షికాగో: సెప్టెంబర్ 13: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించింది. చికాగోతో పాటు చుట్టు పక్కల నివసిస్తున్న తెలుగు క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
విన్నర్‌గా లయన్స్
ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఎంతో రసవత్తవరంగా సాగిన ఈ టోర్నమెంట్‌లో ఎవోలూటీజ్ లయన్స్ టీం ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. అరోరా వారియర్స్ రన్నర్స్ గా నిలిచింది. నాట్స్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ హరీష్ జమ్ముల ప్రణాళిక ఈ టోర్నీని విజయవంతం చేయడంలో శ్రమించారు. చికాగో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జా, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, బిందు వీదులమూడి, కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణకు అందించిన సహకారం అందించారు.
ధన్యవాదాలు
ఈ టోర్నమెంట్ కోసం నాట్స్ వాలంటీర్లు రాజేష్ వీదులమూడి, ఆర్‌కే బాలినేని, పండు చెంగలశెట్టి, శ్రీనివాస్ బొప్పన, కృష్ణ నున్నా, కిరణ్ అంబటి, శ్రీకాంత్ బొజ్జ, అరవింద్ కోగంటి, అరుల్ బాబు, యాజ్నేష్ వెంకటేష్, కార్తీక్ మోదుకూరి, నరేన్ శర్మ, నరేష్ యాదా, వినోద్ బాలగురు, మనోహర్ పాములపాటి, రామ్ తూనుగుంట్ల తదితరులు స్వచ్ఛంధంగా సేవలు అందించారు.
చదవండి : తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా
Comments
Please login to add a commentAdd a comment