Fabian Allen
-
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌కు ఊహించని షాక్.. గన్‌తో బెదిరించి! ఏకంగా
దక్షిణాఫ్రికాలో ఉన్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో అలెన్ పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జోహాన్స్‌బర్గ్‌లో జట్టు బసచేస్తున్న శాండ్టన్ సన్ హోటల్ సమీపంలో అలెన్‌ను కొంతమంది దుండగలు తుపాకితో బెదరించి తన ఫోన్‌ను, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో ఫాబియన్ అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక అంతర్జాతీయ క్రికెటర్‌కు కనీస భద్రత లేకపోవడం పట్ల క్రికెట్ సౌతాఫ్రికాపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. "మా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ ఫాబియన్‌తో ఇప్పటికే మాట్లాడాడు. మరో విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్కాయ్ కూడా ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. ఈ క్రమంలో మెక్‌కాయ్‌ను ఆండ్రీ కోలీ కాంటాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అలెన్ బాగానే ఉన్నాడు. కానీ ఈ ఘటనపై సౌతాఫ్రికా క్రికెట్, పార్ల్ రాయల్స్ ఇంకా స్పందించాల్సి ఉందని" విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అలెన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు
అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జోర్డన్ కాక్స్, పలువురు విండీస్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ వారియర్స్ ఆటగాడు కెన్నార్ లెవిస్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ ఆటగాడు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 90 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఇదే మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్(17 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (16 బంతుల్లో 40 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. కెన్నార్ లెవిస్‌తో పాటు హజ్రతుల్లా జజాయ్ (27 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టీమ్ అబుదాబీపై నార్త్ర్న్ వారియర్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్‌పై మోర్స్విల్లే ఆర్మీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. అసలంక (31), కోబ్ హెర్ఫ్ట్ (20) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనలో ఆండ్రీయస్ గౌస్ (43), ఫాఫ్ డుప్లెసిస్ (31) రాణించడంతో మోర్స్విల్లే 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ జోర్డన్ కాక్స్ విజృంభించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 143 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్.. పూరన్ , ఫేబియన్ అలెన్ చెలరేగినా లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
వామ్మో ఇదేం షాట్.. దెబ్బకు కిటికీ పగిలిపోయింది! వీడియో వైరల్
CPL 2023 - Guyana Amazon Warriors vs Jamaica Tallawahs: జమైకా తల్లావాస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ అద్భుత షాట్‌తో అలరించాడు. గయానా అమెజాన్ వారియర్స్‌తో మ్యాచ్‌లో మాసివ్ సిక్సర్‌తో మెరిశాడు. అతడు కొట్టిన భారీ సిక్స్ దెబ్బకు గయానా స్టేడియం వద్ద గల కిటికీ అద్దం పగిలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బుధవారం జమైకా తల్లావాస్, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ రెండు సిక్సర్లు హైలైట్ గయానాలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వారియర్స్.. జమైకాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ బ్రాండన్ కింగ్ అర్ధ శతకం(52)తో మెరవగా.. ఫాబియన్ అలెన్ 21 పరుగులతో రెండో టాప్ స్కోరర్(నాటౌట్)గా నిలిచాడు. 14 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్ ప్రిటోరియస్, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో రెండు అదిరిపోయే సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది. డ్వేన్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో 18వ ఓవర్ ఆఖరి బంతికి కిటికీని పగలగొట్టిన అలెన్.. తదుపరి ఓవర్లో తాహిర్ వేసిన బంతిని 103 మీటర్ల సిక్సర్‌గా మలిచాడు. ఓపెనర్ సంచలన ఇన్నింగ్స్ కింగ్, అలెన్ మినహా మిగతా వాళ్లు విఫలం చెందిన క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో జమైకా జట్టు 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అయితే, లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్‌కు సయీమ్ అయూబ్ 53 బంతుల్లో 85 పరుగులతో దంచికొట్టాడు. మరో ఓపెనర్ మాథ్యూ నందు 37 పరుగులతో రాణించడంతో 18.3 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి విజయం సాధించింది. సయీమ్ అయూబ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. Fabian Allen SMASHES a window with an enormous six for the @BetBarteronline Magic Moment 💥#CPL23 #GAWvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/aNDkImZH72 — CPL T20 (@CPL) September 14, 2023 -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్‌మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్‌మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్‌పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
CPL 2022: ‘కింగ్’ అద్భుత ఇన్నింగ్స్.. మూడోసారి చాంపియన్‌గా జమైకా తలైవాస్
Caribbean Premier League 2022 - Barbados Royals vs Jamaica Tallawahs, Final: కరేబియన్ ప్రీమియర్ లీగ్- 2022 విజేతగా జమైకా తలైవాస్ అవతరించింది. గయానాలో బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఒబెడ్ మెకాయ్ బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ సిక్సర్ బాది తలైవాస్ విజయం ఖరారు చేశాడు. CHAMPIONS!!!!! 🏆🏆🏆#CPL22 #BRvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #CPLFinal pic.twitter.com/DFMixoADQ0 — CPL T20 (@CPL) October 1, 2022 ఆజం ఖాన్ ఒక్కడే ఇక తాజా సీజన్లో విజయంతో జమైకా మూడోసారి ట్రోఫీ అందుకుంది. దీంతో రోవ్‌మన్ పావెల్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. సీపీఎల్-2022 ఫైనల్లో టాస్ గెలిచిన బార్బడోస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వన్‌డౌన్ బ్యాటర్ ఆజం ఖాన్ అర్ధ శతకంతో రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కింగ్ అదరగొట్టాడు లక్ష్య ఛేదనకు దిగిన జమైకా తలైవాస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ అద్భుత ఆరంభం అందించాడు. 50 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ షామర్ బ్రూక్స్ 47 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలోనే తలైవాస్ జట్టు టార్గెట్ ఛేదించింది. రెండు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా మూడోసారి సీపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. బార్బడోస్‌ను కట్టడి చేయడంలో సఫలమైన తలైవాస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు 2013, 2016 సీజన్లలో తలైవాస్ టీమ్ సీపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. మాటల్లో వర్ణించలేను విజయానంతరం తలైవాస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడుతూ.. ఈ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఒకానొక దశలో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తానే స్థితి నుంచి చాంపియన్లుగా అవతరించడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. జట్టు సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. గయానాలో తమకు ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని.. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. King produces a regal knock!!! He guides his team to win the tournament with an unbeaten 83 from 50 balls earning the CPL22 Final’s @Dream11 MVP award. #CPL22 #BRvJT #CricketPlayedLouder #Dream11 #BiggestPartyInSport pic.twitter.com/QPiuhDoj2F — CPL T20 (@CPL) October 1, 2022 -
సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి పోరుకు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. బ్రబౌర్న్ వేదికగా మార్చి 27 మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో అతడి స్దానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్న ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. డెవాల్డ్ బ్రెవిస్ జూనియర్ ఏబీడిగా పేరుపొందిన దక్షిణాఫ్రికా అండర్-19 ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. 3 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. బ్రెవిస్ అచ్చం డివిలియర్స్ లాగే అద్భుతమైన షాట్లు ఆడుతున్నాడు. అదే విధంగా అండర్-19 ప్రపంచకప్‌లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా రాణించాడు. బ్రెవిస్ మూడవ స్థానంలో యాదవ్‌కు సరైన రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అన్మోల్ప్రీత్ సింగ్ ఈ 23 ఏళ్ల ఆల్ రౌండర్ గతంలో ముంబై ఇండియన్స్ తరుపున 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంలో మళ్లీ ముంబై కొనుగోలు చేసింది. అన్మోల్ప్రీత్ సింగ్ ఇండియా-ఎ,ఇండియా బ్లూ, ఇండియా సి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్మోల్ప్రీత్ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు. ఈ క్రమంలో యాదవ్ స్థానంలో అన్మోల్ప్రీత్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఫాబియన్ అలెన్ ఈ ఏడాది మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతడు గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్లో ప్రాతినిద్యం వహించాడు. అలెన్ గతేడాది కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అదే విధంగా అతడు స్పిన్ బౌలింగ్‌తో పాటు, బెస్ట్ ఫినెషర్గా కూడా మ్యాచ్‌ను ముగించగలడు. ఈ క్రమంలో యాదవ్‌కు ప్రత్యామ్నాయంగా అలెన్‌ను ముంబై తీసుకునే అవకాశం ఉంది. -
వెస్టిండీస్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Akeal Hosein as replacement for Fabian Allen: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో గాయపడిన ఫాబియన్ అలెన్ స్థానంలో అకీల్ హోసిన్ను భర్తీ చేసేందకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. ప్రస్తుతం హోసిన్ వెస్టిండీస్ జట్టు రిజర్వ్ జాబితాలో ఉన్నాడు. అయితే రిజర్వ్ జాబితాలో ఉన్న హోసిన్ స్థానంలో గుడకేష్ మోటీని కరిబీయన్ జట్టు భర్తీ చేసింది. కాగా ఈ మెగా టోర్నీలో జట్టులో మార్పులు చేయాలంటే ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. టి20 ప్రపంచకప్ 2021 ఈవెంట్ టెక్నికల్ కమిటీలో క్రిస్ టెట్లీ (ఈవెంట్స్ హెడ్), క్లైవ్ హిచ్‌కాక్(ఐసీసీ సీనియర్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్), రాహుల్ ద్రవిడ్, మరియు ధీరజ్ మల్హోత్రా (బీసీసీఐ ప్రతినిధులు), సైమన్ డౌల్ ఇయాన్ బిషప్ స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు. కాగా వెస్టిండీస్ జట్టు ఆక్టోబర్ 23న తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. వెస్టిండీస్ జట్టు: కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), అకేల్ హోసిన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మెయర్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెకాయ్, లెండెల్ సిమన్స్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్. రిజర్వ్ జాబితా: డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, గుడకేష్ మోటీ చదవండి: T20 WC IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్ పై కేంద్రమంత్రి కీలక వాఖ్యలు.. -
Fabian Allen: ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అలెన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఐదో బంతిని లియామ్ లివింగ్‌స్టోన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన్ వద్ద అప్పటికే కాచుకొని ఉన్న అలెన్ డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. తాను ఎంత గొప్ప ఫీల్డర్ అనేది అలెన్ మరోసారి రుచి చూపించాడు. ఇంతకముందు సీపీఎల్, బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటి ఫీట్స్నే నమోదు చేశాడు. చదవండి: KL Rahul Stunning Catch: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న సంజూ కాగా మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంభంలో దూకుడుగా ఆడడంతో రాజస్తాన్ స్కోరు 200 దాటుతుందని అంతా భావించారు. కానీ ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ 5 వికెట్లతో టాప్ లేపగా.. షమీ 3 వికెట్లతో రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ 36, యశస్వి జైశ్వాల్ 49 పరుగులతో రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 25 పరుగులతో రాణించడం.. చివర్లో మహిపాల్ లామ్రోర్ (17 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. Fabian Allen- what a beauty😍 #PBKSvsRR pic.twitter.com/BzEryruxwU — Kart Sanaik (@KartikS25864857) September 21, 2021 -
ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్; వీడియో వైరల్
సెంట్ లూసియా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అలెన్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను హెడెన్ వాల్ష్ వేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఆరోన్ ఫించ్ ఓవర్ రెండో బంతిని లాంగాన్ మీదుగా భారీషాట్ ఆడాడు. అది సిక్స్ అని అంతా భావిస్తున్న తరుణంలో ఫాబియెన్ అలెన్ కొన్ని గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్ చేస్తూ ఎడమ చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతే ఫించ్ బిక్కమొహంతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబందించిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనికి ముందు కూడా అలెన్ మూడో టీ20లోనూ ఇలాంటి మాదిరి ఫీట్‌ను నమోదు చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీసీ అలెన్ పట్టిన కొన్ని అద్భుత క్యాచ్‌లను వీడియో రూపంలో షేర్ చేసింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విండీస్ బ్యాటింగ్‌లో ఎవిన లూయిస్( 79, 34 బంతులు; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. పూరన్ 31, గేల్ 21, సిమన్స్ 21తో అతనికి సహకరించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఆరోన్ ఫించ్ 34, మిచెల్ మార్ష్ 30 పరుగులు చేశారు. What a catch from Fabian Allen pic.twitter.com/w5F042PlSe — William Mitchell (@news_mitchell) July 17, 2021 Simply ridiculous🤯 An out of this world catch by @FabianAllen338 🦸♂️#WIvAUS | https://t.co/9eurWAvjaF pic.twitter.com/Kmz8Hlma0J — ICC (@ICC) July 17, 2021 -
దుమ్మురేపిన విండీస్ ఆటగాళ్లు; బాబర్ అజమ్ నెంబర్ వన్
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో విండీస్ ఆటగాళ్లు దుమ్మురేపారు. ముఖ్యంగా బౌలర్ ఫాబియెన్ అలెన్ బౌలర్ల జాబితా ర్యాంకింగ్స్ విభాగంలో తొలిసారి టాప్ 10లో అడుగుపెట్టాడు. ఆసీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన అలెన్ 16 స్థానాలు ఎగబాకి 622 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. ఇక ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ 22వ స్థానంలో, డ్వేన్ బ్రేవో ఏడు స్థానాలు ఎగబాకి 37వ స్థానంలో, ఒబేడ్ మెకోయ్ 15 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రెయిజ్ షంషీ 821 పాయింట్లతో తొలి స్థానంలో, రషీద్ ఖాన్(719 పాయింట్లు) రెండో స్థానం, ఆదిల్ రషీద్( 695 పాయింట్లు) ఒక స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో షిమ్రన్ హెట్‌మైర్ 37 స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో, లెండి సిమన్స్ ఆరు స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచారు. ఇక డేవిడ్ మలాన్ 888 పాయింట్లతో తొలి స్థానం, బాబర్ అజమ్(828 పాయింట్లు), ఆరోన్ ఫించ్(805 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ(285 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో చిత్తుగా ఓడిపోయినా బాబర్ అజమ్ మాత్రం చివరి వన్డేలో అద్భుత శతకంతో మెరిశాడు. ఓవరాల్‌గా 873 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి 857 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. మెహదీ హసన్ 708 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్ విభాగంలో షకీబ్ అల్ హసన్ తొలి స్థానంలో ఉన్నాడు. Fabian Allen breaks into the top 10 of the @MRFWorldwide ICC T20I Player Rankings for bowling 📈 He has jumped up 16 spots! Full rankings ➡️ https://t.co/H7CnAiw0YT pic.twitter.com/DxgQzoUs1Z — ICC (@ICC) July 14, 2021 -
ఆటగాడి క్యాచ్‌కు అభిమానులు ఫిదా; నీ తెలివి సూపర్
సెంట్ లూసియా: విండీస్ బౌలర్ ఫాబియన్ అలెన్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ క్యాచ్‌తో అలరించాడు. ముందు బౌలింగ్‌లో కీలకమైన మిచెల్ మార్ష్ వికెట్ తీసిన అతను ఆ తర్వాత రెండు క్యాచ్‌లతో మెరిశాడు. అందులో ఒకటి బౌండరీ లైన్ వద్ద మరొక ఆటగాడిని సమన్వయం చేసుకుంటూ అలెన్ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో హెడెన్ వాల్స్ వేసిన ఐదో బంతిని కెప్టెన్ ఆరోన్ ఫించ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అది సిక్స్ అని అంతా భావిస్తున్న తరుణంలో లాంగాన్.. అటు మిడ్ వికెట్ నుంచి బ్రేవో, అలెన్‌లు పరిగెత్తుకొచ్చారు. అయితే బ్రేవో అప్పటికే బంతిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయగా.. అతని చేతుల నుంచి జారింది. ఇంతలో సమయస్పూర్తితో వ్యవహరించిన అలెన్ బంతికి కాస్త దూరంలో ఉన్నా తన కాళ్లను స్ట్రెచ్ చేస్తూ అందుకున్నాడు. అంతే ఫామ్‌లో ఉన్న ఫించ్ పెవిలియన్‌కు చేరగా.. విండీస్ క్రికెటర్లు సంబరాల్లో మునిగి తేలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్డ్ హిట్టర్ గేల్ సునామీతో విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.142 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. గేల్(38 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడడంతో పాటు కెప్టెన్ నికోలస్ పూరన్ (32, 27 బంతులు; 4 ఫోర్లు, ఒక సిక్సర్) సహకరించాడు. దీంతో విండీస్ 14.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్‌లో హెన్రిక్స్ 33, కెప్టెన్ ఆరోన్ ఫించ్ 30 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 3, ఆండీ రసెల్ 2 వికెట్లు తీశారు. ఇక గేల్ ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో 14వేల పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా గేల్ చరిత్ర సృష్టించాడు. What a catch!! #WIvAUS #WIvsAUS pic.twitter.com/q5Ma0zq1Yt — Paul Kneeshaw (@Stick_Beetle) July 13, 2021 -
వహ్వా.. స్టన్నింగ్ క్యాచ్.. విండీస్‌దే సిరీస్!
అంటిగ్వా: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో వెస్టిండీస్ గెలుపొందింది. మూడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక సోమవారం నాటి ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. లంక బ్యాట్స్‌మన్ గుణతిలకకు బౌలింగ్ చేసిన అలెన్, స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వెస్టిండీస్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ కళ్లు మూసి తెరిచేలోపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫాబియన్ అలెన్ అద్భుతమే చేశాడు. మాస్టర్‌కార్డ్ మూమెంట్. దీనిని వర్ణించేందుకు మాటలు సరిపోవు’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా 3 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల నిమిత్తం శ్రీలంక ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మొదటి టీ20ని విండిస్ గెలవగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఇక సోమవారం నాటి ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక జట్టు.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చండిమాల్(54), ఆషన్ బండారా(44) రాణించగా, మ్యాథ్యూస్(11) ఫరవాలేదనిపించాడు. మిగిలిన ఆటగాళ్లు సింగిల్డిజిట్కే పరిమితం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లు ఫాబియన్ అలెన్, కెవిన్, హోల్డర్, ఒబెడ్ మెకాయ్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది. బంతి(4 ఓవర్లు, 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్)తోనూ, బ్యాట్(6 బంతుల్లో 3 సిక్సర్లు-21 పరుగులు)తోనూ మ్యాజిక్ చేసిన ఫాబియన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక అలెన్ ఆల్‌రౌండర్ ప్రతిభతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-1 తేడాతో విండీస్ కైవసమైంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు ‘సెహ్వాగ్ ఎడమచేత్తో బ్యాటింగ్ చేసినట్లు ఉంది’ This absolute blinder from the Player of the Match Fabian Allen was Spectacular!👏🏾 How good was this Mastercard Priceless Moment? #WIvSL #MenInMaroon #MastercardPricelessMoment pic.twitter.com/oMLQrYeUBd — Windies Cricket (@windiescricket) March 8, 2021