tornament
-
షికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్
షికాగో: సెప్టెంబర్ 13: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించింది. చికాగోతో పాటు చుట్టు పక్కల నివసిస్తున్న తెలుగు క్రికెట్ ప్లేయర్లు, అభిమానులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విన్నర్‌గా లయన్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు 150 మంది క్రికెట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఎంతో రసవత్తవరంగా సాగిన ఈ టోర్నమెంట్లో ఎవోలూటీజ్ లయన్స్ టీం ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. అరోరా వారియర్స్ రన్నర్స్ గా నిలిచింది. నాట్స్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ హరీష్ జమ్ముల ప్రణాళిక ఈ టోర్నీని విజయవంతం చేయడంలో శ్రమించారు. చికాగో నాట్స్ నాయకులు మదన్ పాములపాటి, మూర్తి కొప్పాక, విజయ్ వెనిగళ్ల, రవి శ్రీకాకుళం, కృష్ణ నిమ్మగడ్డ, లక్ష్మీ బొజ్జా, వేణు కృష్ణార్దుల, డాక్టర్ ప్రసుధ నున్నా, బిందు వీదులమూడి, కార్తీక్ మోదుకూరి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణకు అందించిన సహకారం అందించారు. ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ కోసం నాట్స్ వాలంటీర్లు రాజేష్ వీదులమూడి, ఆర్కే బాలినేని, పండు చెంగలశెట్టి, శ్రీనివాస్ బొప్పన, కృష్ణ నున్నా, కిరణ్ అంబటి, శ్రీకాంత్ బొజ్జ, అరవింద్ కోగంటి, అరుల్ బాబు, యాజ్నేష్ వెంకటేష్, కార్తీక్ మోదుకూరి, నరేన్ శర్మ, నరేష్ యాదా, వినోద్ బాలగురు, మనోహర్ పాములపాటి, రామ్ తూనుగుంట్ల తదితరులు స్వచ్ఛంధంగా సేవలు అందించారు. చదవండి : తొలి గోల్ఫ్ టోర్నమెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆటా -
నేటి నుంచి స్నూకర్, బిలియర్డ్స్ టోర్నమెంట్
బోట్‌క్లబ్(కాకినాడ): రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్ స్నూకర్, బిలియర్డ్స్ ర్యాంకింగ్–2016 పోటీలు స్థానిక టౌన్హాల్లో ఈ నెల 7నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని టోర్నమెంట్ కమిటీ ప్రతినిధి పీవీ రాజీవ్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను టౌన్‌హాలు అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు, కార్యదర్శి జ్యోతుల రాము, వైస్ ప్రెసిడెంట్ డీవీఎన్ రాజు, బిలియర్డ్స్ సెక్రటరీ వి.తరుణ్‌కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని, వీరికి వసతి సదుపాయాలు టోర్నమెంట్ కమిటీ సమకూరుస్తుందని తెలిపారు. -
21 నుంచి కొత్తపేటలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహణ 13 జిల్లాల నుంచీ పాల్గొననున్న 78 జట్లు కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్ –19 బాలురు,బాలికల చాంపియన్ షిప్ –2016 టోర్నమెంట్‌కు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ టోర్నీ నిర్వహణకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్) ఫౌండర్, చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం స్టేడియంలో టోర్నీ బ్రోచర్‌ను ఎమ్మెల్సీ ఆర్ఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా చైతన్యం పెరిగేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ టోర్నీని కొత్తపేటలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ క్రీడా పోటీలకు ఒకప్పుడు పేరొందిన కొత్తపేటకు ఆ వైభవం మరలా తెచ్చేందుకు ఈ పోటీలు నాంది అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ.25 లక్షల వ్యయంతో స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏ క్రీడా కోర్టుకూ లేని ఏసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులకు కొత్తపేట సీఆర్ఎస్, రావులపాలెం సీఆర్సీల సమన్వయంతో వసతి,ఇతర సౌకర్యాలు కలగచేస్తున్నట్టు తెలిపారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచీ బాలురు, బాలికల విభాగంలో సింగిల్స్‌లో 2, డబుల్స్‌లో ఒకటి చొప్పున ఆరేసి జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఇంతవరకూ నిర్వహించిన టోర్నీలతో పోలిస్తే ఇది మెగా ఈవెంట్ అంటూ ఎమ్మెల్సీ ఆర్ఎస్ను అభినందించారు. జిల్లా అసోసియేషన్ సలహాదారు కె.శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌వుడయార్, సీఆర్ఎస్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీరామకృష్ణమోహన్, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల భూరిబాబు, సెక్రటరీ జీపీ నాయుడు, జాయింట్ సెక్రటరీ రాయుడు శ్రీను, కోశాధికారి ఎస్.శివయ్య, సభ్యులు ఎస్.సందీప్‌కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కడియం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.