విండీస్ ఆటగాళ్ల సంబరం(ఫొటో కర్టెసీ: ఏఎఫ్‌పీ)
అంటిగ్వా: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో వెస్టిండీస్ గెలుపొందింది. మూడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక సోమవారం నాటి ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. లంక బ్యాట్స్‌మన్ గుణతిలకకు బౌలింగ్ చేసిన అలెన్, స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వెస్టిండీస్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ కళ్లు మూసి తెరిచేలోపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫాబియన్ అలెన్ అద్భుతమే చేశాడు. మాస్టర్‌కార్డ్ మూమెంట్. దీనిని వర్ణించేందుకు మాటలు సరిపోవు’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.
కాగా 3 టెస్టులు, మూడు వన్డేలు, 3 టీ20ల నిమిత్తం శ్రీలంక ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మొదటి టీ20ని విండిస్ గెలవగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఇక సోమవారం నాటి ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక జట్టు.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చండిమాల్(54), ఆషన్ బండారా(44) రాణించగా, మ్యాథ్యూస్(11) ఫరవాలేదనిపించాడు. మిగిలిన ఆటగాళ్లు సింగిల్‌డిజిట్‌కే పరిమితం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లు ఫాబియన్ అలెన్, కెవిన్, హోల్డర్, ఒబెడ్ మెకాయ్‌కు చెరో వికెట్ దక్కింది.
ఈ క్రమంలో స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది. బంతి(4 ఓవర్లు, 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్)తోనూ, బ్యాట్(6 బంతుల్లో 3 సిక్సర్లు-21 పరుగులు)తోనూ మ్యాజిక్ చేసిన ఫాబియన్ అలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక అలెన్ ఆల్‌రౌండర్ ప్రతిభతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-1 తేడాతో విండీస్ కైవసమైంది.
చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
‘సెహ్వాగ్ ఎడమచేత్తో బ్యాటింగ్ చేసినట్లు ఉంది’
This absolute blinder from the Player of the Match Fabian Allen was Spectacular!👏🏾 How good was this Mastercard Priceless Moment? #WIvSL #MenInMaroon #MastercardPricelessMoment pic.twitter.com/oMLQrYeUBd
— Windies Cricket (@windiescricket) March 8, 2021
Comments
Please login to add a commentAdd a comment