టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నేటి (జూన్‌ 7) మ్యాచ్‌లు | T20 World Cup 2024: Three Matches To Happen On June 7th | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నేటి (జూన్‌ 7) మ్యాచ్‌లు

Published Fri, Jun 7 2024 2:49 PM | Last Updated on Fri, Jun 7 2024 3:10 PM

T20 World Cup 2024: Three Matches To Happen On June 7th

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో ఇవాళ (జూన్‌ 7) మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కెనడా, ఐర్లాండ్‌ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌ (గ్రూప్‌-ఏ) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య జరిగే రెండో మ్యాచ్‌ (గ్రూప్‌-డి) భారత కాలమానం ప్రకారం రేపు (జూన్‌ 8) ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. 

న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిగే మూడో మ్యాచ్‌ (గ్రూప్‌-సి) విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతుంది. కెనడా-ఐర్లాండ్‌ మధ్య జరిగే తొలి మ్యాచ్‌ న్యూయార్క్‌ వేదికగా జరుగనుండగా.. శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు అమెరికాలోని డల్లాస్‌లో.. న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ గయానాలో జరుగనున్నాయి.

కాగా, యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు సూపర్‌ ఓవర్‌ దాకా వెళ్లాయి. పాకిస్తాన్‌-యూఎస్‌ఏ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ (సూపర్‌ ఓవర్‌) ఓ రేంజ్‌లో సాగింది. ఈ మ్యాచ్‌లో తొలి ప్రపంచకప్‌ ఆడుతున్న యూఎస్‌ఏ.. పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. 

దీనికి ముందు ఒమన్‌-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా సూపర్‌ ఓవర్‌ దాకా వెళ్లింది. ఆ మ్యాచ్‌లో నమీబియా ఒమన్‌పై (సూపర్‌ ఓవర్‌లో) విక్టరీ సాధించింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగ్గా స్కాట్లాండ్‌-ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. నిన్న యూఎస్‌ఏ చేతిలో ఓటమితో పాకిస్తాన్‌ సూపర్‌-8కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జూన్‌ 9న భారత్‌.. చిరకాల ప్రత్యర్ది పాక్‌తో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement