అబుదాబీ టీ10 లీగ్ 2023లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జోర్డన్ కాక్స్, పలువురు విండీస్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.
టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్‌న్ వారియర్స్ ఆటగాడు కెన్నార్ లెవిస్ (27 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు).. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ ఆటగాడు జోర్డన్ కాక్స్ (36 బంతుల్లో 90 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఇదే మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ ఆటగాళ్లు నికోలస్ పూరన్(17 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (16 బంతుల్లో 40 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.
కెన్నార్ లెవిస్‌తో పాటు హజ్రతుల్లా జజాయ్ (27 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టీమ్ అబుదాబీపై నార్త్ర్‌న్ వారియర్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మరో మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్‌పై మోర్స్‌విల్లే ఆర్మీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. అసలంక (31), కోబ్ హెర్ఫ్ట్ (20) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. ఛేదనలో ఆండ్రీయస్ గౌస్ (43), ఫాఫ్ డుప్లెసిస్ (31) రాణించడంతో మోర్స్‌విల్లే 9.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
డెక్కన్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ జోర్డన్ కాక్స్ విజృంభించడంతో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 143 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్.. పూరన్ , ఫేబియన్ అలెన్ చెలరేగినా లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment