ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చాలా మ్యాచ్‌లు తుది బంతి వరకు వచ్చినప్పటికీ సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఈ సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తున్నా ఒక్కటంటే ఒక్క సూపర్ ఓవర్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన సూపర్ ఓవర్లపై ఓ లుక్కేద్దాం.
క్యాష్ రిచ్ లీగ్‌లో నేటి వరకు (ఏప్రిల్ 17) మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి. 2020 సీజన్‌లో అత్యధికంగా 5 సూపర్ ఓవర్లు జరుగగా.. అదే సీజన్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు (ఒక దాంట్లో ఫలితం రాకపోయగా మరొకటి జరిగింది) జరిగాయి.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఐపీఎల్ తొలి సీజన్‌లోనూ (2008) ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. 2009లో ఒకటి, 2010లో ఒకటి, 2013లో రెండు, 2014లో ఒకటి, 2015లో ఒకటి, 2017లో ఒకటి, 2019లో రెండు, 2020లో ఐదు, 2021 సీజన్‌లో ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరుగగా... 2008, 2011, 2012, 2016, 2018, 2022, 2023 సీజన్లలో ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు.
మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళితే అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజా అందుతుంది. అందుకే ఫ్యాన్స్ సూపర్ ఓవర్లో ఫలితం తేలడాన్ని ఇష్టపడతారు. ఫలితం ఒక్క సూపర్ ఓవర్ వరకు వెళితేనే అభిమానులు నరాలు బిగబట్టుకుని మ్యాచ్‌లు చూస్తారు. అదే రెండో సూపర్ దాకా వెళితే ఫ్యాన్స్‌తో ఆటగాళ్లు పడే ఉత్కంఠ అంతాఇంత కాదు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment