మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్ ఆష్లీ గార్డనర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్య పరిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 46 ఓవర్ వేసిన జెస్ జోనాసెన్ బౌలింగ్‌లో.. మిగ్నాన్ డు ప్రీజ్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే అంతా బంతి బౌండరీ దాటడం ఖాయమని భావించారు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆష్లీ గార్డనర్ జంప్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకుంది.
దీంతో గార్డెనర్ క్యాచ్‌ను మైదానంలో ఉన్న వాళ్లంతా ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లు లీ(36), వొల్వార్ట్(90) కెప్టెన్ సునే లాస్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. ఇక 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్లు రేచల్ హేన్స్(17), అలీసా హేలీ(5) వికెట్లు కోల్పోయింది.ఈ క్రమంలో మెగ్ లానింగ్ 130 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది.
Take a bow, Ash Gardner 🙌😍 #CWC22 #SAvAUS pic.twitter.com/KY3Cu9F9Mn
— Female Cricket #CWC22 (@imfemalecricket) March 22, 2022
Comments
Please login to add a commentAdd a comment