Super Over
-
DC Vs RR: ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0. సూపర్ ఓవర్ సాగిందిలా...సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సంచలనం.. సూపర్ ఓవర్లో జీరో రన్స్! 16 ఏళ్ల చరిత్రలోనే?
మలేషియా- హాంకాంగ్-బహ్రెయిన్ మధ్య జరుగుతున్న టైసిరీస్లో సంచలనం నమోదైంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం బ్యూమాస్ క్రికెట్ ఓవల్ వేదికగా హాంకాంగ్, బహ్రెయిన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సూపర్ ఓవర్లో ఒక్క పరుగు కూడా సాధించని జట్టుగా బహ్రెయిన్ చెత్త రికార్డును నెలకొల్పింది. 16 ఏళ్ల సూపర్ ఓవర్ చరిత్రలో ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో జీషన్ అలీ (29), షాహిద్ వాసిఫ్ (31), నస్రుల్లా రాణా (14) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఓపెనర్ ప్రశాంత్ కురుప్ (37 బంతుల్లో 31) బహ్రెయిన్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.అయితే ఆ తర్వాత బహ్రెయిన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో బహ్రెయిన్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఆ జట్టు కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్, మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేశాడు.తర్వాతి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో బహ్రెయిన్ విజయసమీకరణం చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులుగా మారింది. ఐదో బంతికి అహ్మర్ బిన్ సిక్సర్‌గా మలచి మ్యాచ్‌ను టై చేశాడు. అయితే ఆఖరి బంతికి బిన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు.ఎహ్సాన్ అదుర్స్..ఈ క్రమంలో సూపర్ ఓవర్లో ఛేజింగ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బహ్రెయిన్ కెప్టెన్ బిన్, సోహైల్ అహ్మద్ లు సూపర్ ఓవర్‌ను ఎదుర్కోనేందుకు వచ్చారు. అదేవిధంగా ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ ఈ సూపర్ ఓవర్ వేసే బాధ్యతను స్పిన్నర్ ఎహ్సాన్ ఖాన్‌కు అప్పగించాడు.ఈ క్రమంలో ఎహ్సాన్ రెండవ బంతికి బిన్ ను, మూడవ బంతికి సోహైల్ అహ్మద్‌ను ఔట్ చేయడంతో పరుగులు ఏమి రాకుండా సూపర్ ఓవర్ ముగిసింది. దీంతో బహ్రెయిన్ ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా బ్యాటింగ్‌కు దిగిన జట్టు రెండు వికెట్లు కోల్పోతే సూపర్ ఓవర్ ముగుస్తుంది.చదవండి: IPL 2025: 'ఒకప్పుడు రోహిత్ వారసుడు.. కానీ సడన్‌గా ఏమైందో మరి' -
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే మ్యాచ్‌లో 3 సూపర్ ఓవర్లు
అంతర్జాతీయ క్రికెట్లోనైనా, ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్లోనైనా డబుల్ సూపర్ ఓవర్ జరగడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటిది ఓ టోర్నీలో ఏకంగా మూడు సూపర్ ఓవర్లతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది.. అవును మీరు విన్నది నిజమే.కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా శుక్రవారం హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్లతో తేలింది. చివరవరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హుబ్లీ టైగర్స్ విజయం సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సూపర్ ఓవర్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. హుబ్లీ టైగర్స్ బ్యాటర్లలో కెప్టెన్ మనీష్ పాండే(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ కూడా నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. బెంగళూరు బ్లాస్టర్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 54 పరుగులతో రాణించాడు. ఇక తొలి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ అగర్వాల్ గోల్డన్ డక్‌గా వెనుదిరగగా.. అనిరుద్ జోషీ 8 పరుగులు చేశాడు. అనంతరం బెంగళూరు బ్లాస్టర్స్ కూడా మళ్లీ పరుగులు చేసింది. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించవలసి వచ్చింది. ఈసారి రెండో సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన హుబ్లీ టైగర్స్ 8 పరుగులు చేయగా.. బెంగళూరు బ్లాస్టర్స్ కూడా 8 పరుగులే చేసింది.దీంతో మళ్లీ స్కోర్ సమం కావడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి మూడో సూపర్ నిర్వహించారు. మూడో సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 12 పరుగులు చేసింది. అనంతరం హుబ్లీ టైగర్స్ 13 పరుగులు చేసి చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. Friday night frenzy at the @maharaja_t20: Not one, not two, but THREE Super Overs were needed for Hubli Tigers to finally win against Bengaluru Blasters 🤯🤯🤯#MaharajaT20onFanCode #MaharajaTrophy #MaharajaT20 pic.twitter.com/ffcNYov1Qf— FanCode (@FanCode) August 23, 2024 -
సూపర్ ఓవర్లో "అజేయ" భారత
శ్రీలంకతో నిన్న (జులై 30) జరిగిన మూడో టీ20లో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. టీ20ల్లో సూపర్ ఓవర్లో విజయం సాధించడం భారత్‌కు ఇది నాలుగో సారి. బౌల్ ఔట్‌తో కలుపుకుని ఐదో సారి. భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి సూపర్ ఓవర్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై రెండు సార్లు, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకపై చెరో సారి టీమిండియా సూపర్ విక్టరీలు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయగలిగింది.భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), సుందర్ (25) ఓ మోస్తరు పరుగులు చేయగా.. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక (26), కుశాల్ మెండిస్ (43), వన్‌డౌన్ బ్యాటర్ (46) పర్వాలేదనిపించారు.లంక బౌలరల్లో తీక్షణ 3, హసరంగ 2, విక్రమసింఘే, అశిత ఫెర్నాండో, రమేశ్ మెండిస్ తలో వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లలో సుందర్, బిష్ణోయ్, రింకూ సింగ్, స్కై తలో 2 వికెట్లు తీశారు.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. వాషింగ్టన్ సుందర్ దెబ్బకు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు (3 బంతుల్లో) కోల్పోయింది. అనంతరం సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో కొలొంబో వేదికగా జరుగనుంది. -
SL VS IND 3rd T20 : ఉత్కంఠ మ్యాచ్.. సూపర్ ఓవర్లో శ్రీలంక చిత్తు (ఫొటోలు)
-
భారత్ ‘సూపర్’ క్లీన్‌స్వీప్
పల్లెకెలె: భారత్ బ్యాటింగ్‌లో మాత్రమే చెత్తగా ఆడింది. కానీ శ్రీలంక మొత్తానికే చెత్త చెత్తగా ఆడి చేజేతులా ఓడింది. మరోవైపు ఓటమి ఖాయమైన మ్యాచ్‌లో టీమిండియా సూపర్ ఓవర్లో గెలిచి టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 39; 3 ఫోర్లు) కుదురుగా ఆడాడు. తీక్షణ 3, హసరంగ 2 వికెట్లు తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక కూడా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు 137 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. కుశాల్ పెరీరా (34 బంతుల్లో 46; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు) రాణించారు. వాషింగ్టన్ సుందర్ వేసిన సూపర్ ఓవర్లో శ్రీలంక 3 బంతులాడి 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులే చేసింది. 3 పరుగుల లక్ష్యాన్ని తొలి బంతికే బౌండరీతో భారత్ అధిగమించింది. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్టు 2న మొదలవుతుంది. డ్రామా మొదలైందిక్కడే... లంక 15 ఓవర్లలో 108/1 స్కోరు చేసింది. చేతిలో 9 వికెట్లున్న లంక 30 బంతుల్లో 30 పరుగులు చేస్తే సరిపోతుంది. రవి బిష్ణోయ్ 16వ ఓవర్లో కుశాల్ మెండిస్‌ను అవుట్ చేస్తే, 17వ ఓవర్లో సుందర్... హసరంగ (3), అసలంక (0)లను పెవిలియన్ చేర్చాడు. 18వ ఓవర్లో ఏకంగా 11 బంతులేసిన ఖలీల్ 12 పరుగులిచ్చాడు. 12 బంతుల్లో 9 పరుగుల సమీకరణం లంకకే అనుకూలంగా ఉండగా... రింకూ సింగ్ 19వ ఓవర్లో 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ప్రధాన బౌలర్ సిరాజ్‌ను పక్కనబెట్టి ఆఖరి ఓవర్ వేసిన సూర్యకుమార్ 2 వికెట్లు తీసి 5 పరుగులే ఇచ్చాడు. అంతే మ్యాచ్ ‘టై’ అయ్యింది. నిర్లక్ష్యంగా బ్యాటింగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఒకవేళ విఫలమైఉంటే భారత్ వంద పరుగులు కూడా దాటేది కాదు. ఎందుకంటే అప్పటికే యశస్వి జైస్వాల్ (10), సంజూ సామ్సన్ (0), రింకూ సింగ్ (1) అవుటవడంతో 14 పరుగులకే 3 వికెట్లు, కాసేపటికే కెప్టెన్ సూర్యకుమార్ (8), శివమ్ దూబే (13) పెవిలియన్ చేరడంతో 48కే సగం వికెట్లు కూలాయి. ఈ దశలో గిల్... రియాన్ పరాగ్ (18 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్కోరుతో భారత్ ఆమాత్రం స్కోరు చేసింది. తీరుమారని లంక లంక లక్ష్యం చేరేందుకు టాప్–3 బ్యాటర్లు నిసాంక (27 బంతుల్లో 26; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్, పెరీరా చక్కని బాటవేశారు. 15.1 ఓవర్లలో లంక 110/1 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. మరుసటి బంతికి మెండిస్ అవుటయ్యాక ఒక్కసారిగా పరిస్థితి మారింది. హసరంగ (3), అసలంక (0), పెరీరా, రమేశ్ మెండిస్ (3), తీక్షణ (0)ఇలా 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను పారేసుకోవడంతో ఛేదించే స్కోరును సమం చేసింది. స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) తీక్షణ 10; గిల్ (స్టంప్డ్) కుశాల్ మెండిస్ (బి) హసరంగ 39; సామ్సన్ (సి) హసరంగ (బి) విక్రమసింఘే 0; రింకూ సింగ్ (సి) పతిరణ (బి) తీక్షణ 1; సూర్యకుమార్ (సి) హసరంగ (బి) ఫెర్నాండో 8; శివమ్ దూబే (సి) కుశాల్ మెండిస్ (బి) రమేశ్ 13; పరాగ్ (సి) రమేశ్ (బి) హసరంగ 26; సుందర్ (బి) తీక్షణ 25; రవి బిష్ణోయ్ (నాటౌట్) 8; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–11, 2–12, 3–14, 4–30, 5–48, 6–102, 7–105, 8–137, 9–137. బౌలింగ్: విక్రమసింఘే 4–0–17–1, తీక్షణ 4–0–28–3, ఫెర్నాండో 2–0–11–1, రమేశ్ 3–0–26–1, హసరంగ 4–0–29–2, కమిండు 3–0–24–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) పరాగ్ (బి) రవి బిష్ణోయ్ 26; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బిష్ణోయ్ 43; పెరీరా (సి అండ్ బి) రింకూ సింగ్ 46; హసరంగ (సి) బిష్ణోయ్ (బి) సుందర్ 3; అసలంక (సి) సామ్సన్ (బి) సుందర్ 0; రమేశ్ (సి) గిల్ (బి) రింకూ సింగ్ 3; కమిండు (సి) రింకూ సింగ్ (బి) సూర్య 1; విక్రమసింఘే (నాటౌట్) 4; తీక్షణ (సి) సామ్సన్ (బి) సూర్య 0; ఫెర్నాండో (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–58, 2–110, 3–117, 4–117, 5–129, 6–132, 7–132, 8–132. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సిరాజ్ 3–0–11–0, సుందర్ 4–0–23–2, రవి బిష్ణోయ్ 4–0–38–2, పరాగ్ 4–0–27–0, రింకూసింగ్ 1–0–3–0, సూర్యకుమార్ 1–0–5–2. -
‘సూపర్’ సాఫ్ట్వేర్ ఇంజినీర్
డాలస్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ను అద్భుతంగా బౌల్ చేసి అమెరికాను గెలిపించిన లెఫ్టార్మ్ పేసర్ సౌరభ్ నేత్రావల్కర్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్‌కు చెందిన అతను చదువు, ఉద్యోగరీత్యా యూఎస్‌కు వెళ్లి ఇప్పుడు తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న తమ టీమ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 32 ఏళ్ల సౌరభ్ 2013లో తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, వసీం జాఫర్ ఆ మ్యాచ్‌లో అతని సహచరులు. అయితే ఎన్నో ఆశలతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతనికి అదే చివరి రంజీ మ్యాచ్ కూడా అయింది. అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్, అవిష్కార్ సాల్వి, ధావల్ కులకరి్ణలాంటి పేసర్లు ఉన్న ముంబై టీమ్‌లో అతనికి చోటు దక్కడం కష్టమైపోయింది. అంతకు మూడేళ్ల క్రితమే అండర్–19 వరల్డ్ కప్‌లో ఆడి భారత్ తరఫున అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే అతను ఆశించినట్లుగా దేశవాళీ కెరీర్ ఊపందుకోకపోగా, ఐపీఎల్ అవకాశం కూడా దక్కలేదు. నిజానికి 2009లోనే సౌరభ్ వెలుగులోకి వచ్చాడు. ఎయిరిండియా ప్రతిభాన్వేషణలో భాగంగా బెంగళూరు ఎన్సీఏలో అద్భుత బంతితో యువరాజ్ సింగ్‌ను బౌల్డ్ చేయడంతో అతనికి స్కాలర్షిప్ లభించింది. కొద్ది రోజులకే అదే ఎయిరిండియా తమ ప్రధాన జట్టులోకి తీసుకోవడంతో యువరాజ్, రైనాలతో కలిసి కార్పొరేట్ టోర్నీ కూడా ఆడాడు. తర్వాతి ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లలో కలిసి అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. అయితే ఏకైక రంజీ మ్యాచ్ తర్వాత మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. మరో రెండేళ్లు క్రికెట్లో గట్టిగా ప్రయత్నిస్తానని, లేదంటే ఆటను ఆపేస్తానని సౌరభ్ తన తండ్రికి చెప్పాడు. చివరకు అదే జరిగింది. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతను ఎమ్మెస్ చేసేందుకు 2015లో అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో అవకాశం లభించింది. చదువులో ప్రతిభతో పాటు క్రికెట్ పరిజ్ఞానంతో ‘క్రిక్‌డీకోడ్’ అనే యాప్‌ను తయారు చేయడంతో ప్రత్యేక స్కాలర్íÙప్ కూడా లభించింది. చదువు పూర్తి కాగానే అతనికి ఒరాకిల్ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అమెరికా చేరాక సరదాగా వారాంతపు క్రికెట్ ఆడుతూ వచ్చిన సౌరభ్... ఆ తర్వాత ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన యూఎస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఆడటంతో మరింత గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో అమెరికా తరఫున 2018లో తొలి వన్డే ఆడిన నేత్రావల్కర్ గత ఏడాది జరిగిన మేజర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో టి20 టీమ్‌లో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. అండర్–19 వరల్డ్ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌తో తలపడిన సౌరభ్... ఇప్పుడు బాబర్ టీమ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన సౌరభ్ ప్రదర్శన తర్వాత సౌరభ్ కంపెనీ ‘ఎక్స్’ ద్వారా తమ ఇంజినీర్‌ను అభినందించింది. -
టీ20 వరల్డ్‌కప్ 2024లో నేటి (జూన్ 7) మ్యాచ్‌లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 7) మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కెనడా, ఐర్లాండ్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ (గ్రూప్-ఏ) భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో మ్యాచ్ (గ్రూప్-డి) భారత కాలమానం ప్రకారం రేపు (జూన్ 8) ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మూడో మ్యాచ్ (గ్రూప్-సి) విషయానికొస్తే.. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతుంది. కెనడా-ఐర్లాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జరుగనుండగా.. శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు అమెరికాలోని డల్లాస్‌లో.. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గయానాలో జరుగనున్నాయి.కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ దాకా వెళ్లాయి. పాకిస్తాన్-యూఎస్ఏ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ (సూపర్ ఓవర్) ఓ రేంజ్లో సాగింది. ఈ మ్యాచ్‌లో తొలి ప్రపంచకప్ ఆడుతున్న యూఎస్ఏ.. పటిష్టమైన పాకిస్తాన్‌కు ఊహించని షాకిచ్చింది. దీనికి ముందు ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్లింది. ఆ మ్యాచ్‌లో నమీబియా ఒమన్‌పై (సూపర్ ఓవర్లో) విక్టరీ సాధించింది. మెగా టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగ్గా స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నిన్న యూఎస్ఏ చేతిలో ఓటమితో పాకిస్తాన్ సూపర్-8కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జూన్ 9న భారత్.. చిరకాల ప్రత్యర్ది పాక్‌తో తలపడనుంది. -
టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన అమెరికా
డాలస్: టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం... టోర్నీ 11వ మ్యాచ్‌లో ‘సూపర్ ఓవర్’ ద్వారా అనూహ్య ఫలితం వచి్చంది. తొలిసారి వరల్డ్ కప్ బరిలోకి దిగిన ఆతిథ్య అమెరికా జట్టు అద్భుతం చేసింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లు సమంగా నిలవడంతో ‘సూపర్ ఓవర్’ అనివార్యమైంది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో యూఎస్ఏ ‘సూపర్ ఓవర్’లో 5 పరుగులతో పాక్‌ను ఓడించింది. 2009 విజేత పాకిస్తాన్ సమష్టి వైఫల్యం కారణంగా పరాభావంతో టోర్నీని మెుదలు పెట్టగా...తొలి మ్యాచ్‌లో కెనడాపై నెగ్గిన యూఎస్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. పాక్ తరఫున ఆమిర్ వేసిన సూపర్ ఓవర్లో అమెరికా 18 పరుగులు చేయగా... గెలవాలంటే ‘సూపర్ ఓవర్’లో 19 పరుగులు చేయాల్సిన పాక్... అమెరికా బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ వేసిన సూపర్ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (43 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్ ఖాన్ (25 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించగా... షాహిన్ అఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో కీలక పరుగులు చేశాడు. అమెరికా బౌలర్లలో నాస్తుష్ కెన్జిగే 3 వికెట్లు పడగొట్టగా, సౌరభ్ నేత్రావల్కర్ 2 వికెట్లు తీశాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు సాధించింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జోన్స్ (26 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గూస్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఒక దశలో చేతిలో 9 వికెట్లతో 8 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన మెరుగైన స్థితిలో నిలిచిన అమెరికా ఆ తర్వాత పాక్ బౌలింగ్ ముందు తడబడింది. అయితే 19వ ఓవర్ వరకు పట్టు బిగించిన పాక్...చివరి ఓవర్లో వెనుకంజ వేసింది. రవూఫ్ వేసిన ఈ ఓవర్లో గెలుపు కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా యూఎస్ ఫోర్, సిక్స్ సహా 14 పరుగులు రాబట్టింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్ X కెనడావేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024: ఉత్కం‘టై’న పోరులో నమీబియా ‘సూపర్’ గెలుపు
సూపర్ ఓవర్‌కు ముందు... నమీబియా గెలిచేందుకు 6 బంతుల్లో 5 పరుగులు కావాలి. క్రీజులో పాతుకుపోయిన ఫ్రయ్‌లింక్ (48 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఉండటంతో నమీబియా గెలుపు లాంఛనం. కానీ మెహ్రాన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ఆఖరి బంతి బౌల్ అయ్యేసరికి ఒమన్ గెలవాలి! ఫ్రయ్‌లింక్, గ్రీన్ వికెట్లు తీసిన మెహ్రాన్ 4 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 2 పరుగులపుడు మెహ్రాన్ చక్కని బంతి వేయగా... వికెట్ కీపర్ మిస్ ఫీల్డింగ్, మిస్ త్రో వల్ల ఒక పరుగు వచ్చి స్కోరు ‘టై’ అయింది. తుది ఫలితం కోసం మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో... ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నమీబియా బ్యాటర్లు డేవిడ్ వీస్ తొలి నాలుగు బంతుల్లో 4, 6, 2, 1 కొట్టగా... చివరి రెండు బంతులు ఆడిన ఎరాస్మస్ 4, 4 బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు 22 పరుగులు చేయాల్సిన ఒమన్ జట్టు నసీమ్ (2) వికెట్ కోల్పోయి 10 పరుగులే చేయడంతో నమీబియా ‘సూపర్’ విక్టరీ నమోదు చేసింది. బ్రిడ్జ్‌టౌన్: లాంఛనమైన (ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 5 పరుగులు) విజయానికి దూరమైన నమీబియా ‘సూపర్ ఓవర్’తో చేజారిన విజయాన్ని చేజిక్కించుకుంది. ఒమన్ పేసర్ మెహ్రాన్ (3–1–7–3) అసాధారణ బౌలింగ్‌ను... డేవిడ్ వీస్ ‘షో’ సూపర్ ఓవర్లో మాయం చేసింది. ‘సూపర్ ఓవర్’లో 13 పరుగులు చేసిన వీస్ వెంటనే బౌలింగ్‌కు దిగి వికెట్ కూడా తీసి 10 పరుగులిచ్చాడు. 20 జట్లు బరిలో ఉన్న ఈ టి20 ప్రపంచకప్‌లో ‘బోర్’ మ్యాచ్‌లే బోలెడనుకున్న క్రికెట్ ప్రేక్షకులు, విశ్లేషకుల అంచనాల్ని గ్రూప్ ‘బి’లోని ఈ మ్యాచ్ తారుమారు చేసింది. ఔరా అనిపించేలా ఈ కూనల తక్కువ స్కోర్ల మ్యాచ్ వరల్డ్‌కప్‌కే వన్నె తెచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా గెలిచినా... మ్యాచ్ చూసిన ప్రతి మదిని ఒమన్ పోరాటం తాకింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖాలిద్ కైల్ (39 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్), జీషాన్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్ (4/21), వీస్ (3/28), కెపె్టన్ గెరార్డ్ ఎరాస్మస్ (2/20) అదరగొట్టారు. తర్వాత నమీబియా కూడా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జాన్ ఫ్రయ్లింక్తో పాటు నికోలస్ డేవిన్ (31 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 3: టి20 ప్రపంచకప్ చరిత్రలో ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలిన మ్యాచ్‌లు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్‌లో సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు.. అక్టోబర్ 1న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించాయి. -
12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్.. నమీబియా వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.ఇక రెండు మ్యాచ్‌లు ఒక ఎత్తు. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమన్-నమీబియా మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇరు జట్లు సమాన స్ధాయిలో పోరాడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఒమన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్లో ఫలితం తేల్చాల్సి వచ్చింది.దంచి కొట్టిన డేవిడ్ వీస్, ఎరాస్మస్..ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగుల చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 13 పరుగులు చేయగా.. ఎరాస్మస్ 8 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వీస్.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటాడు.తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికి ఒమన్‌కు చేయాల్సిన నష్టం వీస్ చేసేశాడు.12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్..కాగా టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరగడం ఇది మూడో సారి. చివరగా 2012 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరిగింది. 2012 పొట్టి ప్రపంచకప్‌లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, కివీస్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టై అయినప్పటికి సూపర్ ఓవర్ ద్వారా కాకుండా బాల్ అవుట్ ద్వారా ఫలితం తేల్చారు.నమీబియా అరుదైన రికార్డు..ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌పై సూపర్ ఓవర్లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది. -
నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్లో ఫలితం! నమీబియా విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో బార్బడోస్ వేదికగా ఒమాన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. ఒమాన్‌పై సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం1 0 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.చెలరేగిన నమీబియా బౌలర్లు..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమాన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.వారెవ్వా మెహ్రాన్ ఖాన్..110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడంలో ఒమన్ ఆల్‌రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.ఆఖరి ఓవర్లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. -
ఐపీఎల్లో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్లు జరిగాయో తెలుసా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మ్యాచ్‌లు తుది బంతి వరకు వచ్చినప్పటికీ సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తున్నా ఒక్కటంటే ఒక్క సూపర్ ఓవర్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన సూపర్ ఓవర్లపై ఓ లుక్కేద్దాం. క్యాష్ రిచ్ లీగ్‌లో నేటి వరకు (ఏప్రిల్ 17) మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి. 2020 సీజన్లో అత్యధికంగా 5 సూపర్ ఓవర్లు జరుగగా.. అదే సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు (ఒక దాంట్లో ఫలితం రాకపోయగా మరొకటి జరిగింది) జరిగాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఐపీఎల్ తొలి సీజన్లోనూ (2008) ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. 2009లో ఒకటి, 2010లో ఒకటి, 2013లో రెండు, 2014లో ఒకటి, 2015లో ఒకటి, 2017లో ఒకటి, 2019లో రెండు, 2020లో ఐదు, 2021 సీజన్లో ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరుగగా... 2008, 2011, 2012, 2016, 2018, 2022, 2023 సీజన్లలో ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళితే అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజా అందుతుంది. అందుకే ఫ్యాన్స్ సూపర్ ఓవర్లో ఫలితం తేలడాన్ని ఇష్టపడతారు. ఫలితం ఒక్క సూపర్ ఓవర్ వరకు వెళితేనే అభిమానులు నరాలు బిగబట్టుకుని మ్యాచ్‌లు చూస్తారు. అదే రెండో సూపర్ దాకా వెళితే ఫ్యాన్స్‌తో ఆటగాళ్లు పడే ఉత్కంఠ అంతాఇంత కాదు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. -
సూపర్ ఓవర్ అంటే చాలు హిట్‌మ్యాన్‌కు పూనకం వస్తుంది..!
సూపర్ ఓవర్ అంటే చాలు టీమిండియా సారధి రోహిత్ శర్మకు పూనకం వస్తుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు మూడు సూపర్ ఓవర్లు ఆడిన హిట్ మ్యాన్ ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి సూపర్ మ్యాన్‌లా రెచ్చిపోయాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో రెండు సూపర్ ఓవర్లలో విధ్వంసం సృష్టించిన (4 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 13, 3 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 11) రోహిత్.. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ ఓవర్లో 4 బంతుల్లో 15 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ మూడు సందర్భాల్లో రోహిత్ ఆటతీరును చూసిన వారు సూపర్ ఓవర్లో హిట్‌మ్యాన్ కాస్త సూపర్ మ్యాన్ అయిపోతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ సూపర్ ఓవర్లోనే కాకుండా అంతకుమందు కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన రోహిత్.. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన హిట్‌మ్యాన్ ఆతర్వాత పూనకం వచ్చినట్లు ఊగిపోయి, కెరీర్లో ఐదో టీ20 శతకం బాదాడు. రోహిత్‌తో పాటు రింకూ సింగ్ కూడా రెచ్చిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
IND vs AFG 3rd T20I: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’...
ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో, అదీ అఫ్గానిస్తాన్‌తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్‌దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్ చూపిన పోరాటపటిమ అసమానం. బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్ రెండో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గుర్బాజ్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. శతక భాగస్వామ్యం... ఫరీద్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి బంతికి డకౌట్... అంతా నిశ్శబ్దం... ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే కూడా కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్ కూడా సున్నాకే అవుట్! ఐదో ఓవర్ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్ కుదేలైంది. రోహిత్ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం. కరీమ్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్ 4, 6 (నోబాల్), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. రిలీఫ్..! ‘ఏంటి వీరూ... లెగ్‌బై ఇచ్చావా, బ్యాట్‌కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్‌సైడ్ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్ లెగ్‌బై ఇవ్వడంతో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్ ఫామ్ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్‌కు ముందు 31 ఇన్నింగ్స్‌లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు. ఐపీఎల్లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్‌కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22. బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182. బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1. సూపర్ ఓవర్లలో ఇలా... ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో అఫ్గానిస్తాన్ 1 సిక్స్, 1 ఫోర్‌తో 16 పరుగులు చేసింది. ఛేదన లో రోహిత్ 2 సిక్స్‌లు కొట్టినా చివరకు భారత్ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
మన అమ్మాయిలే ‘సూపర్’
ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత్ పాలిట దుర్భేద్యమైన ప్రత్యర్థి. ప్రపంచకప్, పతకం (కామన్వెల్త్ గేమ్స్) తెచ్చే మ్యాచ్‌ల్లో మనల్ని రన్నరప్‌గా మార్చిన జట్టు. ఒత్తిడిలో చిత్తుచేసే అలాంటి ఘనమైన ప్రత్యరి్థని ఈసారి భారత మహిళలు చిత్తు చేశారు. మొదట భారీ స్కోరు చేస్తే దాన్ని మనమ్మాయిలు సమం చేశారు. తొలిసారి ‘సూపర్ ఓవర్’ ఒత్తిడిని భారత్ జయిస్తే... ఆసీస్ మూడోసారి తడబడి ఓడింది. అమ్మాయిల క్రికెట్ అంటే మనం ఏ ప్రపంచకప్పో లేదంటే ఫైనల్ మ్యాచో ఉంటేనే కన్నేస్తాం! సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని ఆడినా అటువైపే కన్నెత్తి చూడం. ఇకపై ఈ చిన్నచూపు మాయం కానుంది. ఎందుకంటే భారత అమ్మాయిల ఆట కూడా ‘సూపర్’ టెన్షన్ తెస్తోంది. కాబట్టి మనందరి అటెన్షన్ మారబోతోంది. ముంబై: అట్లుంటది మనతోని! అని ఇన్నాళ్లు పురుషుల క్రికెటే భారత్‌లో కాలర్ ఎగరేసింది. ఉత్కంఠ రేపినా... ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టినా... ‘సూపర్ ఓవర్’ అయినా పురుషాధిక్య క్రికెట్టే శాసించింది. తొలిసారి ఉత్కంఠ ఉరిమి, భారీస్కోర్లు సమమైతే... ‘సూపర్ ఓవర్’ కిక్‌లో తామేమీ తక్కువ కాదని భారత అమ్మాయిల క్రికెట్ జట్టు నిరూపించింది. తమకెదురైన భారీ స్కోరుకు దీటుగా మెరుపులు మెరిపించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (49 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రిచా ఘోష్ (13 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) ఉత్కంఠభరిత పోరులో భారత్‌ను నిలబెట్టారు. ‘సూపర్ ఓవర్లో’నూ భారీ షాట్లతో భారత్‌ను గెలిపించారు. ఎవరి ఊహకందని ఈ మహిళల రెండో టి20 మ్యాచ్‌లో భారత్ ‘సూపర్ ఓవర్’లో 4 పరుగుల తేడాతో ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియాపై గెలిచింది. మొదట ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. బెత్ మూనీ (54 బంతుల్లో 82 నాటౌట్; 13 ఫోర్లు), తాలియా మెక్‌గ్రాత్ (51 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. అనంతరం భారత్ కూడా 20 ఓవర్లలో 5 వికెట్లకు సరిగ్గా 187 పరుగులు చేసింది. స్మృతి, రిచా ధనాధన్ ఆట ఆడారు. దీంతో మ్యాచ్ ‘టై’ కాగా ఫలితం తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇందులోనూ రిచా సిక్స్ కొట్టి నిష్క్రమించగా, స్మతి 4, 6లతో అదరగొట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ‘సూపర్ ఓవర్’ సాగిందిలా... భారత్ 20/1 బంతి ఆ్రస్టేలియా 16/1 రిచా ఘోష్ (6) అలీసా హీలీ (4) రిచా ఘోష్ (అవుట్) అలీసా హీలీ (1) హర్మన్‌ప్రీత్ (1) గార్డెనర్ (అవుట్) స్మృతి మంధాన (4) తాలియా (1) స్మృతి మంధాన (6) అలీసా హీలీ (4) స్మృతి మంధాన (3) అలీసా హీలీ (6) బౌలర్: హీతెర్ గ్రాహమ్ బౌలర్: రేణుక సిం చితగ్గొట్టిన మూనీ, తాలియా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా జట్టు... ఓపెనర్, కెపె్టన్ అలీసా హీలీ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ధాటిగా ఆడిన ఆమెను దీప్తి శర్మ బోల్తా కొట్టించింది. కానీ ఆ తర్వాత బెత్ మూనీ, తాలియా మెక్‌గ్రాత్ ఆఖరి 20వ ఓవర్‌దాకా ఆటాడుకున్నారు. బౌండరీలతో భారత బౌలర్ల భరతం పట్టారు. దీంతో 13వ ఓవర్లోనే ఆసీస్ స్కోరు 100 దాటింది. మొదట తాలియా 37 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్), కాసేపటికి మూనీ 38 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరి జోరు పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. దీంతో అబేధ్యమైన రెండో వికెట్‌కు వీరిద్దరు 158 పరుగులు జోడించారు. స్మృతి ధనాధన్... షఫాలీ వర్మ (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఓపెనింగ్‌కు దిగిన స్మృతి దంచేసింది. ఇద్దరు 8.4 ఓవర్లలోనే 76 పరుగులు చేశారు. జెమీమా (4) నిరాశపరచగా, హర్మన్‌ప్రీత్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో స్మృతి చెలరేగింది. 37 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. వరుస ఓవర్లలో హర్మన్, స్మృతి ని్రష్కమించగా... భారత్ విజయానికి 21 బంతుల్లో 39 పరుగులు కావాలి. ఓటమి ఖాయమైన దశలో రిచా భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాల్సి ఉండగా... రిచా, దేవిక తొలి 5 బంతుల్లో 9 పరుగులు చేశారు. ఇక ఆఖరి బంతికి విజయం కోసం 5 పరుగులు అవసరం కాగా, బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా దేవిక బౌండరీ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి. -
దర్శకుడు సుధీర్ వర్మ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది బంతితోనే కాదు బ్యాట్‌తోను సత్తా చాటగలనని నిరూపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా వచ్చింది. కానీ అఫ్రిదిని దురదృష్టం వెంటాడింది. సూపర్ ఓవర్లో తన జట్టు పరాజయం పాలైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో భాగంగా పెషావర్ జాల్మి, లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హైదర్ అలీ 35, షోయబ్ మాలిక్ 32 పరుగులు సాధించారు. చదవండి: ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఖలందర్స్ 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్మద్ హఫీజ్‌తో కలిసి కెప్టెన్ షాహిన్ అఫ్రిది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏడో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 33 పరుగులు జోడించారు. కాగా 12 బంతుల్లో 30 పరుగుల చేయాల్సిన దశలో హఫీజ్ ఔటయ్యాడు. 19వ ఓవర్లో షాహిన్ ఒక ఫోర్ సహా మొత్తం ఆరు పరుగులు రాబట్టడంతో.. లాహోర్ ఖలందర్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 23 పరుగులు కావాలి. కాగా మహ్మద్ ఉమర్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతి వైడ్ వెళ్లింది. మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. రెండో బంతిని అఫ్రిది సిక్సర్ కొట్టడంతో 4 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. మూడో బంతిని లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్‌గా మలవడంతో రెండు బంతుల్లో ఏడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాలేదు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే డ్రా.. లేదంటే ఓటమి. ఈ దశలో అఫ్రిది డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఫలితం సూపర్ ఓవర్‌కు దారి తీసింది. కాగా 20 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షాహిన్.. సెలబ్రేషన్స్‌లో భాగంగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని గుర్తుచేస్తూ ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. పెషావర్ విజయానికి ఆరు పరుగులు మాత్రమే అవసరం. షోయబ్ మాలిక్ తొలి రెండు బంతులను ఫోర్‌గా మలచడంతో పెషావర్ జాల్మి విజయాన్ని అందుకుంది. చదవండి: నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం THAT over. #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/o8AYrxjmNg — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
సూపర్ ఓవర్లో వెస్టిండీస్ వీర బాదుడు.. 3సిక్స్‌లు, 2ఫోర్లతో.. ఏకంగా!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన రెండో వన్డే ఆసక్తికరంగా సాగింది. చివర వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో..విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైగా ముగిసిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. బ్యాటర్ దియాంద్రా డాటిన్ చెలరేగడంంతో కేవలం 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించింది. డాటిన్ 5 బంతుల్లోనే 19 పరుగులు చేసింది. డాటిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. అనంతరం 26 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 17 పరుగుల మాత్రమే సాధించి ఓటమి చెందింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లో ట్రియాన్(7),బ్రిట్స్(10) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా.. విండీస్ బౌలర్లు చెలరేగడంతో 160 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 161 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్.. సూపర్ ఓవర్ ద్వారా సెమీస్‌కు
Karnataka Beats Bengal In Super Over Enter Semis.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో భాగంగా కర్ణాటక, బెంగాల్ మధ్య గురువారం క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్‌దాకా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించిన కర్ణాటక సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరగులు చేసింది. కరుణ్ నాయర్ 55 పరుగులు నాటౌట్.. టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ రోహన్ కడమ్ 30, కెప్టెన్ మనీష్ పాండే 29 పరుగులు చేశారు. చదవండి: Ind Vs Nz 1st T20: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్! అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగాల్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో బెంగాల్ విజయానికి 20 పరుగులు కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను విద్యాదర్ పాటిల్ వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న రిత్విక్ చౌదరీ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో.. నాలుగు బంతుల్లో 8 పరుగులుగా సమీకరణాలు మారాయి. మూడో బంతికి ఒక పరుగు రాగా.. నాలుగో బంతికి ఆకాశ్ దీప్ బౌండరీ బాదడంతో రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి ఆకాశ్ దీప్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే బెంగాల్ విజయం సాధిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పాటిల్ వేసిన బంతిని ఆకాశ్ దీప్ డీప్‌మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న కెప్టెన్ మనీష్ పాండే డైరెక్ట్ హిట్ చేయడంతో ఆకాశ్ దీప్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నాలుగు బంతుల్లో 5 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.ఇక 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకను మనీష్ పాండే రెండు బంతుల్లోనే 8 పరుగులు కొట్టి విజయం అందించి జట్టును సెమీఫైనల్ చేర్చాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో మిగిలిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌ల్లో కేరళపై తమిళనాడు, గుజరాత్‌పై హైదరాబాద్, రాజస్తాన్‌పై విదర్భలు విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో తమిళనాడుతో హైదరాబాద్.. కర్ణాటకతో విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Ricky Ponting: హెడ్‌కోచ్‌గా ఆఫర్.. ద్రవిడ్‌ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది 🎯 #KARvBEN pic.twitter.com/pFdOtIkB5Y — Rohan (@itzz_Rohan) November 18, 2021 Manish pandey hits the winning six in the super over helped Karnataka to qualify for semis.#SyedMushtaqAliTrophy#SyedMushtaqAliT20pic.twitter.com/cjPAigDFLC — CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) November 18, 2021 -
మూడు పరుగుల కోసం హైడ్రామా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం
USA Dramatically Steal 2 Runs Force Tie Got Victory In Super Over.. టి20 మ్యాచ్‌లంటేనే జోష్‌కు పెట్టింది పేరు. ఆఖరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడుతుంది. అలాంటి మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు హైడ్రామా నెలకొనడం చూస్తుంటాం. గెలవడం కోసం ఎంతదూరం అయినా వెళతారు అనడానికి కెనడా, అమెరికాల మధ్య జరిగిన మ్యాచ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమెరికాను అదృష్టం వరించి మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత సూపర్ ఓవర్లో కెనడాను ఓడించడం జరిగిపోయింది. ఇక విషయంలోకి వెళితే.. 2022 టి20 ప్రపంచకప్ అమెరికన్ రీజియన్ క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో భాగంగా కెనడా, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. అనంతరం అమెరికా ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్లో చివరి బంతికి మూడు పరుగులు అవసరం అయ్యాయి. కెనడా బౌలర్ జతిందర్ పాల్ బంతిని విసరగా స్ట్రైక్‌లో ఉన్న అలీఖాన్ మిస్ చేశాడు. అయితే ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రస్టీ థియోరన్ పరుగు కోసం పిలిచాడు. అతను క్రీజులోకి చేరేలోపే కీపర్ బంతిని అందుకొని వికెట్ల వైపు వేగంగా విసిరాడు. రస్టీ రనౌట్ అయ్యాడనే సంతోషంలో కెనడా ఆటగాళ్లు సంబరాలు షురూ చేశారు. అయితే ఇక్కడే రస్టీ తెలివిని ఉపయోగించి రనౌట్ కాదా అవునా అనేది అంపైర్లు ఇంకా నిర్థారించకపోవడంతో రస్టీ రెండో పరుగు కోసం పరిగెత్తాడు. అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న అలీఖాన్ మ్యాచ్ అయిపోయిందనుకొని పెవిలియన్ వైపు వెళుతున్నాడు. ఇంతలో రస్టీ పరుగు కోసం గట్టిగా అరవడంతో అలీఖాన్ వెంటనే పరుగు లఖించుకున్నాడు. అలా రెండో పరుగు పూర్తి చేసి మూడో పరుగుకోసం పరిగెత్తినప్పటికీ పూర్తిచేయలేకపోయాడు. అయితే మొదట రస్టీ రనౌట్ కాదని నిర్థారించిన అంపైర్లు రెండు పరుగులు లీగల్ అని డిక్లెర్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్లో అమెరికా 22 పరుగులు చేయగా.. కెనడా 14 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 📺 WATCH: One of the most dramatic finishes in the history of cricket as USA and Canada played out a match for the ages that went to a Super Over where #TeamUSA🇺🇸 prevailed 👀The final over highlights are a MUST WATCH⬇️#CANvUSA🇨🇦🇺🇸 #WeAreUSACricket🇺🇸 pic.twitter.com/UBqBNTtS7x — USA Cricket (@usacricket) November 11, 2021 -
Glenn Maxwell: సూపర్ ఓవర్ టై.. మ్యాక్స్‌వెల్ క్లీన్‌బౌల్డ్
Glenn Maxwell Clean Bowled.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఓవర్లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అదేంటి.. ఇంకా మ్యాచ్‌లే మొదలు కాలేదు.. సూపర్ ఓవర్ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ పడకండి. విషయంలోకి వెళితే.. ప్రాక్టీస్ సందర్భంగా ఆర్సీబీ జట్టు సూపర్ ఓవర్ సిములేషన్ను ఆడింది. ఒకవేళ అసలైన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రాక్టీస్ చేశారు. రెండు జట్లుగా విడిపోయిన ఆర్సీబీలో టీమ్-ఏ కు షాబాజ్ అహ్మద్.. టీమ్- బి కి ఆకాశ్ దీప్ కెప్టెన్లుగా వ్యవహరించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన షాబాజ్ అహ్మద్ జట్టు 12 పరుగులు చేసింది. జట్టు తరపున బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన మ్యాక్స్‌వెల్ భారీ షాట్లు ఆడలేకపోయాడు. కాగా తన ఫేమస్ షాట్ అయిన రివర్స్ ప్లిక్ ఆడే దశలో ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోనూ 'ఆర్సీబీ బోల్డ్ డైరీస్' పేరిట ట్విటర్లో షేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆకాశ్ దీప్ జట్టు కూడా 12 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ టైగా ముగిసింది. చదవండి: IPL 2021 Phase 2: సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇక ఐపీఎల్ 13వ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 10 మ్యాచ్‌లాడిన మ్యాక్సీ 14.57 సగటుతో 102 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ మ్యాక్స్‌వెల్‌ను వదిలేసింది. అయితే వేలంలో ఆర్సీబీ రూ. 14.25 కోట్లతో మ్యాక్స్‌వెల్‌ను ఎవరు ఊహించని ధరకు సొంతం చేసుకుంది. అప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో మ్యాక్స్‌వెల్ అదరగొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్ మంచి ప్రదర్శననే కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు 78 పరుగులు అత్యధిక స్కోరుగా ఉంది. ఆర్సీబీ ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసిలో ఉంది. అందుకు అనుగుణంగానే ఆర్సీబీ ఈసారి లీగ్‌లో అదరగొడుతుంది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో అంచె పోటీల్లో ఆర్సీబీ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 20న(సోమవారం) కేకేఆర్‌తో ఆడనుంది. చదవండి: IPL 2021 2nd Phase: ఓపెనర్లిద్దరు ఇరగదీశారు -
'నేను సూపర్ ఓవర్ వేయడం వెనుక కారణం అదే'
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున అక్షర్ పటేల్ సూపర్ ఓవర్ వేయగా.. అతని స్పిన్ ఆడడంలో విఫలమైన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మన్ కేవలం 7 పరుగులు మాత్రమే నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రషీద్ వేసిన ఆఖరి బంతికి సింగిల్ తీసి విజయం సాధించింది. మ్యాచ్ విజయం అనంతరం అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్లు ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదట సూపర్ ఓవర్ తాను వేయాల్సిందని.. ఆఖరి క్షణంలో అక్షర్ పటేల్ చేతిలోకి బంతి వెళ్లిందని ఆవేశ్ ఖన్ పేర్కొన్నాడు. ''రిషబ్ పంత్ దగ్గరకు వెళ్లి ఏం చెప్పావని.. బంతి నీ చేతిలోకి ఎలా వచ్చిందో'' చెప్పాలని అక్షర్‌ను అడిగాడు. దీనికి అక్షర్ స్పందిస్తూ.. సూపర్ ఓవర్‌కు మొదట నీ పేరును పరిశీలించిన మాట వాస్తవం. అప్పటికే ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ కూడా ఆవేశ్ ఖాన్ సూపర్ ఓవర్ వేస్తాడని స్పష్టం చేశాడు. కానీ తాను పంత్ దగ్గరకు వెళ్లి.. ఈ పిచ్‌పై స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రావడం కష్టంగా ఉందని.. బ్యాట్స్‌మన్ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో సూపర్ ఓవర్‌ను ఫాస్ట్ బౌలర్ కంటే స్పిన్ బౌలర్‌తో వేయడం సమంజసమని తెలిపా. అందులోనూ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వస్తే వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి నా బౌలింగ్‌లో ఆడడానికి కాస్త ఇబ్బంది పడుతాడు. అందుకే సూపర్ ఓవర్ నేను వేస్తా అని పంత్‌కు తెలిపా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే కరోనా బారీన పడిన అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐసోలేషన్‌లో ఉన్న అక్షర్ క్వారంటైన్ గడువు పూర్తి చేసుకొని ఇటీవలే జట్టుతో కలిశాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 27న ఆర్సీబీతో ఆడనుంది. చదవండి: బెయిర్‌స్టో అప్పుడు టాయిలెట్లో ఉంటే తప్ప: సెహ్వాగ్ One shone bright on his comeback & delivered the Super Over while the other has been amongst the wickets. 👌👌 Presenting the @DelhiCapitals' bowling aces: @akshar2026 & Avesh Khan 😎😎 - By @28anand #VIVOIPL #SRHvDC Watch the full interview 🎥 👇https://t.co/cbzKlVKG6t pic.twitter.com/EQNzo4bcMo — IndianPremierLeague (@IPL) April 26, 2021 -
‘సూపర్ ఓవర్’ మూవీ రివ్యూ
చిత్రం: ‘సూపర్ ఓవర్’ తారాగణం: నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందుమౌళి, ప్రవీణ్ నిర్మాత: సుధీర్ వర్మ దర్శకత్వం: ప్రవీణ్ వర్మ ఓ.టి.టి. ప్లాట్‌ఫామ్: ఆహా విడుదల తేది : జనవరి 22, 2021 క్రికెట్ బెట్టింగ్, హవాలా నేపథ్యంలో తెలుగులో పూర్తి స్థాయి సినిమాలు రాలేదనే చెప్పాలి. ఆ రెండు నేపథ్యాలనూ వాడుతూ, డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళతాడో విలక్షణమైన స్క్రీన్‌ప్లేతో చెబితే? క్రికెట్ బెట్టింగ్ నేపథ్యం కన్నా హవాలా నేపథ్యం ఎక్కువుండే ‘సూపర్ ఓవర్’లో దర్శక, నిర్మాతలు చేసిన యత్నం అదే. కథ కాశీ (నవీన్ చంద్ర), మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) – ముగ్గురూ చిన్నప్పటి స్నేహితులు. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ కాశీ ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు దిగుతాడు. మిగతా ఇద్దరు ఫ్రెండ్లూ సమర్థిస్తారు. అనుకోకుండా కాశీ కోటీ 70 లక్షలు గెలుస్తాడు. ఆ డబ్బులు తీసుకొని, కష్టాలు తీర్చుకోవాలని ముగ్గురూ రాత్రివేళ బయల్దేరతారు. ఆ రాత్రి తెల్లవారే లోపల అసలు ట్విస్టులు, కష్టాలు మొదలవుతాయి. బుకీ మురళి (కమెడియన్ ప్రవీణ్), పోలీసు ఎస్.ఐ. (అజయ్), హవాలా డబ్బు డీల్ చేసే మనుషులు – ఇలా రకరకాల పాత్రలతో సాగే ఛేజింగ్ థ్రిల్లర్ మిగతా కథ. ఎలా చేశారంటే హితుల కథలా మొదలై పూర్తిస్థాయి థ్రిల్లర్‌లా సాగే ఈ సినిమాలో నటీనటులందరూ పాత్రలకు సరిగ్గా అతికినట్టు సరిపోయారు. ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గంభీర కంఠస్వరం, ఒకింత రగ్డ్ లుక్‌తో నవీన్ చంద్ర ఈ కథను నడిపే కాశీ పాత్రలో బాగున్నారు. తెలుగమ్మాయి చాందిని పాత్రచిత్రణతో, ఆ ఎనర్జీతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. ‘మస్తీస్’, ‘కలర్ ఫోటో’ లాంటి హిట్ వెబ్ సినిమాల్లో కనిపించిన చాందినికి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ప్రతిదానిలో ఏదో ఒక అనుమానం లేవనెత్తే కామికల్ రిలీఫ్ పాత్రలో రచయిత వెన్నెలకంటి కుమారుడు రాకేందుమౌళి వినోదం అందిస్తారు. కమెడియన్ ప్రవీణ్, అజయ్ సహా ఈ సినిమాలో పాత్రలే తప్ప, ఎక్కడా నటీనటులు కనిపించరు. ఎవరెంతసేపున్నా సన్నివేశాలనూ, సందర్భాలనూ, పాత్రల ప్రవర్తననూ ఉత్కంఠ రేపేలా, శ్రద్ధగా రాసుకోవడం దర్శకుడి ప్రతిభ. ఎలా తీశారంటే..: ఈ సినిమాకు బలం – స్క్రీన్‌ప్లేలోని వైవిధ్యం. ఇలాంటి కథ, దానికి వెండితెర కథనం రాసుకోవడం కష్టం. రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం మరీ కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకొని, నలుగురూ ఇష్టపడేలా తీశారు – దర్శకుడు స్వర్గీయ ప్రవీణ్ వర్మ. షూటింగ్ ఆఖరులో వాహనప్రమాదంలో ప్రవీణ్ వర్మ దుర్మరణం పాలయ్యారు. దాంతో, ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని ఇచ్చిన ‘స్వామిరారా’ సుధీర్‌వర్మ పోస్ట్‌ప్రొడక్షన్ చేశారు. సాంకేతిక విభాగాల పనితనం సినిమాకు మరో బలం. 25 రోజులకు పైగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రివేళ షూటింగ్ జరుపుకొందీ సినిమా. నైట్ ఎఫెక్ట్‌లో, ఏరియల్ షాట్స్‌తో దివాకర్ మణి కెమేరావర్క్ కనిపిస్తుంది. ఈ థ్రిల్లర్‌కి నేపథ్య సంగీతం గుండెకాయ. సన్నీ ఈ చిత్రానికి గ్యాప్ లేకుండా సంగీతం ఇస్తూనే ఉన్నారు. అక్కడక్కడ కాస్తంత మితి మీరినా, ఆ నేపథ్య సంగీతమే లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఎడిటింగ్ సైతం కథ శరవేగంతో ముందుకు కదిలేలా చేసింది. సెన్సార్ లేని ఓటీటీలో సహజంగా వినిపించే, అసభ్యమైన డైలాగులు కూడా చాలానే ఉన్న చిత్రమిది. అనేక చోట్ల లాజిక్ మిస్సయి, కథనంలో మ్యాజిక్ ఎక్కువున్న ఈ సినిమాకు ఓటీటీ రిలీజు లాభించింది. థియేటర్లలో కన్నా ఎక్కువ మంది ముంగిటకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఛేజింగ్ థ్రిల్లర్ కావడంతో దర్శకుడు పలుచోట్ల తీసుకున్న సినిమాటిక్ లిబర్టీని ప్రేక్షకుడు క్షమిస్తాడు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న విలక్షణ కథనం వల్ల ఒకే సీన్ సందర్భాన్ని బట్టి, పదే పదే వస్తున్నా సరే సహిస్తాడు. అక్కడక్కడా ఓవర్‌గా అనిపించే అలాంటివి పక్కన పెడితే, గంట 20 నిమిషాల కాలక్షేపం థ్రిల్లర్‌గా ఈ కథాకథనం సూపర్ అనిపిస్తుంది. బలాలు: విలక్షణమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం సహజంగా తోచే∙నటీనటులు, వారి అభినయం కెమేరా వర్క్, ఉత్కంఠ పెంచే నేపథ్య సంగీతం బలహీనతలు: ట్విస్టుల హడావిడిలో మిస్సయిన లాజిక్కులు స్క్రీన్ ప్లేలో భాగంగా రిపీటయ్యే సీన్లు వెండితెర కన్నా ఓటీటీకే పనికొచ్చే అంశాలు కొసమెరుపు: ఇది ఓటీటీలో ఓకే థ్రిల్లర్! – రెంటాల జయదేవ -
రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..?
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే పలు మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు సూపర్ ఓవర్లకు వెళితే, ఆదివారం జరిగిన కింగ్స్ పంజాబ్- ముంబై ఇండియన్స్ అందుకు భిన్నం. ఈ మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్ వరకూ వెళితే కానీ ఫలితం తేలలేదు. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు ఐదు పరుగులే చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. అందులో కింగ్స్ పంజాబ్ విజేతగా నిలిచింది. తొలుత ముంబై ఇండియన్స్ 11 పరుగులు చేస్తే దాన్ని కింగ్స్ పంజాబ్ ఛేదించింది. క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్‌లు 12 పరుగులు సాధించి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో రెండు సూపర్ల ద్వారా మ్యాచ్ ఫలితం తేలడం ఇదే తొలిసారి. గతేడాది వరల్డ్‌కప్ సమయంలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. ఇక్కడ సూపర్ ఓవర్ వరకూ టై కావడంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది అప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. ఈ నిబంధనపై యావత్ క్రికెట్ ప్రపంచం భగ్గుమంది. దాంతో సూపర్ ఓవర్లపై క్రికెట్ లామేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) కొన్ని సూచనలు చేయడంతో దానికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. అందులో సూపర్ ఓవర్ల నిబంధనను మార్చారు. సెమీస్,ఫైనల్(నాకౌట్ మ్యాచ్‌ల్లో) ఫలితం తేలేవరకు మళ్లీ మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించాలనే రూల్ తీసుకొచ్చింది. ఇదే నిబంధనను ఐపీఎల్లో అమలు చేశారు. రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..? ఆదివారం నాటి మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. తొలుత పడిన సూపర్ ఓవర్ టైగా ముగియడంతో రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. కానీ రెండో ది కూడా టై అయితే ఏంటనేది ప్రశ్న. ఇక రెండోది కూడా టై అయితే మూడో సూపర్ ఓవర్‌ను ఆడిస్తారా అనుమానం వ్యక్తమవుతోంది.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం భారతకాలమాన ప్రకారం మధ్యాహ్న మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు వెళితే రాత్రి గం.8గంటలకు ప్రారంభిచకూడదు. అదే సమయంలో రాత్రి మ్యాచ్‌లకు సూపర్ ఓవర్‌కు వెళితే అది అర్థరాత్రి 12గంటలు దాటకూడదని ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిబంధన తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సమయం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ వెళ్లే క్రమంలో కూడా సమయాన్ని చూస్తారు. అలాగే రెండో సూపర్ ఓవర్ కూడా టై అయితే ఇరుజట్ల కెప్టెన్ల ఒప్పందం ప్రకారం చెరొక పాయింట్ కేటాయిస్తారు. అంటే మూడో సూపర్ ఓవర్ ఉండదు. తలొక పాయింట్ తీసుకోవాల్సిందే. మొన్న జరిగిన రెండు సూపర్ ఓవర్ల మ్యాచ్‌ల సమయాలను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్-కేకేఆర్ జట్ల మధ్య సూపర్ ఓవర్ రాత్రి గం7:39 ని.ల నుంచి 7:49 మధ్య జరిగింది. ఇక కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్‌ల మధ్య జరిగిన తొలి సూపర్ రాత్రి గం. 11:46ని.లకు ప్రారంభమైతే, రెండో సూపర్ ఓవర్ గం.11:55 ని.ల నుంచి గం.12:12ని.ల మధ్య జరిగింది. నిబంధన ప్రకారం రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ల మ్యాచ్‌లు నిర్ణీత సమయానికి కంటే ముందే ప్రారంభమయ్యాయి. ఇక్కడ రెండో మ్యాచ్‌లో పడ్డ రెండో సూపర్ ఓవర్ గం. 12.12ని.లకు ముగియడంతో మూడో సూపర్ ఓవర్‌కు అవకాశం లేదు. ఈ సమయంలో మళ్లీ సూపర్ ఓవర్ టై అయితే ఇరుజట్లు పాయింట్లతో సరిపెట్టుకోవాలి. ఒకవేళ వివాదాస్పద బౌండరీ కౌంట్ రూల్ అమలు చేసి ఉంటే ముంబై ఇండియన్స్ గెలిచేది. ముంబై ఇండియన్స్ 24 బౌండరీలు( సిక్స్‌లు, ఫోర్లు) కొడితే, కింగ్స్ పంజాబ్ 22 బౌండరీలే సాధించింది. ఇదిలా ఉంచితే, నాకౌట్ మ్యాచ్‌ల్లో అయితే టై అయితే ఫలితాన్ని సూపర్ ఓవర్ల ద్వారానే ఫలితాన్ని తేల్చాలి. ఇక్కడ తొలి సూపర్ ఓవర్, రెండో సూపర్ ఓవర్లు టైగా ముగిస్తే మూడో సూపర్ ఓవర్ అనేది ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏదొక జట్టును విజేతగా తేల్చాలి కాబట్టి ఈ నిబంధనను ఫాలో కాకతప్పదు. ఇది గతేడాది ఐసీసీ తీసుకొచ్చిన నిబంధన. -
‘ఆరు యార్కర్లు వేయాల్సిందే’
దుబాయ్: రెండు సూపర్ ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ విజయంలో పేసర్ మొహమ్మద్ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. తొలి సూపర్ ఓవర్ వేసిన అతను వరుస యార్కర్లతో రోహిత్, డికాక్‌లను ఇబ్బంది పెట్టడంతో కేవలం ఐదు పరుగులే వచ్చాయి. దాంతో ‘టై’ కావడంతో ఫలితం రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తన బౌలింగ్ వ్యూహంపై షమీకి ముందే స్పష్టత ఉన్నట్లు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ‘సూపర్ ఓవర్ కోసం సాధారణంగా ఎవరూ సిద్ధంగా ఉండరు. అలాంటి సమయంలో బౌలర్ ధైర్యాన్ని, అతని నమ్మకాన్ని మనం నమ్మాలి. తాను ఆరు బంతులు కూడా యార్కర్లుగా వేసేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనిలాంటి సీనియర్లు మ్యాచ్‌లు గెలిపించడం ఎంతో అవసరం’ అని రాహుల్ అన్నాడు. టోర్నీలో సూపర్ ఓవర్లో ఒకసారి ఓడిన తాము ఈసారి మ్యాచ్ గెలవడం సంతోషమే అయినా... ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు అతను వ్యాఖ్యానించాడు. తీవ్ర నిరాశలో రోహిత్... మరోవైపు ఈ పరాజయం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను తీవ్రంగా నిరాశపర్చింది. మ్యాచ్ తర్వాత ప్రసారకర్తలతో మాట్లాడేందుకు రాని రోహిత్, ఆ తర్వాత మీడియా సమావేశానికి కూడా పొలార్డ్‌ను పంపించాడు. ‘మేం గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయామనే విషయాన్ని ఒప్పుకుంటాను. కానీ ఇదేమీ జీవితంలో అతి పెద్ద సమస్య కాదు. దీనిని మరచి ముందుకు సాగాలి. పరాజయం తర్వాత రోహిత్ బాగా బాధపడుతున్నాడని నాకు తెలిసింది. అయితే అతనో పోరాటయోధుడు అనే విషయం మరచిపోవద్దు’ అని కీరన్ పొలార్డ్ వెల్లడించాడు. నాకు కోపం తెప్పించింది: గేల్ రెండో సూపర్ ఓవర్లో సిక్సర్‌తో చెలరేగి గెలిపించిన క్రిస్ గేల్ మాట్లాడుతూ...అసలు మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లడమే తనకు నచ్చలేదని అన్నాడు. పంజాబ్ రెగ్యులర్ టైమ్‌లోనే మ్యాచ్‌ను గెలవాల్సిందని అభిప్రాయపడిన అతను, తాను ఒత్తిడికి లోను కాలేదని స్పష్టం చేశాడు. ‘సూపర్ ఓవర్లో ఆడే సమయంలో నేనేమీ ఒత్తిడికి లోను కాలేదు. అయితే అలాంటి స్థితికి మ్యాచ్ రావడమే నాకు ఆగ్రహం కలిగించింది. నిజానికి సూపర్ ఓవర్లో మొదటి బాల్ ఎవరు ఆడాలని మయాంక్ అడిగితే ఆశ్చర్యపోయా. ఎప్పుడైనా ‘బాస్’ ఆడాల్సిందేనని, తొలి బంతిని సిక్స్ కొడతాను చూడని కూడా అతనితో చెప్పా’ అని గేల్ వెల్లడించాడు. -
సూపర్: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు
దుబాయ్: సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కత నైట్‌రైడర్స్ జట్టు సూపర్ విజయం సాధించింది. కోల్‌కత విజయంలో ప్రధాన పాత్ర పోషించిన లాకీ ఫెర్గూసన్ సూపర్ ఓవర్లో డేవిడ్ వార్నర్ వికెట్ తీయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తొలుత 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను ఫెర్గూసన్ తన పదునైన బంతులతో హడలెత్తించాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 15 పరుగులే ఇచ్చాడు. అటు తర్వాత సూపర్ ఓవర్లోనూ సత్తా చాటాడు. 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మోర్గాన్ 1, దినేష్ కార్తీక్ 2 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశారు. కేకేఆర్‌కు అద్భుతమైన గెలుపునందించిన ఫెర్గూసన్ కేకేఆర్ తరపున తొలి మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. (చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్) తొలి బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ సూపర్ ఓవర్ తొలి బంతికి ఫుల్ లెంగ్త్ డెలివరీతో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ రెండో బంతికి రెండు పరుగులిచ్చాడు. మూడో బంతికి చక్కని యార్కర్‌తో సమద్‌ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్ ఓవర్ మొదటి బంతికి వార్నర్‌ను ఔట్ చేయడం మరచిపోలేని అనుభూతి అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో ఫెర్గూసన్ చెప్పుకొచ్చాడు. అది తన ఫేవరెట్ వికెట్లలో ఒకటి అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌లో తన బౌలింగ్ విషయానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తనకే వదిలేశాడని ఫెర్గూసన్ వెల్లడించాడు. అటు మ్యాచ్‌లోనూ, ఇటు సూపర్ ఓవర్లోనూ మెరుగ్గా రాణించి జట్టుకు విజయాన్నందించిన ఫెర్గూసన్‌పై కెప్టెన్ మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో పోరాడి ఓడిన కేకేఆర్ తాజా మ్యాచ్‌తో పోటీలోకి వచ్చిందని అన్నాడు. (చదవండి: సూపరో... సూపరు) -
‘6 పరుగులు సేవ్ చేయడం మామూలు కాదు’
దుబాయ్: ఐపీఎల్ అంటేనే వినోదాల విందు. అందులోనూ సూపర్ ఓవర్లో ఫలితం తేలడం అంటే ఉత్కంఠగా మ్యాచ్ సాగినట్టే. అభిమానులకు ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేసినట్టే. మరి సూపర్ ఓవర్ కూడా టై గా ముగిసి రెండో సూపర్ కూడా ఆడితే.. ఆ మజా మరింత ‘సూపర్’గా ఉంటుంది. పంజాబ్, ముంబై జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ దీనికి వేదికైంది. ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి సూపర్+సూపర్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లకు 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి పంజాబ్ జట్టు సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. తొలి సూపర్ ఓవర్లో సింగిల్ డిజిట్ పరుగులే నమోదయ్యాయి. జస్ప్రీత్ బుమ్రా చక్కని యార్కర్ స్పెల్‌తో పూరన్ (0), రాహుల్ (4) వికెట్లను కోల్పోయి పంజాబ్‌ను 5 పరుగులే చేయగలిగింది. ఇక ఆది నుంచి జోరు మీదున్న ముంబై జట్టు ఆరు పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుందనుకున్నారంతా. కానీ, మహ్మద్ షమీ యార్కర్ల దాడితో స్వల్ప లక్ష్యాన్ని ముంబై అందుకోలేకపోయింది. డికాక్ (3) వికెట్ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్ పాండ్యా (1) వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్... గేల్ (7) సిక్స్, మయాంక్ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది. (చదవండి: చెన్నై తదుపరి మ్యాచ్‌లకు బ్రేవో దూరం) షమీపై రాహుల్ ప్రశంసలు అద్భుతమైన బౌలింగ్‌తో తొలి సూపర్ ఓవర్లో ఆరు పరుగుల లక్ష్యాన్ని కాపాడిన మహ్మద్ షమీపై పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. ముంబై నిర్దేశించిన సూపర్ ఓవర్ లక్ష్యాన్ని కాపాడుకోవాంటే ఆరు బంతులూ యార్కర్లు వేయాలని షమీ అనుకున్నానని తెలిపాడు. 6 బంతులూ యార్కర్లు వేద్దామనుకుంటున్నాడని షమీ చెప్పడం పట్ల తామంతా ఆశ్చర్యానికి గురయ్యామని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో రాహుల్ చెప్పుకొచ్చాడు. షమీ నిర్ణయాన్ని కెప్టెన్‌గా తాను, మిగతా సీనియర్ ఆటగాళ్లు స్వాగతించామని అన్నాడు. తన ప్లాన్‌ని పక్కాగా అమలు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. ఇక తాజా విజయంతో తమకు రెండు పాయింట్లు జతకావడం పట్ల రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడింట విజయం సాధించింది. (చదవండి: ఉత్కం‘టై’లో... పంజాబ్ సూపర్ గెలుపు) -
ఉత్కం‘టై’లో... పంజాబ్ సూపర్ గెలుపు
దుబాయ్: సూపర్+సూపర్ ఆటకు తెరలేపిన ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. తొలి సూపర్ ‘ఆరు’ బంతులాటలో సింగిల్ డిజిటే నమోదైంది. పంజాబ్ ముందుగా పూరన్ (0), రాహుల్ (4) వికెట్లను కోల్పోయి 5 పరుగులే చేస్తే... ముంబై కూడా డికాక్ (3) వికెట్ కోల్పోయి ఐదు పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయ్యింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు సమాలోచనలు జరిపి మరో సూపర్ ఓవర్‌ను ఆడించారు. ఈసారి తొలుత ముంబై హర్దిక్ పాండ్యా (1) వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్... గేల్ (7) సిక్స్, మయాంక్ (8) 2 ఫోర్లతో ఇంకో రెండు బంతులుండగానే 15 పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... పొలార్డ్ (12 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చెలరేగాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్‡్షదీప్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. రాహుల్ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) విరోచిత పోరాటం చేశాడు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. ముంబై తడబాటు... ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (9), సూర్యకుమార్ యాదవ్ (0), ఇషాన్ కిషన్ (7) పంజాబ్ పేస్‌కు తలవంచారు. ఈ దశలో డికాక్, కృనాల్ పాండ్యా (30 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. అడపాదడపా డికాక్ సిక్సర్లతో, కృనాల్ ఫోర్లతో మురిపించారు. అయితే రన్‌రేట్ మాత్రం ఆశించినంతగా పెరగలేదు. దీంతో జట్టు ఎనిమిదో ఓవర్లో 50, 14వ ఓవర్లో 100 పరుగులు చేసింది. డికాక్ 39 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో కృనాల్, హార్దిక్ (8), డికాక్ అవుటయ్యారు. పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్... చప్పగా సాగే ఇన్నింగ్స్‌కు పొలార్డ్ మెరుపులద్దాడు. అర్శ్‌దీప్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో తొలి రెండు బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. కూల్టర్ నీల్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. షమీ తర్వాతి ఓవర్లో కూల్టర్ నీల్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక జోర్డాన్ ఆఖరి ఓవర్లోనూ పొలార్డ్ 2 సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో 20 పరుగులు స్కోరుబోర్డుకు జతయ్యాయి. ఈ చివరి 3 ఓవర్లలోనే 54 పరుగులు రావడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. కూల్టర్‌నీల్, పొలార్డ్ జోడీ అబేధ్యమైన ఏడో వికెట్‌కు కేవలం 21 బంతుల్లోనే 57 పరుగులు జోడించింది. రాహుల్ జిగేల్... పంజాబ్ ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడే ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌లో ఈసారి ఆ దూకుడేమి కనిపించలేదు. మరో ఓపెనర్, కెప్టెన్ లోకేశ్ రాహుల్ మాత్రం మెరిపించినా... ధనాదంచేసినా... బాధ్యతగా ఆడాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగాడు. ఐదు బంతులాడిన రాహుల్ 4, 4, 0, 6, వైడ్, 4లతో 20 పరుగులు పిండుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లోనే మయాంక్ (11)ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. గేల్, రాహుల్ కలిసి కాసేపు వేగంగా నడిపించారు. గేల్ (24) అవుట్ కావడంతో ఈ జోడికి పదో ఓవర్లో చుక్కెదురైంది. రాహుల్ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. పూరన్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో అలరించినా ఎంతోసేపు నిలువలేదు. మ్యాక్స్‌వెల్ (0) డకౌటయ్యాడు. దీంతో భారమంతా మోసిన రాహుల్ లక్ష్యానికి 23 పరుగుల దూరంలో బౌల్డయ్యాడు. హుడా (23 నాటౌట్), జోర్డాన్ (13) పోరాడటంతో గెలుపుదారిన పడ్డట్లే కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సివుండగా... మొదటి ఐదు బంతులకు వరుసగా 1, 4, 1, 0, 1తో 7 పరుగులొచ్చాయి. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. జోర్డాన్ పరుగు చేసి రెండో పరుగు కోసం రనౌటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ కూడా ‘టై’ అయ్యింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) అర్‡్షదీప్ సింగ్ 9; డికాక్ (సి) మయాంక్ (బి) జోర్డాన్ 53; సూర్యకుమార్ యాదవ్ (సి) మురుగన్ అశ్విన్ (బి) షమీ 0; ఇషాన్ కిషన్ (సి) మురుగన్ అశ్విన్ (బి) అర్‡్షదీప్ సింగ్ 7; కృనాల్ (సి) హుడా (బి) రవి బిష్ణోయ్ 34; హార్దిక్ (సి) పూరన్ (బి) షమీ 8; పొలార్డ్ (నాటౌట్) 34; కూల్టర్‌నీల్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–24, 3–38, 4–96, 5–116, 6–119. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 4–0–24–0, షమీ 4–0–30–2, అర్‡్షదీప్ సింగ్ 3–0–35–2, జోర్డాన్ 3–0–32–1, మురుగన్ అశ్విన్ 3–0–28–0, దీపక్ హుడా 1–0–9–0, రవి బిష్ణోయ్ 2–0–12–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) బుమ్రా 77; మయాంక్ (బి) బుమ్రా 11; గేల్ (సి) బౌల్ట్ (బి) రాహుల్ చహర్ 24; పూరన్ (సి) కూల్టర్‌నీల్ (బి) బుమ్రా 24; మ్యాక్స్‌వెల్ (సి) రోహిత్ శర్మ (బి) రాహుల్ చహర్ 0; దీపక్ హుడా (నాటౌట్) 23; జోర్డాన్ (రనౌట్) 13; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–33, 2–75, 3–108, 4–115, 5–153, 6–176. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–0, కృనాల్ 2–0–12–0, బుమ్రా 4–0–24–3, కూల్టర్‌నీల్ 4–0–33–0, పొలార్డ్ 2–0–26–0, రాహుల్ చహర్ 4–0–33–2. మయాంక్, గేల్ విజయానందం -
సూపరో... సూపరు
ఉత్కంఠకు రూపం ఉంటే అది కూడా ఊపిరి బిగపట్టుకుని ఆస్వాదించేది. బంతి బంతికీ తారుమారవుతున్న ఆధిపత్యాన్ని చూసి అబ్బురపడేది. ప్రతి యేటా మండే ఎండలో అభిమానులకు క్రికెట్ వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి వర్షా కాలంలో జరుగుతున్నా అభిమానులు మాత్రం చివరి బంతి వరకు తుది ఫలితం ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ, అనుక్షణం చోటు చేసుకుంటున్న మలుపులకు మురిసిపోతూ తన్మయత్వంతో తడిసి ముద్దవుతున్నారు. ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు జరిగినా ఏ సీజన్లోనూ జరగని అత్యద్భుతం ఆదివారం చోటు చేసుకుంది. ఒకే రోజు రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ‘సూపర్ ఓవర్’కు దారి తీశాయి. తొలుత అబుదాబి వేదికగా జరిగిన ‘సూపర్’ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడించగా... దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత కూడా ‘సూపర్ ఓవర్’లోనే తేలింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ఒక సూపర్ ఓవర్లో కాకుండా రెండు సూపర్ ఓవర్లలో తేలడం విశేషం. గతంలో సూపర్ ఓవర్లోనూ రెండు జట్ల స్కోర్లు సమమైతే ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించేవారు. గతేడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ‘సూపర్ ఓవర్’ కూడా టై కావడం... ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఫలితంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమమైతే ఏదో ఒక జట్టు గెలిచేవరకు సూపర్ ఓవర్‌ను ఆడించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధన తెచ్చింది. ఐపీఎల్లో ఆదివారం ఈ నిబంధనను అమలు చేశారు. అబుదాబి: బంతితో అంతా తానై ఆడించిన లాకీ ఫెర్గూసన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును గట్టెక్కించాడు. ముందు 15 పరుగులకు 3 వికెట్లు... ఆ తర్వాత సూపర్ ఓవర్లో 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్ పేసర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు. వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ ఒత్తిడిలో తడబడి ఓటమివైపు నిలబడ్డాడు. ఆద్యంతం టన్నులకొద్దీ వినోదాన్ని పంచిన ఈ మ్యాచ్‌లో చివరకు గెలుపు కోల్కతావైపే నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ మోర్గాన్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో జట్టు మంచి స్కోరు అందుకుంది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 163 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. కెప్టెన్ వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫెర్గూసన్ (3/15) ఈ ఐపీఎల్లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం అందుకున్నాడు. నిదానంగా మొదలై.... దూకుడుగా ముగిసి మండే ఎండలో కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగానే సాగింది. తొలి మూడు ఓవర్లలో 15 పరుగులే చేసింది. తర్వాత రాహుల్ త్రిపాఠి 6, 4... గిల్ వరుసగా మూడు బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో 48 పరుగులు చేసిన కోల్‌కతా త్రిపాఠి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ కోసం బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నితీశ్ రాణా (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్))తో కలిసి గిల్ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 10 ఓవర్లకు కోల్‌కతా 77/1తో నిలిచింది. అప్పటికే కుదురుకున్న గిల్, రాణా వరుస ఓవర్లలో... ప్రియమ్ గార్గ్ అద్భుత ఫీల్డింగ్‌కు పెవిలియన్ బాట పట్టారు. కాసేపటికే రసెల్ (11 బంతుల్లో 9; 1 ఫోర్) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేయగలి గింది. ఈ దశలో మోర్గాన్, కార్తీక్ చెలరేగి చివరి ఐదు ఓవర్లలో 58 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మోర్గాన్ 4, 6 సహాయంతో 16 పరుగులు చేసి చివరి బంతికి అవుటయ్యాడు. విలియమ్సన్ పట్టుదల... ఫీల్డింగ్‌లో గాయపడిన విలియమ్సన్ ఓపెనర్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో సింగిల్స్ కోసం ఆరాటపడకుండా బౌండరీల ద్వారా పరుగులు సాధించాడు. బెయిర్‌స్టో కూడా విలియమ్సన్కు అండగా నిలవడంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 58 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇందులో 46 (10 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు బౌండరీల ద్వారా రావడం విశేషం. పవర్‌ప్లే తర్వాతి తొలి బంతికే విలియమ్సన్‌ను అవుట్ చేసి ఫెర్గూసన్ రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ఫెర్గూసన్ వైవిధ్యం... వార్నర్ పోరాటం విలియమ్సన్ ఔటయ్యాక హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడింది. అద్భుత బంతితో ప్రియమ్ గార్గ్ (4)ను బౌల్డ్ చేసిన ఫెర్గూసన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. మరుసటి ఓవర్లోనే బెయిర్‌స్టోను వరుణ్ అవుట్ చేశాడు. ఈ దశలో మరోసారి బంతి అందుకున్న ఫెర్గూసన్ చక్కటి యార్కర్‌తో మనీశ్ పాండే (6)ను పెవిలియన్ చేర్చి రైజర్స్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా వార్నర్ పోరాటం ఆపలేదు. విజయ్ శంకర్ (7)తో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో 15 ఓవర్లకు 109/4తో నిలిచింది. సమద్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) వచ్చాక ఆటలో వేగం పెరిగింది. ఉన్నంత వరకు ధాటిగా ఆడిన సమద్... కెప్టెన్‌పై భారాన్ని తగ్గించాడు. అప్పటివరకు బౌలింగ్‌తో బెంబేలెత్తించిన ఫెర్గూసన్ తెలివైన ఫీల్డింగ్‌తో సమద్‌ను అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక్కడే మ్యాచ్ పూర్తి మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఉత్కం‘టై’... చివరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయానికి 18 పరుగులు కావాలి. బౌలర్ రసెల్ బంతి అందుకున్నాడు. అనుభవాన్నంతా రంగరించి ఆడుతున్న వార్నర్, అప్పుడే వచ్చిన రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నారు. రసెల్ తొలి బంతిని నోబాల్ వేశాడు. ఆ తర్వాత ‘ఫ్రీ హిట్’ బంతిపై రషీద్ ఒక్క పరుగు తీసి వార్నర్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. వార్నర్ జూలు విదిల్చి వరుసగా మూడు బంతుల్లో మూడు ఫోర్లు కొట్టాడు. దాంతో సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్న వార్నర్ ఆఖరి బంతికి గురి తప్పాడు. రసెల్ వేసిన బంతి వార్నర్ ప్యాడ్ లకు తగిలి ఆఫ్‌సైడ్ కు వెళ్లిపోయింది. వార్నర్, రషీద్ ఒక పరుగు మాత్ర మే పూర్తి చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. రెండు జట్లు సూపర్ ఓవర్‌కు సిద్ధమయ్యాయి. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) గార్గ్ (బి) రషీద్ 36; త్రిపాఠి (బి) నటరాజన్ 23; రాణా (సి) గార్గ్ (బి) శంకర్ 29; రసెల్ (సి) శంకర్ (బి) నటరాజన్ 9; మోర్గాన్ (సి) పాండే (బి) థంపి 34; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–48, 2–87, 3–88, 4–105, 5–163. బౌలింగ్: సందీప్‌శర్మ 4–0– 27–0, థంపి 4–0–46–1, నటరాజన్ 4–0– 40–2, విజయ్ శంకర్ 4–0–20–1, రషీద్ ఖాన్ 4–0–28–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) రసెల్ (బి) వరుణ్ 36; విలియమ్సన్ (సి) రాణా (బి) ఫెర్గూసన్ 29; గార్గ్ (బి) ఫెర్గూసన్ 4; వార్నర్ (నాటౌట్) 47; మనీశ్ పాండే (బి) ఫెర్గూసన్ 6; శంకర్ (సి) గిల్ (బి) కమిన్స్ 23; సమద్ (సి) గిల్ (బి) శివమ్ మావి 23; రషీద్ ఖాన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–58, 2–70, 3–70, 4–82, 5–109, 6–146. బౌలింగ్: కమిన్స్ 4–0–28–1, మావి 3–0– 34–1, వరుణ్ 4–0–32–1, రసెల్ 2–0– 29–0, ఫెర్గూసన్ 4–0–15–3, కుల్దీప్ 3–0– 18–0. ► లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి (186 మ్యాచ్‌ల్లో 5,759 పరుగులు), రైనా (193 మ్యాచ్‌ల్లో 5,368 పరుగులు), రోహిత్ శర్మ (197 మ్యాచ్‌ల్లో 5,158 పరుగులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించడం ఇదే ప్రథమం. గతంలో మూడుసార్లు ఆ జట్టు సూపర్ ఓవర్లో ఓడింది. ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. 2009లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడి 5,037 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ► టోర్నీ చరిత్రలో ‘టై’ అయిన మ్యాచ్‌లు ► ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ‘టై’గా ముగియడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో ఢిల్లీ –పంజాబ్; ముంబై –బెంగళూరు; ముంబై–పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌లు ‘టై’గా ముగిసి తుది ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. -
మళ్లీ ‘సూపర్’... బెంగళూరు విన్నర్
దుబాయ్: మళ్లీ సిక్స్‌లే సిక్స్‌లు! వరదే వరద!! బౌండరీ లైనే చేరువైందో లేక బౌలింగే తేలిపోయిందో తెలీదు కానీ మెరుపులు అతి సులువవుతున్నాయి. పొదుపు బౌలింగ్ గగనమవుతోంది. గెలుపు ఖాయమనే అంచనాలు ఆఖరి బంతిదాకా మారుతూనే ఉన్నాయి. అలాంటి మ్యాచ్ ఐపీఎల్లో సోమవారం జరిగింది. క్రికెట్ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్‌లో చివరకు సూపర్ ఓవరే ఫలితాన్నిచ్చింది. 201 పరుగులు చేసినా దక్కని విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) ఆ ఒక్క సూపర్ ఓవర్‌తో దక్కింది. ముంబై ఇండియన్స్ పోరాటం ఆ ఓవర్లోనే ఆవిరైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్‌దత్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయ్యింది. ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీకి దూరమైనా భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. పొలార్డ్ (24 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) వణికించాడు. ముంబైకి కష్టాలు... 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి తొలి ఓవర్లోనే ఓపెనర్లు రోహిత్ 6, డికాక్ 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. ఇక ఆరంభం అదిరిందిలే అనుకుంటుండగా వరుస ఓవర్లలో రోహిత్ శర్మ (8)ను సుందర్, సూర్యకుమార్ (0)ను ఉదాన అవుట్ చేయడం ముంబైని కష్టాల్లోకి నెట్టింది. దీన్నుంచి తేరుకోకముందే మరో ఓపెనర్ డికాక్ (14)ను చహల్ ఔట్ చేశాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత మ్యాచ్ సాగేకొద్దీ లక్ష్యానికి దూరమైంది. జట్టు స్కోరు 50 చేరేందుకే 7.5 ఓవర్లు ఆడింది. 14 ఓవర్లు ముగిసినా వందనే చేరలేదు. 98/4 స్కోరు చేయగా... ఇక మిగిలిన 6 ఓవర్లలో 103 పరుగులు కావాలి. దాదాపు కష్టసాధ్యం. క్రీజులో ఉన్న పొలార్డ్ కూడా అప్పటిదాకా పెద్దగా మెరిపించలేదు. సిక్సర్ల ధమాకా.... ఇలాంటి స్థితిలో 17వ ఓవర్ ముంబై దశనే మార్చింది. 2 క్యాచ్‌లు నేలపాలు కావడంతో పొలార్డ్ ఓవర్ అసాంతం చితగ్గొట్టాడు. 4, 6, 6, 2, 6, 3లతో మొత్తం 27 పరుగులు రావడంతో జట్టు స్కోరు అనూహ్యంగా 149/4కు చేరింది. గత మ్యాచ్ (పంజాబ్, రాజస్తాన్) అనుభవం దృష్ట్యా ఇక 18 బంతుల్లో 53 పరుగులు కష్టంగా కనిపించలేదు. చహల్ 18వ ఓవర్లో 3 భారీ సిక్సర్లు బాదిన పొలార్డ్ 20 బంతుల్లోనే (2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. చహల్ కూడా 20 పైచిలుకు (22 పరుగులు) ఇవ్వడంతో ముంబై లక్ష్యానికి (12 బంతుల్లో 31 పరుగులు) దగ్గరైంది. 19వ ఓవర్లో నవదీప్ సైనీ 12 పరుగులిచ్చాడు. ముంబై ఆఖరి 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా ఉదాన వేసిన ఈ ఓవర్లో ఇషాన్ కిషన్ 2 సిక్సర్లు కొట్టి ఔట్కాగా... ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే పొలార్డ్ ఫోర్ కొట్టడంతో స్కోరు 201తో సమమైంది. మ్యాచ్ ‘టై’ అయింది. విజేత కోసం సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఓపెనర్ల ఫిఫ్టీ–ఫిఫ్టీ... అంతకుముందు ముంబై బౌలర్లపై బెంగళూరు ఓపెనర్లు ఫించ్, దేవ్‌దత్ విరుచుకపడి ఫోర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించారు. వీరిద్దరు అవుటయ్యాక విలియర్స్ వీరవిహారం చేశాడు. దాంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. బెంగళూరు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ పవన్ నేగి ఈ మ్యాచ్‌లో చక్కని క్యాచ్‌లతో ముగ్గురిని (రోహిత్, డికాక్, హార్దిక్) పెవిలియన్ పంపాడు. ఇవన్నీ కూడా బెంగళూరును మ్యాచ్‌లో నిలబెట్టాయి. పైగా పెద్ద లక్ష్యమే కావడంతో ఆర్సీబీ విజయం దాదాపు ఖాయమైన తరుణంలో గొప్ప మలుపు తీసుకుంది. జంపా వేసిన 17వ ఓవర్లో పొలార్డ్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీలైన్ వద్ద పవన్ నేగి నేలపాలు చేశాడు. అది కాస్తా లైన్ వెలుపల పడటంతో సిక్సర్ అయ్యింది. అదే ఓవర్లో చహల్ మరో క్యాచ్ చేజార్చాడు. దీంతో పాటు ఆ ఓవర్లో 27 పరుగులు రావడంతో ముంబై రేసులోకి వచ్చింది. కోహ్లి మళ్లీ... కోహ్లి (3) వరుసగా మళ్లీ విఫలమయ్యాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అతను 14, 1, 3 స్కోర్లతో నిరాశపరిచాడు. చిత్రమేమిటంటే యూఏఈ గడ్డపై ఇప్పటిదాకా ఈ స్టార్ క్రికెటర్ బ్యాట్ నుంచి ఒక్క బౌండరీ కూడా వెళ్లలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్‌దత్ (సి) పొలార్డ్ (బి) బౌల్ట్ 54; ఫించ్ (సి) పొలార్డ్ (బి) బౌల్ట్ 52; కోహ్లి (సి) రోహిత్ శర్మ (బి) రాహుల్ చహర్ 3; డివిలియర్స్ (నాటౌట్) 55; శివమ్ దూబే (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–81, 2–92, 3–154. బౌలింగ్: బౌల్ట్ 4–0–34–2, ప్యాటిన్సన్ 4–0–51–0, చహర్ 4–0–31–1, బుమ్రా 4–0–42–0, కృనాల్ 3–0–23–0, పొలార్డ్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) (సబ్) పవన్ నేగి (బి) సుందర్ 8; డికాక్ (సి) (సబ్) పవన్ నేగి (బి) చహల్ 14; సూర్యకుమార్ (సి) డివిలియర్స్ (బి) ఉదాన 0; ఇషాన్ కిషన్ (సి) దేవదత్ (బి) ఉదాన 99; హార్దిక్ (సి) (సబ్) పవన్ నేగి (బి) జంపా 15; పొలార్డ్ (నాటౌట్) 60; కృనాల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–14, 2–16, 3–39, 4–78, 5–197. బౌలింగ్: ఇసురు ఉదాన 4–0–45–2, వాషింగ్టన్ సుందర్ 4–0–12–1, నవదీప్ సైనీ 4–0–43–0, యజువేంద్ర చహల్ 4–0–48–1, ఆడమ్ జంపా 4–0–53–1. -
‘టై’ అయితే సంయుక్త విజేతగా ప్రకటించండి
న్యూఢిల్లీ: ఏడాది క్రితం వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదుర్కొన్న ఓటమి బాధను న్యూజిలాండ్ క్రికెటర్లు అంత సులువుగా మరచిపోయేలా లేరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు సమం కావడం, ఆపై సూపర్ ఓవర్ కూడా ‘టై’ కావడంతో బౌండరీ కౌంట్‌తో కివీస్ ఓడింది. దీనిపై ఆ జట్టు టాప్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మాట్లాడుతూ... వన్డేల్లో సూపర్ ఓవర్ అవసరమే లేదని...ఆ నిబంధనను తొలగించి, మ్యాచ్ ‘టై’గా ముగిస్తే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలన్నాడు. ‘టి20ల్లో సూపర్ ఓవర్ అంటే కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్ తరహాలో ఏదో ఒక ఫలితం కోసం అలా ఆడవచ్చు. కానీ వన్డేలో సూపర్ ఓవర్ ఆడించడమే అసమంజసం. ఇరు జట్లు అప్పటికి 100 ఓవర్లు ఆడి ఉంటాయి. ఇంతసేపు పోటీ పడిన తర్వాత రెండు జట్లు సమఉజ్జీగా నిలిచాయంటేనే ఎవరూ గెలవలేదనే కదా అర్థం. మ్యాచ్‌ను ‘టై’గా ప్రకటించడంలో తప్పేముంది’ అని టేలర్ వ్యాఖ్యానించాడు. -
‘సూపర్’ సీక్వెల్
మనం ఇన్నాళ్లు సీక్వెల్ సినిమాలెన్నో చూశాం. కానీ ఇప్పుడే సీక్వెల్‌గా ఉత్కం‘టై’న మ్యాచ్‌లు చూస్తున్నాం. మొన్న షమీ చెలరేగితే... రోహిత్ అదరగొట్టేశాడు. కానీ ఆ ‘టైబ్రేక్’లో వీళ్లిద్దరు సీనియర్లు. ఇప్పుడైతే శార్దుల్‌కు అంతగా అనుభవమే లేదు. పైగా భారత్‌కు మ్యాచ్‌పై పట్టులేదు. ఎవరికీ గెలుపుపై ఆశే లేదు. ఇలాంటి సమయంలో సంచలన బౌలింగ్‌తో శార్దుల్ కివీస్‌ను కట్టడి చేయడంతో స్కోర్లు సమమైంది. అంతే ఆట సూపర్కెళ్లింది. భారత్ చితగ్గొట్టింది. అలా రెండో సీక్వెల్ ‘టైబ్రేక్’లోనూ టీమిండియానే పైచేయి సాధించింది. క్లీన్‌స్వీప్ దారిలో నాలుగో అడుగు పడింది. ఇక మిగిలిందొక్కటే! న్యూజిలాండ్‌పై 20వ ఓవర్‌ను చూస్తే... వారెవ్వా శార్దుల్ అనే అంటాం. చివరకు ‘సూపర్’ ఫలితాన్ని చూస్తే మాత్రం ఏ కాస్త కనికరమున్నా... అయ్యో పాపం కివీస్ అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా ఆఖరిదాకా వచ్చి ఓడిపోయిందని జాలనిపిస్తుంది. ఇలా సూపర్ ఓవర్లో పదేపదే ఓడితే మాత్రం కచ్చితంగా ఎవరైన పాపమనే అంటారు. గత పదేళ్లుగా ఆరు మ్యాచ్‌ల్లో (ఒక వన్డే కలుపుకొని) సూపర్దాకా వెళ్లిన న్యూజిలాండ్ గెలుపును మాత్రం సాకారం చేసుకోలేకపోయింది. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా...ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 6 పరుగులే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. వెల్లింగ్టన్: గత మ్యాచ్ టై... ఈ మ్యాచ్ టై... అప్పుడు సూపర్, ఇప్పుడు సూపర్... అయినా విన్నర్ మారలేదు. కివీస్ తలరాత కూడా మారలేదు. మూడో మ్యాచ్‌లో ఆఖరి బంతులు భారత్‌కు అనూహ్య గెలుపునివ్వగా... ఈ మ్యాచ్‌లో శార్దుల్ అద్బుత బౌలింగ్ ప్రదర్శన భారత్ గెలిచేందుకు ఊపిరి పోసింది. శుక్రవారం కూడా ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకున్నాడు. సోధి 3, బెన్నెట్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు సరిగ్గా 165 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మన్రో (47 బంతుల్లో 64; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సీఫెర్ట్ (39 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. శార్దుల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆదుకున్న పాండే మనీశ్ పాండే షాట్ మళ్లీ టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్ రాహుల్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. అతనితో ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూ సామ్సన్ (8) సహా కెప్టెన్ కోహ్లి (11), శ్రేయస్ అయ్యర్ (1), శివమ్ దూబే (12) అంతా విఫలం కాగా... టీమిండియా 12 ఓవర్లు ముగియక ముందే 88 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మనీశ్ పాండే చేసిన ఫిఫ్టీనే ‘శతక’మంత సాయం చేసింది. టెయిలెండర్లు శార్దుల్ (15 బంతుల్లో 20; 2ఫోర్లు), సైనీ (11 నాటౌట్) అండతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మన్రో, సీఫెర్ట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఏమంత కష్టం కానీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ ‘పవర్ ప్లే’లో గప్టిల్ (4) వికెట్ కోల్పోయింది. మన్రో, సీఫెర్ట్‌ల రెండో వికెట్ భాగస్వామ్యం 74 పరుగులకు చేరడం, జట్టు స్కోరు వందకు సమీపించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ఎట్టకేలకు రనౌట్ రూపంలో మన్రో, పరుగు వ్యవధిలో బ్రూస్ (0) ఔట్ కావడంతో చిగురించిన ఆశలపై సీఫెర్ట్, టేలర్ (18 బంతుల్లో 24; 2 ఫోర్లు) నీళ్లుచల్లారు. 19 ఓవర్లలో కివీస్ స్కోరు 159/3. అప్పటికే సీఫెర్ట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. టేలర్ ఔట్ – సీఫెర్ట్ రనౌట్ ఇంకా చేతిలో 7 వికెట్లుండటం... 6 బంతుల్లో విజయానికి 7 పరుగులు అవసరముండటంతో కివీస్ విజయం దాదాపు ఖాయమైంది. కానీ చివరి ఓవర్ తొలి బంతి నుంచే గెలుపు మలుపు తీసుకుంది. శార్దుల్ వేసిన ఫుల్లెంత్ డెలివరీని లాఫ్టెడ్ షాట్ ఆడగా అది మిడ్ వికెట్లో అయ్యర్ చేతికి చిక్కింది. క్రీజ్‌లోకి వచ్చిన మిచెల్ వస్తూనే బౌండరీ కొట్టాడు. ఇక మిగిలింది 3 పరుగులైతే 4 బంతులున్నాయి. మూడో బంతి మిచెల్‌ను బీట్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లగా పరుగందుకున్న సీఫెర్ట్ వచ్చే లోపే రాహుల్ వికెట్లకు గిరాటేయడంతో అతను రనౌటయ్యాడు. ఉత్కంఠ ఉన్నపళంగా పెరిగింది. నాలుగో బంతికి ఓ పరుగుతీశాడు. ఐదో బంతిని మిచెల్ (4) గాల్లోకి లేపాడు. మిడాఫ్‌లో ఉన్న దూబే క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి వుండగా సాన్‌ట్నర్ ఒక పరుగు మాత్రమే పూర్తి చేశాడు. రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించగా డీప్ పాయింట్లో ఉన్న సామ్సన్ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని కీపర్‌కు అందించాడు. రెప్పపాటు వ్యవధిలోనే రాహుల్ వికెట్లను కూల్చేయడంతో సాన్‌ట్నర్ (2) రనౌట్. మ్యాచ్ టై అయ్యింది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో రోహిత్, జడేజా, షమీలకు విశ్రాంతినిచ్చి సంజూ సామ్సన్, వాషింగ్టన్ సుందర్, సైనిలకు అవకాశమిచ్చింది. కానీ ఈ ముగ్గుర్లో ఎవరూ రాణించలేదు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ కూడా గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ‘ప్రత్యర్థి ఎంత బాగా ఆడుతున్నా చివరి వరకు ప్రశాంతంగా ఉండి పోరాడాలని ఈ రెండు మ్యాచ్‌లు నాకు నేర్పించాయి. ఇంతకంటే అద్భుతమైన మ్యాచ్‌లను ఆశించలేం. గతంలో ఎప్పుడూ సూపర్ ఓవర్ ఆడని మేం ఇప్పుడు వరుసగా రెండు గెలిచాం. సూపర్ ఓవర్లో సామ్సన్తో ఓపెనింగ్ చేయించాలనుకున్నా నా అనుభవం పనికొస్తుందని రాహుల్ చెప్పడంతో నేనే బ్యాటింగ్‌కు వచ్చాను. మా ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా’ –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి)సాన్‌ట్నర్ (బి) సోధి 39; సామ్సన్ (సి) సాన్‌ట్నర్ (బి) కుగ్లీన్ 8; కోహ్లి (సి) సాన్‌ట్నర్ (బి) బెన్నెట్ 11; అయ్యర్ (సి) సీఫెర్ట్ (బి) సోధి 1; దూబే (సి) బ్రూస్ (బి) సోధి 12; పాండే నాటౌట్ 50; సుందర్ (బి) సాన్‌ట్నర్ 0; శార్దుల్ (సి) సౌతీ (బి) బెన్నెట్ 20; చహల్ (సి) íసీఫెర్ట్ (బి) సౌతీ 1; సైనీ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–14, 2–48, 3–52, 4–75, 5–84, 6–88, 7–131, 8–143. బౌలింగ్: సౌతీ 4–0–28–1, కుగ్లీన్ 4–0–39–1, సాన్‌ట్నర్ 4–0–26–1, బెన్నెట్ 4–0–41–2, సోధి 4–0–26–3. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 4; మన్రో రనౌట్ 64; íసీఫెర్ట్ రనౌట్ 57; బ్రూస్ (బి) చహల్ 0; టేలర్ (సి) అయ్యర్ (బి) ఠాకూర్ 24; మిచెల్ (సి) దూబే (బి) ఠాకూర్ 4; సాన్‌ట్నర్ రనౌట్ 2; కుగ్లీన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–22, 2–96, 3–97, 4–159, 5–163, 6–164, 7–165. బౌలింగ్: శార్దుల్ 4–0–33–2, సైనీ 4–0–29–0, బుమ్రా 4–0–20–1, చహల్ 4–0–38–1, సుందర్ 2–0–24–0, దూబే 2–0–14–0. -
ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్..
దుబాయ్: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందిగా! న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య హోరాహోరీ పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇదీ ‘టై’ కాగా బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతను చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ దిశగా అడుగు వేసింది. తాజాగా జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్ ‘టై’ అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని నిర్ణయించింది. కేవలం నాకౌట్ దశలోనే ఆడించే సూపర్ ఓవర్లను ఇకపై లీగ్ దశలోనూ ఆడిస్తారు. కానీ... ఆ సూపర్ ‘టై’ అయితే మ్యాచ్‌ను ‘టై’గా పరిగణిస్తారు. మరో సూపర్ ఓవర్ ఉండదు. జింబాబ్వే, నేపాల్ జట్లపై విధించిన నిషేధాన్ని కూడా ఐసీసీ ఎత్తేసింది. మహిళల మెగా ఈవెంట్ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. టి20 ప్రపంచకప్ విజేతకు 10 లక్షల డాలర్లు (రూ.7 కోట్లు), రన్నరప్ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3.5 కోట్లు) ఇస్తారు. వన్డే ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీని 3.5 మిలియన్ డాలర్లు (రూ.24.8 కోట్లకు) పెంచింది. 2021 నుంచి అండర్–19 మహిళల టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. -
‘బౌండరీ’కి బదులు రెండో సూపర్
న్యూఢిల్లీ: బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సమానంగా ఆడినప్పటికీ ఇంగ్లీషు టీమ్‌ను విజేతగా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మ్యాచ్‌ల్లో ఫలితం రాబట్టేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ప్రతిపాదన తెచ్చారు. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బౌండరీ విధానంతో ఫలితం తేల్చకుండా మరో సూపర్ ఓవర్ ఆడించివుంటే బాగుండేదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ ఫైనల్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ కీలకమేనని, ఫుట్‌బాల్‌లో ఫలితం తేలకపోతే అదనపు సమయం ఇస్తారని గుర్తుచేశాడు. బౌండరీ నింబధనను రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ కూడా తప్పుబట్టారు. ప్రపంచకప్‌లో నాకౌట్ విధానంలోనూ మార్పులు చేయాల్సిన అవసరముందని సచిన్ అభిప్రాపడ్డాడు. ఐపీఎల్ తరహాలో టాప్ నిలిచిన జట్టుకు నాకౌట్లో ఓడితే మరొక అవకాశం కల్పించాలని సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపిస్తే బాగుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ తర్వాత క్రీజ్‌లో రావాల్సిందని పేర్కొన్నాడు. -
బౌండరీలు కూడా సమానమైతే?
లార్డ్స్ : నరాలు తెగే ఉత్కంఠ మధ్య ప్రపంచకప్ మహాసంగ్రామం ముగిసింది. క్రికెట్ పుట్టినింటికే విశ్వకానుక చేరింది. 45 రోజుల ఆట ఏడున్నర గంటల్లో తేలకపోయినా 4 నిమిషాల్లో మెరిసి మురిసింది. తృటిలో టైటిల్ చేజార్చుకున్న న్యూజిలాండ్ మాత్రం అభిమానుల మనుసులను గెలుచుకుంది. ప్రపంచకప్ ఫైనల్ టై కావడమే విశేషం అంటే.. తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడం సగటు క్రికెట్ అభిమానిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. అయితే చివరకు బౌండరీలు మ్యాచ్ ఫలితం తేల్చగా.. కివీస్‌ను మాత్రం నిరాశ పరిచాయి. ఈ తుదిపోరులో ఇంగ్లండ్ సూపర్ ఓవర్‌తో కలుపుకొని 26 బౌండరీలు బాదగా.. కివీస్ మాత్రం 17 బౌండరీలే సాధించింది. దీంతో విశ్వవిజేతగా క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ నిలిచింది. సూపర్ ఓవర్ టై అయితే ప్రధానమ్యాచ్, సూపర్ ఓవర్ మొత్తం బౌండరీలు లెక్కించి.. ఎక్కవ బౌండరీలు చేసిన జట్టును విజేతగా ప్రకటించారు. మరీ ఆ బౌండరీలు కూడా టై అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతి అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం ఈ పరిస్థితి కనుక ఏర్పడితే.. కేవలం ప్రధాన మ్యాచ్ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. ఒకవేళ అవి కూడా సమానమైతే.. సూపర్ ఓవర్ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన పరుగులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ రన్స్ చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఊదాహారణకు... బంతులు తొలి జట్టు రెండో జట్టు 6వ బంతి 4 4 5వ బంతి 3 2 4వ బంతి 6 4 3వ బంతి 1 2 2వ బంతి 1 2 1వ బంతి 1 2 ఇక్కడ తొలి జట్టు చివరి బంతికి 4 పరుగులు సాధించగా.. రెండో జట్టు కూడా అంతే పరుగులు చేసింది. ఐదో బంతికి తొలి జట్టు 3 పరుగులు చేయగా.. రెండో జట్టు మాత్రం 2 పరుగులే చేసింది. రెండో జట్టు కన్నా ఒక పరుగు ఎక్కువ చేసింది కనుక సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం తొలి జట్టే విజేత అవుతోంది. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
ప్రపంచ కల నెరవేరింది
ఒకప్పుడు సగం ప్రపంచాన్ని ఏలినా... ఇన్నాళ్లూ ప్రపంచ కప్ మాత్రం వారికి కలే... మూడుసార్లు కడపటి మెట్టుపై బోల్తా... ఆపై దరిదాపులకూ రాలేని దీన స్థితి... నాలుగోసారి మాత్రం ఆ కల నెరవేరింది... ఓ దశలో కల్లగా మారేలా ఉన్నా కాలం కలిసొచ్చింది... ఒత్తిడిని పక్కకు నెడుతూ, ఉత్కంఠను తట్టుకుని... విశ్వ విజేత కిరీటం వారిని వరించింది. ఔను...! ఇంగ్లండ్ సాధించింది... ఎట్టకేలకు వన్డే చాంపియన్ అయింది... వీడని నీడలాంటి వారి ఆశయం నెరవేరింది... ఎన్నాళ్లో వేచిన విజయం పలకరించింది... చాలావరకు సాదాసీదాగా సాగిన ఫైనల్... ఆఖర్లో అదిరిపోయే హై డ్రామా సృష్టించింది... మైదానంలో అభిమానులను మునివేళ్లపై నిలిపింది... టీవీల ముందు ప్రేక్షకులను కన్నార్పకుండా చేసింది... ప్రపంచ కప్ తుది సమరం ‘టై’ అవడమే అరుదంటే... వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్ ఆడిస్తే... అందులోనూ ఇరు జట్ల స్కోర్లు సమమైతే... ఇంతకంటే మజా మజా ఏదైనా ఏముంటుంది? ఏదేమైనా క్రికెట్ పుట్టిల్లు పండుగ చేసుకుంది... వారి ‘ప్రపంచ కల’ సొంతగడ్డపైనే నెరవేరింది... నాలుగేళ్ల వారి శ్రమకు ఫలితం దక్కింది... రాబోయే నాలుగేళ్లు వారే రారాజని తీర్పొచ్చింది... లండన్ : ఇంగ్లండ్ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్ కప్ ఫైనల్లో వన్ ఓవర్ ఎలిమినేటర్ పద్ధతిలో ఇంగ్లండ్ విజేతగా ఆవిర్భవించింది. ఇక్కడి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన ఓపెనర్ హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ లాథమ్ (56 బంతుల్లో 47; 2 ఫోర్లు, సిక్స్) రాణించాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విలియమ్సన్ (53 బంతుల్లో 30; 2 ఫోర్లు) స్కోరుకు సమానంగా అదనపు పరుగులు రావడం గమనార్హం. వోక్స్ (3/37), ప్లంకెట్ (3/42)లకు చెరో మూడు వికెట్లు దక్కాయి. చివర్లో హై డ్రామా నడుమ ఇంగ్లండ్ సరిగ్గా 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు (15) సమం కాగా... ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో నమోదైన బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను జగజ్జేతగా ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లు నీషమ్ (3/43), ఫెర్గూసన్ (3/50) వరుసగా వికెట్లు పడగొట్టడం, గ్రాండ్‌హోమ్ (1/25) పొదుపుగా బంతులే యడంతో ఛేదనలో ఇంగ్లండ్ కష్టాలు ఎదుర్కొంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (98 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటం, బట్లర్ (60 బంతుల్లో 59; 6 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో తేరుకుంది. నికోల్స్ నిలిచాడు... లాథమ్ ఆడాడు కివీస్ ఓపెనింగ్ జంట నికోల్స్, గప్టిల్ (18 బంతుల్లో 19, 2 ఫోర్లు, సిక్స్) ఫైనల్లో కాసేపు నిలిచింది. ఆర్చర్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో దూకుడు చూపిన గప్టిల్‌ను వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. విలియమ్సన్ జాగ్రత్తగా ఆడాడు. ఎదుర్కొన్న 12వ బంతికి గానీ పరుగు తీయలేకపోయాడు. పవర్ ప్లే అనంతరం ఇద్దరూ వేగం పెంచడంతో కదలిక వచ్చింది. స్వల్ప వ్యవధిలో వీరిని ఔట్ చేసి కివీస్‌కు ప్లంకెట్ షాకిచ్చాడు. అతడి గుడ్ లెంగ్త్ బంతి విలియమ్సన్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది. అంపైర్ ధర్మసేన ఔటివ్వకున్నా మోర్గాన్ రివ్యూ కోరి ప్రత్యర్థి కెప్టెన్‌ను సాగనంపాడు. అంపైర్ ఎరాస్మస్ తప్పుడు నిర్ణయానికి రాస్ టేలర్ (15) బలయ్యాడు. ఆల్‌రౌండర్ నీషమ్ (25 బంతుల్లో 19; 3 ఫోర్లు) మిడాన్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. గ్రాండ్‌హోమ్ (16) అండగా లాథమ్ బండి లాగించాడు. వోక్స్ ఈ ఇద్దరినీ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. హెన్రీ (4), సాన్‌ట్నర్ (5 నాటౌట్) చివర్లో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇంగ్లండ్ కష్టంగానైనా అందుకుంది... ఇంగ్లండ్ ఛేదన సులువుగా సాగలేదు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతే ఓపెనర్ జేసన్ రాయ్ (20 బంతుల్లో 17; 3 ఫోర్లు) ప్యాడ్లను తాకింది. అంపైర్ ఎరాస్మస్ ఔటివ్వకపోవడంతో కివీస్ సమీక్ష కోరింది. బంతి లెగ్ స్టంప్ మీదుగా వెళ్తున్నట్లు తేలడంతో ఎరాస్మస్ నిర్ణయానికి కట్టుబడ్డాడు. హెన్రీ... రాయ్‌ను ఊగిసలాటలో పడేసి వికెట్ దక్కించుకున్నాడు. రూట్ (30 బంతుల్లో 7) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. గ్రాండ్హోమ్పై ప్రతాపం చూపబోయి వికెట్ ఇచ్చేశాడు. బెయిర్ స్టో (55 బంతుల్లో 36; 7 ఫోర్లు) వికెట్లను ఫెర్గూసన్ గిరాటేశాడు. ఆ వెంటనే మోర్గాన్ (9) పేలవ షాట్‌కు ఔటయ్యాడు. అప్పటికి 23.1 ఓవర్లలో జట్టు స్కోరు 86/4. స్టోక్స్–బట్లర్ ఐదో వికెట్‌కు 130 బంతుల్లో 110 పరుగులు జోడించి మలుపు తిప్పారు. 53 బంతుల్లో బట్లర్, స్టోక్స్ 81 బంతుల్లో అర్ధసెంచరీలు అందుకున్నారు. సమీకరణం 32 బంతుల్లో 46 పరుగులుగా మారి విజయావకాశాలు మెరుగైన స్థితిలో ఫెర్గూసన్ ఓవర్లో బట్లర్ షాట్‌కు యత్నించి ఔటవడం ఉత్కంఠ పెంచింది. స్టోక్స్ పోరాడుతున్నా... వోక్స్ (2)ను పెవిలియన్ చేర్చి కివీస్ మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చింది. 49వ ఓవర్లో ప్లంకెట్ (10), ఆర్చర్ (0)లను నాలుగు బంతుల వ్యవధిలో ఔట్ చేసి నీషమ్ ఒత్తిడిని ఆతిథ్య జట్టు మీదకు నెట్టాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... బౌల్ట్ తొలి రెండు బంతులకు స్టోక్స్ పరుగులు చేయలేకపోయాడు. మూడో బంతిని సిక్స్ కొట్టాడు. నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్‌లోకి పంపి రెండో పరుగుకు యత్నిస్తుండగా గప్టిల్ త్రో స్టోక్స్‌కు తగిలి 6 పరుగులు వచ్చాయి. లక్ష్యం రెండు బంతుల్లో 3 పరుగులుగా మారింది. రషీద్ (0), వుడ్ (0) రనౌట్లయినా పరుగు వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి ఐదు ఓవర్లు హైడ్రామా... ఫైనల్లో చివరి ఐదు ఓవర్ల హైడ్రామా ఇరు జట్ల పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. అప్పటికి ఇంగ్లండ్ 30 బంతుల్లో 46 పరుగులు చేయాలి. బట్లర్ రెండు బంతుల ముందే ఔటయ్యాడు. వోక్స్ (46.1), ప్లంకెట్ (48.3), ఆర్చర్ (48.6) ఔటవ డంతో కప్ న్యూజిలాండ్‌దే అనిపించింది. కానీ, అటు పరుగులూ రావడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి ఓవర్లో స్టోక్స్ సిక్స్, ఓవర్ త్రో రూపంలో 2 ప్లస్ 4 పరుగులు రావడంతో తలకిందులైంది. బౌల్ట్ క్యాచ్... సిక్స్... మ్యాచ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన టర్నింగ్ పాయింట్ నీషమ్ ఓవర్లో స్టోక్స్ కొట్టిన సిక్స్ షాట్. 9 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన స్థితిలో జరిగిందీ ఘటన. స్టోక్స్ మిడ్ వికెట్‌లోకి భారీ షాట్ ఆడగా... బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేసిన తప్పిదం దెబ్బకొట్టింది. లైన్‌కు కొన్ని అంగుళాల ముందే బంతిని అందుకున్న బౌల్ట్... అలాఅలా వెనక్కువెళ్తూ బౌండరీ రోప్‌ను తొక్కేశాడు. ఎదురుగా ఫీల్డర్ గప్టిల్ ఉన్నా అతడికి విసిరే ప్రయత్నం చేయలేకపోయాడు. పోనీ, బంతిని లోపలకు విసిరేసినా ఆరు పరుగులు బదులుగా రెండో, మూడో వచ్చేవి. అవేవీ కాకపోగా ఏకంగా సిక్స్ నమోదైంది. బోనస్‌గా స్టోక్స్‌కు లైఫ్ వచ్చింది. ప్రధాన పేసర్ అయిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ (10 ఓవర్లలో 67 పరుగులు; సూపర్ ఓవర్లో 15 పరుగులు) ఆకట్టుకోలేకపోవడం కివీస్‌కు వేదన మిగిల్చింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీడబ్ల్యూ) వోక్స్ 19; నికోల్స్ (బి) ప్లంకెట్ 55; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ప్లంకెట్ 30; టేలర్ (ఎల్బీడబ్ల్యూ) వుడ్ 15; లాథమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 47; నీషమ్ (సి) రూట్ (బి) ప్లంకెట్ 19; గ్రాండ్‌హోమ్ (సి) సబ్ (విన్స్) (బి) వోక్స్ 16; సాన్‌ట్నర్ (నాటౌట్) 5; హెన్రీ (బి) ఆర్చర్ 4; బౌల్ట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 241 వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240. బౌలింగ్: వోక్స్ 9–0–37–3; ఆర్చర్ 10–0–42–1; ప్లంకెట్ 10–0–42–3; వుడ్ 10–1–49–1; రషీద్ 8–0–39–0; స్టోక్స్ 3–0–20–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 17; బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్ 36; రూట్ (సి) లాథమ్ (బి) గ్రాండ్‌హోమ్ 7; మోర్గాన్ (సి) ఫెర్గూసన్ (బి) నీషమ్ 9, స్టోక్స్ (నాటౌట్) 84; బట్లర్ (సి) సబ్ (సౌతీ) (బి) ఫెర్గూసన్ 59; వోక్స్ (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 2; ప్లంకెట్ (సి) బౌల్ట్ (బి) నీషమ్ 10; ఆర్చర్ (బి) నీషమ్ 0; రషీద్ (రనౌట్) 0; మార్క్ వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 241. వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241. బౌలింగ్: బౌల్ట్ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్ 10–2–25–1, ఫెర్గూసన్ 10–0–50–3, నీషమ్ 7–0–43–3, సాన్‌ట్నర్ 3–0–11–0. సూపర్ ఓవర్ సాగిందిలా... నోట్: సూపర్ ఓవర్లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ 26 బౌండరీలు కొట్టగా... న్యూజిలాండ్ 17 బౌండరీలు సాధించింది. స్టోక్స్... మాస్టర్ స్ట్రోక్... ప్రపంచ కప్ నెగ్గడం జట్టుగా ఇంగ్లండ్‌కు ఎంత సంబరమో, అంతకుమించి బెన్ స్టోక్స్‌కు వ్యక్తిగతంగా ఆనందదాయకం. ఎందుకంటే అతడి చేతుల మీదుగానే ఇంగ్లండ్‌కు ఒక కప్ (2017 టి20 ప్రపంచ కప్) చేజారింది. భారత్ వేదికగా జరిగిన నాటి కప్ ఫైనల్లో స్టోక్స్ వేసిన చివరి ఓవర్లో కార్లొస్ బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాది వెస్టిండీస్‌కు కప్‌ను సాధించి పెట్టాడు. అప్పుడు స్టోక్స్ పిచ్ పైనే కుప్పకూలి రోదించాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఆ చేదు అనుభవాన్ని అతడు తన చేతులతోనే చెరిపేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన స్టోక్స్ తన స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఒడ్డునపడేశాడు. సహచరులు వెనుదిరుగుతున్నా పట్టు వదలకుండా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సూపర్ ఓవర్లోనూ బ్యాటింగ్‌కు వచ్చి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చాడు. టోర్నీలో స్టోక్స్ ఆస్ట్రేలియాపై (89), శ్రీలంకపై (82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్‌లు ఓటముల కారణంగా వెలుగులోకి రాలేకపోయాయి. ఫైనల్లో మాత్రం అతడి శ్రమకు అత్యద్భుత రీతిలో ఫలితం దక్కింది. గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గప్టిల్‌ను ఓదార్చుతున్న నీషమ్ -
‘సూపర్ ఓవర్’లో నెగ్గిన ముంబై
-
ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టాడు!
ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో క్రునాల్ పొదుపుగా బౌలింగ్ చేసి 14 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 29 పరుగులు (20 బంతుల్లో) చేశాడు. క్రునాల్ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ముంబై సూపర్ ఓవర్ దాకా వెళ్లగలిగింది. సూపర్ ఓవర్లో బూమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై జట్టును విజయం వరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రునాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా క్రునాల్ మాట్లాడుతూ ‘నన్ను నేను ఆల్‌రౌండర్‌గా భావించుకుంటాను. బ్యాటుతోనూ, బంతితోనూ మైదానంలో రాణించాలని కోరుకుంటాను. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌గానూ, బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్‌గానూ భావించుకుంటాను’ అని అతను చెప్పాడు. గుజరాత్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు పిచ్ అంతా అనుకూలంగా లేదని, కానీ, చివరి ఓవర్లో తాను సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ టై వరకు వెళ్లేందుకు దోహదపడిందని తెలిపాడు. ఆఖరి ఓవర్లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరం కాగా తొలి బంతిని కృనాల్ సిక్సర్ కొట్టగా... రెండో బంతికి సింగిల్ వచ్చింది. అయితే మూడో బంతికి బుమ్రా అవుటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు... ఐదో బంతికి సింగిల్ వచ్చాయి. చివరి బంతికి కృనాల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయిన సంగతి తెలిసిందే. -
భళారే... బుమ్రా
► ‘సూపర్ ఓవర్’లో నెగ్గిన ముంబై ఇండియన్స్ ► పోరాడి ఓడిన గుజరాత్ లయన్స్ రాజ్‌కోట్: లక్ష్యం 154 పరుగులే అయినా చిట్టచివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేగిన గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ చివరకు ‘టై’గా ముగిసింది. దీంతో పదో సీజన్లో తొలిసారిగా ‘సూపర్ ఓవర్’ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు నెగ్గింది. ‘సూపర్ ఓవర్’ లో ముంబై జట్టు పొలార్డ్, బట్లర్ వికెట్లు (ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కే అవకాశం) కోల్పోయి 5 బంతుల్లో 11 పరుగులు చేసింది. ఆ తర్వాత 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ బుమ్రా వేసిన ‘సూపర్’ ఓవర్లో మెకల్లమ్, ఫించ్ పూర్తిగా తడబడి ఆరు పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. పైగా ఇందులో ఓ నోబ్, ఓ వైడ్ కూడా ఉండడం విశేషం. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జడేజా (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కృనాల్ పాండ్యాకు మూడు, మలింగ.. బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (44 బంతుల్లో 70; 9 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన కృనాల్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చివర్లో మెరుపులు... టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆరంభం నుంచే తడబడింది. ఆడుతోంది సొంత గడ్డపైనే అయినా టాప్ ఆర్డర్ కనీసం పవర్‌ప్లే ఓవర్లు కూడా ఆడలేకపోయింది. మెకల్లమ్ (6), రైనా (1), ఫించ్ (0), దినేష్ కార్తీక్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో లయన్స్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అయితే ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. చూడచక్కని షాట్లతో విరుచుకుపడిన తను మూడో ఓవర్లో వరుసగా ఓ సిక్స్, రెండు ఫోర్లతో పాటు ఆ తర్వాత ఓవర్లో రెండు ఫోర్లతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు సహకారం అందించాడు. దూకుడు మీదున్న ఇషాన్ కిషన్‌ను 12వ ఓవర్లో హర్భజన్ పెవిలియన్‌కు పంపాడు. 16 ఓవర్లలో ఏడు వికెట్లకు 102 పరుగులతో ఉన్న జట్టు స్కోరును ఆండ్రూ టై, ఫాల్క్‌నర్ ఉరకలెత్తించడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటగలిగింది. 18వ ఓవర్లో ఫాల్క్‌నర్ ఓ ఫోర్, ఆండ్రూ టై రెండు సిక్సర్లు బాదడంతో 19 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన 19వ ఓవర్లో వీరిద్దరు వరుస బంతుల్లో అవుటయినా అప్పటికే ఎనిమిదో వికెట్‌కు 43 పరుగులు వచ్చాయి. తడబాటు... లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. మూడో ఓవర్లో పార్థివ్ రెండు ఫోర్లు, సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. నాలుగో ఓవర్లో బట్లర్ (9) వెనుదిరగ్గా నితీశ్ రాణా (16 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) కూడా త్వరగానే అవుటయ్యాడు. అటు పార్థివ్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అయితే పవర్‌ప్లే అనంతరం ఒక్కసారిగా ముంబై స్కోరులో వేగం తగ్గింది. దీనికి తోడు 14వ ఓవర్లో ఫాల్క్‌నర్.. కెప్టెన్ రోహిత్ (5), పార్థివ్‌ను అవుట్ చేయడంతో ఒత్తిడి పెరిగింది. చివరి రెండు ఓవర్లలో 15 పరుగులు రావాల్సి ఉండగా 19వ ఓవర్లో థంపి.. హార్దిక్ (4), హర్భజన్‌ను అవుట్ చేయగా, మెక్లీనగన్ (1) రనౌట్ అయ్యాడు. టై అయ్యింది ఇలా... ఇక ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా తొలి బంతిని కృనాల్ సిక్సర్ కొట్టగా... రెండో బంతికి సింగిల్ వచ్చింది. అయితే మూడో బంతికి బుమ్రా అవుటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు... ఐదో బంతికి సింగిల్ వచ్చాయి. చివరి బంతికి కృనాల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయ్యింది. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 48; మెకల్లమ్ (బి) మలింగ 6; రైనా (సి) పొలార్డ్ (బి) బుమ్రా 1; ఫించ్ (బి) మలింగ 0; కార్తీక్ (స్టంప్డ్) పార్థివ్ (బి) కృనాల్ పాండ్యా 2; జడేజా (సి) అండ్ (బి) కృనాల్ పాండ్యా 28; ఫాల్క్‌నర్ (బి) బుమ్రా 21; ఇర్ఫాన్ పఠాన్ (సి) హారిద్క్ పాండ్యా (బి) కృనాల్ పాండ్యా 2; ఆండ్రూ టై రనౌట్ 25; బాసిల్ థంపి నాటౌట్ 2; అంకిత్ సోని నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–21, 2–46, 3–48, 4–56, 5–83, 6–95, 7–101, 8–144, 9–144. బౌలింగ్: మెక్లీనగన్ 4–0–50–0, మలింగ 4–0–33–2, హర్భజన్ 4–0–23–1, బుమ్రా 4–0–32–2, కృనాల్ పాండ్యా 4–0–14–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (సి) కార్తీక్ (బి) ఫాల్క్‌నర్ 70; బట్లర్ రనౌట్ 9; నితీశ్ రాణా ఎల్బీడబ్ల్యూ (బి) అంకిత్ 19, రోహిత్ శర్మ (సి)కార్తీక్ (బి) ఫాల్క్‌నర్ 5, పొలార్డ్ (సి) మెకల్లమ్ (బి) బాసిల్ థంపి 15; కృనాల్ పాండ్యా రనౌట్ 29; హార్దిక్ పాండ్యా (సి) కిషన్ (బి) బాసిల్ థంపి 4; హర్భజన్ ఎల్బీడబ్ల్యూ (బి) బాసిల్ థంపి 0; మెక్లీనగన్ రనౌట్ 1; బుమ్రా రనౌట్ 0; మలింగ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 1, మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–43, 2–82, 3–104, 4–109, 5–127, 6–139, 7–142, 8–143, 9–150, 10–153 బౌలింగ్: బాసిల్ థంపి 4–0–29–3, ఫాల్క్‌నర్ 4–0–34–2, ఇర్ఫాన్ 2–0–26–0, అంకిత్ 4–0–16–1, రైనా 4–0–28–0, ఆండ్రూ టై 1–0–9–0, జడేజా 1–0–11–0. -
సూపర్ టై... రాయల్స్ జై!]
బౌండరీల లెక్కలో నెగ్గిన రాజస్థాన్ కోల్‌కతాకు నిరాశ తొలుత మ్యాచ్ టై తర్వాత సూపర్ ఓవర్ కూడా టై నాటకీయంగా గట్టెక్కిన రాయల్స్ స్కోర్లు సమమైతే టై.... ఫలితానికి సూపర్ ఓవర్ ఉంటుంది... ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే..?ఇన్నాళ్లూ అనేకసార్లు టి20 మ్యాచ్‌లు చూసినా... సూపర్ ఓవర్ టై కావడాన్ని మాత్రం చూడలేదు. ఐపీఎల్లో తొలిసారి ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాజస్థాన్, కోల్‌కతాల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే రెండు జట్లలో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టుది విజయం. మ్యాచ్‌లో రాజస్థాన్ 18 బౌండరీలు సాధించగా... కోల్‌కతా కేవలం 14 బౌండరీలు కొట్టింది. దీంతో రాజస్థాన్ ఖాతాలో విజయం చేరింది. అబుదాబి: నరాలు తెగే ఉత్కంఠ... ఆఖరి బంతి వరకూ ఇరు జట్లతో విజయం దోబూచులాట... అనూహ్య మలుపులు... క్షణక్షణానికీ మారిన సమీకరణాలు... అటు స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకులు, ఇటు టీవీసెట్ల ముందు కోట్లాది అభిమానులు అందరినీ మునికాళ్లమీద నిలబెట్టిన మ్యాచ్... తొలుత టై... ఆ తర్వాత సూపర్ ఓవర్ టై... కానీ బౌండరీలు ఎక్కువగా సాధించడం ద్వారా రాజస్థాన్ ఖాతాలో విజయం. షేక్ జయేద్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌండరీల లెక్కలో కోల్‌కతాపై గెలిచింది. తొలుత రెండు జట్లు 20 ఓవర్లలో 152 పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ టై అయింది. ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను ఆశ్రయించగా... అక్కడ కూడా రెండు జట్లు 11 పరుగులు చేయడంతో మళ్లీ టై అయింది. ఇలాంటి సందర్భంలో నిబంధనల ప్రకారం... ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుదే విజయం. రాజస్థాన్ తమ ఇన్నింగ్స్‌లో 18 బౌండరీలు (ఫోర్లు, సిక్స్‌లు కలిపి) కొట్టగా.... కోల్‌కతా 14 మాత్రమే బాదింది. దీంతో రాయల్స్ గెలిచింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఓపెనర్ రహానే (59 బంతుల్లో 72; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచి నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. సంజు శామ్సన్ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు), వాట్సన్ (24 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించారు. రహానే, వాట్సన్ మూడో వికెట్‌కు 45 బంతుల్లో 64 పరుగులు జోడించారు. ఆఖర్లో స్టీవ్ స్మిత్ (11 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో వినయ్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా... షకీబ్, మోర్కెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన కెప్టెన్ గంభీర్ (44 బంతుల్లో 45; 4 ఫోర్లు) ఈసారి మాత్రం బాధ్యతగా ఆడి రాణించాడు. అయితే రాజస్థాన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో ఒత్తిడి పెంచారు. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్సర్), షకీబ్ అల్ హసన్ (18 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో మ్యాచ్ కోల్‌కతా వైపు మొగ్గింది. అయితే ఫాల్క్‌నర్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో రకరకాలుగా మలుపులు తిరిగి మ్యాచ్ టై అయింది. రాజస్థాన్ బౌలర్లలో ఫాల్క్‌నర్ మూడు, తాంబే రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) సూర్యకుమార్ (బి) వినయ్ 72; కరుణ్ నాయర్ (బి) వినయ్ 1; శామ్సన్ (బి) షకీబ్ 20; వాట్సన్ రనౌట్ 33; స్టువర్ట్ బిన్నీ (సి) బిస్లా (బి) మోర్కెల్ 0; స్టీవ్ స్మిత్ నాటౌట్ 19; ఫాల్క్‌నర్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు (వైడ్లు 5) 5; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1-13; 2-54; 3-118; 4-128; 5-145. బౌలింగ్: వినయ్ కుమార్ 4-0-30-2; మోర్నీ మోర్కెల్ 4-0-40-1; నరైన్ 4-0-28-0; షకీబ్ అల్ హసన్ 4-0-23-1; కలిస్ 1-0-4-0; పీయూష్ చావ్లా 3-0-27-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గంభీర్ (సి) అబ్దుల్లా (బి) భాటియా 45; బిస్లా (సి) నాయర్ (బి) రిచర్డ్సన్ 3; కలిస్ (సి) స్మిత్ (బి) తాంబే 13; మనీష్ పాండే ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 19; సూర్యకుమార్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 31; షకీబ్ అల్ హసన్ నాటౌట్ 29; ఉతప్ప (బి) ఫాల్క్‌నర్ 0; వినయ్ కుమార్ (బి) ఫాల్క్‌నర్ 0; పీయూష్ చావ్లా రనౌట్ 0; నరైన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (బై 1, లెగ్‌బైస్ 2, వైడ్లు 6, నోబాల్స్ 2) 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1-21; 2-49; 3-85; 4-88; 5-137; 6-141; 7-141; 8-146. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-7-0; రిచ ర్డ్సన్ 4-0-28-1; ఫాల్క్‌నర్ 2-0-11-3; ఇక్బాల్ అబ్దుల్లా 2-0-17-0; వాట్సన్ 3-0-26-0; భాటియా 4-0-29-1; ప్రవీణ్ తాంబే 4-0-31-2. ఫాల్క్‌నర్ బర్త్‌డే గిఫ్ట్ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయానికి కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫాల్క్‌నర్. కోల్‌కతా విజయానికి రెండు ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా... ఫాల్క్‌నర్ 19వ ఓవర్లో కేవలం 4 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌లో మళ్లీ జీవం వచ్చింది. చివరి ఓవర్లో రిచర్డ్సన్ బౌలింగ్‌లో షకీబ్ పోరాడటంతో 11 పరుగులు వచ్చి మ్యాచ్ టై అయింది. అటు సూపర్ ఓవర్లోనూ ఫాల్క్‌నర్ చక్కగా బౌలింగ్ చేశాడు. ఈ విజయం తనకు చిరస్మరణీయం. ఎందుకంటే... మంగళవారం ఫాల్క్‌నర్ పుట్టినరోజు. ఈ విజయం ద్వారా తనకు తానే పుట్టిన రోజు గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. 2009 ఐపీఎల్‌లోనూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ టై కాగా...సూపర్ ఓవర్లో రాజస్థాన్ గెలిచింది. ఓవరాల్‌గా ఐపీఎల్లో ఇది ఐదో టై. సూపర్ ఓవర్ సాగిందిలా... కోల్‌కతా బ్యాటింగ్: బౌలర్: ఫాల్క్‌నర్ తొలి బంతి - ఒక పరుగు. రెండో పరుగుకు వెళ్లి సూర్య రనౌట్. రెండో బంతి - పాండే సింగిల్ మూడో బంతి - షకీబ్ సింగిల్ నాలుగో బంతి - లాంగాన్ మీదుగా పాండే సిక్సర్ ఐదో బంతి - పాండే సింగిల్ ఆరో బంతి - ఒక పరుగు వచ్చింది. రెండో పరుగుకు వెళ్లి షకీబ్ రనౌట్ మొత్తం: 11 పరుగులు రాజస్థాన్ బ్యాటింగ్: బౌలర్: నరైన్ తొలి బంతి: వాట్సన్ సింగిల్ రెండో బంతి: స్మిత్ రెండు పరుగులు మూడో బంతి: స్మిత్ సింగిల్ నాలుగో బంతి: మిడ్ వికెట్ మీదుగా వాట్సన్ ఫోర్ ఐదో బంతి: వాట్సన్ సింగిల్ ఆరో బంతి: స్మిత్ రెండు పరుగులు మొత్తం: 11 పరుగులు ప్రధాన ఇన్నింగ్స్ 20 ఓవర్లలో కోల్‌కతా (14) కంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన రాజస్థాన్ (18) విజేతగా నిలిచింది -
సూపర్ ‘టై’
జైపూర్: ఇన్నాళ్లూ టి20ల్లో మ్యాచ్‌లు ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం రావడం చూశాం. కానీ సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే... ఆ ఉత్కంఠతను తట్టుకోవడం కష్టం. టి20 చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయిన మ్యాచ్ చాంపియన్స్ లీగ్‌లో జరిగింది. హైవీల్డ్ లయన్స్, ఒటాగో వోల్ట్స్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో బౌండరీల సంఖ్య ద్వారా గెలిచిన ఒటాగో... సీఎల్టీ20 సెమీస్‌కు చేరువయింది. తమ బ్యాట్స్‌మన్ డి కాక్ అద్భుతమైన సెంచరీ చేసినా లయన్స్ మ్యాచ్‌ను కోల్పోయింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమితో లయన్స్ జట్టు రిక్తహస్తాలతో వెనుదిరగనుంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్... 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగలు చేసింది. ఓపెనర్ క్వింటాన్ డి కాక్ (63 బంతుల్లో 109 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. సహచరులంతా విఫలమైనా ఒంటిచేత్తో పోరాడి భారీ స్కోరు అందించాడు. తర్వాత ఒటాగో జట్టు కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 167 పరుగులే చేసింది. ఒక దశలో ఓడిపోతుందనుకున్న ఒటాగోను... నీషామ్ (25 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా... తన్వీర్ వేసిన ఈ ఓవర్లో నీషామ్ ఓ సిక్సర్ కొట్టినా... 10 పరుగులే వచ్చాయి. దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్లో డ్రామా: ఫలితం కోసం నిర్వహించిన సూపర్ ఓవర్లో తొలుత ఒటాగో జట్టు 13 పరుగులు చేసింది. తన్వీర్ బౌలింగ్‌లో నీషామ్ ఒక బౌండరీ, మెకల్లమ్ ఒక సిక్సర్ కొట్టారు. తర్వాత లయన్స్ తరఫున డి కాక్ తొలి మూడు బంతులకే నీషామ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్సర్, సింగిల్‌తో 11 పరుగులు రాబట్టాడు. ఇక మూడు బంతులకు మూడు పరుగులు కావలసిన దశలో... సైమ్స్ అవుటయ్యాడు. తర్వాతి బంతికి డి కాక్ మరో సింగిల్ తీశాడు. ఇక విజయానికి ఆఖరి రెండు పరుగులు కావాల్సి ఉండగా... ప్రిటోరియస్ ఒక పరుగు తీసి రనౌట్ అయ్యాడు. దీంతో లయన్స్‌కు కూడా సరిగ్గా 13 పరుగులే వచ్చాయి. దీంతో స్కోర్లు మరోసారి సమమయ్యాయి. ఫలితం తేలిందిలా: సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం కోసం ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇందులోనూ రెండు జట్లు సరిగ్గా ఏడేసి సిక్సర్లు కొట్టాయి. ఈ సమయంలో బౌండరీలు ఎక్కువ కొట్టిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. లయన్స్ 11 ఫోర్లు కొడితే.. ఒటాగో జట్టు 12 ఫోర్లు కొట్టింది. దీంతో ఒక బౌండరీ అధికంగా కొట్టినందున ఒటాగో జట్టు మ్యాచ్ గెలిచినట్లు ప్రకటించారు.