్ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఇల్లినాయిస్ చెందిన హరికేన్స్ టీం రన్నర్ అప్ గా నిలిచింది. నాట్స్ చికాగో కల్చరల్ కో ఆర్డినేటర్ బిందు వీదులముడి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ చికాగో నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జ, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, హరీష్ జమ్ముల, మరియు కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో సహాకరించిన శిల్పా ఎర్రా, పూజా సావంత్, రోజా శీలంశెట్టి, బిందు బాలినేని, ప్రదీప్, ప్రియాంక గుప్తా, సంధ్య అంబటి, సుమతి నెప్పలి, రామ కొప్పక, రవి కిరణ్ ఆలా, శివ దేసు, రాజేష్ వీధులమూడి, ఆర్కే బాలినేని, పండూ చెంగలశెట్టి, యాజ్నేష్, కిరణ్ అంబటి, తుషార్ సావంత్ తదితరులకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది చదవండి : .Miss Universe Singapore-2021: మిస్ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి -
షికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్
షికాగో: సెప్టెంబర్ 13: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించింది. చికాగోతో పాటు చుట్టు పక్కల నివసిస్తున్న తెలుగు క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విన్నర్‌గా లయన్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఎంతో రసవత్తవరంగా సాగిన ఈ టోర్నమెంట్లో ఎవోలూటీజ్ లయన్స్ టీం ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. అరోరా వారియర్స్ రన్నర్స్ గా నిలిచింది. నాట్స్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ హరీష్ జమ్ముల ప్రణాళిక ఈ టోర్నీని విజయవంతం చేయడంలో శ్రమించారు. చికాగో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జా, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, బిందు వీదులమూడి, కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణకు అందించిన సహకారం అందించారు. ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ కోసం నాట్స్ వాలంటీర్లు రాజేష్ వీదులమూడి, ఆర్కే బాలినేని, పండు చెంగలశెట్టి, శ్రీనివాస్ బొప్పన, కృష్ణ నున్నా, కిరణ్ అంబటి, శ్రీకాంత్ బొజ్జ, అరవింద్ కోగంటి, అరుల్ బాబు, యాజ్నేష్ వెంకటేష్, కార్తీక్ మోదుకూరి, నరేన్ శర్మ, నరేష్ యాదా, వినోద్ బాలగురు, మనోహర్ పాములపాటి, రామ్ తూనుగుంట్ల తదితరులు స్వచ్ఛంధంగా సేవలు అందించారు. చదవండి : తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా -
64 రౌండ్లు కాల్పులు.. తూట్లు పడ్డ బాడీ!
గన్ కల్చర్‌కి కేరాఫ్ అడ్రస్ అమెరికా అనేది చాలా మంది చెప్పే మాట. అక్కడి ప్రభుత్వాలు తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడాలని ఎంత దృష్టి సారించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. వాషింగ్టన్: చికాగో జైలు నుంచి విడుదలైన వారం రోజుల్లో యూస్‌కి చెందిన రాపర్ కెటీఎస్ డ్రే అకా లోండ్రే సిల్వెస్టర్ (31) అనే వ్యక్తిపై ఓ దుండగుల ముఠా 64 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘రెండు వేర్వేరు వాహనాల్లో వచ్చిన దుండగులు సిల్వెస్టర్పై బుల్లెట్ల వర్షం కురిపించారిని తెలిపారు. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. అదే సమయంలో ఇద్దరు మహిళల (60), (35)కు కూడా బుల్లెట్లు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. వారిని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక చికాగోలో వారం రోజుల్లో 40 మందిపై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనల్లో 10 మంది మరణించారు. ఇక కేటీఎస్ అనగా.. ‘కిల్ టు సర్వైవ్’, ఈ పదాన్ని సిల్వెస్టర్ తన మెడలో వేసుకున్నాడు. అంతేకాకుండా అదే సింబల్‌తో టాటూ కూడా వేయించుకున్నాడు. పోలీసు నివేదికలు సిల్వెస్టర్‌ను గ్యాంగ్‌స్టర్ శిష్యుల లేక్‌సైడ్ వర్గంలో సభ్యుడిగా గుర్తించాయి. -
ఐదో తరగతి విద్యార్థులకు ఫ్రీ కండోమ్స్.. తల్లిదండ్రుల ఆగ్రహం
వాషింగ్టన్/చికాగో: యుక్త వయసులో పిల్లల్లో కలిగే శారీరక, మానసిక మార్పుల గురించి వారితో చర్చిస్తే ఎంతో మేలని మానసిక నిపుణులు సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాబోధనలో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకంగా బోధిస్తారు. అయితే దేని గురించి అయినా చెప్పే పద్దతిలో.. అవసరం ఉన్న వరకు తెలియజేస్తే తప్పులేదు. అలా కాదని అత్యుత్సాహం ప్రదర్శిస్తే అబాసు పాలవ్వాల్సి వస్తుంది. అమెరికాలోని చికాగో ఎడ్యుకేషన్ బోర్డు కూడా తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఐదో తరగతి.. ఆపై విద్యార్థులకు పాఠశాలలో కండోమ్స్ ఇవ్వాలని చికాగో ఎడ్యుకేషన్ బోర్డ్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. చికాగో పబ్లిక్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్లో సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించింది. దీనిలో భాగంగా విద్యార్థులకు 'ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం' తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు దీనిపై అభ్యంతరం ఉంటే లిఖితపూర్వకంగా బోర్డుకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇక సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు, హైస్కూళ్లలో ఒక వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం. విద్యార్థుల్లో లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భాలను నిరోధించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు సీపీఎస్(చికాగో పబ్లిక్ స్కూల్స్) అధికారులు చెబుతున్నారు. అంతేకాక బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు కండోమ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కండోమ్స్ అయిపోతే ప్రిన్సిపాల్స్ సదరు ఉన్నతాధికారులకు తెలియజేసి.. తెప్పించుకోవాలని తెలిపింది. సెక్స్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇలా ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న పాలసీని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే కేవలం 12 ఏళ్ల వయసు ఉంటుందని... అప్పటికీ వారు ఇంకా చిన్నపిల్లలే అని చెబుతున్నారు. పిల్లలకు కండోమ్స్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదని... దీనిపై మరోసారి ఆలోచన చేయాలని కోరుతున్నారు. కానీ వైద్యులు, మానసిక విశ్లేషకులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఈ పాలసీ చాలా అవసరమని.. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే... వారికి సరైన జాగ్రత్తలు చెప్పకపోతే... వారికి చెడు జరిగే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకర నిర్ణయాలు తీసుకునేందుకు కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కు యువతకు ఉందన్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారని పేర్కొన్నారు. -
షికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడకలు అమెరికాలోని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హమ్మర్ పార్కులో సమావేశమైన ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సుమారు 150 మంది వరకు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరైన వెంకట్‌రెడ్డి లింగారెడ్డితో పాటు తెలంగాణ అమెరికా తెలుగు సోసైటీకి నుంచి కందిమళ్ల సత్య, ఏ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటం ముందు దీపాలను ఆర్వి రెడ్డి దీపాలను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ, శివ దేశూ, శ్రీజన్, శేషు, ఆడి, శశాంక్, శివారెడ్డి, రామకాంత్, భూపాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజన ఏర్పాటు చేశారు. దీంతో పాటు పిల్లల కోసం సరదా కార్యక్రమాలు నిర్వహించారు. -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో
చికాగో: వారమంతా కష్టపడితే మనకు సెలవు దొరికేది ఒకరోజు. ఆ ఒక్కరోజును ఎలా ప్లాన్ చేసుకొని గడపాలా అని ఆలోచిస్తుంటాం. ముఖ్యంగా పనివల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. ఇక ఒత్తిడిని దూరం చేయడానికి కొంతమంది స్విమ్మింగ్‌ను మార్గంగా ఏంచుకుంటారు. అయితే స్విమ్మింగ్ చేసేవాళ్లు మహా అయితే నెల రోజులు కంటిన్యూగా చేయగలుగుతారు. అంతకుమించి చేసినా బోర్ కొట్టడం ఖాయం. కానీ అమెరికాలోని చికాగొకు చెందిన ఒక బస్‌డ్రైవర్ మాత్రం 365 రోజుల నుంచి ప్రతీరోజు లేక్ మిచిగాన్‌లో ఈత కొట్టడానికి వస్తూనే ఉన్నాడు. అదేంటి ప్రతీరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే.. నాకున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదొక్కటే మార్గం అనిపించింది.. అందుకే సంవత్సరం నుంచి ఇదే పనిలో ఉన్నా అంటూ వింత సమాధానమిచ్చాడు. వివరాలు.. చికాగోకు చెందిన డాన్ ఓ కానర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండనివ్వకపోవడం.. ఆఫీస్‌కు వెళితే అధికారులు ఒత్తిడి తేవడం.. దీనికి తోడూ రోజు 12 గంటలకు పైగా బస్ నడపడం.. ఇవన్నీ కలిపి అతన్ని మానసికంగా చాలా కుంగదీశాయి. అదే సమయంలో కరోనా మహమ్మారితో అమెరికా మొత్తం లాక్డౌన్ ఉండడంతో అతనికి పని తగ్గిపోయింది. దీంతో మానసిక ప్రశాంతత కోసం కాస్త భిన్నంగా ఆలోచించాడు. గతేడాది సరిగ్గా ఇదే రోజున మాంట్రోస్ హార్బర్లో ఉన్న లేక్ మిషిగాన్‌కు చేరుకొని దూకడం ప్రారంభించాడు. అప్పటినుంచి కాలాలు మారుతున్నా తన పని మాత్రం ఆపలేదు. గడ్డకట్టే చలిలోనూ వచ్చి నదిలో దూకడంతో గడ్డకట్టిన నీళ్లతో దాదాపు 20 సార్లు దెబ్బలు తగలడంతో పాటు ఒంటినిండా గాట్లు పడేవి. అంత బాధను ఓర్చుకొని తన పని కానిచ్చి వెళ్లిపోయేవాడు. అలా సరిగ్గా నిన్న(శనివారంతో) ఏడాది పూర్తి కానుండడంతో కానర్ సంతోషంలో ఉన్నాడు. కానర్ స్పందిస్తూ.. '' ఒకవైపు మహమ్మారి బయపెడుతుంది.. మరోవైపు నాకు మానసిక ఒత్తిడి ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కాలేదు. మానసిక ప్రశాంతతను పొందడానికి లేక్ మిషిగాన్‌ను ఏంచుకున్నాను. 365 రోజులుగా నదిలో దూకుతున్న ప్రతీసారి కొత్తగానే కనిపించేది. అలా ఒక పనిని ఏడాది పాటు విజయవంతంగా పూర్తి చేశాను. ఈ ఏడాది వ్యవధిలో ఎన్నో జ్ఞాపకాలు మిగిలాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కానర్ చేసిన పని ఇప్పుడు అక్కడ హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు కానర్‌ను కలిసి ఒత్తిడి తగ్గించుకోవడం కోసం చిట్కాలు అడుగుతున్నారు. మరికొందరు మాత్రం అతనికి పనిపాటా లేక అలాంటి దారిని ఏంచుకున్నాడు. అంటూ కామెంట్లు చేశారు. చదవండి: 10 నిమిషాల అంతరిక్ష యాత్ర కోసం రూ.205 కోట్లు ఖర్చు చందమామపై బాంబులు ఎందుకు? -
ఘనంగా లింగారెడ్డి భీమారెడ్డి 80వ జన్మదిన వేడుకలు
చికాగో : హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ప్రెసిడెంట్ లింగారెడ్డి భీమారెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు చికాగోలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి పలువురు వ్యాపార, రాజకీయ నాయకులు హాజరై భీమారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో దేవాలయానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు వివిధ రూపాల్లో సేవలందిస్తూ ముఖ్యంగా తెలుగువారికి ఎంతో సహాయ,సహకారాలు అందించే భీమారెడ్డి..ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురంలో 1941లో జన్మించారు. రాజమండ్రి, కాకినాడలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1967లో అమెరికా వచ్చిన ఆయన రేతియాన్ అనే స్టీల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత చికాగోలోని హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో అనే దేవాలయానికి ప్రెసిడెంట్‌గా ఐదు పర్యాయాలు పనిచేయారు. ఈ ఆలయానికి 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్తాపన చేశారు. అనతికాలంలోనే ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆలయ నిర్మాణంలో బ్యాంక్ రుణాలను పూర్తిగా చెల్లించడంలో భీమారెడ్డి ముఖ్యమైన పాత్ర పోషించి, ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు. ఈ వేడుకకి ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు రాజా కృష్ణమూర్తి, సాయి మందిర్ మాజీ అధ్యక్షులు డా. కట్టమంచి ఉమాపతి రెడ్డి, వెస్ట్మాంట్ ఇండియన్ కమ్యూనిటి ప్రతినిధులు వెంకటరెడ్డి సహా పలువురు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. -
ఎయిర్‌పోర్టులో 3,200 వయగ్రా పిల్స్..
వాషింగ్టన్ : 3,200 వయగ్రా పిల్స్‌ను చికాగో విమానాశ్రయంలోకి తీసుకెళ్లిన ఓ భారతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని తన మిత్రుల కోసం తీసుకెళుతున్నానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. దాదాపు నాలుగున్నర కేజీల బరువున్న 3,200 వయగ్రా పిల్స్ విలువ రూ. 69 లక్షల వరకూ ఉంటుందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు వెల్లడించారు. సరైన కారణాన్ని వెల్లడించడంలో నిందితుడు విఫలమయ్యాడని చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం దేశం వెలుపల కొన్న మెడిసిన్‌ను దిగుమతి చేసుకోవడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ ఒప్పుకోదని తెలిపారు. అయితే నిందితుడి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. -
రేపటి నుంచి షికాగోకు నాన్‌స్టాప్ విమానం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నేరుగా షికాగో వెళ్లేందుకు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. షికాగో నుంచి బుధవారం బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్–777 విమానం గురువారం రాత్రి 12.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఇదే విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ అయి నేరుగా షికాగో బయల్దేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ప్రతి శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి షికాగోకు ఈ సర్వీసు వెళుతుంది. 238 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 మొదటి తరగతి, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. -
అమెరికాలో హైదరాబాదీపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: అమెరికాలోని షికాగో నగరంలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో పాతబస్తీ సంతోష్‌నగర్ మోయిన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్(43) గాయపడ్డారు. షికాగోలోని సౌత్ మిచిగాన్ ఎవెన్యూ 11300 బ్లాక్ వద్ద ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) ముజీబుద్దీన్ కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి అడ్డగించారు. ముజీబుద్దీన్ పర్సు లాక్కుని కారు కూడా ఇవ్వాలని బెదిరించారు. ముజీబుద్దీన్ వారించగా అతనితో కాసేపు పెనుగులాడారు. ఈ క్రమంలో ముజీబుద్దీన్‌పై కాల్పులు జరపడంతోపాటు తలపై తుపాకీతో కొట్టి కారుతో దొంగలు ఉడాయించినట్లు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు ‘సాక్షి’కి తెలిపారు. స్థానికులు ముజీబ్‌ను యూనివర్సిటీ ఆఫ్ షికాగో హాస్పిటల్‌కు తరలించారని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వారు తెలిపారు. ముజీబ్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోతుండగా కొందరు స్థానికులు ఫొటోలు తీశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన షికాగో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ దారుణం గురించి ముజీబుద్దిన్ భార్య మాట్లాడుతూ.. ‘నా భర్త రూమ్‌లో ఉండే వ్యక్తి జరిగిన ప్రమాదం గురించి మాకు తెలియజేశాడు. దారుణం గురించి తెలిసి కుప్పకూలిపోయాం. ప్రస్తుతం నా భర్త ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. తనను చూసుకోవడానికి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో మాకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాను. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, భారత కాన్సులేట్లని సంప్రదించి నా భర్తకు తగిన వైద్య సాయం అందేవిధంగా చూడాలని కోరాను’ అన్నారు. ఈ ఉదంతాన్ని పాతబస్తీకి చెందిన ఎంబీటీ నేత అంజద్ఉల్లాఖాన్ షికాగోలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి జై శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. (చదవండి: అమెరికాలో శవమై తేలిన యువతి) కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ముజీబుద్దీన్ 2015లో అమెరికాలోని షికాగో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ప్రముఖ స్టోర్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య అఫ్రోజ్ కౌసర్‌తోపాటు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన కుమారుడు కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ముజీబ్ తల్లి షహనాజ్ తయ్యబా చెప్పింది. ముజీబ్ద్దీన్కు వీసా పత్రాల విషయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇప్పటివరకు స్వదేశానికి రాలేని పరిస్థితి నెలకొందని, ఈ ఏడాది జూన్‌లో అతని తండ్రి ముంతజీబ్ మరణించినా ఈ సమస్య కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
హైదరాబాదీపై అమెరికాలో కాల్పులు
వాషింగ్టన్: చికాగోలో హైదరాబాదీపై కాల్పులు కలకలం సృష్టించాయి. పాతబస్తీ చంచల్ గూడకు చెందిన సిరాజ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. డిసెంబర్ 4న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరాజ్ అమెరికాలో పనిచేస్తున్నాడు. డిసెంబర్ 4 తెల్లవారుజామున ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. డెవాన్ ఉత్తరాన అతని కారుపై గుర్తు తెలియని షూటర్లు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ అతను సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనుక సీటు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో కొన్ని ఆటోమేటిక్ గన్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాల్పుల విషయాన్ని విదేశాంగ మంత్రి, భారత ప్రభుత్వం, యుఎస్ఎలోని భారత రాయబారి, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సిరాజ్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. -
షికాగోలో భారీగా లూటీలు: చెలరేగిన హింస
వాషింగ్టన్ : అమెరికా షికాగో నగరంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున వందల మంది యువకులు వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టించారు. వాణిజ్య సముదాయాల్లోకి చొరబడి లూటీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పరిస్థితిని అదుపు చేసేందుకు జరిగిన కాల్పుల్లో ఒక పౌరుడు, సెక్యూరిటీ గార్డుతోపాటు సుమారు 13 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేశాయి. (వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం) మాగ్నిఫిసెంట్ మైల్ తోపాటు, ఇతర ప్రాంతాల్లో సాయుధులైన వందలమంది దుండగులు షాపులు, హోటళ్లలోకి చొరబడి, షాపుల కిటీకీలను ధ్వంసం చేశారు. గంటల తరబడి విధ్వంసానికి తెగబడి భయోత్పాతం సృష్టించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ఆంక్షలను విధించారు. ఇది నేరపూరిత సంఘటన అని పోలీస్ సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ తెలిపారు. పోలీసులు ఒక నిరాయుధ యువకుడిని కాల్చి చంపారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అల్లర్లు చెలరేగాయన్నారు. అతను పోలీసులపై కాల్పులు జరపడంతో తాము తిరిగి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు చెప్పారు. తాజా ఘటనలో100 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై షికాగో మేయర్ లోరీ లైట్ఫుట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హింసను తీవ్రంగా ఖండించారు. నిందితులను తక్షణమే గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ కొంతమంది ఆందోళనకు దిగారు. -
విదేశాల నుంచి భారత్‌కు విమానాల రాక
ఎన్ఆర్ఐ: కరోనా కారణంగా ప్రపంచం ఎన్నడూ ఎదుర్కొని సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. ఈ మహమ్మారి పేద, ధనిక, సామాన్యులు, గొప్పవారు అని సంబంధం లేకుండా అందరి జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. కేవలం వృతిపరంగా మాత్రమే ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను కూడా ఈ కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. ఈ మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకట్టవేసేందుకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. భారత ప్రభుత్వం కూడా మార్చి 21 న లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్‌ను ఇప్పటికీ మూడు సార్లు సవరించి మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి భారతదేశానికి సంబంధించి అన్ని విదేశీ ప్రయాణాలతో పాటు దేశం లోపల కూడా అన్ని రవాణా సౌకర్యాలు రద్దు అయ్యాయి. దీంతో ఉద్యోగరీత్యా, చదువు కోసం, ఇంట్నషిప్ కోసం, టూర్ కోసం, బిజినెస్ పని మీద ఇతర దేశాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే పరిస్థితులు లేక అక్కడే చిక్కుకొని పోయారు. వారందరూ ఎప్పుడెప్పుడు మన దేశానికి తిరిగొద్దామా అని ఎదురు చూస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కల్పించాలని వారు భారత ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా కారణంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులందరిని వెనక్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టింది. వందేమాతరం మిషన్ అలాగే ఆపరేషన్ సముద్రసేతు ద్వారా భారతీయులందరిని స్వదేశానికి చేర్చడానికి నిర్ణయించి అందుకు సంబంధించిన కార్యకలాపాలు మొదలుపెట్టారు. అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో విదేశీ మంత్రిత్వ శాఖ ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన కోవిడ్-19 సెల్ విభాగం ఈ ఆపరేషన్లను దగ్గరుండి పరిశీలిస్తోంది. వివిధ దేశాలలో ఉన్న భారత ఎంబాసీలు, హైకమిషన్ల ద్వారా అక్కడ వారి వివరాలు తెలుసుకొని వారిని భారతదేశానికి తీసుకు వస్తున్నారు. వందే భారత్ మిషన్ తొలి విడతలో ఎయిర్ ఇండియా 12 దేశాలకు 64 విమాన సర్వీసులు అందిచనుంది. మే 7 నుంచి 15 వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఆపరేషన్ ద్వారా విదేశాలలో చిక్కుకుపోయిన వారిని తరలించనున్నారు. వందేభారత్ మిషన్ ద్వారా 7 విమానాలు అమెరికా నుంచి ఇండియాకు రానున్నాయి. (ఆ టిక్కెట్లన్నీ రద్దు: రైల్వే శాఖ) వీటిలో రెండు విమానాలు ఒక్కొక్కటి శాన్‌ఫ్రాన్సికో నుంచి, న్యూయార్క్ నుంచి, చికాగో, వాషింగ్టన్ నుంచి రానున్నాయి. చికాగో నుంచి వచ్చే విమానం ముంబాయ్, చెన్నైకి రానుంది. మే15 న బయలుదేరనున్న విమానం ఢిల్లీ, హైదరాబాద్ చేరుకోనుంది. అయితే ఈ ఏడు విమానాల్లో ఉన్న సీట్లు ఎంబాసీ పోర్టల్‌లో రిక్వెస్ట్ పెట్టుకున్న అందరకి సరిపోయేంతా లేవు. దీంతో అందరికి మొదటిఫేస్లో విమాన సీట్లు కేటాయించలేమని ఈ విషయంలో అందరూ ఓపికతో ఉండాలని స్వదేశీ మీడియా, యూఎస్ఏ ద్వారా విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధి భారత ప్రభుత్వం ఫేస్-2 ని కూడా ప్లాన్‌చేస్తోందని మరికొంతమందిని ఆ విమానాల ద్వారా తరలిస్తామని పేర్కొంది. భారతదేశానికి తీసుకువచ్చే విషయంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి, విద్యార్థులకు, పెద్దవాళ్లకి, గర్భవతులకు, వీసా గడువు ముగిసిన వారికి మొదట ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మిగిలిన వారిని ఎలక్ట్రానిక్ ర్యాండమ్ సెలక్షన్లో ఎంపిక చేస్తారు. ప్రయాణీకులందరికీ ఈ మెయిల్స్, ఫోన్ల ద్వారా పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్, టికెట్ ప్రాసెస్, హెల్త్ ప్రోటోకాల్, బయలు దేరే సమయాలు అన్నింటి గురించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలిపారు. (దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు) -
మే 16 నుంచి 22 వరకు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు రెండో దశ వందేభారత్ మిషన్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా మే 16 నుంచి 22 వరకు, 31 దేశాలకు 149 విమానాలను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. రెండోదశలో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేసియా, ఉక్రెయిన్, కజికిస్తాన్, ఒమన్, మలేసియా, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, సింగపూర్, ఐర్లాండ్, కిర్గిజిస్థాన్, కువైట్, జపాన్, జార్జియా, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, అర్మేనియా, థాయ్‌లాండ్, ఇటలీ, నేపాల్, బెలారస్, నైజీరియా, బంగ్లాదేశ్‌లకు 149 విమానాలను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ విమానాల్లో కేరళకి 31, ఢిల్లీ 22, కర్ణాటక 17, తెలంగాణ 16, గుజరాత్ 14, రాజస్తాన్ 12, ఆంధ్రప్రదేశ్ 9, పంజాబ్‌లో 7 విమానాలు ల్యాండ్ అవుతాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో 6, ఒడిశాలో 3, చండీగఢ్‌లో 2, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్లకు ఒక్కో విమానం చొప్పున చేరతాయి. కొందరు ప్రవాసులకు కష్టాలు! కరోనా కష్టాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ అమెరికాలో కొంతమందికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా కారణంగా విదేశీయుల వీసాలతోపాటు, భారతీయ సంతతి పౌరులు వీసాల అవసరం లేకుండా భారత్‌కు వచ్చేందుకు అవకాశం కల్పించే ఓసీఐ కార్డులనూ తాత్కాలికంగా రద్దు చేయడం ఇందుకు కారణమవుతోంది. దీంతో హెచ్1బీ వీసాలు ఉన్న వారు లేదా గ్రీన్‌కార్డు కలిగి ఉన్నవారు, పుట్టుకతో అమెరికా పౌరులైన పిల్లల తల్లిదండ్రులు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేకుండాపోయింది. హెచ్1బీ వీసాలు ఉన్న వారిలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి.. ఇటు స్వదేశమూ రాలేక నానా అవస్థలూ పడుతున్నారు. అమెరికా ప్రభుత్వం నిర్ణయం కారణంగా వీరందరూ రెండు నెలల్లో భారత్‌కు వెళ్లిపోవాల్సి ఉంది. తల్లిదండ్రులకు భారతీయ వీసా ఉన్నప్పటికీ పిల్లలు అమెరిక పౌరులైనందున వారిని వందేభారత్ మిషన్‌లో భాగంగా భారత్ తిరిగి తీసుకువచ్చేందుకు ఎయిరిండియా అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు తమను అనుమతించాలని కోరుతూ అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. -
'కష్టాల్లో ఉన్నవారిని సీఏఏ ఆదుకుంటుంది'
చికాగొ : ప్రపంచంలో మానవాళి ఇప్పుడు ఒక విచిత్రమైన విపత్కరం లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసినదే. కరోనా మహమ్మారి మన జీవితాలని అల్లకల్లోలం చేస్తోంది. ఏంతో మంది ప్రాణాలను కబళిస్తోంది. ప్రజలు భయబ్రాంతులతో రోజులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. 'మానవ సేవే మాధవ సేవ' ధేయ్యంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలు భార్గవి నెట్టెం మాట్లాడుతూ.. 'ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సాటి తెలుగు వారికి సహాయం చెయ్యడం, కష్టాలలో వున్న భారతీయ విద్యార్థులను ఆదుకోవడం లాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైద్యబృందాల రక్షణ కోసం మా సంఘ ఆడపడుచులు అలుపెరగకుండా ఎన్నో మాస్క్ లు తయారు చేసి ఇవ్వటం మాకు గర్వకారణం. స్వతహా గా డాక్టర్ అయినా నేను నా సాయ శక్తుల రోగుల సేవలు అందించడమే కాకుండా, భారత దేశం నుంచి తమవాళ్లను చూసుకునేందుకు వచ్చిన తల్లితండ్రుల ఆరోగ్యం, మందుల విషయంలో సహాయం చేసే అదృష్టం కలిగించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు. ఆన్ లైన్ ద్వారా 100కి పైగా కుటుంబాలతో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి ఆ వచ్చిన విరాళాలను ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పూజారులకు అందించాం. ఇమ్మిగ్రేషన్ సమస్యలున్న వారికి అటార్నీలతో సంప్రదింపులు జరిపి ఆర్ధిక సహాయం ఏర్పాటు చేస్తున్నాం. వయో వృద్ధులకు మా వలంటీర్ల ద్వారా నిత్యావసరాలు అందించాం. నా తరపున సహాయం అందేందుకు సహకరించిన చికాగో ఆంద్ర అసోసియేషన్ వ్యవస్థాపకులకి, బోర్డు డైరెక్టర్లకి, మా సంఘ సభ్యులకి, శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు. -
జైల్లో కరోనా.. ఖైదీల విడుదలకు పిటిషన్
చికాగో: ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా రక్కసి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ 16,697 మరణాలు సంభవించగా.. 4.5 లక్షలకు పైగా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న మూడు నగరాల్లో ఒకటైన చికాగోలోని కుక్ కౌంటీ జైలు ఖైదీలు పెట్టుకున్న విజ్ఞప్తిని జిల్లా జడ్జి గురువారం తోసిపుచ్చారు. జైల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ఇప్పటికే ఒకరు కోవిడ్-19 బారినపడి మరణించారని 4500 ఖైదీలు పిటిషన్లో పేర్కొన్నారు. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న జైళ్లకు తమను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఇజ్రాయెల్‌కు ఐదు టన్నులు సరఫరా.. మోదీకి థాంక్స్!) అయితే, అంత భారీ స్థాయిలో ఖైదీలను బదిలీ చేయడం.. అత్యంత సంక్లిష్ట ప్రక్రియ అని జిల్లా జడ్జి మాథ్యూ కెన్నెల్లీ పేర్కొన్నారు. ఖైదీల పిటిషన్‌ను కొట్టివేశారు. అదేసమయంలో.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి రక్షణకు చర్యలు ముమ్మరం చేయాలని కుక్ కౌంటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జైల్లో ఉన్న ఖైదీలకు శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందించాలని స్పష్టం చేశారు. కాగా, కుక్ కౌంటీ జైల్లో ఇప్పటి వరకు 276 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒకరు మరణించారు. 172 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకడం గమనార్హం. చిన్న చిన్న నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను బెయిల్‌పై విడుదల చేస్తామని జైలు అధికారులు వెల్లడించారు. (దక్షిణ భారత్ నుంచి విమానాలు: బ్రిటన్) -
కరోనా : పెంగ్విన్ ఫీల్డ్ ట్రిప్ !!
చికాగో : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆ పెగ్విన్స్‌కు స్వేచ్ఛ లభించింది. తాము ఇన్ని రోజులు మగ్గిపోయిన అక్వేరియంలో ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి. తమ రాజ్యంలోని ఇతర జీవులను చూస్తూ టైం పాస్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ పూర్తిగా ప్రబలడంతో అమెరికా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికాగోకు చెందిన షేడ్ అక్వేరియాన్ని కూడా మూసేశారు. అయితే అక్వేరియంలో ఉండే పెంగ్విన్లను లోపల స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. దీంతో విల్లింగ్టన్ అనే పెంగ్విన్ అక్వేరియాన్ని చుట్టేస్తూ అందులోని జంతువులను చూస్తూ ఆనందపడిపోతోంది. ఆసక్తిగా ఒకదాన్నొకటి చూసుకుంటున్న వేల్, పెంగ్విన్ మంగళవారం కయావక్, మోయక్, బేబీ అన్నిక్ అనే వేల్స్‌ల దగ్గరకు వెళ్లి చూసి వచ్చింది. అక్కడే ఉంటున్న మరో రెండు పెంగ్విన్లు టిల్లీ, కార్మిన్లు కూడా వేల్స్లను చూసోచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిలియన్ల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతున్నాయి. దీనిపై అక్వేరియం సిబ్బంది మాట్లాడుతూ.. ‘‘ విల్లింగ్టన్ వేల్స్ దగ్గరకు వెళ్లినపుడు అవి చాలా ఆసక్తిగా దాన్ని చూడసాగాయి. ఎందుకంటే అవెప్పుడూ పెంగ్విన్స్‌ను చూసెరుగవ’’ని పేర్కొన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా జూలు, అక్వేరియాలు మూతపడటంతో అక్కడి జంతువులు లోపలే స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు సంరక్షకులు. -
నాటా ఆధ్వర్యంలో ఘనంగా బ్యాడ్మింటన్ పోటీలు
చికాగొ : నాటా ఆధ్వర్యంలో శనివారం(మార్చి 7న) అత్యంత ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రవాస భారతీయులు దాదాపు 60 మంది పాల్గొన్నారు. పోటీలో విజేతలుగా నిలిచినవారికి రంగరాజు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్ డైరెక్టర్ లింగారెడ్డిగారి వెంకట్‌రెడ్డి, నాటా రీజనల్ ప్రెసిడెంట్లు పరమేశ్వర్ రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, రీజనల్ ఆర్డినేటర్లు లక్ష్మీ నారాయణ, శివశంకర్, కమ్యూనిటీ కార్యకర్తలు ఆది, వెంకటేశ్వర్లు, శివకుమాకర్రెడ్డి, సృజన తదితరులు పాల్గొని పోటీలను విజయవంతంగా నిర్వహించారు. -
కరోనా మహమ్మారిపై బిల్‌గేట్స్ స్పందన
చికాగో : ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిడ్-19 శతాబ్ధంలో ఒకసారి వచ్చే అత్యంత తీవ్రమైన వ్యాధికారిక వైరస్ అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ' పేద, మధ్య తరగతి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే అలాంటి దేశాలపై కరోనా లాంటి వైరస్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపన్న దేశాలు సహకారం అందించాలి. ఇందుకోసం ప్రపంచదేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలి. మందులు, వ్యాక్సిన్లపై మరింత ఖర్చు పెట్టాలి. అప్పుడే వైరస్‌లను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడగలం' అని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఎడిటోరియల్‌లో బిల్‌గేట్స్ తెలిపారు. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ) కాగా కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తన వంతు సాయం కింద బిల్‌గేట్స్... మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం ప్రకటించారు. కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఒకవైపు చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే, బాధిత దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ న్యూజిలాండ్, లిథువేనియాలకు సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించి వణుకు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 44 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 2,780 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 83 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్ బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. (బిల్‌గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు) -
చికాగొలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
చికాగొ : అమెరికాలోని చికాగొలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్ సుదాకర్ దలేలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తిని పెంపొందించే గీతాలు, డాన్పులతో పలువురు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు యూఎస్ ప్రతినిధులు, నగర అధికారులు , సుమారు 250 మంది భారతీయ పౌరులు, తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో శవమై తేలిన యువతి
వాషింగ్టన్: గతేడాది డిసెంబరు 30న అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని శవమై తేలింది. ఆమె సొంత కారులో బ్లాంకెట్‌లో చుట్టబడిన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివరాలు... గుజరాత్‌కు చెందిన అషరాఫ్ దాబావాలా ఇల్లినాయిస్లోని చౌంబర్గ్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు సురీల్ దాబావాలా(33) చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబరు 30న ఆమె కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అషరాఫ్.. తన కూతురి జాడ చెప్పిన వారికి పది వేల డాలర్లు బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండు వారాల తర్వాత సురీల్ మృతదేహం చికాగోలో అనుమానాస్పద పరిస్థితిలో బయటపడింది. సురీల్ కారు డిక్కీలో దుప్పటిలో చుట్టిన ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ తెలిపింది. సురీల్ కుటుంబం విఙ్ఞప్తి మేరకు ఆమె జాడను కనుగొన్నట్లు వెల్లడించింది. కాగా సురీల్ మరణానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు తెలిపారు. -
అమెరికాలో కాల్పుల కలకలం; 13 మందికి గాయాలు
చికాగో : అమెరికాలోని చికాగోలో ఆదివారం కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక విందు వేడుకలో భాగంగా యువకుల మద్య జరిగిన వివాదం కాల్పులకు దారి తీయడంతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..చికాగోలో కొందరు యువకులు ఒక ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నట్లు ప్యాట్రోల్ చీఫ్ ఫ్రెడ్ వాలర్ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో 13 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 12.30 గంటలకు చోటుచేసుకుందని, బాధితులంతా 16 నుంచి 48 మధ్య వయస్సు వారేనని పేర్కొన్నారు. కాగా, తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఫ్రెడ్ వాలర్ వెల్లడించారు. -
ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ'
చికాగో : ఇల్లినాయిస్ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ' పేరుతో నవంబర్ 3, 2019 న నార్త్ చికాగోలోని ఓ డోనోవన్ రెస్టారెంట్ ఎదురుగా కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. ద్వి పక్షపాత ఏకగ్రీవ సమ్మతి కోసం గౌరవ సెనేటర్ డర్బిన్ బ్లాక్ లీ-హారిస్ S.386 / HR.1044 - 2019 వలసదారుల చట్టాన్ని కొనసాగించాలంటూ నిరసనకారులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వలసదారులు హాజరై తమ నిరసనను తెలిపారు. స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ ఫ్లకార్డులతో నిరసన నిర్వహించారు. యూఎస్‌లో హాఫ్ మిలియన్‌కు పైగా వలసదారులు అధిక నైపుణ్యం కలిగి ఉన్నారు. అయితే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ ఉపాధి ఆధారిత కేటాయింపులలో ప్రభుత్వం ఏకపక్ష రీతిలో వ్యవహరిస్తుంది. జూలై 2019 లో HR.1044 కు సంబందించి ప్రవేశపెట్టిన బిల్లును హౌస్‌లో అధిక మెజారిటీతో ఆమోదించారు. అయితే తాజాగా ఇదే బిల్లును సెనెట్ హౌస్‌లో ప్రవేశపెట్టినప్పుడు బిల్లును ఆమోదించడానికి అడ్డు చెప్పారు. దీంతో సోమవారం వేల మంది నిరసనకారులు ఫ్లకార్డులతో 'స్టాండ్ ఫర్ ఈక్వాలిటీ' నినాదాలు చేస్తూ చికాగో వీధులన్ని కలియతిరిగారు. -
చికాగోలో ఘనంగా ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం
చికాగో : దసరా వెళ్లి, దీపావళి పర్వదినానికి భారతీయులందరూ ఉత్సాహంగా సిద్ధమవుతున్న వేళ చికాగో ఆంధ్ర సంఘం (సిఏఏ) ఆధ్వర్యంలో ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లెమాంట్ హిందూ దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నేతృత్వంలో యువ చిత్రకారిణి అర్చిత దామరాజు, ప్రవేశ ద్వారం వద్ద అలంకరణలను జయశ్రీ సోమిశెట్టి, అఖిల్ దామరాజు అందించి మొత్తం ప్రాంగణానికి నూతన శోభను చేకూర్చి పలు ప్రశంసలను అందుకున్నారు. సంఘ అధ్యక్షులు పద్మారావు అప్పలనేని నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కోశాధికారి అనురాధ గంపాల నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గురు జానకి ఆనందవల్లి (రామాయణ శబ్దం), అపర్ణ ప్రశాంత్ (శ్రీరాజరాజేశ్వరి అష్టకం), జ్యోతి వంగర (మహాలక్ష్మి నమోస్తుతే) తమ తమ విద్యార్ధులతో ప్రదర్శించిన సంప్రదాయ కూచిపూడి నృత్యాలు కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి. అలాగే వాణి దిట్టకవి పర్యవేక్షణలో గురు జ్యోతి వంగర రూపొందించిన సీతారామ కళ్యాణం ప్రేక్షకులను అలరించింది. స్మిత నండూరి, సుష్మిత బట్టర్, హరిణి మేడ, పూజ జోషి, శ్వేత కొత్తపల్లి, జయశ్రీ సోమిశెట్టి, రాణి తంగుడు, కిరణ్మయి రెడ్డివారి, మృదులత మతుకుమల్లి, ప్రశాంతి తాడేపల్లి, పూర్ణిమ వేముల, శైలజ సప్ప, శిల్ప పైడిమర్రి, దివ్య చిత్రరసు, సమత పెద్దమారు, సౌమ్య బొజ్జా, మాలతి దామరాజు, షాలిని దీక్షిత్, యశోద వేదుల సందర్బోచితంగా సినిమా గీతాలు పాడి అలరించారు. అనంతరం లక్ష్మీనాగ్ సూరిభొట్ల దర్శకత్వంలో ప్రదర్శించిన సందేశాత్మక హాస్యనాటిక మహానటి కడుపుబ్బ నవ్విస్తూనే అందరినీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమానికి మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ వాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని హుషారుగా ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, మల్లేశ్వరి పెదమల్లు, రాఘవ జాట్ల, శివబాల జాట్ల, సుందర్ దిట్టకవి, వాణి దిట్టకవి, దినకర్ కరుమూరి, పవిత్ర కరుమూరి, ప్రసాద్ నెట్టం, భార్గవి నెట్టెం, ఉమ కటికి, సంధ్య అప్పలనేని, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, శ్రుతి మోత్కూర్, మురళి రెడ్డివారి, గౌరి అద్దంకి, శ్రీ హరి జాస్తి, విజయ్ కొర్రపాటి, విష్ణువర్ధన్ పెద్దమారు, సురేష్ పోనిపిరెడ్డి, సత్య నెక్కంటి, సాయి రవి సూరిభోట్ల, సురేష్ ఐనపూడి, రమేష్ తాంగుడు, సతీష్ దేవేళ్ళ తదితరులు పాల్గొన్నారు. -
మరో ప్రాణం తీసిన బాక్సింగ్ రింగ్
చికాగో: గత జూలై నెలలో ఇద్దరు బాక్సర్లు రోజుల వ్యవధిలో బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన మరువకముందే మరొక బాక్సర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థి నుంచి వచ్చిన ముష్టిఘాతాలకు తాళలేకపోయిన అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ పాట్రిక్ డే ప్రాణాలు కోల్పోయాడు. బాక్సింగ్ బౌట్లో తలకు తీవ్ర గాయాలు కావడంతో నాలుగు రోజుల పాటు కోమాలోకి వెళ్లిన పోయిన పాట్రిక్.. చివరకు తుది శ్వాస విడిచాడు. శనివారం చికాగలో జూనియర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చార్లస్ కాన్వెల్తో జరిగిన మ్యాచ్‌లో పాట్రిక్ నాకౌట్ అయ్యాడు. చార్లస్ కాన్వెల్ నుంచి వచ్చిన బలమైన పంచ్‌లకు రింగ్‌లో నిలబడలేకపోయిన పాట్రిక్ అక్కడే కులబడిపోయాడు. దాంతో అతన్ని స్ట్రెచర్ సాయంతో ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో పాట్రిక్‌ను బతికించడం కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. నాలుగు రోజు పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్ దాన్ని జయించలేకపోయాడు. బుధవారం ప్రాణం విడిచినట్లు అతని ప్రమోటర్ డిబెల్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్‌షెవ్, అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్లకు ఇదే తరహాలో మృత్యువాత పడ్డారు. -
ఆటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
చికాగొ : అమెరికన్ తెలుగు అసొసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో చికాగొలోని పచావటిలోని బాలాజీ టెంపుల్లో అక్టోబర్ 5న బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 500 మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళలు రంగు రంగుల చీరలు కట్టుకొని రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత గౌరీ పూజను నిర్వహించి బతుకమ్మ ఆడుతూ తమ ఆటపాటలతో అలరించారు. కాగా బతుకమ్మ బాగా ఆడిన మహిళలను ఎంపిక చేసి చీరలను బహుకరించారు. అంతేగాక శ్రీకృష్ణా జువెల్లర్స్ వారి గోల్డ్ కాయిన్స్, జోయాలుక్కాస్ వారి ముత్యాల హారాలను గెలిచిన మహిళలకు బహుమతులుగా అందజేశారు. -
ఎస్.386 బిల్లుకు మద్దతుపై భారతీయ సంఘాల కార్యచరణ
చికాగో : ఎస్.386 బిల్లు(ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ 2019)కు సెనేటర్ డిక్ డర్బిన్ మద్దతు కోరటంపై చికాగోలోని అన్ని భారతీయ సంఘాలు కార్యాచరణ ప్రాణాళిక రూపొందించాయి. ఈ మేరకు గత ఆదివారం నగరంలోని షిర్ధిసాయి మందిరంలో సమావేశమయ్యాయి. దాదాపు మూడు వందల మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెనెట్‌లో బిల్లును ముందుకు నడిపించే విషయానికి సంబంధించి మేథోమధనం జరిగింది. తమ తమ అనుభవాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. నైపుణ్యం కల్గిన వలసదారుల కుటుంబాలకు కలుగుతున్న ఇబ్బందులను వారు చర్చించారు. కార్యనిర్వాహకులు వెంకటరామిరెడ్డి రవి, మనోజ్ కుమార్ సింగమ్శెట్టిలు హెచ్1బి వీసా కల్గిన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. భారతీయ సంఘాలు తానా, ఆటా, గుజరాత్ అసోషియేషన్, బెంగాలీ అసోషియేషన్, నాచా, కేరళ అసోషియేషన్ ఆఫ్, నాస్విల్లే, ఐఏజీసీ,టాటా, టీఏజీసీ, నాట్స్, టీటీఏ, సీఏఏ,వీహెచ్ఐఏ,నాటా, టీడీఎఫ్, ఆటా తెలంగాణ, ఫోమా, చికాగో తమిళ్ సంఘం బిల్లుకు డిక్ మద్దుతు తెలిపేలా చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలిపాయి. జీసీ బాక్లాగ్ సమస్య ఉన్నవారు immi.gcbacklog@gmail.comతో సలహాలు, సూచనలు పొందగలరని తెలిపారు. -
గావస్కర్ నయా రికార్డ్!
చికాగో: లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇప్పటివరకు క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చాంపియన్ ప్లేయర్.. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దీనిలో భాగంగా హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్‌తో చేతులు కలిపాడు. దీనిలో భాగంగా ఇప్పటివరకు 775కు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించాడు. అతిత్వరలోనే హృదయ సంబంధ లోపాలతో జన్మించే వెయ్యి మంది పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ ఉంది. అంతేకాకుండా ఈ ఏడాదిలో 5000, వచ్చే రెండేళ్లలో పదివేల మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న గావస్కర్.. చికాగోలోని మానవ్ సేవ్ మందిర్‌ను దర్శించాడు. ఈ సందర్భంగా భారత్‌లో నిరుపేద చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించాలని సాయి సంజీవని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరాడు. ఇక తన బ్యాటింగ్ మెరుపులతో గావస్కర్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అందులో ముఖ్యంగా వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన గావస్కర్ తన తొలి సిరీస్‌లోనే రెచ్చిపోయాడు. ఏకంగా అరంగేట్రపు టెస్టు సిరీస్‌లో 774 పరుగులు సాధించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అయితే తాజాగా ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్‌లో తన అద్బుత ఫామ్‌తో 774 పరుగులు సాధించి గావస్కర్ సరసన చేరాడు. అయితే స్మిత్ రికార్డు అందుకున్న రోజే హార్ట్ టు హార్ట్ విత్ సునీల్ గావాస్కర్ ఫౌండేషన్ 775 మంది చిన్నారులకు ఆపరేషన్లు పూర్తి చేసింది. దీంతో గావస్కర్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు. (చదవండి: పిల్లల ఆపరేషన్లకు ఎన్ఆర్ఐల భారీ విరాళం) -
చికాగో తెలుగు సంఘాల సమర్పణలో ‘అర్ధనారీశ్వరం’
చికాగో : అమెరికా చికాగోలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా సెప్టెంబర్ 7వ తేదీన నేపర్విల్లోని నార్త్ సెంట్రల్ కాలేజ్ ఫైఫర్ హాలులో సమర్పించిన కూచిపూడి సంగీత నృత్యరూపకం ‘అర్ధనారీశ్వరం’ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పద్మభూషణ్ వెంపటి చినసత్యం కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన 21 మంది కళాకారులు ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అనేక తెలుగు సంఘాలు సమైక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాల్లో అమెరికన్ తెలుగు అసోషియేషన్, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్, చికాగో తెలుగు అసోషియేషన్, చికాగో ఆంధ్ర అసోషియేషన్ ఉన్నాయి. చికాగోలోని 8 డ్యాన్స్ స్కూళ్ల గురువులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు. సహకారం అందించిన వారిలో ఆనంద డ్యాన్స్ థియేటర్ గురువు జానకి ఆనందవల్లి నాయర్, ఆచార్య పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమి గురు ఆశా అడిగ ఆచార్య, ఆనంద డ్యాన్స్ గురువు సంగీత రంగాల, కూచిపూడి నాట్య విహార గురువు శోభ తమ్మన, నృత్య తరంగ డాన్స్ అకాడమి గురువు అపర్ణ ప్రశాంత్, ప్రేరణ అకాడమి ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురువు అరుణ చంద్ర, సంస్కృతీ ఫౌండేషన్ గురువు శోభ నటరాజన్, డా వినీల చక్కులపల్లి కాకర్లలు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభ సమయంలో ‘అర్ధనారీశ్వరం’ ప్రదర్శన దృశ్యాలను నిర్వహకులు ప్రేక్షకులకు వివరించారు. రెండు గంటల పాటు సాగిన ఈ సంగీత నృత్యరూపకంలో ఆరణ్యంలో గంగ కోసమై భగీరథుని తపస్సుతో ప్రారంభమై, బ్రహ్మాదిదేవతల ప్రవేశము, గంగ ప్రవేశము, కైలాసంలో ప్రమధగణాలతో శివుని తాండవం, పరమేశ్వరుడు భగీరథ ప్రార్థనను మన్నించడం, ఉత్తుంగ తరంగ గంగాప్రవాహినియైన గంగావతరణం, గౌరి అసూయ శివుని అనునయం, గౌరి కైలాసం నుంచి నిష్ర్కమించడం, గౌతమమహర్షి ఆదేశంతో గౌరి కేదారేశ్వర పూజ చేయడం, శివుడు ప్రత్యక్షంగా గౌరీశంకరులు ఏకమవ్వడం, అర్ధనారీశ్వరుని లాస్య తాండవ నృత్యం, ప్రమధాది భక్త గణముల నృత్యముతో రసవత్తరంగా కథ ముగుస్తుంది. నృత్య ప్రదర్శనలోని సన్నివేశాలను ప్రతిబింబించేలా స్టేజీ అలంకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది. కూచిపూడి నాట్యకళాకారుల, గాయనీగాయకుల, వాద్యబృందం అద్భుత ప్రదర్శన ప్రేక్షకులను అకట్టుకుంది. 19 ఏళ్ల తర్వాత చికాగో విచ్చేసిన వెంపటి బృందం వారి నృత్య ప్రదర్శనను ఘనంగా ఏర్పాటు చేయడంలో కార్యనిర్వహక ముఖ్య సభ్యులు రామరాజ బి యలవర్తి, జగదీశ్ కానూరి, సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని విశేష కృషి చేశారు. -
చికాగోలో ఘనంగా గణేష్ నిమజ్జనం
చికాగో : అమెరికాలోని చికాగో నగరంలో వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో(ఐఏజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిమజ్జన వేడుకలకు నగరంలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా విజయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గణేష్ విగ్రహంపై పూల జల్లు కురిపించారు. బ్యాండ్ మేళాతో యువత వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. ఈ సంరద్భంగా ఐఏజీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మనోజ్ సింగంసెట్టి మాట్లాడుతూ.. అందరి సహకారంతో వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా ముగించామని తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రతిభింబించేలా ఈవెంట్‌ను తీర్చిదిద్దిన డెకరేషన్ టీం స్టార్‌బీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకు, కమ్యూనిటీ సభ్యులకు, బోర్డ్ డైరెక్టర్లకు, వాలెంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఏజీసీ వైస్ ప్రెసిడెంట్ హీనా త్రివేది మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకి, స్థానిక ప్రజాపతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏజీసీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ హరిందర్‌రెడ్డి పులియాల, రాజేశ్వరి రావత్, తృప్తి పటేల్, రాధికా దేశాయి, విఠల్ దేశాయి, అపర్ణ దేశ్‌ముఖ్, పరూల్ టోపివాలా, విద్యశ్రీ పూజారి, సందీప్ ఎల్లంపల్లి, అంకూర్, పూనమ్, తేజస్ రెడ్డి, మధు, ప్రవీణ్, సత్యనారాయణ, శ్రీనివాస్ కాసల, రాజవర్ధన్‌రెడ్డి, దివ్య, పూనమ్ జైన్, వినోద్ కుమార్, సాక్షి అగర్వాల్, రాజేశ్, మురళి, అనిత మందాడి, మమత ఉప్పల, శిల్ప మచ్చ, భావన పులియాహ, లక్ష్మీ నాగుబండి తదితరులు పాల్గొన్నారు. -
చికాగోలో విజయవంతంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
చికాగో: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే చికాగోలో నాట్స్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది. 15 జట్లు, 22 మ్యాచ్‌లతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నీలో పాల్గొన్న క్రికెటర్లు తమ ప్రతిభను చూపించారు. రేజింగ్ బుల్స్ టీం ఈ చికాగో క్రికెట్ టోర్నమెంట్ కప్ 2019 ను కైవసం చేసుకుంది. చికాగో నాట్స్ సభ్యులు మహేశ్ కాకర్ల, మూర్తి కొప్పాక, శ్రీనివాస పిడికిటి, రాజేశ్ వీదులమూడి, కృష్ణ నిమ్మగడ్డ, శ్రీనివాస బొప్పన, శ్రీథర్ ముమ్మనగండి, కృష్ణ నున్న, ఆర్కే బాలినేని, హారీశ్ జమ్ముల, కార్తీక్ మోదుకూరి, శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించారు. యజ్ఞేష్, అరుల్ బాబు, సందీప్ వెల్లంపల్లి, అరవింద్ కోగంటి, కృష్ణ నిమ్మగడ్డ, సంతోష్ పిండి, వినోద్ బాలగురు చక్కటి ప్రణాళికతో ఈ టోర్నమెంట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రశాంత్ నున్న, వెంకట్ దాములూరి, గోపాల్ శీలం, మురళీ కోగంటి, శ్రీకాంత్ బొజ్జా, వేణు కృష్ణార్ధుల, చెన్నయ్య కంబాల, పాండు చెంగలశెట్టి, మనోహార్ పాములపాటి, నవాజ్ తదితరులు చక్కగా టోర్నమెంట్ నిర్వహణకు కృషి చేశారు. బావర్చి, హైదరాబాద్ హౌస్ భోజన ఏర్పాట్లు చేసింది. శ్రీని అర్షద్, స్మార్ట్ డెక్, రవి శ్రీకాకుళం, విండ్ సిటీ వాసు అడ్డగడ్డ కార్పొరేట్ స్పాన్సర్లుగా వ్యవహారించారు. -
ఘనంగా ‘చిన్మయ మిషన్’ నూతన భవన ప్రారంభోత్సవం
చికాగో : ‘చిన్మయ మిషన్’ ఎన్‌డబ్య్లూఐ చరిత్రలో 2019 జూలై 27 స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రోజు చిన్మయ ఓంకార సొంత నూతన భవన ప్రారంభోత్సవం ఆనందోత్సాహముల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ స్వామి స్వరూపానంద ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారి దివ్య హస్తముల మీదుగా నూతన భవన ఆవిష్కరణ కన్నుల పండగగా జరిగింది. నూతన భవన సంప్రోక్షణ వైదిక శాస్త్రానుసారముగా భారతీయ దేవాలయం పండితులు శ్రీ వాసుదేవజీ ఆధ్వర్యంలో గణపతి హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్మయ బాలవిహార్ పిల్లలు సమర్పించిన ప్రథమ గానం, నృత్యం విశేషంగా నిలిచాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు శ్రీ స్వామి స్వరూపానందవారి ఆశీస్సులు స్వీకరించి, విందు భోజనం చేశారు. చిన్మయ ఓంకార నూతన విద్యా సంవత్సరం సెస్టెంబర్ 8 ఆదివారం నుంచి మొదలవుతుందని తెలిపారు. చిన్మయ మిషన్ ఎన్‌డబ్య్లూఐ కార్యక్రమానికి విచ్చేసిన అతిథితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి చిన్మయ మిషన్ చికాగో నుంచి స్వామి శరణానంద, స్వామి స్వప్రభానంద, ఆచార్యులు జితేంద్ర, పలువురు ప్రముఖులు విచ్చేశారు. -
చికాగోలో 'హెల్త్ ఫెయిర్' విజయవంతం
చికాగొ : గ్రేటర్ చికాగోలోని శ్రీ బాలాజీ టెంపుల్లో ఆగస్టు 3న పబ్లిక్ కమ్యూనిటీ హెల్త్ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ హెల్త్ ఫెయిర్ కార్యక్రమానికి డాక్టర్ వసంతనాయుడు, డాక్టర్ రాధికా పతి అధ్యక్షత వహించారు. హెల్త్ ఫెయిర్‌లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు, చుట్టుపక్కల నివసించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 400 మందికి పైగా హాజరైన ఈ హెల్త్ ఫెయిర్‌లో రక్తపోటు, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించారు.ఈ హెల్త్ ఫెయిర్‌కు చికాగో ఆంధ్ర అసోసియేషన్, చికాగో తమిళ సంఘం, చికాగో తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో, శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమ్ ట్రస్ట్ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. పరీక్షలను నిర్వహించడానికి కావలసిన ల్యాబ్ వసతులను యునిల్యాబ్కి చెందిన శివరాజన్ అందజేశారు. మొత్తం 20మందికి పైగా వైద్య నిపుణులు ఉచిత హెల్త్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు నిర్వహించారు. హెల్త్ ఫెయిర్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు వరుసగా.. శోభ చొక్కలింగం(కార్డియాజిస్ట్), సురేఖ సాకల, శాంతి యెన్న(డెంటల్), మల్లిక రాజేంద్రన్ (గైనకాలజిస్ట్), గిరిజా కుమార్, రామరాజు యేలవర్తి(ఇంటర్నల్ మెడిసిన్), రమేశ్ కోలా (హెమటాలజిస్ట్), వసంతనాయుడు, కాంచన రాజశేఖర్, తనూజ కొత్తింటి, ఉషా అప్పలనేని (పిడియాట్రిషియన్స్), వైదేహి సలాడి (ఫిజియో థెరపిస్ట్), శ్రీ గురుస్వామి (సోషల్ వర్కర్), శ్రీ శక్తి రామనాథన్( డైటిషీయన్), మధ్వాని పట్వర్ధన్ (క్లినికల్ సైకాలజిస్ట్), భార్గవి నెట్టెమ్, కృష్ణ బత్తిన (ఫ్యామిలి నిపుణులు), కృతిబెన్ అగేరా(యోగా), సంజీవని ( మానసిక రుగ్మతల నిపుణురాలు) ఉన్నారు. వీరు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫెయిర్‌లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి సలహాలు ఇచ్చారు. ఇక కార్యక్రమం చివర్లో రాధిక పతి మాట్లాడుతూ.. ఈ హెల్త్ ఫెయిర్‌ను విజయవంతం చేసినందుకు టెంపుల్ నిర్వాహకులను, పరీక్షలు నిర్వహించిన వివిధ వైద్య నిపుణులను, స్పాన్సర్లను, వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణమైన బాలాజీ టెంపుల్‌కు చెందిన మేనేజర్లు రమేశ చిత్తూరి, సత్య కుమారి, నిర్వాహకులు డా. ఎన్ఎస్ రావు, విజయలక్ష్మీరావు, వరదీశ్ చిన్నికృష్ణన్, అను అగ్నిహోత్రి, గణేశ్ సోలయిలకు కృతజ్ఞతలు తెలిపారు. -
చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం
చికాగో: ప్రస్తుత కాలంలో వస్తువులకే ప్రాధాన్యత ఇస్తూ.. మానవ సంబంధాలకు విలువ ఇవ్వకూడదనే విధంగా సమాజం తయారైందని ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్దారెడ్డి వ్యాఖ్యానించారు. చికాగో సబర్బ్ ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో ‘చికాగో సాహితీ మిత్రులు’ పేరుతో శనివారం నిర్వహించిన సాహిత్య సభలో సిద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలకరింపులు తగ్గిపోతూ.. ప్రక్కనున్న వారి గురించి ఆలోచించలేని సమాజాన్ని మనం తయారు చేసుకుంటున్నామని అన్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరమైని సిద్దారెడ్డి అభిప్రాయపడ్డారు. వేమన, గురజాడ, శ్రీశ్రీలు తెలుగులో రాసిన రచనల్లోని సారాన్ని ఒక తత్వంలాగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని ‘చికాగో సాహితీ మిత్రుల సంఘం’ నిర్వాహకులు మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్, ఆపూరి హరినాథ్ బాబులు నిర్వహించారు. అయితే ఈ సభకు డాక్టర్ జంపాల చౌదరి అధ్యక్షత వహించారు. ప్రముఖ రచయిత్రి మల్లేశ్వరి మాట్లాడుతూ.. తన నవల ‘నీల’ రాయడానికి గల నేపథ్యాన్ని, నిజమైన సంఘటనలను ఆ నవలలో కొన్ని చోట్ల ఎలా పొందుపరిచారో ఆ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులు నవీన్ వాసిరెడ్డి ప్రసంగిస్తూ.. తెలుగు సాహిత్యానికి ఉన్న విశాలమైన స్థానాన్ని తాను కేంద్ర సాహిత్య అకాడమీకి సభ్యునిగా ఎంపిక అయ్యాక దగ్గరగా చూశానని తెలిపారు. అదేవిధంగా తెలుగు కథ పరిణామం గురించి మాట్లాడారు. సభా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి తాను చేసిన సేవలను వివరించారు. నవలా సాహిత్యానికి బహుమతులను ఎంపిక చేయడంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సమావేశ నిర్వహణకు వసతులు ఏర్పాటు చేసిన మెట్టుపల్లి శారద, బూచుపల్లి రాము, పాతకోట ప్రభాకర్ తదితరులకు సాహిత్య సంస్థ తరుపున ప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాటా డైరక్టర్ లింగారెడ్డిగారి వెంకటరెడ్డి , నాటా రీజనల్ కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ పాల్గొన్నారు. వీరితోపాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు.. అప్పలనేని పద్మారావు, కటికి ఉమా, కానూరి జగదీష్, నందుల మురళి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’
చికాగో : ‘చికాగో సాహితీ మిత్రులు’ సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలో ‘సాహిత్య సభ’ జరగనుంది. జులై 20, 2019న శనివారం మధ్యాహ్నం 1:00 గంటకు ఓక్ బూక్ర్ పబ్లిక్ లైబ్రరి, 600 బూక్ర్ రోడ్, ఐఎల్-60523 వేదికగా ఈ సభ జరగనుంది. ఈ సభలో ప్రముఖ రచయితలు, కవులు, సంపాదకులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి ‘‘కవిత్వం-మానవ సంబంధాలు’’.. ప్రముఖ రచయిత్రి డా. కేయన్ మల్లీశ్వరి తానా బహుమతి పొందిన నవల ‘‘నీల’’ గురించి.. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ‘‘కథ’’ సంపాదకులు వాసిరెడ్డి నవీన్ గారు తెలుగు సాహిత్య ప్రయాణం గురించి మాట్లాడతారు. తెలుగు భాష, సంస్కృతులను ప్రేమించేవారందరికీ ఇదే మా సాదర ఆహ్వానమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంపై మరిన్ని వివరాల కోసం జయదేవ్(630-667-3612), ప్రకాష్ (630-935-1664)లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు
చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన ఆంధ్ర వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బారింగ్టన్ రోడ్ పాండ్ పిక్నిక్ గ్రోవ్‌లో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యారు. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని ప్రెసిడెంట్ పద్మారావు పేర్కొన్నారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. చికాగోలో తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. సాయిరవి సూరిభోట్ల, విజయ్ కొరపాటి, సురేష్ పొనిపిరెడ్డి, విష్ణువర్ధన్ పద్దమారు, సత్య తోట పర్యవేక్షణలో విష్ణు విలాస్ వారు అందించిన విందుభోజనానికి తోడుగా సుజాత అప్పలనేని, రాజీ మక్కెన, శైలజ కపిల తయారుచేసిన గోంగూర పచ్చడి, నాటుకోడి కూర, ఆవకాయ పచ్చడి, మైసూర్‌పాక్, నెయ్యితో కలిపి కోనసీమ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరటి ఆకులలో వడ్డించారు. సాయంత్రం మల్లేశ్వరి పెదమల్లు ఆధ్వర్యంలో మహిళలు ముంత మసాలా తయారుచేసి వడ్డించారు. ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ భార్గవి నెట్టెం (ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2020) సీఏఏ ఫౌండర్స్ దినకర్ - పవిత్ర కారుమూరి, మల్లేశ్వరి - శ్రీనివాస్ పెదమల్లు, సుందర్- వాణి దిట్టకవి, రాఘవ జాట్ల, ప్రసాద్ - భార్గవి నెట్టెం, సుజాత అప్పలనేని, ఉమా కటికి, సీఏఏ బోర్డ్ డైరెక్టర్లు శ్యామ్ సుందర్ పప్పు, సాయిరవి సూరిభోట్ల, శైలేష్ మద్ధి, శ్రీకృష్ణ మతుకుమల్లి, రాజ్ పోట్లూరి, రామకృష్ణ తాడేపల్లి, గౌరిశంకర్ అద్దంకి, శిరీష కోల, అనురాధ గంపాల, సాహితీ కొత్త, కిరణ్ వంకాయలపాటి, సునిత రాచపల్లి, నీలిమా బొడ్డు, మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి తదితరులు పాల్గొన్నారు. జ్యోతి వంగర సారథ్యంలో సంఘ వ్యవస్థాపకులు, బోర్డ్ డైరెక్టర్లు చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ విశేష ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా పిల్లలకి పెద్దలకి ఆటపాటల పోటీలను నిర్వహించి.. నీలిమ బొడ్డు, జయశ్రీ సోమిశెట్టి, శ్రీచైత్య పొనిపిరెడ్డి, శ్వేతా కొత్తపల్లి, సరిత వీరబ్రహ్మ, నాగేశ్వరి తోట, కిరణ్ మట్టే, స్మిత నండూరి బహుమతులందించారు. ఈ వనభోజనాలు జయప్రదం కావడానికి సహకరించిన దాతలు పటేల్ బ్రదర్స్, అశోక్ లక్ష్మణన్, కృష్ణ రంగరాజు తదితరులకు ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని మరియు సీఏఏ బోర్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశ్ మీడియావారి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సహకారాన్ని పలువురు అభినందించారు. -
బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి
వాషింగ్టన్ : రెండు నెలల క్రితం చికాగోకి చెందిన ఒక మహిళ, ఆమె కూతురు కలిసి 19 సంవత్సరాల గర్భవతిని హత్యచేసి కడుపు కోసి బిడ్డను బయటకు తీసిన దారుణం గురించి తెలిసిందే. బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దాంతో ఆ శిశువును ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ బిడ్డ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. మాల్రేన్ ఒహోవా లోపేజ్(19) అనే గర్భవతికి చికాగోకి చెందిన క్లారిస ఫిగురోవా(46),ఆమె కుమార్తె డేసిరీ(24) ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. పిల్లలకు సంబంధించిన వస్తువులు తమ వద్ద లభిస్తాయని ఒహోవాను ఆకర్షించి తమ ఇంటికి రప్పించారు. వచ్చిన అనంతరం ఒహోవా గొంతు నులిమి చంపి ఆమె కడుపు కోసి బిడ్డను బలవంతంగా బయటకు తీశారు. ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. తల్లి గర్భం నుంచి బయటకు తీసిన ఆ చిన్నారి ఊపిరి తీసుకోలేదు. దాంతో ఫిగురోవా ఆ శిశువును తన బిడ్డ అని ఆసుపత్రిలో చేర్పించింది. నెలల నిండకముందే.. బలవంతంగా శిశువును బయటకు తీయడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నది. చివరకు బ్రైయిన్ డెడ్ అయ్యి ఆ శిశువు మరణించినట్లు శుక్రవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. మరోవైపు ఒహోవా కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒహోవా ఫేస్బుక్ ఖాతాను పరిశీలించిన పోలీసులకు.. ఫిగురోవా మీద అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి సోదా చేయగా అక్కడ ఒహోవా మృత దేహం కనిపించింది. బిడ్డ కోసం తానే తన కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు ఫిగురోవా ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
చికాగోలో సామూహిక వనభోజనాలు
చికాగో : నాపా (నార్త్ అమెరికా పద్మశాలీ అసోసియేషన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక వనభోజనాల కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 250 పద్మశాలీ కుటుంబాలు పాల్గొన్నాయని నాపా తెలిపింది. స్వర్గీయ అజయ్ మెతుకు(నాపా వ్యవస్థాపకులు)కు నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న అందరూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వంటకాలతో అంరదరి నోరూరించారు. చికాగో బృందం పద్మశ్రీ రామారావు (పద్మశాలీ సంఘం మాజీ అధ్యక్షుడు) సత్కరించింది. ఈ ఈవెంట్‌ను నిర్వహించిన చికాగో చాప్టర్ డైరెక్టర్ రాజ్ అడ్డగట్ల, బోర్డ్ సభ్యులు ఈశ్వర్ గుమిడ్యాల, వేణు పిస్కా, ట్రెజరర్ రామ్రాజ్ అవదూత.. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను సత్కరించారు. టీమ్ సభ్యులు రాజ్ గెంట్యాల, శ్రీమాన్ వంగరి, రవి కూరపాటి, శ్రీనివాస్ దామర్ల, విమల్ దాసి, శ్రీనివాస్ కైరంకొండ, సాయిరామ్ పసికంతి, ప్రవీణ్ కటకం, శ్రీనివాస్ వేముల సహాకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని నాపా తెలిపింది. 2019 సెప్టెంబర్ 14న జరిగే వార్షికోత్సవానికి హాజరు కావల్సిందిగా కార్యక్రమానికి పాల్గొన్నవారందరినీ కోరారు. ఈ కార్యక్రమానికి నాపా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సంతోష్ అంకెం, దేవాంగ్ అసోసియేషన్ ఫౌండర్ వెంకటేశ్వర్ రావు బట్చు, రవి బోధులా హాజరయ్యారు. -
చికాగోలో ఘనంగా సీఏఏ తృతీయ వార్షికోత్సవ వేడుకలు
చికాగో : వికారినామ సంవత్సర ఉగాది పండుగ రోజున చికాగో ఆంధ్రా సంఘం(సీఏఏ) తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఆటా, పాటలు, హాస్య, పౌరాణిక నాటికలు, సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు, తెలుగువాడు, ఆంధ్ర ప్రాంతంలో మూలాలున్న శ్రీ రామ్ విల్లివాలం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువతరం డాక్టర్, ఇంజనీర్ వృత్తులనే కాకుండా నచ్చిన ఏ రంగంలోనైనా నిరంతర కృషితో తమ కలలను సాకారం చేసుకోవచ్చని ప్రోత్సహించారు. ఫౌండర్స్ ప్రెసిడెంట్ దినకర్ కారుమూరి మాట్లాడుతూ రామ్ విల్లివాలం కూడా చిన్ననాటి నుంచి మన తెలుగు సంస్థలలో ప్రాతినిధ్యం వహించి, నేటి యువతకి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ రామారావుకి చిత్ర లేఖనం, కవిత్వం, రచనా రంగాలలో వారు చేసిన విశేష కృషిని అభినందిస్తూ జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సమితి సభ్యులే కాకుండా చికాగో ఇండియన్ ఔట్ రీచ్ అసోసియేషన్ చైర్మన్ కృష్ణ బన్సల్ వంటి పలువురు విచ్చేసి చికాగో ఆంధ్రా సమితి సభ్యులకి ప్రోత్సహం అందించారు. చికాగో ఆంధ్ర సంఘం వారి సేవా విభాగం ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలను ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి వివరించారు. చికాగో ఆంధ్రా సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మందిపైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషిచేశారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో జయశ్రీ సోమిశెట్టి, సవిత యాలమూరి-వెర్నేకర్, మల్లేశ్వరి పెదమల్లు, రాజ్ మునగా వేదికను అందంగా అలంకరించగా, ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి అందరి ప్రశంసలనూ పొందేలా చక్కగా కూర్చి ఆద్యంతమూ చురుకుగా నడిపించారు. ఈ కార్యక్రమానికి సుందర్ దిట్టకవి, అన్విత పంచాగ్నుల, సవిత యాలమూరి-వెర్నేకర్, కార్తీక్ దమ్మాలపాటి వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. ఉగాది సందర్భంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు ఆంధ్ర ప్రాంత రుచులతో భోజనం వడ్డించారు. చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ పద్మారావు అప్పాలనేని మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విజయానికి సీఏఏ కార్యవర్గ సభ్యులు, వాలంటీర్ల కృషి మరువలేనిదని అన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్,ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం మాట్లాడుతూ ఫౌండర్స్ కమిటీ చైర్మన్ దినకర్ కారుమూరి, సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల, తన్వి జాట్ల, సంధ్య అప్పలనేని, సెక్రటరి శైలేష్ మద్ది, జాయింట్ సెక్రటరి రాజ్ పొట్లూరి, ట్రెజరర్ అను గంపాల, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, నీలిమ బొడ్డు, సురేష్ శనక్కాయల, సాయి రవి సూరిభొట్ల, సునీత రాచపల్లి, కిరణ్ వంకాయలపాటి, వెబ్ అండ్ డిజిటల్ డైరెక్టర్ శ్రీకృష్ణ మతుకుమల్లి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి, రామకృష్ణ తాడేపల్లి, లాజిస్టిక్స్ డైరెక్టర్ గౌరీశంకర్ అద్దంకి, మురళి రెడ్డివారి, సీనియర్స్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పు రమణమూర్తి ఎడవల్లి, రఘు బడ్డి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, శృతి మోత్కూరు, మైత్రి అద్దంకిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ విజయానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలు విజయ్ కొరపాటి, సురేశ్ పొనిపిరెడ్డి, విష్ణు పెద్దమారు, సత్య తోట, సత్య నెక్కంటి, రమేశ్ నెక్కంటి, సురేశ్ ఐనపూడి, సరిత ఐనపూడి, వెంకట్ మక్కెన, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, హరచంద్ గంపాల, లక్ష్మీనాగ్ సూరిభొట్ల, ప్రోమో వీడియోలలో పాల్గొన్న సభ్యులకు, రామాలయ ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మణ్, వనమూర్తి, సతీశ్ అమృతూర్, అన్నపూర్ణ విశ్వనాధన్, వీడియో అండ్ ఫోటోగ్రఫీ సేవలందించిన యుగంధర్ నాగేశ్లతోపాటూ పలువురు కార్యకర్తలకు, అలాగే ఆర్థిక చేయూతనిస్తున్న స్పాన్సర్లకు అధ్యక్షులు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు. -
చికాగోలో ఘనంగా మహిళా దినోత్సవ సంబరాలు
చికాగో: అమెరికాలోని చికాగో నగరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోవత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులర్ అధికారిణి రాజేశ్వరీ చంద్రశేఖరన్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవెంట్ గణేశ్ స్తోత్రంతో ప్రారంభమైంది. లింగ సమానత్వం, రాజకీయ, వ్యాపార, ఎకనామిక్ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలపై ప్రారంభ ఉపన్యాసం మెహెర్ మేడవరం చేశారు. ఆధునిక సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత, అమెరికాలో భారతీయ మహిళల రాణింపు తదితర అంశాలపై రాజేశ్వరీ చంద్రశేఖరన్ ప్రసంగించారు. శ్రీకృష్ణ జువెల్లర్స్, రాఫెల్ టికెట్ ప్రైజ్ విజేతలకు గోల్డ్ కాయిన్స్ అందజేసింది. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ షో కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భారతీయ సంప్రదాయ చీరలను ధరించి భారతదేశ గొప్పతనాన్ని చాటారు. సింగర్లు మాధురీ, శైలజ, షిర్లీలు బాలీవుడ్, టాలీవుడ్ పాటలు పాడి అక్కడి వారిని అలరించారు. ఈ కార్యక్రమంలో పలు రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమ వ్యవహారాలను అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ట్రస్టీ మెహెర్ మేడావరం, బోయపల్లి సాయినాథ్ రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. అలంకరణ, ఏర్పాట్లను రమణ అబ్బారాజు, అమర్ నెట్టెం, సుచిత్రా రెడ్డి, లక్ష్మి బోయపల్లి, చలమ బండారు, వెంకట్తూడి, మహిపాల్ వంచ, హరి రైని, జగన్ బుక్కరాజు, నర్సింహ చిట్లలూరి, బీమి రెడ్డి, సతీష్ ఎల్లమిల్లి, భాను స్వర్గం చూశారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు హనుమంత రెడ్డి నిర్వాహకులను ప్రశంసించారు. -
చికాగోలో ఘనంగా ప్రపంచ జల దినోత్సవం
చికాగో : భారతి తీర్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వరంలో చికాగోలో ప్రపంచ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాపర్విల్లేలోని ఓక్ బ్రూక్ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఇతర కమ్యూనిటీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతి తీర్థ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాశం మాట్లాడుతూ.. నీరు లేని మనిషి జీవితాన్ని ఊహించలేమన్నారు. నీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ జల దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. నీటీని పొదుపుగా వాడుకోవాలని కోరారు. అలాగే గత 15 ఏళ్లు భారతీ తీర్థ సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను సభికులకు వివరించారు. అనంతరం నీటి నిర్వహణ, పొదుపుపై అవగాహనకు కృషి చేసిన 15 మందికి ‘వాటర్ వారియర్స్’ జ్ఞాపికలను అందించారు. హితేష్ షా, డాక్టర్ అజిత్ పాంట్, డాక్టర్ రాజ్ రాజారాం, ప్యాట్రిసియా మెర్రీ వెదర్ ఆర్గిస్, డాక్టర్ రోజర్ ఐలిఫ్, ఖాజా మొయినుద్దీన్, విజయ్ గుప్తా, లెన్‌బ్లాండ్, డేవిడ్ ముల్లాన్, స్టెఫెన్ మెక్క్రాకెన్, ఉమా వేంపాటి, చేతన్ కాలే, సుందర్ దిట్టకావి, శ్యామా పప్పు, యోగేష్ షా తదితురులకు వాటర్ వారియర్స్ జ్ఞాపికలను అందజేశారు. -
పేద పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
చికాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు మేముసైతం అంటూ ముందుకొచ్చింది. నాట్స్చికాగో మహిళా బృందం 62 వేలమందికి ఆహారాన్ని సిద్ధం చేసి ఉచితంగా అందించింది. చికాగో నాట్స్ మహిళా నాయకులు రామ్ కొప్పాక, శైలజ ముమ్మనగండి, రాధ పిడికిటి, సుమతి నెప్పల్లి, లక్ష్మి కలగర, రోజా శీలంశెట్టి, కల్పన సుంకర, రాజీవ్ మన్నె, కల్యాణి కోగంటి తదితురులు ఆహారాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తమకు తెలిసిన ప్రతి ఒక్కరి సహకారాన్ని కూడా తీసుకుని పేద పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేశారు. ఇలా తయారైన 62 వేల మీల్స్‌ను స్కాంబర్గ్లోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్కు నాట్స్ విరాళంగా అందించింది. -
పాక్, చైనా కాన్సులేట్ల ఎదుట ఎన్ఆర్ఐల నిరసన
చికాగో : చికాగోలోని డౌన్‌టౌన్ స్ట్రీట్ భారత్‌మాతాకీ జై నినాదాలతో మారుమోగిపోయింది. పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు చికాగోలోని ప్రవాసాంధ్రులు నివాళి అర్పించారు. జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘాతుక ఘటనకు కారణమైన పాకిస్తాన్, ఆ దేశానికి సహకారం అందిస్తున్న చైనా దేశాల కాన్సులేట్ల ఎదుట తమ నిరసన తెలిపారు. జవాన్ల మరణం తమను ఎంతో కలచివేసిందని, ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం పాకిస్తాన్ మానుకోవాలని, పాకిస్తాన్‌కు చైనా అందిస్తున్న సహాకారాన్ని తక్షణమే విరమించుకోవాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. -
ఘనంగా సిలికానాంధ్ర మనబడి ‘పిల్లల పండుగ’
బఫెలో గ్రోవ్(చికాగో): సిలికానంధ్ర మనబడి వారు ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదం తో తెలుగు భాషని ఒక ప్రణాళికా బద్ధంగా నేర్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పిల్లలు నేర్చుకున్న తెలుగుని మరియు వారిలో వున్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసి ఉత్సాహ పరిచేందుకు సిలికానంధ్ర మనబడి ‘పిల్లల పండుగను’ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16న బఫెలో గ్రోవ్ కేంద్ర సమన్వయకర్త, ప్రచార అధిపతి డా. వెంకట్ గంగవరపు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక తెలుగువారు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వెంకట్ గంగవరపు మాట్లాడుతూ అమెరికాలో 11,000 మంది పిల్లలు మనబడిలో తెలుగు నేర్చుకుంటున్నారని అందులో 210 మంది పిల్లలు బఫెలో గ్రోవ్ కేంద్రం లో నేర్చుకోవడం చాలా ఆనందం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల పద్యాలు, హాస్యనాటికలు, నీతి కథలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించించాయి. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి అనుభవాలను పంచుకున్నారు. రజినీకాంత్ ఉన్నం, రమణి గోగుల, వెంకట్ పెరుగు, బాలగురువు మహిత చతుర్వేదుల వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక 7స్పైసెస్ అచ్చమైన తెలుగు వంటకాలతో శ్రోతలకు పసందైన విందును వడ్డించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నిర్వాహకులు డా. రమణ మల్లాది, పావని గంగవరపు, నరేంద్ర గుడిపాటి, లోకేష్ కొసరాజు, ప్రతాప్ మేదరమెట్ట, దీప్తి ముసునూరి, మాధవి దొనపాటి, శ్రీనివాస్ ఇవటూరి, ప్రతాప్ మేదరమెట్ట, శ్రీనాథ్ గోగినేని, మురళి శేషం, యోగేష్ తోట, రాజా దండు, అనిల్ పేరిన, కృష్ణ మొవ్వ, సాయి సుందరి, చంద్ర పెండ్యాల, తదితరులకు వెంకట్ గంగవరపు కృతజ్ఞతలు తెలిపారు. -
వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిని పడేశాడు
చికాగో: ఈరోజుల్లో అమ్మాయిలను పడేయాలంటే చాలా కష్టం. అస్సలు వాళ్లను ఎలా పడేయాలో తెలియక కొందరు కుర్రాళ్లు పిచ్చోళ్లవుతున్నారు. ఏళ్ల తరబడి వారి ప్రేమ కోసం నిరీక్షణ చేస్తారు. అందుకే కొందరు యువకులు తమ బుర్రకు తట్టిన కొత్త ఆలోచనలు వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిలను పడేస్తున్నారు. చికాగోకు చెందిన బాబ్ లెంపా వ్యక్తి ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేయడానికి చికాగోలోని మ్యాగీ డాలే పార్క్‌ను ఎంచుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పెగ్గీ బేకర్ డాలే పార్క్‌కు సమీపంలోని అపార్ట్మెంట్లో 37వ ఫ్లోర్లో ఉంటుంది. తనకు 37వ ఫ్లోర్ నుంచి చూసినా తన ప్రపోజల్ మెసేజ్ కనిపించాలని.. 45 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పుతో 'మ్యారీ మీ' అనే మెసేజ్‌ను మంచులో తయారు చేశాడు. దాన్ని గీయడానికి అతనికి 6 గంటల సమయం పట్టింది. చాలామంది దాన్ని గమనించినా అంతగా పట్టించుకోలేదు. తొలుత ఆమె చూసి వామ్మో ఇంత పెద్దగా ఎవరు గీశారని అనుకుది. చివరికి ఆ ప్రపోజల్ తనకోసమే అని తెలిసి భావోద్వేగానికి గురైంది పెగ్గీ. అనంతరం తన బోయ్‌ఫ్రెండ్‌కు ఎస్ చెప్పేసింది. దీంతో వాళ్లిద్దరూ ఒక్కటయిపోయారు. ఇక.. ఈ ప్రపోజల్ మెసేజ్‌ను పార్క్ సిబ్బంది ఫోటో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసి అతడి ప్రపోజల్, దానికి ఆ యువతి ఒప్పుకోవడం.. మీరెప్పుడైనా చికాగో పార్క్‌లో ప్రపోజ్ చేశారా? అంటూ వాళ్లు క్యాప్షన్ పెట్టడంతో.. ఆ ఫోటోతో పాటు... వాళ్ల స్టోరీ కూడా వైరల్‌గా మారింది. -
అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి
షికాగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైన ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెంద గా పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడు. ఇల్లినాయిస్ సమీపంలో ఉన్న అరోరా పారిశ్రామిక సముదాయంలో ఈ ఘటన జరిగింది. హెన్నీ ప్రాట్ అనే పైపుల తయారీ కంపెనీలో గ్యారీ మార్టిన్(45) అనే వ్యక్తి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మార్టిన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తు న్నట్లు ఆ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో తీవ్ర నిస్పృహకు గురైన మార్టిన్ వెంటనే తన వద్ద ఉన్న పిస్టల్‌తో తోటివారిపైకి కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కూడా కాల్పులకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మార్టిన్ చనిపోయాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. -
అమెరికాలో కాల్పుల కలకలం..!
చికాగో : చికాగోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుకాల్పులు జరిపి ఆ ఉన్మాదిని మట్టుబెట్టారు. చికాగోకు కొద్ది మైళ్ల దూరంలో ఉన్న అరోరాలోని ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
నాపా చికాగో చాప్టర్ ఘనంగా ప్రారంభం
చికాగో: నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్(నాపా) ఆధ్వర్యంలో చికాగోలోని బాలాజీ ఆలయంలో మార్కండేయ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలతో పాటు కొత్తగా నాపా చికాగో చాప్టర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చికాగో చాప్టర్ డైరక్టర్‌గా నియమితులైన రాజ్ ఆడ్డగట్ల మాట్లాడుతూ.. మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న నాపా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. చికాగో చాప్టర్ ఆధ్వర్యంలో తొలి సారి జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమం అనంతరం పసందైన వంటకాలతో అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం రామారావును సభ్యులు ఘనంగా సత్కరించారు. నాపా అధ్యక్షుడు అంజన్ క్రాంతి, మాజీ అధ్యక్షులు బాబురావు సామల, వేణు, శ్రీనివాస్ సాయిని, ప్రకాశ్ పెల్, రమేశ్ జి, మధు జింక, శరత్ రాపోలు, భద్రాది, శ్రీనివాస్ తాటిముల, రఘ డిడ్డి, చికాగో చాప్టర్ సభ్యులకు రాజ్ ఆడ్డగట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమారాజ్ అవదూత, ఈశ్వర్ జి, శ్రీనివాస్ వేముల, ప్రవీణ్ కటకం, విమల్, శ్రీనివస్ దామర్ల, శ్రీమాన్ వంగరి, శ్రీనివాస్ కైరంకొండ, రవి కూరపాటి, శ్రీరామ్ పసికంటి, రాజ్‌కుమార్, ఉమ, గీత, శ్రీదేవి, సునీత, విజయ, లక్ష్మి, నీలిమ, ప్రమోద, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు. -
షికాగో థెరిస్సా
గడ్డ కట్టించే చలిలో అందరూ సొంత భద్రత చూసుకుంటారు.కాని ఆమె మాత్రం రోడ్డుపై నివసించే వారి కోసం ఏకంగా హోటల్ రూములే బుక్ చేసింది. చికాగోలో మొన్నటి బుధవారం నుంచి జీవితం తెల్లబోయింది. పనులు గడ్డకట్టాయి. ఉత్తర ధ్రువపు మంచు ఫలకాలపై చోటు చేసుకున్న వాతావరణమార్పు అమెరికాలోని కొన్ని నగరాలను వొణికించడం మొదలెట్టింది. ముఖ్యంగా చికాగోని. వాతావరణ శాఖ వెంటనే హెచ్చరికలు మొదలెట్టింది. బయట పది నిమిషాలు నిలుచున్నా మంచుకాటు తప్పదని భయపెట్టింది. ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 27 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. కొంచెం ధైర్యం ఉన్న జనం బయట ఆటలకు ప్రయత్నించారు. బయట గుడ్డు పగలకొట్టి ఆమ్లెట్ వేయడం అసంభవం అని నిరూపించారు. గుడ్డు పగలగొట్టిన మరుక్షణం అది గడ్డకట్టుకుపోతే ఆమ్లెట్ ఎలా వేయడం? వేడి నీళ్లను తీసుకొచ్చి బయటకు చిమ్మితే ఆ నీళ్లు కిందపడేలోపు ఐసుగడ్డలుగా మారుతున్నాయి. ఎవరో వండిన నూడుల్స్ బయటకు తెచ్చి ఫోర్క్‌తో పైకి ఎత్తితే నూడుల్స్ బిగుసుకుపోయి వాటిని చుట్టుకున్న ఫోర్క్ గాలిలో నిలబడింది. జనం ఇలా ఎవరి గొడవల్లో వారు ఉన్నారు. కాని ఒక్క మహిళ మాత్రం తానొక మనిషినని ఇది సాటి మనుషులకు సాయం చేయాల్సిన సమయం అని గుర్తించింది.ఆమె పేరు కాండిస్ పేనె. వయసు 36. షికాగోలో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో మామూలు ఉద్యోగి. ఆమె రోజూ ఆఫీసుకు వెళ్లే దారిలో రోడ్డు పక్క డెబ్బై ఎనభై మంది పేవ్మెంట్ మీద నివసించే వారిని గమనించేది. వారంతా అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ ఏరియాలో స్థానికులు ‘టెంట్ సిటీ’ అంటారు. ఇప్పుడు మారిన వాతావరణానికి పెద్ద పెద్ద భవంతులలో ఉన్నవారే వొణికే పరిస్థితి ఉంటే మంచు కమ్ముకుంటున్న ఈ రాత్రి వీరికి ఆసరా ఎవరు అనే ఆలోచన కాండిస్ పేనెకు వచ్చింది. బుధవారం రాత్రి వాళ్లు కనుక పేవ్మెంట్ల మీద ఉంటే గడ్డకట్టుకుని చనిపోతారని ఆమెకు అర్థమైంది. వాళ్లను తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టేందుకు హోమ్ లేదు. తన ఇల్లు చాలదు. అందుకని తన దగ్గర ఉన్న డబ్బుతో వారికి హోటల్ రూములు బుక్ చేయాలని అనుకుంది. ఆ ప్రాంతంలో ఎన్ని హోటళ్లకు ఫోన్ చేసినా పేవ్మెంట్ మనుషులను తమ హోటల్లోకి రానివ్వమని చెప్పారు. కాని ఒక్క హోటల్ ‘అంబర్ ఇన్’ అందుకు అంగీకరించింది. వెంటనే ఒక్క రోజుకు 70 డాలర్ల లెక్కన కాండిస్ అందులో 20 గదులు బుక్ చేసింది. అంతే కాదు తన ట్విట్టర్ అకౌంట్లో ‘నేను ఇలా రూములు బుక్ చేశాను. టెంట్ సిటీలో ఉన్న దిక్కులేని వారిని కాస్త హోటల్ వరకూ తెచ్చి వదిలిపెట్టండి’ అని నగర వాసులను అభ్యర్థించింది. అంతే. దానిని చూసిన సహృదయులు వెంటనే స్పందించారు. వెంటనే సాయానికి ముందుకు వచ్చారు. డబ్బులు తమకు తామే అంబర్ ఇన్ హోటల్‌కు పంపడం మొదలెట్టారు. బుధవారం నుంచి ఆదివారం వరకు (మంచు తుఫాను అధికంగా ఉంటుందని తెలిసిన ఐదు రోజులు) యాభై రూములు బుక్ అయ్యాయి. అంతే కాదు టెంట్ సిటీలో ఉన్న 80 మందినే కాక మరో ముప్పై నలభై మంది దిక్కులేనివారిని తీసుకొచ్చి హోటల్లో పెట్టారు.‘మొదట వాళ్లు టెంట్లను వదిలి రావడానికి సిద్ధపడలేదు. మా వస్తువులు పోతాయి అన్నారు. పోయిన వస్తువులకు కూడా డబ్బు ఇస్తాను అని వారిని తీసుకొచ్చాను’ అంది కాండిస్.మంచి మనసుతో ఒకరు ప్రయత్నిస్తే దానికి అందరూ తోడవుతారనేదానికి ఉదాహరణగా చాలామంది ఇప్పుడీ నిరుపేదల ఆహారానికి ఏర్పాట్లు చేశారు. దుస్తులు అందచేశారు. కాండిస్ని ప్రశంసలతో ముంచెత్తారు.‘నేను మామూలు మనిషిని. ఇదంతా నాకు కొత్త. కాని ఈ పని చేశాక ఇలా రోడ్డు మీద నివసించేవారి కోసం శాశ్వతంగా ఒక హోమ్ నిర్మించాలని తలంపు మాత్రం వచ్చింది’ అంది కాండిస్.ప్రభుత్వాలే అన్నీ చేయవు. ప్రభుత్వాలకు అన్నీ తెలిసే వీలు ఉండదు.కాని తెలిసిన మనుషులం వెంటనే సాయానికి దిగాలని కాండిస్ని చూస్తే అనిపిస్తుంది.అన్నార్తుల కోసం దిగి వచ్చిన నల్ల థెరిసా అని కూడా అనిపిస్తుంది. -
డబ్ల్యూఐసీ అధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర్య వేడుకలు
చికాగో: వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ(నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో సంక్రాంతి, రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని ప్రముఖ హిందూ దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400మంది ఔత్సాహికులు పలు పోటీల్లో పాల్గొని సందడి చేశారు. ఐఏఎమ్‌ఏఐఎల్ అధ్యక్షులు జి. శ్రీనివాస రెడ్డి అందించిన సేవలకు గానూ ఆయనను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సభికులను ఉద్ధేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ నాయకులు జి. క్రిష్ణమూర్తి ఈ కార్యక్రమానికి అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికన్ రాజకీయాల్లో భారతీయలు చురుకైన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు శ్రీకాంత్ పల్లబోతు అతిధులను ఆహ్వానించగా లింగారెడ్డిగారి ప్రవల్లిక సభకు అధ్యక్షత వహించారు. ట్రెజరర్ మువ్వా కిరణ్ అతిధులకు, సభికులకు ధన్యవాదాలు తెలిపారు. చికాగోలోని ప్రముఖ హిందూ దేవాలయం మాజీ అధ్యక్షులు భీమారెడ్డి, గోపాల శ్రీనివాసన్, ట్రస్టీలు, చింతమ్ సుబ్బారెడ్డి, మెట్టుపల్లి జయదేవ్, అశోక్ లక్ష్మనలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాధికా తోటకూర, పద్మశ్రీ, రేవతి, అనితా సేనాయ్, ప్రీతి, మోనాలి, శోభ, శ్రీహరి, రవి, దివ్య, నరసింహ, శేషు, శివ దాసు, శశాంక, వెంకట పెరుమాళ్లు, సాయి అభిరామ్, పట్టాభి, లక్ష్మీ నారాయణ, వీర వరియాన్, చెన్నయ్య, శివారెడ్డి, సుగంధి, జయంతి, చరణ్ శ్రీ, సుచిత్ర, నివేదిత, రాణి, వంశీ, శివ, రవి, సెల్వల కృషి అమోఘమని పలువురు కొనియాడారు. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ ఉపాధ్యక్షులు ఆది తన్నీరు, వైస్ బోర్డు సభ్యులు సృజన్ నైనప్పగారి అధ్యతన కార్యక్రమం సాగింది. వెస్ట్‌మౌంట్ ఇండియన్ కమ్యూనిటీ అధ్యక్షులు లింగారెడ్డిగారి వెంకటరెడ్డి వాలంటీర్లందిరికి ధన్యవాదాలు తెలియజేశారు. -
చికాగోలో 'రావాలి జగన్ కావాలి జగన్'
చికాగో : ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం చికాగో ఆధ్వర్యంలో జగన్ అన్నకు తోడుగా.. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ 3648కిలోమీటర్ల దూరం నడిచి ఓ చరిత్రను సృష్టించారని ఎన్ఆర్ఐలు అన్నారు. చికాగో దగ్గర్లోని విస్కిన్సన్, డెట్రాయిట్, ఇండియానా నుంచి ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలనను ఎన్ఆర్ఐలు గుర్తు చేసుకున్నారు. పేదరిక నిర్మూలన కోసం వైఎస్సార్ అనుసరించిన విధానాలు తర్వాతి ప్రభుత్వాలు కూడా అనుసరిస్తూ వస్తున్నాయని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనే మహోన్నత అధ్యాయం ముగిసిందని, పేదలకు తమకంటూ ఓ నాయకుడు ఉన్నాడన్న నమ్మకం కలిగించిందని తెలిపారు. త్వరలోనే కష్టాలన్నీ పరిష్కారమవుతాయనే భరోసా వచ్చిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, బొత్ససత్యనారాయణ, నజీం అహ్మద్, పద్మజా రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడారు. 'ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తాము ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రజలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలను జన్మభూమి కమిటీలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో, ప్రభుత్వ పథకాలు తమకు చేరడం లేదని, ప్రజలు వైస్ జగన్‌కు విన్నవించుకున్నారు. తమ పాలనలో పథకాలు అందరికి చేరుతున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు తమ అనుకూల మీడియాలో ఊదరగొడుతున్నారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు' అని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. మిడ్ వెస్ట్ వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఆర్వీ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. చికాగో ఎన్ఆర్ఐ వైఎస్సార్సీపీ కోర్ ఆర్గనైజర్లు కేకే రెడ్డి, రామ్‌భూపాల్ రెడ్డి కందుల, శరత్ యెట్టపు, పరమేశ్వర్ యెరసాని, రమాకాంత్ జొన్నలలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు సహాయసహకారాలు అందించారు. -
చికాగోలో సీఏఏ పల్లెసంబరాలు
చికాగో : చికాగో ఆంధ్ర సంఘం(సీఏఏ) ఆధ్వర్యంలో ఘనంగా “పల్లె సంబరాలు” కార్యక్రమం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న హిమపాతం, చలిగాలులు, రహదారులపై పేరుకుపోయిన మంచు, నడవటానికి కూడా ఇబ్బందిగా ఉన్నా లెక్కచేయకుండా చికాగో పరిసర పట్టణాలన్నిటి నుంచీ 1000 మందికిపైగా తెలుగువారు తరలివచ్చి, కార్యక్రమానికి శోభతెచ్చారు. తెలుగువారందరిని ఒక్క చోటికి తెచ్చి తెలుగు పల్లెల జీవనవిధానాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలన్న చికాగో తెలుగు ఆడుపడుచుల సంకల్పానికి ఇవేవీ అడ్డుకాలేకపోయాయి. ఈ కార్యక్రమం దీప ప్రజ్వలన, ప్రార్ధనా గీతం, చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయటం, వినాయక స్థుతితో ప్రారంభమైంది. జానకి ఆనందవల్లి నాయర్ విద్యార్ధులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం “దేవీస్థుతి రాగమాలిక”,, అపర్ణ ప్రశాంత్ విద్యార్ధుల బృందం ప్రదర్శించిన “జతిస్వరం” లను ప్రేక్షకులు కరతాళధ్వనులతో ప్రశంసించారు. చిన్నారులు నర్తించిన అనేక సినీ గీత నృత్యాలు అందరినీ అలరించాయి. శిల్ప పైడిమర్రి సమన్వయించిన మహానటి పాటల నృత్యాలు అందరినీ మెప్పించాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రదర్శించిన అనేక నృత్యగీతాలు ప్రేక్షకులను కూడా తమతోపాటు నర్తించేలా చేశాయి. జ్యోతి వంగర నృత్యదర్శకత్వంలో మూడు రోజుల సంక్రాంతి వేడుకలను ప్రతిబింబిస్తూ 60మందికి పైగా పాల్గొన్న సంక్రాంతి రూపకం 20 నిమిషాలపాటు ప్రేక్షకులను సమ్మోహనపరచి మెప్పించింది. సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి సాంస్కృతిక కార్యక్రమాలను, వేదిక నిర్వహణను చాలా చక్కగా సమర్ధవంతంగా చేసి అందరి మన్ననలూ పొందారు. మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, సుజాత అప్పలనేని, వాణి దిట్టకవి వారికి సలహాలు, సూచనలు అందిస్తూ అన్నిటా తోడుగా నిలిచారు. శ్రీనివాసమూర్తి పద్యాల రూపొందించిన ఎడ్లబండి, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా చేసిన అలంకరణలు, ద్వారం, ముగ్గులు, గాలిపటాలు, అందరికీ ఒక చక్కని అనుభూతినిచ్చాయి, ఫోటోలు వీడియోల రూపంలో గుర్తుంచుకొనేలా మిగిలాయి. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో దాదాపు 20మంది ఆడపడుచులు ఉత్సాహంగా వేదికపై చేసిన అలంకరణలు, జయశ్రీ సోమిశెట్టి, భార్గవి నెట్టెం చిత్రించిన వేదిక నేపధ్య చిత్రాలు, శ్వేత కొత్తపల్లి, శైలజ సప్ప కూర్చిన సంక్రాంతి బొమ్మలకొలువు ప్రత్యేక ఆకర్షణలుగా అందరి మెప్పును పొందాయి. సమత పెద్దమారు చేసిన దీపవనితల అలంకరణ మరో ప్రత్యేక ఆకర్షణై విశిష్టంగా నిలిచింది. శ్రీశైలేశ్ మద్ది, శ్రీనివాసమూర్తి పద్యాల రూపొందించిన లోగోలు, బ్యానర్లు, ప్రచార కరపత్రాలు, కార్యక్రమ వివరాల కరపత్రం కనులవిందుగా ఉండి అందరి ప్రశంసలనూ పొందాయి. వారే రూపొందించి ముద్రించిన 2019 తెలుగు క్యాలెండర్ అత్యంత ఆకర్షణీయంగా ఏడాది పొడవునా ఉపయోగించుకునేవిధంగా నిలిచింది. కార్యక్రమ నిర్వహణను కిరణ్మయి మట్టే, శైలజ చెరువు, సుందర్ దిట్టకవి సమయపాలన తప్పకుండా నిర్వహించారు. చైర్మన్ దినకర్ కారుమూరి చికాగో ఆంధ్ర సంఘపు పూర్వ నాయకత్వాన్ని సత్కరించారు. సంఘ అధ్యక్షులు అప్పలనేని పద్మారావు మాట్లాడుతూ ఈ ఏడాదంతా నిర్వహించనున్న కార్యక్రమాలను వివరించి, సంఘ సభ్యులకు, స్పాన్సర్లకు, విచ్చేసిన గౌరవ అతిధులకు, పెద్దలకు, అన్ని బాధ్యతలను స్వఛ్ఛందంగా తీసుకుని చక్కగా నిర్వహించిన కార్యకర్తలకు తమ కృతజ్ఞతలను తెలియజేశారు. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం అన్నిచోట్లా తామేవుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, సీనియర్ డైరెక్టర్ శ్యామ పప్పు అతిథి స్వాగత సత్కారాలను నిర్వహించారు. సంఘ యువ డైరెక్టర్లు మైత్రి అద్దంకి, శృతి మోత్కూర్, నిఖిల్ దిట్టకవి యవత కోసం తమ ప్రణాళికలు వివరించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక సంపత్తిని, సహకారాన్ని మణి తెల్లాప్రగడ, పద్మాకర్ దామరాజు, కిరణ్ ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ శైలేశ్ మద్ది, సంధ్య అప్పలనేని సమకూర్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సురేశ్ శనక్కాయల, అనురాధ గంపల, కిరణ్మయి వంకాయలపాటి, శ్రీకృష్ణ మతుకుమల్లి, నీలిమ బొడ్డు, శ్రీనివాస్ ధూళిపాళ్ళ, రమేశ్ నెక్కంటి సమర్ధవంతంగా నిర్వహించారు. -
మరింత ఫ్రెష్‌గా..
ప్రతి దానికీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.. మందులకు, కూల్ డ్రింక్‌లకు, పాలప్యాకెట్లకు.. ఇలా అన్నిటికీ.. మరి కూరగాయలకు? పళ్లకు?? మనం వండిన ఆహారానికి??? వీటి ఎక్స్పైరీ డేట్ తెలిసేదెలా? నేడే కొనండి.. ఆలసించిన ఆశాభంగం.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రెండు కొంటే ఐదు ఫ్రీ సూపర్ మార్కెట్లో బోలెడన్ని ఆఫర్లు.. తక్కువకు వస్తున్నాయని కొనేశాం.. ఫ్రిజ్‌లో తోసేశాం.. కళ్లకు కనిపించినవి వాడుతున్నాం.. కానీ కనిపించకుండా కొన్ని లోలోపలే పాడైపోతున్నాయి.. ఆహారం వృథా.. చివర్లో చూసుకుని.. చేసేది లేక చెత్తకుప్పలో పడేయాల్సిన దుస్థితి ఇంతకీ పరిస్థితి మారేదెలా? ఇంట్లో జరిగే ఆహార వృథా.. చూడ్డానికి చిన్నదే కానీ ఓ పెద్ద సమస్య. దానికి పరిష్కారం ఈ స్మార్ట్ కంటెయినర్లని అంటోంది షికాగోకు చెందిన ఒవీ స్మార్టర్ వేర్. ఎందుకంటే వీటికి తగిలించి ఉండే ఎలక్ట్రానిక్ డిస్క్‌లు ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల తాజాదనంపై మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటాయట. ఇవి ఇంటర్నెట్తో ఆనుసంధానమై ఉంటాయి. ఆన్లైన్ డాటాబేస్ ఆధారంగా పదార్థాలు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయన్న వివరాలను అంచనా వేస్తాయి. రంగుల ఆధారంగా వినియోగదారులను అప్రమత్తం చేస్తాయి. డిస్క్ పచ్చ రంగులో ఉంటే తాజాగా ఉందని అర్థం. అదే పసుపు రంగులోకి మారితే.. ఫ్రిజ్‌లో ముందు వాడాల్సిన లేదా తినాల్సిన వస్తువు అదే అని సూచిస్తున్నట్లు లెక్క.. ఎరుపు రంగులోకి మారితే.. పాడైనట్లు అన్నమాట. ఇవి మన ఫోన్లోని ప్రత్యేకమైన యాప్‌తో లింక్ చేసి ఉంటాయి. డిస్క్ పసుపు రంగులోకి మారగానే.. ఫోన్‌కు మెసేజ్ రూపంలో సమాచారం వస్తుంది. అంతేకాదు.. స్మార్ట్ కంటెయినర్లో ఉన్న ఆహార పదార్థాలతో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు. మీ ఏరియాలోని ఇతరులతో పోలిస్తే.. మీరు చేస్తున్న ఆహార వృథాను కూడా తెలియజేస్తుంది. ఒవీ స్మార్ట్‌వేర్ మీ సాధారణ ఫ్రిజ్‌ను స్మార్ట్ ఫ్రిజ్‌గా మారుస్తుందని ఆ కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు థాంపన్స్ అన్నారు. ‘చాలా మందికి ఆహారాన్ని వృథా చేయడం ఇష్టం ఉండదు. కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతుంటారు.. ఒక్కోసారి ప్యాకెట్లకు ప్యాకెట్లు పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రతి ఇల్లు లెక్కేస్తే.. ఈ వృథా చాలా భారీగా ఉంటుంది. ఈ కంటెయినర్లు ఆహార వృథాను తగ్గించేందుకు తోడ్పడుతాయి’ అని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుంటున్నారు. మార్చి నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర రూ. 9,100. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వెస్టియన్‌కు పీఈఆర్‌పీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: చికాగో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నివాస, వాణిజ్య, రిటైల్ రంగాల్లో వర్క్‌ప్లేస్ సొల్యూషన్ కంపెనీ వెస్టియన్‌కు కస్టమర్ వాల్యూ లీడర్షిప్ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన 5వ ఫ్రోస్ట్ అండ్ సులివన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రాం (పీఈఆర్‌పీ) అవార్డు–2018 కార్యక్రమంలో వెస్టియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్‌కిరణ్ నాయక్ ఈ అవార్డును అందుకున్నారు. వెస్టియన్‌కు ఈ అవార్డు రావటం వరుసగా నాల్గోసారి. -
చికాగో సీజీఐలో ప్రారంభమైన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమం
చికాగో: భారత ప్రభుత్వం చికాగోలోని భారత కాన్సులేట్ కార్యాలయం(సీజీఐ)లో ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులను మరింత సరళతరం చేసేందుకు భారత విదేశాంగ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాన్సులేట్ అధికారులతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా గడిచిన నాలుగున్నరేళ్లలో భారత్ పాస్‌పోర్ట్ జారీలో పెను మార్పులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. పాస్‌పోర్ట్ సర్వీస్‌లలో 2017 సంవత్సరంలో 19 శాతం వృద్ధి సాధించామని తెలిపింది. కేవలం ఒక నెలలోనే పది లక్షల అప్లికేషన్లు వచ్చాయని.. పాస్‌పోర్ట్ సేవా ద్వారా ఆరు కోట్ల మందికి పాస్‌పోర్ట్‌లు జారీ చేసినట్టు వెల్లడించింది. పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. పాస్‌పోర్ట్ విధానాలను సరళతరం చేయడమే కాకుండా పాస్‌పోర్ట్ సేవలను ప్రజల చెంతకే తీసుకువచ్చినట్టు స్పష్టం చేసింది. భారత్‌లోని అన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటివరకు 236 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని.. మరికొన్ని సేవా కేంద్రాలు కూడా త్వరలో వినియోగంలోకి రానున్నాయని తెలిపింది. దేశంలో ఉన్న పాస్‌పోర్ట్ ఆఫీసులు, గతంలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను కలుపుకుంటే.. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నపాస్‌పోర్ట్ కార్యాలయాల సంఖ్య 365కు చేరిందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్లలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపింది. అందులో భాగంగా తొలుత లండన్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి.. ఆ తర్వాత బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో దీనిని విజయవంతంగా చేపట్టినట్టు పేర్కొంది. యూఎస్ విషయానికి వస్తే.. వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో, న్యూయార్క్, శాన్‌ఫ్రానిస్కో, అట్లాంటా, హోస్టన్‌లలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలలో ఈ పోగ్రామ్‌ను చేపట్టినట్టు ప్రకటించింది. చికాగోలో ప్రారంభించిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అక్కడి ఎన్ఆర్ఐలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపింది. ఈ నూతన పద్దతిలో ప్రజలు సులువుగా దరఖాస్తులు సమర్పించడమే కాకుండా, డిజిటల్ పరిశీలన, భద్రతోపాటు అప్లికేషన్ ట్రాకింగ్ కూడా అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో అన్ని భారత రాయబార కార్యాలయాల్లో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపింది. -
జగన్‌పై దాడిని ఖండించిన చికాగో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్
చికాగో : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని చికాగో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు ఖండించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు జరిగిన సంఘటనని ఖండించక పోగా తక్కువ చేసి చూపుతున్నారని వెకిలి చేష్టలతో కామెడీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమని నమ్మించడానికి ఈ హత్యాప్రయత్నం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరిగిందని ఎన్ఆర్ఐలు ధ్వజమెత్తారు. ఆపరేషన్ గరుడలో భాగమని శివాజీ ముందే చెబితే, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శివాజీ ని అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అంతమొందించాలనే పథక రచన ప్రభుత్వం చేసిందన్నారు. దాడి చేసిన వ్యక్తి దగ్గర దొరికిన 10 పేజీలు అతను రాసింది కాదని, ప్రభుత్వమే పోలీసుల చేత రాయించారని విమర్శించారు. ఆ పేజీలను జేబులో ఉంచుకుంటే కనీసం నలిగిపోయినట్టుగా కనిపించాలని, కానీ అవి నలిగిపోయినట్టుగా కనిపించడం లేదు కాబట్టి దానిని ఎవరో రాసినట్టుగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలోకి దుండగుడు కత్తితో ఎలా ప్రవేశించాడని, తీవ్రవాదులు బాంబులతో ప్రవేశిస్తే రాష్ట్ర ప్రభుత్వంగాని కేంద్ర ప్రభుత్వంగానీ ఇక ఏం చేయగలరని ఎన్ఆర్ఐలు ప్రభుత్వాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించడం వల్లనే తనను చంపేయాలని అనుకున్నారని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడు రకాలుగా కుట్ర పన్ని వైఎస్ జగన్‌ని అంతమొందించాలనుకున్నారని కానీ వారి పథకాలు పారలేదని విమర్శించారు. హత్య చేసి అల్లర్లు సృష్టించాలని లేదా స్లో పాయిసన్ ఇచ్చి నిర్మూలించి అభిమాని చేతిలో చనిపోయాడని చిత్రీకరించాలనుకున్నారని ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు, మంత్రులు వాడిన భాష నాగరికంగా లేదని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకే చెందుతుందని చికాగో ఎన్ఆర్ఐలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, పోలీసు అధికారులు తెలుగుదేశం కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా పనిచేయడం మానుకుని ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాప్రయత్నం కేసుని నీరు గార్చకుండా నిజాయితీగా విచారణ జరిపి, బాధ్యుని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. ఈ నిరసనలో చికాగో వైఎస్సార్సీపీ రీజనల్ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, రాంభూపాల్ కందుల, శ్రీనాధ రెడ్డి అంకిరెడ్డి పల్లె, శరత్ యట్టెపు, పరమేశ్వర్ యర్రసాని, రవి కిషోర్ ఆళ్ళ, రామిరెడ్డి పెద్దిరెడ్డి, ప్రమోద్ ముత్యాల, మనోజ్ సింగం శెట్టి, హారీందర్ పుల్వాయి, సంజీవ్ కాప, జానకీ రాం, రమాకాంత్ జొన్నల, వెంకట్, మోహన్ గారి కృష్ణా రెడ్డి, వెంకట్ తూడి, మహిపాల్ వంచా, సుమన్ శనివారపు, గోపి పిట్టల, శ్రీనివాస్ సరికొండ, లింగారెడ్డి, సందీప్, రవి కిషోర్, భీమా రెడ్డి, శ్రీధర్, రమణారెడ్డి, మోహన్ పిట్టల, రామలింగం కొండూరు, మల్లారెడ్డి, తేజేశ్వర్, సుధాకర్, రమణ అబ్బరాజు, నరసింహా రెడ్ది, శివ, మనోహర్, రామ్ దొనపాటి, సురేన్ మొరుకువాటి, వెంకట సుబ్బారెడ్డి, ధీరజ్, సురేందర్ రెడ్డి, వెంకట్ కొండూరు, బక్త ప్రియా, వెంకట్ యర్రా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
చికాగోలో ఘనంగా సాయి మహా సమాధి వందేళ్ల వేడుకలు
చికాగో: సాయి మహా సమాధి అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది మొత్తం ‘శతాబ్ధి సోహాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని యూఎస్ సాయి సంస్థాన్ నిర్ణయించింది. ఈ సందర్బంగా చికాగోలోని సాయిబాబా మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతోపాటు, రథయాత్ర, వంద నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో బాబాకు అభిషేకం నిర్వహించారు. అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా చెప్పిన సూక్తులను, సాయి మహాత్యం గురించి నిర్వహకులు భక్తులకు వివరించారు. శతాబ్ది సోహాలలో భాగంగా ఆధ్యాత్మికత, అన్నదానం, పిల్లలకు ప్రేమ, సంస్కృతికై ఆరాధన, అవసరమున్న వారికి సహాయపడటం వంటి ఐదు నినాదాలతో ముందుకు సాగనున్నారు. సాయి మందిరంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు ఆరాధన కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలు ఆలయంలో వంద పుష్పపు మొక్కలు నాటారు. అభిషేకం ఆత్మశుద్ధి, పుష్పాభిషేకం, ముక్తాభిషేకం, బిక్షా జోలితో పాటు దసరా వేడుకలు కూడా జరిపారు. శ్రీ సాయిసచ్ఛరితం విశిష్టతను తెలిపేలా భక్తులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. -
చికాగోలో అంబురాన్ని అంటిన సాంస్కృతిక సంబురాలు
సాక్షి, చికాగో : చికాగో ఆంధ్ర సమితి వారి 3వ సాంస్కృతిక దినోత్సవం ప్లెయిన్‌ఫీల్డ్ నార్త్ హైస్కూల్లో అక్టోబర్ 13న ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో చిన్నారుల నాట్యాలు, పెద్దవారి ఆటలు, పాటలు, ఆడవారి చీరలు, ఆత్మీయ పలకరింపులు, విందు వినోదాలు.. మొత్తానికి దసరా జాతర- సాంస్కృతిక శోభ మేళవించిన సంబరాన్ని తలపించింది. సీఏఏ అధ్యక్షులు డా. ఉమ కటికి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 600 పైగా అతిథులు పాల్గొన్నారు. విశేష అతిథులుగా బిల్ ఫాస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవెలిన్ సంగునీటి విచ్చేసి భారత దేశ సంస్కృతిని, ఆంధ్ర ప్రదేశ్ కళలని, సీఏఏ చేస్తున్న కృషిని కొనియాడారు. కల్చరల్ టీం సభ్యులు శిరీష కోలా, రమేష్ కోలా, సురేష్ శనక్కాయల, నీలిమ బొడ్డు, సాహితి కొత్త, శ్రీ కృష్ణ మటుకుమల్లి గారి ఆధ్వర్యంలో నృత్య గురువులు శోభ తమన్న, దివ్య రాజశేఖరన్, జ్యోతి వంగర, రమ్య కౌముది, శోభ నటరాజన్, దేవకి జానకిరామన్, జానకి ఆనందవల్లి గార్ల శిష్యులు చేసిన నృత్యాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. తమ శిష్యులతో శోభ నటరాజన్ చేయించిన మల్హరి నృత్యం, జ్యోతి వంగర చేయించిన ఆంధ్ర ప్రదేశ్ నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ నృత్య కళలని చూసిన సీఏఏ ఫౌండర్స్ కమిటీ సభ్యులు దినకర్ కారుమూరి మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా, ప్రజలు వారి మనస్సులు కలిసి ఉన్నాయి అని ఈ రోజు నిరూపించింది అన్నారు. ధనాధికారి సునీత రాచపల్లి, కిరణ్మయి వంకాయలపాటి, అను గంపల, రమణ మూర్తి ఏడవల్లి ఆత్మీయంగా అతిథుల్ని ఆహ్వానిస్తే, సాయి రవి సూరిబోట్ల ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ సభ్యుల ఆతిధ్యం ఆంధ్ర రుచులని మురిపించింది. ఏపీడీఫ్ఎన్ఏ టీం రాజ్ పొట్లూరి, శైలేష్ మద్ది ఆంధ్రాలో చికాగో ఆంధ్ర సమితి వారు చేసిన సేవలని వివరించారు. మెంబర్షిప్ ద్వారా వచ్చిన ఆదాయంలో 25% అణుగారిన వర్గాల అభ్యున్నతికి, అనాథ, దివ్యంగుల సేవకి వేచిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల టిట్లీ ప్రభావానికి గురైన ఉత్తరాంధ్రని ఆదుకోవడానికి చేసిన విజ్ఞప్తికి స్పందించి పలువురు ప్రవాసాంధ్రులు స్పందించి విరాళాలు అందించారు. దానికి సీఏఏ తమ వంతు విరాళం జత చేసి ఆంధ్ర ప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేస్తామని ఏపీడీఫ్ఎన్ఏ ప్రతినిధులు తెలిపారు. సంస్థ ఫౌండర్స్ శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల గార్లు అతిథుల్ని పలకరిస్తూ చికాగో నగరంలోని ఇతర సంస్థల ప్రతినిధులని ఆహ్వానించారు. సంస్థలు భిన్నమైన, వారి ఏకత్వం ఒక్కటే అని ఈ కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. డా. ఉమ కటికి 2019 సంవత్సరానికి బోర్డుని ప్రకటిస్తూ పద్మారావు అప్పలనేని ప్రెసిడెంట్ గాను, డా. భార్గవి నెట్టంని ఉపాధ్యక్షులుగా (2020 ప్రెసిడెంట్-ఎలెక్ట్) గా ఎన్నుకునట్టు తెలిపారు. 2019 సంవత్సర అధ్యక్షులు పద్మారావు గారు ఇప్పుడున్న కార్యవర్గంలోకి నూతనంగా వస్తున్న గౌరి శంకర్ అద్దంకి, రామకృష్ణ తాడేపల్లి, శ్రీ హరి జాస్తి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, మైత్రి అద్దంకి, శ్రుతి మోత్కుర్, సీనియర్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పుని పరిచయం చేసారు. 2019లో సంస్థ బలోపేతానికి తన వంతు కృషికి మద్దతు తెలపాలని అభ్యర్దించారు. చివర్లో 'సంసారంలో సరిగమలు' అంటూ లక్ష్మీ దామరాజు గారి ఆధ్వర్యంలో సీనియర్స్ వేసిన పాటల పూదోట, లక్ష్మీ నాగ్ సూరిబోట్ల గారి గారి దర్శకత్వంలో స.ప.స నాటకం ప్రేక్షకులని అలరించాయి. బోర్డు సభ్యులే కాక వలంటీర్ మెంబర్లు విజయ్ కొరపాటి, సత్య తోట, సురేష్ ఐనపూడి, సురేష్ పోనిపిరెడ్డి, శ్రీచైతన్య పోనిపిరెడ్డి, రమేష్ నెక్కంటి, సత్య నెక్కంటి, సుధీర్ పోతినేని, రామ్ ఇనుకుర్తి, శ్రీనివాస్ దూళిపాల్ల, ప్రశాంతి తాడేపల్లి, మల్లేశ్వరి పెదమల్లు, ప్రసాద్ నెట్టెం, క్రిష్ణకాంత్ పరుచూరి, శ్రీని రాచపల్లి, పద్మాకర్ దామరాజు, మాలతి దామరాజు, భాను స్వర్గంలు కూడా అందర్నీ ఆహ్వానించి కార్యక్రమంలో వివిధ అంశాలలో సహాయ సహకరాలని అందించారు. సంస్థ సెక్రెటరీ డా. భార్గవి నెట్టం వందన సమర్పణలో 2018 సంవత్సర కార్యవర్గానికి, స్పాన్సర్స్, ఫౌండర్స్, నృత్య గురువులు మరియు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమెరికా, భారత దేశాల జాతీయ గీతలాపనతో కార్యక్రమం పూర్తి అయింది. -
సీఏఏ ఆధ్యర్యంలో ఘనంగా 'వుమెన్స్ గాలా'
చికాగో : నాపర్విల్లేలోని రాయల్ ప్యాలెస్ హాలులో చికాగో ఆంధ్ర అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా 'విమెన్స్ గాలా' నిర్వహించారు. సీఏఏ అధ్యక్షురాలు డా.ఉమ కటికి, బోర్డు సభ్యులు దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయని దీపనాగ్ ఆలపించిన వినాయక ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 300మందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ జాతీయ సమైక్యతా సూచిగా 10మంది సీనియర్ మహిళలు వివిధ రాష్ట్రాల సాంప్రదాయక వస్త్రధారణతో ప్రదర్శించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపనాగ్ తన గాత్రంతో కార్యక్రమాన్ని ఉరకలెత్తించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన డా. విజ్జీ, శ్రీశక్తి, డార్లెన్ సెంగెర్, సంతోష్ కుమార్, రీస్ యవర్, గౌరీ శ్రీ, వాసవిలు తమ ప్రసంగాలతో మంచి సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆటాపాటలతోపాటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సీఏఏవారు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. -
అమెరికా వ్యాప్తంగా ప్రారంభమైన మనబడి తరగతులు
ప్రపంచంలోని 12 దేశాల్లో ముఖ్యంగా అమెరికాలోని 35 రాష్ట్రాల్లోని 260కి పైగా కేంద్రాలలో తెలుగు భాషను ప్రవాసాంధ్రుల పిల్లలకు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరానికి గాను తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10,000 మందికి పైగా విద్యార్ధులు నమోదు చేసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో మనబడి నూతన విద్యా సంవత్సరం చికాగోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సిలికానాంధ్ర మనబడి, మన గుడి అన్నారు. మనబడి ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడం గొప్ప కార్యక్రమమని, అందులోనూ ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక వాస్క్ ఎక్రిడిటేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపులాంటి అనేక విజయాలు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు విద్యావిధానం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ (అధ్యక్షులు) రాజు చమర్తి అన్నారు. ఇక్కడ తెలుగు నేర్చుకున్న పిల్లలు వారి వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, 11 సంవత్సరాలుగా మనబడి ద్వారా 45000 మందికి పైగా పిల్లలకు తెలుగు నేర్పించామని తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు మాట్లాట, బాలానందం, తెలుగుకుపరుగు, పద్యనాటకం, తెలుగు పద్యం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో కార్యక్రమాలతో విద్యార్ధులకు తెలుగు భాషతో పాటు మన కళలు సంప్రదాయాలు కూడా తెలియజేస్తున్నామని శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు వెంటనే manabadi.siliconandhra.org ద్వారా ఈ నెల 21 వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని లేదా 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్ధులు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీ లో శరత్ వేట, డల్లాస్‌లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, స్నేహ వేదుల, రత్నమాల వంక, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని, శ్రీరాం కోట్ని , చికాగోలో సుజాత అప్పలనేని, వెంకట్ గంగవరపు, వర్జీనియా నుండి శ్రీనివాస్ చివలూరి, మాధురి దాసరి, గౌడ్ రామాపురం, నార్త్ కెరొలిన అమర్ సొలస, అట్లాంటా విజయ్ రావిళ్ళ తదితరుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో మనబడి నూతన విద్యా సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. -
చికాగోలో తెలుగు విద్యార్థి మృతి.. ‘ఆట’ సహాయం
చికాగో : నగరంలో నాగరాజు అనే తెలుగు విద్యార్థి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నేపర్‌విల్లే వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణవార్తతో అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి కుటుంబానికి సహాయం చేయటానికి ‘‘అమెరికా తెలుగు అసోషియేషన్ (ఆట)సేవ బృందం’’ ముందుకొచ్చింది. ఆట తరుపున మహిపాల్ రెడ్డి గురువారం ఉదయం మృతుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆట సేవ బృందం తరుపున వారికి సహాయం చేయనున్నారు. ఆట సేవ బృందం ప్రతినిధి మాట్లాడుతూ.. తాను ఈ ఉదయమే మృతుడి కుటుంబాన్ని కలిశానన్నారు. అతడి కుటుంబం షాక్ గురై ఉందని వారికి సహాయం అవసరమని తెలిపారు. తాను నాగరాజు తమ్ముడితో మాట్లాడానన్నారు. అతని కుటుంబసభ్యులు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులు గురువారం ఉదయం భారతదేశం నుంచి చికాగోకు రాబోతున్నట్లు వెల్లడించారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియల విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పరిస్థితుల్లో ‘ఆట’ వారికి అండగా ఉంటుందని తెలిపారు. వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని తమ చికాగో టీమ్ అందిస్తుందని పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
చికాగో: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని చికాగో తెలుగు కమ్యూనిటీ ఘనంగా నిర్వహించింది. స్థానిక థుమ్కా బాంకెట్ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకకు భారీ ఎత్తున వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పేదప్రజలకు, విదేశాల్లో ఉన్న తెలుగువారికి అందించిన సేవలను కొనియాడారు. అదేవిధంగా తండ్రి బాటలో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాపక్షనేతగా ఎదిగినతీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పద్మజా రెడ్డి, చికాగో పార్టీ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . కార్యక్రమంలో రమణా అబ్బరాజు, మనోజ్ సింగమశెట్టి, రాంభూపాల్ రెడ్డి కందుల, కేకే రెడ్డి, వెంకట్ రెడ్డి లింగారెడ్డిగారి, జయదేవ్ మెట్టుపల్లి, క్రిష్ణా రంగరాజు, శ్రీని వోరుగంటి, రమాకాంత్ రెడ్డి, హరిందర్ రెడ్డి, జగదీశ్, శివ, రవి కిషోర్ ఆల్లా, సేతుకుమార్ కర్రి, ప్రమోద్ ముత్యాల, రామిరెడ్డి పెద్దిరెడ్డి, వెంకట్ పులుసు, గోపీ పిట్టల, మోహన్, రాజ్ అడ్డగట్ల, సురేష్ శంక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదికో కొత్త షికాగో నిర్మిస్తేనే!
న్యూయార్క్: పట్టణీకరణ విషయంలో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు 2030 వరకు ఏడాదికో కొత్త షికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. 2030 కల్లా భారత జనాభాలో 40%మంది పట్టణాల్లో నివసిస్తారన్న అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సమ్మిళిత అభివృద్ధిపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హర్దీప్ మాట్లాడారు. భారత పట్టణీకరణ లక్ష్యాలను చేరుకునేందుకు నేటినుంచి 2030 వరకు ప్రతి ఏటా 70 నుంచి 90 కోట్ల చదరపు మీటర్ల పట్టణాభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. మిషన్ 2030లో భాగంగా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే పట్టణీకరణ కోసం 70% కొత్త మౌలికవసతులను భారత్ ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని పురీ తెలిపారు. 1947లో భారత జనాభాలో 17% పట్టణాల్లో నివసిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 30% ఉంది. 2030 కల్లా ఇది 40%కు చేరవచ్చని అంచనా. -
చికాగోలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
చికాగో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చికాగోలోని సౌత్ బారింగ్టన్లోని అమెరికా తెలంగాణ సంస్థ (ఆటా) ఆధ్వర్యంలో ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను ఈ సంస్థ ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి లెంకల స్వాగత చిరునామాతో ఆరంభించగా, సత్య నారాయణ కండిమల్ల, కరుణాకర్ మాధవరం, శ్రీనివాస్ రెడ్డి చాడ, నరేందర్ రెడ్డి చిమర్ల, కళ్యాణ్ ఆనందుల, శ్రీనివాస రెడ్డి గజ్జి జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నారి శ్లోక అనందుల గణేష్ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అర్పించిన అమరులకు నివాళిగా నిశ్శబ్దం పాటించారు. అమెరికా తెలంగాణ సంస్థ అధ్యక్షుడు సత్య కందిమళ్ల.. వేడుకకు హాజరైన అథితులకు మరియు తెలంగాణ వాసులకు రాష్ట్ర ఆవిర్భావ శుభకాంక్షలు తెలిపారు. ఈ నెల 29, 30, జూలై 1 న హూస్టన్‌లో మహా నగరములోజరుపుకొంటున్న 2వ ప్రపంచ తెలంగాణ సమావేశానికి హాజరు కావాలని కోరారు. చైర్మన్ కరుణాకర్ మాట్లాడుతూ.. సంస్థ ఆవిర్భావ ప్రాముఖ్యత , రాష్ట్ర ఆవిర్భావానికి సంస్థ పాలుపంచుకున్న పలు కార్యక్రమాలు, రాష్ట్ర ఆవిర్భావం తరువాత బంగారు తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యముతో సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాలను, తెలంగాణ ప్రవాసీ విధి విధానాలు, విద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ప్రత్యేక సలహా కమిటీ సభ్యులు కళ్యాణ్ ఆనందుల, శ్రీనివాస్ చాడ, నరేందర్ చీమర్లా ప్రసంగిస్తూ... ప్రపంచ తెలంగాణ మహాసభల ద్వారా మన సంస్క్రతి, కట్టుబాట్లను, మన కళ, భాషా మన భావి తరాలకు అందిస్తున్నామ్మని, ఈ 2వ ప్రపంచ తెలంగాణ సమావేశాలలో ప్రత్యేక ఆకర్షణీయమైన శ్రీ సీతారామ కళ్యాణం, మన రాష్ట్ర రాజకీయలు మన పాత్ర వేదిక, వాణిజ్య వేదికలు, ఉత్సవ అంగడుల (ఎక్జిబిట్స్) వంటి అంశాల గురించి వివరించారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకులు పార్థు మాని నేతృత్వంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పాటల కచేరి కార్యక్రమం అతిథులను అలరించింది. చివరిగా నరేంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక విభాగాలు, అమెరికా తెలంగాణ సంస్థకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రచార భాగస్వాములకు, హాజరైన అతిథులకు, ఈ కార్యక్రమానికి కష్టపడి పని చేసిన వాలంటీర్లుకి, ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచి, పక్కా ప్రణాళికతో విజయవంతం చేసిన అమెరికా తెలంగాణ సంస్థ ప్రచార కమిటీ చైర్మన్, రామచంద్ర రెడ్డి, ఏడేలకు ధన్యవాదాలు’ అంటూ కార్యక్రమాన్ని ముగించారు. -
వైఎస్ అంటే పేరు కాదు.. బ్రాండ్
షికాగోలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు సాక్షి, హైదరాబాద్ : భారతదేశ సమకాలీన రాజకీయాల్లో తమ నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వగలిగేంత అభిమానం సంపాదించుకున్న మహానేత ైవైఎస్ రాజశేఖరరెడ్డి అని ఎన్నారైలు, పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు కొనియాడారు. ఆయన లేనిలోటు ఎవరూ పూడ్చలేనిదని కీర్తించారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 500 మంది ఎన్నారై ప్రతినిధులు హాజరవగా.. ఆటా రజతోత్సవ వేడుకుల్లో పాల్గొనేందుకు షికాగో చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, అనిల్‌కుమార్ యాదవ్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ నేతలు కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్తోపాటు వైఎస్ అభిమాని గోనె ప్రకాశరావు, ప్రేమసాగర్‌రెడ్డి (ఎన్నారై, వైఎస్ ఆప్తమిత్రుడు), ఆటాకు చెందిన బోర్డు ట్రస్టీ హరి లింగాల తదితరులు పాల్గొని రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన అన్ని పథకాలను రానున్న కాలంలో ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్ అన్నది కేవలం పేరు కాదని.. అదొక బ్రాండ్ అని ఎమ్మెల్యే రోజా ఉద్ఘాటించారు.