
జోహన్నెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన రెండో వన్డే ఆసక్తికరంగా సాగింది. చివర వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో..విండీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైగా ముగిసిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. బ్యాటర్ దియాంద్రా డాటిన్ చెలరేగడంంతో కేవలం 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించింది. డాటిన్ 5 బంతుల్లోనే 19 పరుగులు చేసింది. డాటిన్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.
అనంతరం 26 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 17 పరుగుల మాత్రమే సాధించి ఓటమి చెందింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లో ట్రియాన్(7),బ్రిట్స్(10) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా.. విండీస్ బౌలర్లు చెలరేగడంతో 160 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 161 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది.
చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment