సెంట్ లూసియా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అలెన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను హెడెన్ వాల్ష్ వేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఆరోన్ ఫించ్ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా భారీషాట్ ఆడాడు. అది సిక్స్ అని అంతా భావిస్తున్న తరుణంలో ఫాబియెన్ అలెన్ కొన్ని గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ చేస్తూ ఎడమ చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతే ఫించ్ బిక్కమొహంతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబందించిన వీడియో ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనికి ముందు కూడా అలెన్ మూడో టీ20లోనూ ఇలాంటి మాదిరి ఫీట్‌ను నమోదు చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీసీ అలెన్ పట్టిన కొన్ని అద్భుత క్యాచ్‌లను వీడియో రూపంలో షేర్ చేసింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విండీస్ బ్యాటింగ్‌లో ఎవిన లూయిస్( 79, 34 బంతులు; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. పూరన్ 31, గేల్ 21, సిమన్స్ 21తో అతనికి సహకరించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఆరోన్ ఫించ్ 34, మిచెల్ మార్ష్ 30 పరుగులు చేశారు.
What a catch from Fabian Allen pic.twitter.com/w5F042PlSe
— William Mitchell (@news_mitchell) July 17, 2021
Simply ridiculous🤯
— ICC (@ICC) July 17, 2021
An out of this world catch by @FabianAllen338 🦸♂️#WIvAUS | https://t.co/9eurWAvjaF pic.twitter.com/Kmz8Hlma0J
Comments
Please login to add a commentAdd a comment