బాబర్‌ ఆజంపై సంచలన ఆరోపణలు | Pakistan Journalist Raises Serious Allegations On Babar Azam 2 Crore Audi Car, Fans Reacted On This | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల కారు.. బాబర్‌ ఆజంపై సంచలన ఆరోపణలు

Published Thu, Jun 20 2024 4:56 PM | Last Updated on Thu, Jun 20 2024 5:38 PM

On Babar Azam 2 Crore Audi Car Pak Journalist Raises Serious Allegation Fans Reacts

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌పై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. జట్టును గ్రూపులుగా విడగొట్టి సర్వనాశనం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అతడిపై వేటు వేసి.. కొత్త సారథిని ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాబర్‌ను ఉద్దేశించి పాక్‌ సీనియర్‌ జర్నలిస్టు ముబాషిర్‌ లుక్మాన్‌ తీవ్ర ఆరోపణలు చేశాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడేమోననే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

‘‘బాబర్‌ ఆజం గ్యారేజీలో ఈ- ట్రాన్‌ చేరింది. తన సోదరుడు తనకిది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు. అతడి సోదరుడు అంత గొప్పగా ఏం పని చేస్తాడని.. రూ. 7- 8 కోట్ల కారు గిఫ్టుగా ఇస్తాడు?

అతడికి అసలు ఏ పనీపాట లేదని తెలిసింది. నాతో ఎవరో ఒక మాట అన్నారు. ‘చిన్న జట్లపై ఓడిపోయినా.. విలువైన ప్లాట్లు, కార్లు ఇవ్వరు కదా?

మరెవరు ఇస్తారు’? అన్నాడు. అప్పుడు నేను అతడి బదులిస్తూ.. ‘ఇవీ మరీ తీవ్రమైన ఆరోపణలు’ అన్నాను. అతడు వెంటనే అందుకుని.. ‘అయినా ఎవరేం చేస్తున్నారో అందరికీ తెలుసులెండి అన్నాడు’’’ అంటూ బాబర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కాగా గతేడాది చివర్లో తన అన్నయ్య తనకు ఆడి కారు బహుమతిగా ఇచ్చాడని బాబర్‌ ఆజం తెలిపాడు. భారత్‌లో ఈ కారు విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా. పాక్‌లో ఇంతకు రెండు రెట్లు ఎక్కువే.

ఇక బాబర్‌పై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అతడి అభిమానులు సదరు జర్నలిస్టుపై మండిపడుతున్నారు. వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అయిన బాబర్‌కు ఇలాంటి దుస్థితి పట్టలేదని పేర్కొంటున్నారు.

పాక్‌ బోర్డు నుంచి అందే పారితోషికంతో పాటు.. వివిధ రకాల బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉండటం వల్ల కూడా కోట్లాది రూపాయలు వస్తాయని.. అలాంటి వ్యక్తిపై ఇలాంటి చవకబారు ఆరోపణలు సరికాదని హితవు పలుకుతున్నారు. 

బాబర్‌ ప్రతిష్టను దిగజార్చేందుకు మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాబర్‌ ఆజం సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2021లో సెమీస్‌ చేరిన పాకిస్తాన్‌.. 2022లో రన్నరప్‌గా నిలిచింది. 

అయితే, ఈసారి కనీసం సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించింది. లీగ్‌ దశలో అమెరికాతో పాటు టీమిండియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఇక గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లోనూ పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌ కూడా చేరలేదన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బాబర్‌ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టీ20 ప్రపంచకప్‌-2024కు ముందు పీసీబీ అతడిని మళ్లీ వన్డే, టీ20 కెప్టెన్‌గా పునర్నియమించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement