
వెస్టిండీస్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ఫీల్డర్ లారా వోల్వార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన తుమీ సెఖుఖునే బౌలింగ్‌లో.. వెస్టిండీస్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పాయింట్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న లారా వోల్వార్డ్ ఒంటి చెత్తో డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.
వెస్టిండీస్ బ్యాటర్‌ల్లో కిసియా నైట్(48),డాటిన్(36) పరుగులతో రాణించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్ 4 వికెట్లతో వెస్టిండీస్‌ను కుప్పకూల్చగా, ఆయబొంగ ఖాకా, ట్రయాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండ్రీ స్టెయిన్(52),సునే లూస్(47) పరుగులతో టాప్ స్కోరర్‌లగా నిలిచారు.
చదవండి: IPL 2022 Auction: "చాహల్ భాయ్ నీకు భారీ ధర దక్కడం ఖాయం.. ఆల్‌ది బెస్ట్"
What the hell 🤯
— WCricCraze🏏 (@WomensCricCraze) February 6, 2022
Laura Woolvardt takes a stunner to dismiss Mathews.#SAvWI pic.twitter.com/ZxkKlWJeu1
Comments
Please login to add a commentAdd a comment