Akeal Hosein as replacement for Fabian Allen: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో గాయపడిన ఫాబియన్ అలెన్ స్థానంలో అకీల్ హోసిన్‌ను భర్తీ చేసేందకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. ప్రస్తుతం హోసిన్ వెస్టిండీస్ జట్టు రిజర్వ్ జాబితాలో ఉన్నాడు. అయితే రిజర్వ్ జాబితాలో ఉన్న హోసిన్ స్థానంలో గుడకేష్ మోటీని కరిబీయన్ జట్టు భర్తీ చేసింది. కాగా ఈ మెగా టోర్నీలో జట్టులో మార్పులు చేయాలంటే ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తప్పనిసరి.
టి20 ప్రపంచకప్ 2021 ఈవెంట్ టెక్నికల్ కమిటీలో క్రిస్ టెట్లీ (ఈవెంట్స్ హెడ్), క్లైవ్ హిచ్‌కాక్(ఐసీసీ సీనియర్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్), రాహుల్ ద్రవిడ్, మరియు ధీరజ్ మల్హోత్రా (బీసీసీఐ ప్రతినిధులు), సైమన్ డౌల్ ఇయాన్ బిషప్ స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు. కాగా వెస్టిండీస్ జట్టు ఆక్టోబర్ 23న తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
వెస్టిండీస్ జట్టు: కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), అకేల్ హోసిన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెకాయ్, లెండెల్ సిమన్స్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్.
రిజర్వ్ జాబితా: డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, గుడకేష్ మోటీ
చదవండి: T20 WC IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్ పై కేంద్రమంత్రి కీలక వాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment