Abu Dhabi T10: Nicholas Pooran smashes 80 to win over Northern Warriors - Sakshi
Sakshi News home page

Abu Dhabi T10: వరల్డ్‌ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 32 బంతుల్లోనే

Published Sat, Nov 26 2022 11:58 AM | Last Updated on Sat, Nov 26 2022 12:22 PM

Nicholas Pooran hits 80runs,Deccan Gladiators to 24 run win over nw - Sakshi

అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ మరో సారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో దక్కన్ గ్లాడియేటర్స్‌కు పూరన్‌ సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా నార్తర్న్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పూరన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 32 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ 10 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 80 పరుగులు సాధించాడు.

పూరన్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఫలితంగా నిర్ణీత 10 ఓవర్లలో  గ్లాడియేటర్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అతడితో పాటు కోహ్లర్-కాడ్మోర్(32) పరుగులతో రాణించాడు. అనంతరం 139 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. వారియర్స్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఆడమ్‌ లైత్‌(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన పూరన్‌
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పూరన్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో వెస్టిండీస్‌కు సారథ్యం వహించిన పూరన్‌.. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన పూరన్‌ కేవలం 25 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ మెగా టోర్నీలో వెస్టిండీస్‌.. స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ వంటి పసికూన చేతిలో ఓడి క్వాలిఫియర్‌ రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది.  ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభావానికి నైతిక బాధ్యత వహిస్తూ పూరన్‌ విండీస్‌ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.


చదవండి: IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. న్యూజిలాండ్‌తో రెండో వన్డే కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement